మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్‌తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్‌పోస్ట్‌లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్‌లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్‌లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment