audit
-
నిషేధిత జాబితాలోని భూములే టార్గెట్ గా అక్రమాలు..
-
ఆడిట్లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానా
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఆడిట్లో లోపాలు జరిగినట్లు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) గుర్తించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్లో లోపాలకు కారణమైన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆడిట్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లపై చర్యలు తీసుకుంది.2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఆడిట్ పనులను డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి అప్పగించింది. సుమారు రూ.200 కోట్ల ఆడిట్(audit)లో అవకతవకలు జరిగినట్లు ఎన్ఎఫ్ఆర్ఏ గుర్తించింది. దాంతో డెలాయిట్ హాస్కిన్స్కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ అనధికార లావాదేవీలను గుర్తించడం, వాటిని నివేదించడంలో ఆడిట్ సంస్థ విఫలమైందని ఎన్ఎఫ్ఆర్ఏ తెలిపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఏలు ఏబీ జానీను రూ.10 లక్షలు జరిమానా(fine)తోసహా ఐదేళ్ల పాటు ఆడిట్ పనుల నుంచి నిషేధించగా, రాకేశ్ శర్మకు రూ.5 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్ఫామ్డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్పీ అనేది ఎకనామిక్ వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సేవల సంస్థ. ఇది ఆడిట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సర్వీసులు అందిస్తోంది. -
భూకంప జోన్లో మల్లన్నసాగర్
సాక్షి, హైదరాబాద్: తగిన అధ్యయనాలు, పరిశోధనలు చేయకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ డ్రాయింగ్లను ఆమోదించి, నిర్మాణం చేపట్టారని ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంత భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా చీలికలు, కదలికలు ఉన్నాయని.. భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తమ ప్రాథమిక నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ సిఫార్సులను పట్టించుకోకుండా.. తగిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని తప్పుపట్టింది. ఒకవేళ భూకంపం వస్తే సమీప ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్ నిర్వహించిన కాగ్.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలివీ.. సగం ఆయకట్టు మల్లన్నసాగర్ కిందే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో ఇది సగానికికన్నా ఎక్కువ. 2017 అక్టోబర్‌లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రారంభించగా.. మార్చి 2022 నాటికి రూ.6,126 కోట్లు విలువైన పనులు చేశారు. గత సీఎం 2020 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అధ్యయనం జరపాలని కోరినా... మల్లన్నసాగర్ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై (సైట్ స్పెసిఫిక్ సీస్మిక్ స్టడీస్) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సూచించారు. దీంతో సంబంధిత అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. కానీ ఆ అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే.. 2017లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. తర్వాత ఎన్జీఆర్ఐ నివేదిక ఇచ్చింది. భూకంపాలకు అవకాశం ఉందంటూ.. దేశంలో భూకంపాల సంభావ్యత తక్కువగా ఉండే సీస్మిక్ జోన్–2లో తెలంగాణ ఉన్నా.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో.. జోన్–2 ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని తేలిందని ఎన్జీఆర్ఐ నివేదికలో పేర్కొంది. ఇటీవలికాలంలో ఒంగోలు, లాతూర్‌లో వచి్చన భూకంపాలతో తెలంగాణలోనూ ప్రకంపనలు వచ్చాయని, ఇక్కడి నిర్మాణాలకు స్వల్పంగా నష్టం జరిగిందని తెలిపింది. 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచి్చన భూకంపంతో దక్షిణ భారతదేశం అంతా ప్రకంపనలు కనిపించాయని పేర్కొంది. 1983 జూన్‌లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల వరకు కనిపించిందని గుర్తు చేసింది. నాటి భూకంప కేంద్రం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే తట్టుకునేలా కట్టని (నాన్ ఇంజనీర్డ్) నిర్మాణాలు దెబ్బతింటాయని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంతంలోని భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా మూడు జతల చీలికలు (3 సెట్స్ ఆఫ్ డామినెంట్ లీనమెంట్) ఉన్నాయని.. కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. వీటితో పడే ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పట్టించుకోకుండా, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ దృఢత్వం, భూకంపం వస్తే జరిగే విపత్తు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలేనని కాగ్ పేర్కొంది. అత్యవసరంగా డ్రాయింగ్స్కు ఆమోదం మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతంలో భూకంపాల సంభావ్యతపై అధ్యయనాలు లేవని.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్ డ్రాయింగ్స్‌ను ఆమోదిస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజనీర్ పదేపదే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ డ్రాయింగ్స్ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఐఐటీ–రూర్కి’ల నుంచి ఈ డ్రాయింగ్స్కు తదుపరి ఆమోదం(వెట్టింగ్) తీసుకోవాలని కూడా సూచించారు. కానీ నీటిపారుదల శాఖ సదరు సంస్థలతో వెట్టింగ్ చేయించినట్టు ఎలాంటి రికార్డులు లేవని కాగ్ పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్మాణం 95శాతం పూర్తయ్యాక 2021 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలైన డిజైన్లు, స్థిరత్వ విశ్లేషణలు, డిజైన్లకు వెట్టింగ్ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం విడ్డూరమని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదని, ఎలాంటి నివేదిక సైతం ఇవ్వలేదని పేర్కొంది. ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి మల్లన్నసాగర్ డ్యామ్ దెబ్బతింటే.. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ఓ నివేదిక సమర్పించింది. మల్లన్నసాగర్లో నీళ్లు నింపడానికి ముందే ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించింది. మల్లన్నసాగర్లో 2021 ఆగస్టు నుంచి నీళ్లు నింపడం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎమర్జెన్సీ ప్లాన్‌ను తయారు చేయలేదని కాగ్ ఆక్షేపించింది. ఒకవేళ్ల మల్లన్నసాగర్‌కు ప్రమాదం జరిగితే.. సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. -
డెలాయిట్‌కు చైనా మొట్టికాయ
బీజింగ్: ప్రముఖ అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ టచే తోమట్సుపై చైనా చర్యలు తీసుకుంది. చైనా ప్రభుత్వరంగ ‘చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ’కి సంబంధించి ఆడిట్ సరిగ్గా చేయనందుకు డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై 30.8 మిలియన్ డాల ర్లు (రూ.252 కోట్లు) జరిమానా విధించింది. అవినీతి ఆరోపణలపై చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ హెడ్ లాయ్ షియోమీని చైనా 2021లో ఉరితీయడం ఈ సందర్భంగా గమనార్హం. పెట్టుబడులు పెట్టేందు కు, నిర్మాణ కాంట్రాక్టులు, ఉద్యోగాలకు సంబంధించి లంచాలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య ఆడిట్, ఇతర పనుల్లో తప్పులకు గాను డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై మూడు నెలల పాటు సస్పెన్షన్‌ను కూడా గతంలో విధించింది. హురాంగ్ సంస్థపై 1.16 లక్షల డాలర్లు, ఆడిట్లో లోపాలకు గాను 13 మంది ఉద్యో గులపై 36,000 డాలర్ల జరిమానా విధించింది. హురాంగ్ ఆస్తులు, నిబంధనల అమలు, నిర్వహణ కార్యకలాపాలపై ఆడిటర్‌గా డెలాయిట్ తగినంత దృష్టి సారించడంలో విఫలమైనట్టు చైనా నియంత్రణ సంస్థలు తేల్చాయి. -
హైదరాబాద్ కంపెనీలకు ‘హిండెన్‌బర్గ్ బూచి’
సాక్షి, హైదరాబాద్: ‘హిండెన్‌బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
అదానీ గ్రూప్ కంపెనీల ఆడిటింగ్
న్యూఢిల్లీ: అమెరికన్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలకు భరోసా కల్పించే చర్యలపై అదానీ గ్రూప్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని గ్రూప్ కంపెనీల ఖాతాలను స్వతంత్ర సంస్థతో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకుంది. తాము ఏమీ దాచడం లేదని, చట్టాలన్నింటినీ పాటిస్తున్నామని నియంత్రణ సంస్థలకు తెలియజేయడమే ఈ ఆడిట్ ప్రధాన ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంస్థలపై ప్రభావం నిల్: ఎస్అండ్పీ అదానీ గ్రూప్ సంక్షోభ ప్రభావాలు ఇతర ఆర్థిక సంస్థలపై భారీగా ఉండబోవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింVŠ ఒక నివేదికలో విశ్లేషించింది. -
వచ్చే 8న కిర్లోస్కర్ బ్రదర్స్ ఈజీఎం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్) డిసెంబర్ 8న వాటాదారుల అత్యవసర సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. వెలుపలి సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా వాటాదారులకు సూచించింది. కంపెనీలో ఉమ్మడిగా 24.92 శాతం వాటా కలిగిన కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, అతుల్ కిర్లోస్కర్, రాహుల్ కిర్లోస్కర్ డిమాండుమేరకు ఈజీఎంను చేపట్టినట్లు తెలియజేసింది. కిర్లోస్కర్ సోదరుల మధ్య వివాదాలు తలెత్తడంతో కేబీఎల్ చైర్మన్, ఎండీ సంజయ్ కిర్లోస్కర్ ఒకవైపు, అతుల్, రాహుల్ మరోవైపు చేరారు. ఈ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించాలన్న డిమాండుపై ఈజీఎంను నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆరేళ్లలో న్యాయ, వృత్తిపరమైన కన్సల్టెన్సీ చార్జీలకు సంబంధించి కంపెనీ చేసిన వ్యయాలపై పరిశోధన చేపట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్ ఎంపికను కోరుతున్నట్లు వివరించింది. కాగా.. బోర్డు ఈ ప్రతిపాదనలను సమర్థించడంలేదని కేబీఎల్ పేర్కొంది. బోర్డు, డైరెక్టర్ల స్వతంత్రతను ప్రశ్నించడం సరికాదని వాదిస్తోంది. -
కోవిడ్ కట్టడిలో భారత్ భేష్. మరి మరణాలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిలో విఫలమై ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్ ఈ విషయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మాన్ వ్యాఖ్యానించారు. ఫౌండేషన్ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్‌కీపర్స్) నివేదిక విడుదల సందర్భంగా మంగళవారం ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్ మహమ్మారి అదుపులో భారత్ విజయం సాధించింది. కోవిడ్ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం. 200 కోట్ల కరోనా టీకాల పంపిణీ, ఏకంగా 90 శాతం వ్యాక్సినేషన్ రేటుతో ఎన్నో విషయాల్లో దిక్సూచీగా మారింది.. దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయించి వ్యాక్సిన్ తయారీ రంగంలో పెద్దన్న పాత్ర కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జీ20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్ సత్తా చాటుతోంది. పేదరిక నిర్మూలన, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల వంటి అంశాల్లోనూ మంచి పురోగతి సాధించింది. కోవిన్ యాప్ ద్వారా త్వరితగతిన కోట్లాది వ్యాక్సిన్ల పంపిణీని సుసాధ్యంచేసింది. భారత్‌లో స్వయం ఉపాధి బృందాల ద్వారా మహిళలు సాధించిన సాధికారత, ప్రగతి అమోఘం’ అని సుజ్మాన్ అన్నారు. ఆక్సిజన్ కొరతతో కోవిడ్ మరణాలపై ఆడిట్ కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమర్పించింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది. ఇదీ చదవండి: రేపిస్ట్ ఇల్లు నేలమట్టం! -
టాక్స్ ఆడిట్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ మెళకువలు తెలుసుకుంటే మేలు..
టాక్స్ ఆడిట్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం.. ఈ వారం ఎలా చేయించాలో తెలుసుకోండి. - ముందుగా ఆర్ధిక సంవత్సరం చివరికి టర్నోవరు లేదా అమ్మకాలు లేదా బ్యాంకులో వసూళ్లు విలువ తెలుసుకోండి. చివరి దాకా వేచి ఉండక్కర్లేదు. మీ అనుభవం .. వ్యాపార సరళి, జీఎస్టీ రికార్డులను బట్టి తెలుస్తుంది. టర్నోవరు కోటి రూపాయలు దాటింది అంటే మీ కేసు టాక్స్ ఆడిట్ పరిధిలోనిది అన్నమాట. - వెంటనే ఒక ప్రాక్టీస్ లో ఉన్న సీఏని సంప్రదించండి. - సదరు సీఏని అపాయింట్ చేసుకోండి. అలాగే ఫీజు కూడా ముందుగానే పేర్కొనండి. - సీఏని మీరే నియమించినా ఆ వ్యక్తి ఇటు మీ తరఫున అటు ఇన్‌కం ట్యాక్స్ విభాగం తరఫున తన విధులకు న్యాయం చేస్తారు. - ఏం చేయాలన్నది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. - ఆడిట్ పరిధిలో ఏయే రికార్డులు వెరిఫై చేయాలన్నది ప్రస్తావించారు. - ఒక అస్సెస్సీకి సంబందించిన వందలాది అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వీటి అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇవ్వాలి. - ఉదాహరణకు వ్యాపారంలో సొంత ఖర్చులు ఉన్నాయా? క్యాపిటల్ ఖర్చులు మామూలు ఖర్చుల్లో కలవడం జరగలేదు కదా? బిజినెస్‌కి సంబంధం లేని ఖర్చులు విడిగా రాయడం చేశారా? సొంత వాడకాన్ని విడిగా చూపించారా? విరాళాలు విడిగా రాశారా? ఇలాంటివన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. - పైవన్నీ తప్పు అని అనటం లేదు... కొన్ని వ్యాపారాల్లో చాలా సహజం... జరిగింది జరిగినట్లు రాయండి.. ఆడిటర్ ఆ వ్యవహారాలను జల్లెడ బట్టి తన వృత్తి నైపుణ్యంతో విడగొడతారు. - ఆదాయాన్ని, ఖర్చులను సరిగ్గా నిర్ధారించడంపైనే ఈ ఆడిట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కొన్ని విధులు సరిగ్గా నిర్వహించడం జరిగిందా లేదా అన్నది రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా టీడీఎస్ లాంటివాటికి సంబంధించి చట్టప్రకారమే ప్రయోజనం పొందారా లేదా అన్నది పరిశీలిస్తుంది. - ఇందుకోసం ఆదాయపు పన్ను విభాగం నిర్దేశి ంచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. - అప్పుడు పూర్తి అవుతుంది.. ఆడిట్.. ఆడిట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్‌పై ఇద్దరు సంతకం పెడతారు. దీన్ని గడువు తేదీ లోపల దాఖలు చెయ్యాలి. లేకపోతే పెనాల్టీ భారీగా వడ్డీస్తారు. ఈ రిపోర్ట్ మీకూ శ్రీరామ రక్ష. 31మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి ఇంకా గడువు ఉంది. ఫిబ్రవరి 15 దాకా పొడిగించారు. కాబట్టి కాస్త త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసేసి ఉంటే 31 మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరం రిటర్నుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
పంచాయతీల ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ నం.1.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్ విధానంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లోనూ ప్రభుత్వం ఆన్లైన్ ఆడిటింగ్‌ను 100 శాతం పూర్తి చేసింది. అలాగే ఆయా నివేదికలను ఆన్లైన్లో కేంద్రానికి సమర్పించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల్లో ఈ ప్రక్రియ ఇప్పటివరకు 13 శాతమే పూర్తవగా మరో 16 రాష్ట్రాల్లో ఇది ఇంకా మొదలుకాలేదు. దేశంలోని 2,56,561 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటివరకు 32,820 పంచాయతీల్లోనే ఆన్లైన్ ఆడిటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,549 గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలవగా 5,560 పంచాయతీల్లో ఆడిటింగ్‌తో తమిళనాడు మూడో స్థానం నిలిచింది. మరోవైపు మండలాలవారీ ఆడిటింగ్‌లోనూ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోని 540 మండలాలకుగాను ఇప్పటివరకు 156 చోట్ల ఆడిట్ పూర్తిచేసింది. కేంద్రం గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు సూచనలతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వేంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ఆడిట్ శాఖ ఇప్పటికే ఆన్లైన్ ఆడిటింగ్‌లో 2,10,781 అభ్యంతరాలను నమోదు చేసిందన్నారు. గ్రామ పంచాయతీల సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతూనే 100 శాతం ఆన్లైన్ ఆడిటింగ్‌ను పూర్తి చేశారన్నారు. ఆన్లైన్ ఆడిటింగ్‌లో తమకు సహకరించాలని ఇతర రాష్ట్రాలు కోరాయన్నారు. -
భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆడిటింగ్‌లో మరింత పటిష్టమైన, శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలని ఆడిటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కారాలను కనుగొనడంలోనూ ఆడిటింగ్ కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తొలి ఆడిట్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపారు. పారదర్శకత ఒకప్పుడు దేశీయంగా ఆడిట్ అంటే ఒకింత అనుమానంగా, భయంగాను చూసేవారని, కాగ్.. ప్రభుత్వం ఒకదానితో మరొకటి తలపడినట్లుగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం మైండ్‌సెట్ మారిందన్నారు. విలువ జోడింపులో ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న భావన నెలకొందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వం పాటించిన తప్పుడు విధానాలు, పారదర్శకత లేకపోవడం వల్లే బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ‘గతంలో ఎన్పీఏలను ఎలా దాచిపెట్టేవారో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు చేసిన పనులను మేం పూర్తి నిజాయితీతో దేశ ప్రజల ముందు ఉంచాము. సమస్యలను గుర్తించినప్పుడే వాటికి పరిష్కార మార్గాలను కనుగొనగలము. వ్యవస్థలో పారదర్శకత తెచ్చిన తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి‘ అని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. డేటా కీలకం.. గతంలో సమాచారాన్ని కథల రూపంలో చెప్పేవారని, చరిత్రను కూడా కథల రూపంలోనే రాశారని మోదీ చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, సమాచారం అంటే డేటాయేనని ఆయన పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో సమాచారం అంటే డేటా. భావి తరాల్లో మన చరిత్రను డేటా ద్వారానే చూస్తారు. దాని కోణంలోనే అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో చరిత్రను డేటానే నిర్దేశిస్తుంది‘ అని మోదీ తెలిపారు. కాగ్ అడిగే డేటా, ఫైళ్లను ప్రభుత్వ విభాగాలు విధిగా అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయి ఆడిట్లు నిర్వహించడానికి ముందు ప్రాథమికంగా బైటపడిన అంశాల గురించి ఆయా ప్రభుత్వ విభాగాలకు తెలియజేసేలా కాగ్ కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని మోదీ చెప్పారు. మరోవైపు, తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని, అందుకే ఆ రోజును ఆడిట్ దివస్‌గా నిర్వహించాలని భావించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. కొత్త ఆడిట్ ప్రక్రియ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను కాగ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. చదవండి:బ్యాంకులకు ఆర్బీఐ షాక్ ! -
పద్మనాభ స్వామి ఆలయం: 3 నెలల్లోగా ఆడిట్ పూర్తి చేయాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం 25 సంవత్సరాల ఆడిట్ నుంచి మినహాయించాలని కోరుతూ శ్రీ పద్మనాభస్వామి ఆలయ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆదేశించిన ఆడిట్ కేవలం దేవాలయానికి మాత్రమే పరిమితం కాదని, ట్రస్ట్ కూడా వర్తింస్తుందని స్పష్టం చేసింది. ఆడిట్ మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక ఆడిట్ నుంచి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ని విచారించింది. మూడు నెలల్లోగా ఆడిట్ పూర్తి కావాలని స్పష్టం చేసింది. అలానే ఆడిట్ అనేది కేవలం ఆలయానికి సంబంధించి మాత్రమే కాక ట్రస్ట్ కూడా వర్తిస్తుందని తెలిపింది. 2015 నాటి ఆర్డర్లో నమోదైన కేసులోని అమికస్ క్యూరీ నివేదికల నేపథ్యంలో ఈ చర్యను చూడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: చదువుపై దృష్టి పెట్టు: ఇంటర్ విద్యార్ధికి సుప్రీం సూచన ) రాజకుటుంబీకుల ఆధీనంలోని శ్రీపద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్ జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. చదవండి: ఇదేం పద్ధతి? -
ఆర్థిక ఇబ్బందుల్లో పద్మనాభ దేవాలయం
న్యూఢిల్లీ: ప్రసిద్ధిగాంచిన పద్మనాభ స్వామి దేవాలయం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉందని, స్వామికి వచ్చే కానుకలు నిర్వహణా వ్యయాలకు చాలడం లేదని గుడి నిర్వహణా కమిటీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ట్రావెన్కోర్ రాజ కుటుంబం నడిపే దేవస్థాన ట్రస్టుపై ఆడిట్ నిర్వహించాలని కోరింది. కేరళలోని ఈ ప్రఖ్యాత దేవాలయం నిర్వహణకు నెలకు రూ.1.25 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే తమకు గరిష్టంగా 60-70 లక్షల రూపాయలే వస్తున్నాయని, ఈ విషయమై తగు సూచనలివ్వాలని కమిటీ తరఫు న్యాయవాది బసంత్ కోర్టును అభ్యర్థించారు. సొమ్ములు లేకపోవడంతో నిర్వహణ క్లిష్టంగా మారిందని, నిధులపై వివరాలు తెలుసుకుందామని ఆడిట్ కోసం కోరితే ట్రస్టు స్పందించడంలేదని తెలిపారు. టస్ట్రు వద్ద రూ.2.87 కోట్ల నగదు, 1.95 కోట్ల ఆస్తులు ఉన్నట్లు 2013 ఆడిట్ నివేదిక తెలియజేస్తోందని, ఇప్పుడు ట్రస్టు వద్ద ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఆడిట్ జరపాలని కోరారు. గతంలో సుప్రీం ఆదేశాల మేరకే ట్రస్టు ఏర్పడిందని, దేవస్థానానికి ట్రస్టు తప్పక సాయం చేయాలనే విషయాన్ని గుర్తు చేశారు. చదవండి: మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు.. రాజకుటుంబ ట్రస్టు పద్మనాభస్వామి ట్రస్టు రాజకుటుంబం ఏర్పరిచిన పబ్లిక్ ట్రస్టని, దానికి ఆలయ నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదని ట్రస్టు తరఫు న్యాయవాది అరవింద్ వాదించారు. గుళ్లో పూజలు, ఆచారాలను పర్యవేక్షించడానికి ట్రస్టు పరిమితమని, సుప్రీంకోర్టు అమికస్ క్యూరి కోరినందునే గతంలో ఆడిట్ జరిగిందని చెప్పారు. గుడికి, ట్రస్టుకు సంబంధం లేనందున ఆడిట్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తమది స్వతంత్ర కమిటీ అని, ట్రస్టుపై కమిటీ ఆధిపత్యానికి అంగీకరించమని తెలిపారు. సంవత్సరాలుగా కమిటీ, ట్రస్టు మధ్య వివాదం ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దేవస్థానం రోజూవారీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఈ విషయంలో సంబంధిత అథారీ్టలను సంప్రదించాలని సూచించింది. ఆడిట్ నుంచి మినహాయించాలన్న ట్రస్టు అభ్యర్ధనపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. 2011లో గుడికి స్వతంత్ర ట్రస్టును ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పరచాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసి, రాజ కుటుంబానికి గుడి నిర్వహణపై హక్కును పునరుద్ధరించింది. అనంతరం గుడికి సంబంధించి 25ఏళ్ల ఆదాయవ్యయాలను ఆడిట్ చేయాలని నిర్వహణ కమిటీకి సూచించింది. అయితే ఆడిట్‌కు ట్రస్టు ఆంగీకరించడంలేదు. దీంతో 9ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాన్ని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది -
ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్‌గా జీసీ ముర్ము
న్యూఢిల్లీ: సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం (ఐఎన్‌టీఓఎస్‌ఏఐ) ప్రాంతీయ గ్రూప్‌లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్ ది ఆసియన్ ఆర్గనైజేషన్ (ఏఎస్ఓ ఆఫ్ ఎస్ఏఐ) చైర్మన్‌గా భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీసీ ముర్ము ఎంపికయ్యారు. ఆయన ఎంపిక విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఒక ప్రకటనలో తెలిపింది. 2024 నుంచి 2027 వరకూ ఆయన ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్ బాధ్యతల్లో ఉంటారు. 56వ గవర్నింగ్ బోర్డు కాగ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన ఏఎస్‌ఓఎస్‌ఏఐ 56వ గవర్నింగ్ బోర్డ్ జీసీ ముర్మును చైర్మన్‌గా ఎంచుకుంది. ఈ ఎంపికకు మంగళవారం ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఏఎస్‌ఓఎస్‌ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్ నిర్వహిస్తున్నట్లు కూడా కాగ్ వెల్లడించింది. సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం 1979లో ఏర్పాటయ్యింది. ప్రారంభంలో 11 సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంఘంలో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం సభ్యులందరూ పాల్గొంటారు. మూడేళ్లకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది. చదవండి: ఇండియా వర్సెస్ కెయిర్న్,.. కుదిరిన డీల్ ? -
మద్యం దుకాణాల్లో స్టాక్ ఆడిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, డిపోలలో స్టాక్ ఆడిట్ చేయాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రతి నెలా ఈ స్టాక్ ఆడిట్ నిర్వహిస్తారు. అందుకోసం మూడు సంస్థలను ఎంపిక చేశారు. డిపోలను ఓ సంస్థ ఆడిట్ చేస్తే.. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఆడిట్ నిర్వహిస్తాయి. బేవరేజస్ సంస్థల నుంచి డిపోలకు వస్తున్న నిల్వలు, అక్కడ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అవుతున్న వాటిని సెంట్రల్ డిపో నుంచే ఆడిట్ చేస్తారు. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని 2,975 ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్లి స్టాక్ ఆడిట్ నిర్వహిస్తాయి. ఆ దుకాణాలకు సరఫరా అవుతున్న మద్యం, అక్కడి విక్రయాలు, ఇంకా అందుబాటులో ఉన్న నిల్వలను తనిఖీ చేస్తాయి. రికార్డులను పరిశీలిస్తాయి. ఈ విధంగా మద్యం డిపోలు, దుకాణాల్లోని స్టాక్ ఆడిట్ మొత్తాన్ని పరిశీలించి విక్రయాలు సక్రమంగా సాగుతున్నాయా? అవకతవకలు జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. అవకతవకలను గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. -
సేఫ్టీ ఆడిట్ మళ్లీ మొదటి నుంచి...
సాక్షి, సిటీబ్యూరో: బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై గత నవంబర్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో కొత్తగా నిర్మించే ఫ్లైఓవర్లన్నింటితోపాటు పాతవాటికి కూడా తగిన సేఫ్టీ ఏర్పాట్లు తీసుకోవడమే కాక.. నిపుణుల కమిటీ సూచనకనుగుణంగా అవసరాన్ని బట్టి అదనపు సేఫ్టీ ఏర్పాట్లు కూడా చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. బయోడైవర్సిటీఫ్లెఓవర్ కారణంగా ముగ్గురు మృతి చెందడంతో ఫ్లైఓవర్ డిజైన్లోనే లోపాలనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. స్వతంత్ర నిపుణుల కమిటీ సూచనలకనుగుణంగా ప్రయాణికులు వేగనిరోధక చర్యలు పాటించేందుకుఅవసరమైన సైనేజీలతోపాటు రంబుల్‌స్ట్రిప్స్ పెంచడం.. ప్రత్యేక మెటీరియల్‌తో రబ్బర్‌స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ అనుభవం నేర్పిన పాఠంతో ప్రస్తుతంపురోగతిలో ఉన్న ఫ్లై ఓవర్లకు, కొత్తగా చేపట్టబోయే ఫ్లై ఓవర్లకు అన్నింటికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను సిఫార్సు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఫ్లై ఓవర్లు పూర్తయ్యాక కూడా సదరు నిపుణులతో సేఫ్టీ ఆడిట్ చేశాకే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. పనిలోపనిగా ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఫ్లై ఓవర్లకు కూడా కమిటీ సిపార్సుల మేరకు తగిన సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. అన్ని ఫ్లై ఓవర్లకు కూడా వేగ పరిమితి హెచ్చరికలు, రంబుల్‌స్ట్రిప్స్‌తోపాటు క్రాష్‌బారియర్స్, వ్యూకట్టర్స్ తదితరమైన వాటితో రీడిజైన్‌లకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌కు తీసుకున్న సేఫ్టీ ఏర్పాట్లన్నీ కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా రెండో వరుసలో భూమికి దాదాపు 20మీటర్ల ఎత్తులో నిర్మించే ఫ్లై ఓవర్ల విషయంలో మరింత శ్రద్ధతో వీటిని అమలు చేయనున్నారు. రెండో వరుస ఫ్లై ఓవర్లపై ప్రత్యేక శ్రద్ధ.. వ్యూహాత్మక రహదారుల పథకం(ఎస్సార్డీపీ)లో భాగంగా దాదాపు రూ.25వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, తదితర పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ దశల్లోని పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ. 3వేల కోట్ల విలువైన పనులుపురోగతిలో ఉన్నాయి. వీటిల్లో రెండో వరుసలో వచ్చే ఫ్లై ఓవర్లు కొన్ని ఉన్నాయి. బైరామల్‌గూడ జంక్షన్ వద్ద ఒవైసీ హాస్పిటల్వైపు నుంచి నాగార్జునసాగర్ రోడ్వైపు, విజయవాడ రోడ్వైపు వెళ్లే ఫ్లై ఓవర్ రెండో వరుసలో రానుంది. దాదాపు కిలోమీటరు పొడవుండే ఇది దాదాపు 15 మీటర్ల కంటే ఎత్తులో ఉంటుంది. అలాగే ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వైపు వెళ్లేందుకు నిర్మించే స్టీల్‌బ్రిడ్జి అత్యంత ఎత్తులో భూమికి 20 మీటర్ల ఎత్తులోరానుంది. ఉప్పల్ జంక్షన్ వద్ద , ఇతరత్రా ప్రాంతాల్లోనూ రెండో వరుసలో ఫ్లై ఓవర్లు రానున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి కూడా 20మీటర్ల ఎత్తులో రానుంది. అది చెరువుపైన ఉంటుంది కనుక దాని విషయంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో ఓఆర్ఆర్ వరకు ఎక్కడ ఫ్లై ఓవర్ నిర్మించినా రెండు, మూడు వరుసల్లో నిర్మించాలనే యోచన ఉంది. ప్రస్తుతానికి ఒక వరుస మాత్రమే అవసరమైనా భవిష్యత్ అవసరాల కనుగుణంగా భూసేకరణ కష్టాలు లేకుండా ఉండేందుకు, ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా ఉండేందుకు నాగపూర్ తదితర నగరాల్లో మాదిరిగా రెండు వరుసల్లో ఫ్లై ఓవర్లు నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక వచ్చే ఫ్లై ఓవర్లన్నింటికీ సేఫ్టీ ఆడిట్ కీలకంగా మారింది. సేఫ్టీ ఏర్పాట్ల వల్ల పెరిగే అదనపు లోడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్మాణం ఆరంభం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. పాత ఫ్లై ఓవర్లు ఎంతోకాలంగా వినియోగంలో ఉన్నందున సేఫ్టీ ఆడిట్ అవసరం లేదనే అభిప్రాయాలున్నా, ఎందుకైనా మంచిదనే తలంపుతో అవసరమని భావించిన వాటికి మాత్రం పాతవాటికి కూడా సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.కాగా ప్రమాదం అనంతరం కొద్ది రోజులు మూసివేసి...ఇటీవల అందుబాటులోకి తెచ్చిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సేఫ్టీ మెజర్స్‌ను నెలరోజుల పాటు పరిశీలించి..అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభంలో పెద్ద గ్యాంట్రీ (ఓవర్‌హెడ్) సైన్‌బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా నిపుణుల కమిటీ సూచించినా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆపనులు సాధ్యం కాకపోవడంతో చేపట్టలేదు. సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ తగ్గుతుంది కనుక ఆ సమయంలో గ్యాంట్రీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
జెట్ మాజీ ఛైర్మన్‌కు మరోసారి చిక్కులు
సాక్షి, ముంబై: జెట్‌ఎయిర్‌వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్‌కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్‌పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేష్‌గోయల్ చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్‌గోయల్‌కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్ నిర్వహించడమే మంచిని భావిస్తోంది. గతవారంలో గోయల్‌ను ప్రశ్నించిన అధికారులు ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్‌తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్‌ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ముంబైలో గోయల్‌ను ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా గోయల్, అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
జెట్ ఖాతాలపై ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్
ముంబై: తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఎస్బీఐ ఆదేశించింది. జెట్ ఎయిర్వేస్ బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా రుణాలను తీసుకోగా, ఎస్బీఐ లీడ్ బ్యాంకర్‌గా ఉంది. చమురు ధరల పెరుగుదలతో జెట్ ఎయిర్వేస్ గత మూడు త్రైమాసికాలుగా రూ.1,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేస్తోంది. తీవ్ర స్థాయిలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న ఈ సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలను కూడా చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 31 వరకు జెట్ ఎయిర్వేస్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఎస్బీఐ నిర్ణయించడం గమనార్హం. జెట్ ఎయిర్వేస్ ఖాతాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఓ ప్రజావేగు ఇచ్చిన సమాచారంతో ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు, ఈఅండ్‌వై సంస్థ ఇప్పటికే దీన్ని ప్రారంభించినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్ రూ.5,000 కోట్లను మింగేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. సెప్టెంబర్ క్వార్టర్ నాటికి ఈ సంస్థ రుణ భారం రూ.8,052 కోట్లుగా ఉంది. -
జీఎస్టీపై కాగ్ ఆడిట్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పనితీరుపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆడిట్ నిర్వహించనుంది. దీనికిగానూ జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి (2017 జూలై 1) నుంచి దాని పనితీరుపై పోస్ట్‌మార్టమ్ నిర్వహించనుంది. దీనిపై తుది నివేదికను త్వరలో రూపొందించనుంది. డిసెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టాలని కాగ్ యోచిస్తోంది. జీఎస్టీ పనితీరు సహా విధివిధానాలను పరిశీలించేందుకు కాగ్ బృందాలు పలు ప్రధాన రాష్ట్రాల్లోని జీఎస్టీ కమిషనరేట్లను ఇప్పటికే సందర్శించాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
దేశీ విమానయాన సంస్థల సేఫ్టీ ఆడిట్ షురూ..
న్యూఢిల్లీ: దేశీ విమానప్రయాణాల్లో ఇటీవల పలు వివాదాస్పద ఉదంతాలు నమోదవుతున్న నేపథ్యంలో విమానాల్లో రక్షణ చర్యలపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే షెడ్యూల్డ్ విమానయాన సంస్థలన్నింటిపైనా ఆడిట్ జరుగుతోందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి ముంబై కేంద్రంగా పనిచేసే ఎయిర్‌లైన్స్ ఆడిట్ చేపట్టనున్నట్లు వివరించారు. విమానయాన సంస్థల కార్యకలాపాలతో పాటు శిక్షణా కార్యక్రమాలు.. కేంద్రాలు, సిబ్బంది పనితీరును కూడా మదింపు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది షెడ్యూల్డ్ ఆపరేటర్స్ ఉండగా .. ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్, గోఎయిర్, విస్తార మొదలైనవి ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ప్రయాణం మధ్యలో ఇంజిన్లు ఫెయిల్ కావడం, విమానాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరులతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ ఆడిట్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
అంగన్వాడీల్లో ఆడిట్
అశ్వాపురం ఖమ్మం : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్డు, మధ్యాహ్న భోజనం, బాలామృతం, చిన్నారులకు ఆటపాటలతో ప్రీ స్కూల్ విద్య తదితర సేవలు అందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు సేవలు అందడం లేదని, అంగన్వాడీ టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పౌష్టికాహారం పక్కదారి పడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తోంది. లబ్ధిదారులకు పౌష్టికాహారం అందుతున్న తీరును తెలుసుకోనుంది. జిల్లాలో రెండు విడతలుగా రెండు బృందాలు ఈ నెలాఖరు వరకు తనిఖీ చేపట్టాలని నిర్ణయించింది. 155 కేంద్రాల్లో.. జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,434 ప్రధాన, 626 మినీ అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 8,500 మంది గర్భిణులు, 5వేల మంది బాలింతలు, 3 సంవత్సరాల లోపు పిల్లలు 55వేల మంది, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 27వేల మంది అంగన్వాడీ సేవలు పొందుతున్నారు. కాగా జిల్లాలో 155 అంగన్వాడీ కేంద్రాలను సామాజిక బృందం తనిఖీ చేయనుంది. మొదటి విడతలో 75, రెండో విడతలో 80 కేంద్రాల్లో తనిఖీ చేపట్టనున్నారు. తనిఖీ చేయనున్న కేంద్రాలను డైరెక్టరేట్ నుంచి ఎంపిక చేశారు. జిల్లాలో ఇల్లెందు ప్రాజెక్ట్‌లో 6, దుమ్ముగూడెం 34, టేకులపల్లిలో 8, అశ్వారావుపేటలో 6, బూర్గంపాడులో 24, చండ్రుగొండలో 34, చర్లలో 10, దమ్మపేటలో 11, మణుగూరులో 19, పాల్వంచలో 3 కేంద్రాల్లో సామాజిక తనిఖీ జరగనుంది. తనిఖీలో ఫిబ్రవరి 2018 నుంచి జూలై 2018 ఆరు నెలల కాలంలో అందించిన సేవలపై ఆరా తీస్తారు. ఈ నెల 7 నుంచి ఇల్లెందు ప్రాజెక్ట్‌లో సామాజిక తనిఖీ ప్రారంభమైంది. సేవల్లో పారదర్శకతే లక్ష్యంగా.. అంగన్వాడీ సేవల్లో పాదర్శకత కోసం ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పౌష్టికాహారం సరఫరా చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని, కేంద్రాలకు పిల్లలు, గర్భిణులు, బాలింతలు హాజరుకాకపోయినా, హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసి పౌష్టికాహారం పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి ఏడాది 10 శాతం అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నెలలో జిల్లాలో 61 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ ఏడాది 155 కేంద్రాల్లో తనిఖీ చేపడుతున్నారు. 14 అంశాల పరిశీలన సామాజిక తనిఖీ బృందం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి కేంద్రం నిర్వహణ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల తీరును పరిశీలిస్తుంది. లబ్ధిదారుల హాజరు, ఏయే నెలల్లో, ఎంత పౌష్టికాహారం సరఫరా అయింది, లబ్ధిదారులకు ఎంత పంపిణీ చేశారు? తదితర 14 రకాల అంశాలను పరిశీలిస్తారు. గ్రామంలో గృహ సందర్శన చేపట్టి గర్భిణులు, బాలింతలు, 0 నుంచి 6 నెలలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు, స్థానికులతో మాట్లాడి అంగన్వాడీల ద్వారా గుడ్లు, బియ్యం, పప్పు, బాలామృతం, భోజనం, పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారో లేదా, అంగన్వాడీ సేవలు అందుతున్నాయా లేదో తెలుసుకుంటారు. తనిఖీ పూర్తయ్యాక ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ఆవరణలో గ్రామసభ నిర్వహించి తనిఖీలో వెల్లడైన వివరాలను, సమస్యలను వివరించి, లబ్ధిదారులు, స్థానికులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం నివేదికను మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారికి, డైరెక్టరేట్‌కు అందజేస్తారు. ఈ నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో.. జిల్లాలో 155 అంగన్వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న పౌష్టికాహారం, సేవలపై తనిఖీ చేస్తారు. ఈ నెల 7న ఇల్లెందు ప్రాజెక్ట్‌లో తనిఖీ ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో తనిఖీ నిర్వహిస్తారు. సామాజిక తనిఖీ బృందానికి రికార్డులు అందజేయాలని సీడీపీఓలను ఆదేశించాం. తనిఖీ పూర్తయ్యాక నివేదికలు అందజేస్తారు. –ఝాన్సీ లక్ష్మీబాయి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి -
సెలబ్రిటీల లెక్కలు మారిపోయాయి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఈ మధ్య ప్రముఖుల ఫాలోవర్ల లెక్కలను విడుదల చేసింది. అయితే అనుసరించేవారి(ఫాలోవర్ల) లెక్కలు నిజం కాదని, అందులో చాలా మట్టుకు బోగస్‌వే ఉన్నాయంటూ పెద్ద షాకే ఇచ్చింది. ప్రధాని మోదీ నుంచి మొదలుకుని, సినీ సెలబ్రిటీల దాకా ఎవరి ఖాతాలో ఎన్ని ఫేక్ ఫాలోవర్లు ఉన్న లిస్ట్‌ను ట్విటర్ విడుదల చేసింది. అందులో మన స్టార్ల లెక్కలను పరిశీలిస్తే... టాలీవుడ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ సమంత అక్కినేని. అయితే ఆమె ఫాలోవర్లలో 68 శాతం మాత్రమే అసలు అని ట్విటర్ తేల్చింది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న మహేష్ బాబు ఫాలోవర్లలో 51 శాతం, రానా దగ్గుబాటి 53 శాతం, నాగార్జున ఖాతాలో 54 శాతం రియల్ ఫాలోవర్లు ఉన్నారంట. లిస్ట్‌లో తర్వాతి ప్లేస్‌లో ఉన్న రాజమౌళి ట్విటర్లో మాత్రం 72 శాతం ఒరిజినల్ ఫాలోవర్లు ఉండగా, అత్యధిక ఒరిజినల్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా జక్కన్న నిలిచారు. తారక్ రియల్ ఫాలోవర్స్ 65 శాతం ఉండగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 49 శాతంతో లోయెస్ట్ రియల్ ఫాలోవర్స్ సెలబ్రిటీగా నిలిచారు. బాలీవుడ్ విషయానికొస్తే... 35 మిలియన్ల ఫాలోవర్లతో షారూఖ్ ఖాన్ ట్విటర్ టాప్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆయన ఒరిజినల్ ఫాలోవర్స్ 48 శాతం మాత్రమే ఉంది. అంతేకాదు ఈ లిస్ట్‌లో ఆయనే లోయెస్ట్ ఫాలోవర్స్ సెలబ్రిటీ కావటం గమనార్హం. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 62 శాతం, సల్మాన్ ఖాన్ 50 శాతం, అక్షయ్ కుమార్ 50 శాతం, దీపికా పదుకొనే 67 శాతం, హృతిక్ రోషన్ 56 శాతం, అమీర్ ఖాన్ 68 శాతం, ఏఆర్ రెహమాన్ 53 శాతం, అలియా భట్ 61 శాతం రియల్ ఫాలోవర్స్ ఉండగా, ఈ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా 71 శాతం రియల్ ఫాలోవర్స్‌తో హయ్యెస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు. ట్విటర్ అడిట్ ప్రకారం... -
ఆర్బీఐపై సీవీసీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ. చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సరైన ఆడిట్స్ నిర్వహించలేదని పేర్కొన్నారు. సీబీఐ విచారణను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎన్బీ స్కాం విషయంలో తప్పు ఆర్బీఐదే అంటూ సీవీసీ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆడిటింగ్ విధానాన్ని పటిష్టపరచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పీఎన్బీ బ్యాంకులో కుంభకోణం జరిగిన సమయంలో రిజర్వు బ్యాంకు సరైన ఆడిట్స్ నిర్వహించలేదని, కాబట్టి తప్పు ఆర్బీఐదే అని ఆయన విమర్శించారు. ఆర్బీఐ మరింత పటిష్టమైన ఆడిటింగ్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరముందన్నారు. బ్యాంకుల్లో రిస్క్‌లను గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆడిటింగ్ చెయ్యాలి. కానీ పీఎన్బీలో సమయానుసారంగా ఆర్బీఐ అలా స్పష్టంగా ఆడిటింగ్ చేయలేదని చౌదరి ఆరోపించారు. కాగా దాదాపు 13వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇప్పటికే భారీ మోసాన్ని గుర్తించడంలో విఫలమయ్యారంటూ రెగ్యులేటర్స్పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
ఉపాధి కష్టాలు
వారంతా శ్రమజీవులు.. రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పల్లెల్లో పనులు లేక వారంతా ఉపాధి హామీ కూలీలుగా మారారు. పనులు చేస్తే వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఏకైక లక్ష్యం వారిది. రోజంతా మండుటెండలో పనిచేస్తున్నారు. అయితే కూలి చెల్లించాల్సిన అధికారులు వివిధ కారణలతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో శ్రమనే నమ్ముకున్న వేలాది మంది ఉపాధి హామీ కూలీల దయనీయ స్థితి ఇది. అధికారులు ఆడిట్లో చేసిన తప్పుల ఫలితంగా కూలీలు ఆర్థిక కష్టాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. సక్రమంగా పనులు ఉండకపోవటంతో జిల్లాలో వలసలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తేనే వలసలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధికారుల బాధ్యతారాహిత్యం, ఉపాధి హామీ లో చోటుచేసుకుంటున్న అవినీతి వల్ల కూలీలు అంతిమంగా నష్టపోతున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని ప్రభుత్వం ఆమోదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగం అభివృద్ధికి సంబంధించిన పనులు, కాలువలు, జంగిల్‌క్లియరెన్స్, చెరువుల్లో మట్టితీయడం, రోడ్లు, పంటకుంటలు, వర్మీకంపోస్టులు తదితర పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. అనుమతి ఇచ్చిన తరువాత గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు పనులు కల్పిస్తారు. జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించేందుకు, పనులను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏలు, మేట్లు, టీఏలు, టీటీఏలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఏపీడీలను నియమించారు. ఉపాధి పనులు డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధిలో ప్రతి ఏటా కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ఆడిట్ నిర్వహించారు. దాని వలన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. పర్యవసానంగా జిల్లాలోని ఉపాధి కూలీలకు నాలుగు నెలల్లో రూ.20 కోట్ల బకాయి పడ్డారు. బ్యాంక్‌లకు ఆధార్‌కార్డ్ లింకేజీ కాని కారణంగా మరో రూ.2.37 కోట్లు నిలిచిపోయింది. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా అందని వేతనం జిల్లాలో 5.85 లక్షల మందికి ప్రభుత్వం అధికారికంగా జాబ్ కార్డులు మంజూరు చేసింది. వీరికి నిబంధనల ప్రకారం ఏటా వంద పనిదినాలు కల్పించాలి. వీరికి రోజు కూలి రూ.140 తగ్గకుండా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గత డిసెంబర్ నుంచి జిల్లాలో సుమారు 85 వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానంగా 62 వేల మందికి ఉపాధి కూలి అందని పరిస్థితి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 55వేల నుంచి 61 వేల మంది ప్రస్తుతం పనుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో 2017 డిసెంబర్ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కూలి మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు జరిగాయని తరచూ విచారణలు చేపడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. అయితే కూలీల వేతనాల మంజూరుకు మాత్రం దీనిని సాకుగా చూపుతున్నారు. ∙ఉదాహరణకు వాకాడు మండలంలో 665 గ్రూపుల్లో 10,075 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రసుత్తం వీరిలో వెయ్యి మందికి మాత్రమే ఉపాధి పనులు దక్కాయి. వీరికి గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూలీలకు రూ.3 లక్షలు వరకు ఉపాధి సొమ్ము రావాల్సి ఉంది. ఉపాధి కూలీలు మూడు నెలలుగా పనులు చేస్తున్నప్పటికీ కూలి సొమ్ము అందక పస్తులుంటున్నారు. కూలీలకు సంబంధించిన వేతనాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నోడల్ బ్యాంక్‌లకు విడుదల చేసి అక్కడ నుంచి వివిధ బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాలకు పంపుతుంది. అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న బ్రాంచ్‌ల్లో జమ అవుతుంది. కూలీలు తమ ఖాతా నంబర్లు, ఆధార్ కార్డులు అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా అనుసంధానం చేసిన నంబర్లు ఎన్సీపీఐ(నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో సింక్ అయితే ఆయా వేతనాలు కూలీల ఖాతాలో జమ అవుతాయి. కూలీలకు సంబంధించిన ఆధార్, ఖాతా నంబర్లు ఎన్సీపీఐలో సింక్ చేయడంలో అధికార్లు జాప్యం, చేసిన పొరపాట్లు కారణంగా వేతనాలు జమకాకుండా రిజెక్ట్ అవుతున్నాయి. పూర్తిగా అధికారులు చేసిన తప్పులకు కూలీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు వారాలుగా కూలీ అందక పస్తులుంటున్నాం ఐదు వారాలుగా ఉపాధి పనులు చేస్తున్నా.. ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగితే బ్యాంక్‌లో జమ చేశామని, అక్కడ అడిగితే జమకాలేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. వారం రోజులుగా పనులు సైతం మానుకుని కూలి డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఇల్లు గడవక కుటుంబం పస్తులుండాల్సి వస్తోంది. –వేమాల మస్తానయ్య ఉపాధి కూలీ, వాకాడు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాం సెంటు భూమిలేని మా లాంటి పేదోళ్లంతా ఉపాధి పనులను నమ్ముకుని బతుకుతున్నాం. 48 రోజులుగా పనులు చేస్తున్నా ఇంతవరకు డబ్బులు జమకాలేదు. ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. మాత్రలు కొనడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అల్లాడుతున్నాం. అధికారులను అడిగితే ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప డబ్బులైతే ఇవ్వట్లేదు. పాస్ పుస్తకాలు పట్టుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నాం. –వంజివాక పిచ్చమ్మ, ఉపాధి కూలీ, వాకాడు -
పీడబ్ల్యూసీకి సెబీ షాక్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కంప్యూటర్స్ ఖాతాలను ఈ సంస్థే ఆడిట్ చేసినా... కంపెనీ లాభనష్టాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వెల్లడికాలేదు. చివరకు ప్రమోటర్ రామలింగరాజు వెల్లడించాకే విషయాలన్నీ బయటికొచ్చాయి. సత్యం ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన ఈ వ్యవహారంలో... దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పీడబ్ల్యూసీని సెబీ దోషిగా తేల్చింది. ఫలితంగా పీడబ్ల్యూసీ నెట్వర్క్ సంస్థలు రెండేళ్ల పాటు భారత్‌లోని లిస్టెడ్ కంపెనీలకు ఆడిట్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే సత్యం కంప్యూటర్స్ ఖాతాలు ఆడిటింగ్ ద్వారా పీడబ్ల్యూసీ, గతంలో దాని రెండు భాగస్వామ్య సంస్థలు అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్లకు పైగా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని 108 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, పీడబ్ల్యూ నెట్వర్క్ సంస్థలు 2017–18కి సంబంధించి ఇప్పటికే చేపట్టిన ఆడిటింగ్ అసైన్‌మెంట్స్‌పై దీని ప్రభావం ఉండదని తెలిపింది. సెబీ ఆదేశాలపై తాము స్టే తెచ్చుకుంటామని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ ధీమా వ్యక్తం చేయగా, ఉత్తర్వులను పరిశీలించనున్నట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి చెప్పారు. ఆడిటర్లకు సంబంధించి ఇప్పటికే కఠిన నిబంధనలు ఉన్నాయని, వాటిని అమలు మాత్రమే చేయాల్సి ఉందని తెలిపారు. దేశీ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన రూ. 7,000 కోట్ల సత్యం కంప్యూటర్స్ కుంభకోణం 2009లో బయటపడింది. ఆ తర్వాత కంపెనీ చైర్మన్ రామలింగరాజు జైలుకెళ్లడం, సంస్థను టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవధిలో పీడబ్ల్యూసీ రెండు సార్లు రాజీ యత్నాలకు ప్రయత్నించినా విఫలమయింది. అయితే, అమెరికాలో మాత్రం రాజీ చేసుకోగలిగింది. బిగ్ ఫోర్‌గా పరిగణించే నాలుగు దిగ్గజ ఆడిటింగ్ కంపెనీల విషయంలో ఇంత తీవ్రమైన ఆదేశాలు జారీ కావడం దేశంలో ఇదే ప్రథమం. గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరిలకు 3 ఏళ్లు.. ప్రైస్ వాటర్‌హౌస్ మాజీ భాగస్వాములు గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరి మూడేళ్ల పాటు లిస్టెడ్ సంస్థలకు ఆడిట్ సర్టిఫికెట్లు జారీ చేయరాదని సెబీ స్పష్టంచేసింది. 2000–2008 మధ్య కాలంలో ప్రైస్ వాటర్‌హౌస్ సంస్థలు ఆడిటింగ్ సేవలకు గాను సత్యం నుంచి రూ. 23 కోట్లు ఫీజుగా పొందగా.. ఇందులో రూ. 13 కోట్లు పీడబ్ల్యూ బెంగళూరుకి లభించాయని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రైస్ వాటర్‌హౌస్ బెంగళూరు విభాగంతో పాటు ఎస్ గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరి అనుచితంగా లబ్ధి పొందిన మొత్తం రూ. 13 కోట్లు, 2009 జనవరి 7 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. ఇందుకు 45 రోజుల గడువు ఇచ్చింది. స్టే తెచ్చుకుంటాం: పీడబ్ల్యూసీ సెబీ విచారణ, తీర్పు తమను నిరాశపరిచినట్లు పీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చే లోగా స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ చూడని విధంగా సత్యం యాజమాన్యం చేసిన మోసంలో పీడబ్ల్యూ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పూ చేయలేదనే 2009 నుంచీ చెబుతున్నాం. తాజా తీర్పు 2011లో బాంబే హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. దీనిపై స్టే తెచ్చుకోగలమని భావిస్తున్నాం‘ అని వెల్లడించింది. కొత్త ఆడిటర్ల వేటలో కంపెనీలు.. ప్రైస్ వాటర్‌హౌస్ నెట్వర్క్ సంస్థలపై సెబీ నిషేధం విధించిన నేపథ్యంలో ప్రస్తుతం వాటి సర్వీసులు ఉపయోగించుకుంటున్న అనేక లిస్టెడ్ కంపెనీలు కొత్త ఆడిటర్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీడబ్ల్యూసీ నెట్వర్క్ కింద భారత్‌లో ప్రస్తుతం 11 సంస్థలు ఉండగా.. 3,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. దేశీయంగా 75 లిస్టెడ్ కంపెనీలకు ఈ సంస్థలు ఆడిటింగ్ సేవలు అందిస్తున్నాయి. 2017–18 ఏడాది ఆడిటింగ్‌పై తీర్పు ప్రభావం ఉండదని సెబీ చెప్పినప్పటికీ.. తర్వాతైనా సరే ఈ లిస్టెడ్ కంపెనీలు మరో ఆడిటర్‌ను వెతుక్కోవాలి. మరోవైపు, సెబీ ఆదేశాల నేపథ్యంలో పరోక్షంగానైనా.. అన్‌లిస్టెడ్, ఇతర సంస్థలకు ప్రైస్ వాటర్‌హౌస్ అందించే ఆడిటింగ్ సేవలపైనా ప్రశ్నలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.