రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్‌'.. మ్యాడ్‌ ట్రైలర్‌ వచ్చేసింది! | Ram Pothineni Latest Movie Double Ismart Trailer Out Now | Sakshi
Sakshi News home page

Double Ismart Trailer: రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్‌'.. ఫ్యాన్స్‌కు పిచ్చేక్కించేలా ట్రైలర్!

Published Sun, Aug 4 2024 8:59 PM | Last Updated on Sun, Aug 4 2024 9:06 PM

Ram Pothineni Latest Movie Double Ismart Trailer Out Now

రామ్‌ పోతినేని- పూరి జగన్నాథ్‌ కాంబోలో వస్తోన్న ఫుల్ యాక్షన్‌ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు.  

ఇస్మార్ట్‌ శంకర్‌ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే రామ్ డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ బిగ్‌బుల్‌ పాత్రలో మెప్పించనున్నారు. కాగా.. ఈనెల 15 ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement