రిలీజ్‌కు ముందే భారీ డీల్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌కు ఎన్ని కోట్లంటే! | Ram Pothineni Movie Double Ismart Digital Rights Sale For Huge Price | Sakshi
Sakshi News home page

Double Ismart: భారీ ధరకు డబుల్‌ ఇస్మార్ట్.. ఎన్ని కోట్లో తెలుసా?

Published Fri, Jul 26 2024 7:05 PM | Last Updated on Fri, Jul 26 2024 8:34 PM

Ram Pothineni Movie Double Ismart Digital Rights Sale For Huge Price

టాలీవుడ్‌ హీరో రామ్ పోతినేని‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. ఈ మూవీకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ కాకముందే క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. సౌత్‌ ఇండస్ట్రీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ ఏకంగా రూ.33 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement