Asset Management Company
-
బజాజ్ ఫిన్సర్వ్ రెండు ఈటీఎఫ్‌లు
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. -
దీర్ఘకాలంలో బులిష్ గా భారత ఈక్విటీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలికంగా భారతీయ ఈక్విటీలు బులిష్ గా కనిపిస్తున్నాయని బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ సీఐవో నిమేష్ చందన్ చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా రాజకీయ, భోగోళికపరమైన అంశాల కారణంగా కొన్ని ఒడుదుడుకులు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లతో లభిస్తున్నాయని తెలిపారు. అటు ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల విషయానికొస్తే మెరుగైన ఈల్డ్‌లను లాకిన్ చేసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే కొద్దీ మధ్యకాలికంగా క్యాపిటల్ గెయిన్స్పరమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌ను (బీఏఎఫ్) ఆవిష్కరించామని, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇలాంటివి గణనీయంగా రాబడులు అందించే అవకాశం ఉందన్నారు. బీఏఎఫ్తో మరిన్ని ప్రయోజనాలు.. ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్కమ్ సాధనాలకు ఏయే పాళ్లలో ఏ విధంగా పెట్టుబడులను కేటాయించవచ్చనేది బీఏఎఫ్లో నిపుణులైన అనుభవజు్ఞల పర్యవేక్షణలో జరుగుతుంది. సాధారణంగా ఈక్విటీ సూచీలతో పోలిస్తే ఈ తరహా ఫండ్స్‌లో ఒడుదుడుకులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలు ఉన్న చాలా మందికి ఈ ఫండ్స్ అన్నివేళలా అనువైనవి. బీఏఎఫ్ అనేది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోనూ డైవర్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఏ ఈక్విటీ లేదా అసెట్ అలొకేషన్ వ్యూహమైనా సరైన పనితీరు కనపర్చాలంటే కనీసం 3–5 ఏళ్ల పాటు న్వెస్ట్మెంట్ కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్ విషయంలోనూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి. ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక పాత ఫండ్స్ (వింటేజ్) వైపు చూడాలా అని కొందరిలో మీమాంస ఉండొచ్చు. అయితే, ఫండ్ వ్యూహం, తమ అసెట్ అలొకేషన్కి అది ఎంత వరకు ఉపయోగపడుతుందనేదే చూసుకోవడం మంచిది. సాధారణంగా వింటేజ్ ఫండ్స్‌కి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ విధానం, మేనేజ్మెంట్ బృందం మొదలైనవి మారిపోతే వాటి గత పనితీరు అనేది భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందనుకోవడానికి ఉండదు. వింటేజ్ ఫండ్లు చేసిన తప్పిదాల నుంచి నేర్చుకుని, అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా న్యూ ఫండ్ ఆఫర్లు ఉండవచ్చు. -
శామ్కో నుంచి డైనమిక్ అస్సెట్ ఫండ్
ముంబై: శామ్కో అస్సెట్ మేనేజ్మెంట్ ‘డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్’ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు, మార్కెట్ల కరెక్షన్లలో రక్షణ ప్రయోజనాలతో ఈ పథకం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లలో మరీ ప్రతికూల పరిస్థితులు కనిపించిన సందర్భాల్లో పెట్టుబడులను పూర్తిగా డెట్‌లోకి మార్చడం ఈ పథకం విధానంలో భాగంగా ఉంటుంది. పెట్టుబడులు అన్నింటినీ డెట్‌కు మార్చే తొలి డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా మారినప్పుడు అవసరమైతే నూరు శాతం పెట్టుబడులను అందులోకి మళ్లించగలదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీల మధ్య పెట్టుబడులను మారుస్తూ, రిస్క్ తగ్గించి, మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. డిసెంబర్ 7 నుంచి 21వ తేదీ వరకు ఈ నూతన పథకం (ఎన్ఎఫ్వో) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
స్మాల్‌కేస్‌తో జిరోధా జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: కొత్తగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్న బ్రోకరేజీ సంస్థ జిరోధా తాజాగా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ స్మాల్‌కేస్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ సాధనాలను రూపొందించడంలో స్మాల్కేస్కు 6 ఏళ్ల పైగా అనుభవం ఉందని, ఈ నేపథ్యంలోనే దానితో చేతులు కలిపామని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లపై భారీ వ్యయాలు భారం లేకుండా మెరుగైన మ్యూచువల్ ఫండ్ పథకాలను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆశిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ను పరిచయం చేయడానికి ఈ భాగస్వా మ్యం తోడ్పడగలదని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీని ప్రారంభించేందుకు జిరోధా 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది. 2021 సెప్టెంబర్‌లో సెబీ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది అనుమతుల కోసం జిరోధా ఎదురుచూస్తోంది. ప్రస్తు తం 42 మ్యుచువల్ ఫండ్ కంపెనీలు రూ. 40.5 లక్షల కోట్ల పైగా ఆస్తులను నిర్వహిస్తున్నాయి. -
డెలాయిట్‌కు చైనా మొట్టికాయ
బీజింగ్: ప్రముఖ అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ టచే తోమట్సుపై చైనా చర్యలు తీసుకుంది. చైనా ప్రభుత్వరంగ ‘చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ’కి సంబంధించి ఆడిట్ సరిగ్గా చేయనందుకు డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై 30.8 మిలియన్ డాల ర్లు (రూ.252 కోట్లు) జరిమానా విధించింది. అవినీతి ఆరోపణలపై చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ హెడ్ లాయ్ షియోమీని చైనా 2021లో ఉరితీయడం ఈ సందర్భంగా గమనార్హం. పెట్టుబడులు పెట్టేందు కు, నిర్మాణ కాంట్రాక్టులు, ఉద్యోగాలకు సంబంధించి లంచాలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య ఆడిట్, ఇతర పనుల్లో తప్పులకు గాను డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై మూడు నెలల పాటు సస్పెన్షన్‌ను కూడా గతంలో విధించింది. హురాంగ్ సంస్థపై 1.16 లక్షల డాలర్లు, ఆడిట్లో లోపాలకు గాను 13 మంది ఉద్యో గులపై 36,000 డాలర్ల జరిమానా విధించింది. హురాంగ్ ఆస్తులు, నిబంధనల అమలు, నిర్వహణ కార్యకలాపాలపై ఆడిటర్‌గా డెలాయిట్ తగినంత దృష్టి సారించడంలో విఫలమైనట్టు చైనా నియంత్రణ సంస్థలు తేల్చాయి. -
ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు
న్యూఢిల్లీ: ఫోరెన్సిక్ ఆడిటర్లుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇలా ఎంపికైన ఆడిటర్లు మ్యూచువల్ ఫండ్స్, ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎంసీ)లు, ట్రస్టీ సంస్థలకు సేవలు అందించవలసి ఉంటుంది. అర్హతగల సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఇచ్చిన గడువు ఈ నెల 6తో ముగియగా.. తాజాగా మార్చి 31వరకూ సెబీ పొడిగించింది. దరఖాస్తుదారులు మొబైళ్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు తదితర యూఎస్బీ డ్రైవ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, డిజిటల్ ఎవిడెన్స్‌పై నివేదికలు రూపొందించడం తదితర కార్యకలాపాలు చేపట్టవలసి ఉంటుంది. బైబ్యాక్ బిడ్స్, ధరలపై సెబీ ఆంక్షలు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే బైబ్యాక్‌లకు వర్తింపు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)లో సెబీ తాజాగా ఆంక్షలు విధించింది. బిడ్స్ వేయడం, ధరల నిర్ణయం, పరిమాణం తదితర అంశాలకు ఆంక్షలు వర్తింపచేస్తూ సెబీ సర్క్యులర్‌ను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కొనుగోలు తేదీ నుంచి గత 10 ట్రేడింగ్ పనిదినాల రోజువారీ సగటు పరిమాణం(విలు వ)లో 25 శాతాన్ని మించి బైబ్యాక్ చేపట్టేందుకు వీలుండదు. మార్కెట్ ప్రారంభానికి ముందు తొలి అర్ధగంట, ట్రేడింగ్ సమయంలో చివరి అర్ధగంట లో బైబ్యాక్ బిడ్స్‌ను అనుమతించరు. క్రితంరోజు ట్రేడైన ధరకు 1% శ్రేణిలో మాత్రమే ఆర్డర్లకు అను మతి ఉంటుంది. తాజా నిబంధనలను అమలు చేయవలసిందిగా అటు కంపెనీలు, ఇటు ఎంపిక చేసిన బ్రోకర్లను సెబీ ఆదేశించింది. నిబంధనల అమలును స్టాక్ ఎక్సే్ఛంజీలు పర్యవేక్షిస్తుంటాయని, ఉల్లంఘిస్తే జరిమానా లేదా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బైబ్యాక్ చేపట్టేందుకు స్టాక్ ఎక్సే్ఛంజీలు, టెండర్ ఆఫర్ మార్గా లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్ చేపట్టడాన్ని దశలవారీగా తొలగించనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకల్లా పాన్–ఆధార్ లింక్ ఇన్వెస్టర్లకు సెబీ తాజా ఆదేశాలు సెబీ ఈ నెలాఖరులోగా ఆదాయ పన్ను శాఖ నుంచి పొందే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కు ఆధార్‌ను లింక్ చేయవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి ఆదేశించింది. తద్వారా సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలను ఎలాంటి సమస్యలూ లేకుండా నిర్వహించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. గడువులోగా పాన్‌కు ఆధార్‌ను లింక్ చేయని ఇన్వెస్టర్లను కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తామని పేర్కొంది. దీంతో సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై ఆంక్షలు అమలుకానున్నట్లు వెల్లడించింది. 2023 మార్చి31లోగా ఆధార్‌ను లింక్ చేయకుంటే పాన్ సేవలు నిలిచిపోనున్నట్లు 2022 మార్చిలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం తగిన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. -
బ్లాక్‌రాక్ ‘ఆస్తులు’ ఆవిరి!
న్యూఢిల్లీ: మార్కెట్లో మామూలు ఇన్వెస్టర్లే కాదు. కాకలు తీరిన కంపెనీలూ దెబ్బతింటాయి. ఏకంగా 10 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులున్న బ్లాక్‌రాక్ లాంటి దిగ్గజం కూడా గడిచిన ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ ఆటుపోట్లను తట్టుకోలేకపోయింది. ఈ సంస్థ ఏకంగా తన నిర్వహణ ఆస్తుల్లో లక్షా డెబ్బై వేల కోట్ల డాలర్లను (రూ.136 లక్షల కోట్లు) కోల్పోయింది. అది కూడా ఆరు నెలల కాలంలో. ఇది ఓ ప్రపంచ రికార్డు కూడా. గతంలో ఎన్నడూ ఓ సంస్థ ఆరు నెలల కాలంలో ఇంతలా నిర్వహణ ఆస్తులను కోల్పోలేదు. నిజానికి 2022 తొలి ఆరు నెలలు ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లకు ఏమాత్రం కలసి రాలేదనే చెప్పుకోవాలి. ఈ ప్రతికూలతలను ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు సాధ్యమైన మేర అధిగమించే ప్రయత్నాలు చేశాయి. కానీ, బ్లాక్రాక్పై మార్కెట్ పరిణామాల ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే ఈ సంస్థ నిర్వహణ ఆస్తుల్లో మూడొంతులు ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లోనే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా మారిన ఇన్వెస్టర్ల ప్రాథాన్యతలు సైతం ఈ సంస్థ ఆస్తులపై ప్రభావం చూపించాయి. ఈ సంస్థ నిర్వహించే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్‌లో పావు శాతమే బెంచ్‌మార్క్ కంటే మెరుగైన పనితీరు చూపించాయి. 8.49 లక్షల కోట్ల డాలర్లు.. జూన్ చివరికి బ్లాక్‌రాక్ మొత్తం నిర్వహణ ఆస్తులు 8.49 లక్షల కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం నుంచి చూస్తే 11 శాతం క్షీణించాయి. అసలు బ్లాక్‌రాక్ మూలాలు యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్)లోనే ఉన్నాయని చెప్పుకోవలి. 2002లో మొదటి యూఎస్ డోమిసిల్డ్ బాండ్ ఈటీఎఫ్‌ను ఆరంభించగా, గత పదేళ్ల కాలంలో యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి 280 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2022 జూన్ 30 నాటికి 954 బిలియన్ డాలర్ల ఆస్తులను యాక్టివ్ బాండ్ ఫండ్స్‌లో నిర్వహిస్తుంటే.. యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్‌లోని నిర్వహణ ఆస్తులు 393 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఈ ఏడాది బాండ్ మార్కెట్ కుప్పకూలడం యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు బయటకు వెళ్లేందుకు దారితీసింది. ‘‘స్టాక్స్, బాండ్స్‌కు 2022 అత్యంత చెత్త ఆరంభంగా మిగిలిపోతుంది’’ అని బ్లాక్‌రాక్ చైర్మన్, సీఈవో లారీఫింక్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. -
ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఖాతాలు ఓకే
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు ఇన్వెస్టర్లను ఓమాదిరిగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కొత్తగా 51 లక్షల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. దీంతో 43 ఫండ్ హౌస్‌ల ద్వారా మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 13.46 కోట్లకు చేరాయి. ఇటీవల మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)పట్ల అవగాహన పెరగడం, లావాదేవీలలో డిజిటైజేషన్ వంటి అంశాలు ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. గత 12 నెలల్లో స్పీడ్ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) గణాంకాల ప్రకారం గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 93 లక్షల ఖాతాలు ప్రారంభంకాగా.. గత 12 నెలల్లో 3.2 కోట్ల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. అయితే భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, బలపడుతున్న బాండ్ల ఈల్డ్స్, యూఎస్ ఫెడ్ కఠిన విధానాలు వంటి అంశాలు క్యూ1లో పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఎల్‌ఎక్స్‌ఎంఈ నిపుణులు ప్రియా అగర్వాల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఇకపై పెట్టుబడులు ఊపందుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీలకే ప్రాధాన్యం ఎంఎఫ్‌లలో రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా ఈక్విటీ ఫండ్స్‌కే ఆసక్తి చూపుతారని మైవెల్త్‌గ్రోత్.కామ్ సహవ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. దీంతో మార్కెట్ పరిస్థితులు ఫోలియోలపై ప్రభావం చూపుతాయని తెలియజేశారు. రానున్న కాలంలో మార్కెట్లు స్థిరపడితే ఫండ్స్‌లో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా వేశారు. ఎంఎఫ్ పరిశ్రమలో 10 కోట్ల ఫోలియోలు 2021 మే నెలకల్లా నమోదయ్యాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. క్యూ1లో జత కలిసిన 51 లక్షల ఖాతాలలో 35 లక్షల ఫోలియోలు ఈక్విటీ ఆధారిత పథకాలేకావడం గమనార్హం! -
ఐఐఎఫ్ఎల్ వెల్త్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్లో వాటాలను విక్రయించాలని విదేశీ పెట్టుబడి సంస్థలు యోచిస్తున్నాయి. ప్రధానంగా జనరల్ అట్లాంటిక్ సింగపూర్, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాటాలను ఆఫర్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్‌లో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్‌కు 13.6 శాతం వాటా ఉంది. అయితే మార్కెట్ ధర కంటే అధికంగా సుమారు 40 శాతంవరకూ ప్రీమియంను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాటాల కొనుగోలుకి పీఈ ఫండ్స్, సంపన్న వర్గాలు (హెచ్ఎన్ఐలు) ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నాయి. పీఈ సంస్థ ద క్యాపిటల్ ఫండ్ సైతం రేసులో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో షేరుకి రూ. 2,100 ధరవరకూ ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. బుధవారం బీఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,474 వద్ద ముగిసింది. కాగా.. వాటా విక్రయం అంశంపై ఐఐఎఫ్ఎల్ వెల్త్సహా జనరల్ అట్లాంటిక్, ఫెయిర్‌ఫాక్స్ స్పందించకపోవడం గమనార్హం! 2008లో షురూ కొటక్ వెల్త్ ఉద్యోగులు కరణ్ భగత్, యతిన్ షా సహకారంతో 2008లో నిర్మల్ జైన్ ఐఐఎఫ్ఎల్ వెల్త్‌ను ఏర్పాటు చేశారు. 2015 అక్టోబర్‌లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ 21.6 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,122 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అయితే అప్పటికి ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ పేరుతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2019లో విలువ జోడింపునకు వీలుగా ఐఐఎఫ్ఎల్.. ఫైనాన్స్, వెల్త్, సెక్యూరిటీస్ పేరుతో మూడు కంపెనీలుగా విడదీసి లిస్టింగ్ చేసింది. కాగా.. 44 బిలియన్ డాలర్ల ఆస్తులతో దేశంలోనే అతిపెద్ద స్వతంత్ర వెల్త్ మేనేజర్ కంపెనీగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ నిలుస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
హెచ్ఎస్బీసీ ఏఎంసీ చేతికి ఎల్అండ్టీ ఎంఎఫ్
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎల్అండ్టీ మ్యుచువల్ ఫండ్‌ను (ఎల్అండ్టీ ఎంఎఫ్) హెచ్ఎస్బీసీ అసెట్ మేనేజ్మెంట్ (హెచ్ఎస్బీసీ ఏఎంసీ) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 425 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,192 కోట్లు) వెచ్చించనుంది. ఎల్అండ్టీ ఎంఎఫ్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (ఎల్టీఎఫ్హెచ్) అనుబంధ సంస్థ ఎల్అండ్టీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ (ఎల్టీఐఎం)కు 100 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు హెచ్ఎస్బీసీ ఏఎంసీతో ఎల్టీఎఫ్హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని హెచ్ఎస్బీసీ ఇండియా సీఈవో హితేంద్ర దవే తెలిపారు. అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రుణ వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్టీఎఫ్హెచ్ ఎండీ దీనానాథ్ దుబాషి వివరించారు. హెచ్ఎస్బీసీకి ఇప్పటికే భారత్‌లో అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి దీని నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ సుమారు రూ. 11,700 కోట్లు. దీని పరిమాణం ఎల్టీఎంఎఫ్తో పోలిస్తే ఆరో వంతు ఉంటుంది. డీల్ అనంతరం హెచ్ఎస్బీసీ ఏఎంసీ దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఏయూఎంతో దేశంలోనే 12వ అతి పెద్ద ఫండ్ హౌస్‌గా మారుతుంది. -
సుందరం ఏఎంసీ–ప్రిన్సిపల్ ఏఎంసీ డీల్‌కు అనుమతి
ముంబై: ప్రిన్సిపల్ అస్సెట్ మేనేజ్మెంట్ భారత్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం లభించినట్టు సుందరం అస్సెట్‌మేనేజ్‌మెంట్ కంపెనీ తెలిపింది. ప్రిన్సిపల్ ఇండియా నిర్వహణలోని ఆస్తులను 100 శాతం సుందరం ఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన సుందరం అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సొంతం చేసుకోనుంది. ఈ ఒప్పం దాన్ని ఈ ఏడాది జనవరి 28న సుందరం ఏఎంసీ ప్రకటించింది. కొనుగోలుకు ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడించలేదు. ‘‘ప్రస్తుతం ప్రన్సిపల్ ఏఎంసీ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకాలను సుందరం పథకాల్లో విలీనం చేయడం లేదంటే ఆయా పథకాల పేర్లను సుందరం పేరుమీదకు మార్చొచ్చు. ప్రిన్సిపల్ ఏఎంసీ పంపిణీదారులు, ఇన్వెస్టర్లు సుందరం కిందకు వస్తారు’’ అని పేర్కొంది. ఇరు సంస్థల ఉమ్మడి ఆస్తుల విలువ రూ.50,000 కోట్లకు చేరుకుంటుందని సుందరం ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్షవిజి తెలిపారు. -
కెనరా రోబెకో వేల్యూ ఫండ్
కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా వేల్యూ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఉండాల్సిన విలువ కన్నా తక్కువ ధరకు ట్రేడవుతున్న నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. సముచిత స్థాయిలో పెట్టుబడులకు భద్రత కలిపిస్తూ, రిస్కు భారం తక్కువగా ఉండే స్టాక్స్‌కు ప్రాధాన్యం లభిస్తుందని సేల్స్, మార్కెటింగ్ హెడ్ మోహిత్ భాటియా తెలిపారు. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఈక్విటీలకు అధిక కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. కెనరా రోబెకో వేల్యూ ఫండ్ ఎన్ఎఫ్వో ఆగస్టు 27న ముగుస్తుంది. తిరిగి క్రయ, విక్రయాలకు సెప్టెంబర్ 6న అందు బాటులోకి వస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్టర్లు పరిశోధన, విశ్లేషణ వంటి అంశాలతో అవసరం లేకుండా వారి పెట్టుబడులకు ప్రతిఫలాన్ని పొందటానికి మ్యూచువల్ ఫండ్స్ దోహదపడతాయి. అధిక సంఖ్యాక ఇన్వెస్టర్లు చేసే ఇన్వెస్ట్మెంట్లను వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టడమే ఈ మ్యూచువల్ ఫండ్స్ పని. ఇక్కడ ఇన్వెస్టర్లు వారి డబ్బును వేటిల్లో, ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. మ్యూచువల్ ఫండ్స్ వాటి ఫండ్స్ నిర్వహణ కోసం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి వివిధ ఇన్వెస్టర్లకు అనువుగా ఉండే పలు రకాల ఫండ్ పథకాలను మార్కెట్లోకి తెస్తాయి. వాటిల్లో మనకు అనువైన వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఎక్కడ ఇన్వెస్ట్చేయాలో తెలియని వారు, పెట్టుబడులకు అధిక సమయం కేటాయించలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. చాలా ఫండ్స్‌లో రూ.500 నుంచి ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించొచ్చు. అలాగే ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కన్నా ఫండ్స్‌లో లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది. అంటే మనకు అవసరమైనప్పుడు మన డబ్బుల్ని ఎక్కువ ఆలస్యం కాకుండా త్వరగా వెనక్కు తీసుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌నే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)గా పరిగణిస్తారు. ఇవి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. అంటే అటు లార్జ్ క్యాప్‌తోపాటు ఇటు మిడ్ క్యాప్‌లోనూ మన డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లకు 80 సీ కింద పన్ను రాయితీలను పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1 లక్ష వరకు పన్ను ప్రోత్సాహకం అందుబాటులో ఉంది. వీటిల్లో పెట్టుబడులను మూడేళ్ల తర్వాతే వెనక్కు తీసుకోగలం. కొత్తగా ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించే వారికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉత్తమం. -
మ్యూచువల్ ఫండ్‌కు కొంచెం ఖేదం, కొంచెం మోదం
- ఏజెంట్ల సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు రద్దు - ఫండ్లు విలీనమైతే పన్ను ప్రయోజనాలు న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఖరీదైన వ్యవహారం కానున్నది. మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లకు ఇచ్చే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపును ఆర్థిక మంత్రి రద్దు చేశారు. అయితే ఒకే విధమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు విలీనమైతే ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)కి చెందిన ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు బడ్జెట్లో అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఈ సర్వీస్ ట్యాక్స్‌ను ఏఎంసీయే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఒకేవిధమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు విలీనమైతే, ఇన్వెస్టర్‌కు పన్ను తటస్థత లభిస్తుంది. ఇప్పటివరకూ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో విలీనమైతే, దానిని మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సాధారణ బదిలీగా పరిగణించేవాళ్లు. దీనికి ఇన్వెస్టర్లు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ చర్య కారణంగా భవిష్యత్తులో చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల విలీనం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం 45 మ్యూచువల్ ఫండ్స్ రూ.12 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి.