రామ్ పోతినేని డబుల్‌ ఇస్మార్ట్‌.. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉందంటే? | Ram Pothineni Double Ismart Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Double Ismart Movie Twitter Review: డబుల్‌ ఇస్మార్ట్‌ ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉందంటే?

Published Thu, Aug 15 2024 7:21 AM | Last Updated on Thu, Aug 15 2024 11:34 AM

Ram Pothineni Double Ismart Movie Twitter Review

రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్‌ చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. ఈ మూవీని 2021లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.

ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్‌ ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. ఫస్ట్ హాఫ్‌, సెకండాఫ్ ఎక్సలెంట్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. రామ్ మాస్‌ యాక్షన్‌ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచే థియేటర్ల పండుగ వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్‌కు హిట్‌ టాక్‌ రావడంతో రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement