![Tollywood Hero Ram Pothineni Emotional Speech At Double Ismart Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/12/RamPothineni-01.jpg.webp?itok=Hutsvokl)
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. హనుమకొండలోని జరిగిన ఈవెంట్‌కు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ అభిమానులను ఉద్దేశించి ఆసక్తకర కామెంట్స్ చేశారు. పక్కోడి గురించి.. పకోడీల గురించి పట్టింటచుకుంటే పనులు జరగవంటూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు.
రామ్ మాట్లాడుతూ..'ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ.. బయటకానీ ఓ ట్రెండ్ చూస్తున్నా. అరే... నీకిది నచ్చిందా? అని అంటే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమోనని పక్కనోళ్ల మీద తోసేస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం హోటల్‌కు వెళ్లి ఓ బిర్యానీ తిన్నామనుకోండి. బిర్యానీ బాగుందిరా అనుకోని.. చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగలేదు అని అంటే మనమీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది. అది బిర్యానీ అయినా, సినిమా అయినా.. రేపు మీ కెరీర్ అయినా..నీకు నచ్చింది నువ్వు చెయ్.. పక్కనోడి ఓపినియన్‌తో నీ అభిప్రాయం మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కొడీ గురించి.. పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అన్నాయ్. మామూలుగా నేను సలహాలు ఇవ్వను. నా అనుకున్న వాళ్లకే ఇస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది. అందుకే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఆగస్టు 15న కలుద్దాం. లవ్ యూ ఆల్' అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌గా స్పీచ్ ఇచ్చారు.
ఈ చిత్రంలో హీరోయిన్ ముంబయి ముద్దగుమ్మ కావ్య థాపర్ కనిపించనుంది. ఇందులో సంజయ్ దత్ బిగ్‌బుల్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రంలో కమెడియన్ అలీ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పక్కనోడి గురించి.. పకోడీ గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్..🔥#RamPothineni #DoubleISMART #TeluguFilmNagar pic.twitter.com/bMveIckc1Q
— Telugu FilmNagar (@telugufilmnagar) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment