న్యూఢిల్లీ: కొత్తగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ)ని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్న బ్రోకరేజీ సంస్థ జిరోధా తాజాగా వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ స్మాల్‌కేస్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను రూపొందించడంలో స్మాల్‌కేస్‌కు 6 ఏళ్ల పైగా అనుభవం ఉందని, ఈ నేపథ్యంలోనే దానితో చేతులు కలిపామని ఆయన పేర్కొన్నారు.
ఇన్వెస్టర్లపై భారీ వ్యయాలు భారం లేకుండా మెరుగైన మ్యూచువల్ ఫండ్ పథకాలను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆశిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ను పరిచయం చేయడానికి ఈ భాగస్వా మ్యం తోడ్పడగలదని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీని ప్రారంభించేందుకు జిరోధా 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది. 2021 సెప్టెంబర్‌లో సెబీ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది అనుమతుల కోసం జిరోధా ఎదురుచూస్తోంది. ప్రస్తు తం 42 మ్యుచువల్ ఫండ్ కంపెనీలు రూ. 40.5 లక్షల కోట్ల పైగా ఆస్తులను నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment