పొరబడిన తెలుగు నటులు.. శ్రద్ధాంజలి ట్వీట్లు | tollywood actors, bollywood mis tweets on jaya after death rumours | Sakshi
Sakshi News home page

పొరబడిన తెలుగు నటులు.. శ్రద్ధాంజలి ట్వీట్లు

Published Mon, Dec 5 2016 6:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

పొరబడిన తెలుగు నటులు.. శ్రద్ధాంజలి ట్వీట్లు - Sakshi

పొరబడిన తెలుగు నటులు.. శ్రద్ధాంజలి ట్వీట్లు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారని వదంతులు వ్యాపించడంతో పలువురు ప్రముఖులు ఉద్విగ్నానికి లోనయ్యారు.‍ తమిళ చానెళ్లతోపాటు జాతీయ చానెళ్లలో కూడా ఆమె చనిపోయినట్లు రూమర్స్‌ రావడంతో సామాజిక అనుసంధాన వేదికల్లో తమ అభిప్రాయాలు పంచుతున్నారు. వదంతులు నమ్మి నిజంగానే జయలలిత కన్నుమూసిందని పొరపడ్డారు. ఇలా పొరపడిన వారిలో తెలుగు సినిమా ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అమ్మ చనిపోయిందని వదంతులు రాగానే ప్రముఖ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ ‘నా తమిళ సోదర, సోదరీమణుల పక్షాన ప్రార్థిస్తున్నాను. ఈ లోటును ఎలా వ్యక్తీకరించాలో మాటలు రావడం లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

అలాగే, మరో ప్రముఖ నటుడు సందీప్‌ కిషన్‌, హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ కూడా ఈ వరుసలో చేరారు. అయితే, అనంతరం జయకు ఇప్పటికీ వైద్యం అందిస్తున్నామంటూ అపోలో వైద్య సిబ్బంది మరో హెల్త్‌ బులెటిన్ విడుదల చేసి స్పష్టత నివ్వడంతో మోహనబాబు తన ఖాతాలో ట్వీట్‌ ను తొలగించగా.. వెన్నెల కిశోర్‌ తాను చేసిన ట్వీట్‌ స్థానంలో హెల్త్‌ బులెటిన్‌ పత్రాన్ని ట్వీట్‌ చేశారు. ఇక సందీప్‌ కిషన్‌ కూడా తన ట్వీట్‌ను మార్చేశాడు. అలాగే, బాలీవుడ్‌ నుంచి జయ ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలు ట్వీట్లు ట్విట్టర్‌లో దర్శనం ఇస్తున్నాయి.  మరోపక్క, జయ పార్టీ కార్యాలయంలో కూడా తొలుత పార్టీ జెండాను కిందకు దించి మరోసారి పైకి ఎగరేశారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement