బీజింగ్: ప్రముఖ అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ టచే తోమట్సుపై చైనా చర్యలు తీసుకుంది. చైనా ప్రభుత్వరంగ ‘చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ’కి సంబంధించి ఆడిట్ సరిగ్గా చేయనందుకు డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై 30.8 మిలియన్ డాల ర్లు (రూ.252 కోట్లు) జరిమానా విధించింది. అవినీతి ఆరోపణలపై చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాజీ హెడ్ లాయ్ షియోమీని చైనా 2021లో ఉరితీయడం ఈ సందర్భంగా గమనార్హం.
పెట్టుబడులు పెట్టేందు కు, నిర్మాణ కాంట్రాక్టులు, ఉద్యోగాలకు సంబంధించి లంచాలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య ఆడిట్, ఇతర పనుల్లో తప్పులకు గాను డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై మూడు నెలల పాటు సస్పెన్షన్‌ను కూడా గతంలో విధించింది. హురాంగ్ సంస్థపై 1.16 లక్షల డాలర్లు, ఆడిట్‌లో లోపాలకు గాను 13 మంది ఉద్యో గులపై 36,000 డాలర్ల జరిమానా విధించింది. హురాంగ్ ఆస్తులు, నిబంధనల అమలు, నిర్వహణ కార్యకలాపాలపై ఆడిటర్‌గా డెలాయిట్ తగినంత దృష్టి సారించడంలో విఫలమైనట్టు చైనా నియంత్రణ సంస్థలు తేల్చాయి.
Comments
Please login to add a commentAdd a comment