Joint venture
-
ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ కోసం.. తొలి జాయింట్ వెంచర్
ముంబై: రీ సస్టెయినబిలిటీ కంపెనీ (ReSL)లో భాగమైన రీ సస్టెయినబిలిటీ అండ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (Re Sustainability and Recycling Private Limited (ReSRL)) మరియు స్పెషాలిటీ కెమికల్స్ విభాగంలో పేరొందిన ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ (AIL) అనుబంధ సంస్థ ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ (Aarti Circularity Limited (ACL)) కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు చేతులు కలిపాయి. ప్లాస్టిక్ వనరుల రికవరీ మరియు పర్యావరణహిత వనరుల నిర్వహణ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా భారతదేశవ్యాప్తంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ఫెసిలిటీలను (PMRF) అభివృద్ధి చేసే క్రమంలో భారత్‌లో ఈ తరహాలో ఇదే తొలి జాయింట్ వెంచర్‌గా నిలవనుంది.ప్లాస్టిక్స్ సహా వివిధ వ్యర్ధాలను వేరు చేసి, వనరులను వెలికి తీసి, రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి సరుకుగా, ఇంధనాలుగా లేదా రీసైకిల్డ్ పాలిమర్ ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగపడే అడ్వాన్స్డ్ సర్క్యులర్ మెటీరియల్స్ (ఏసీఎం) ఉత్పత్తి చేయడంపై పీఎంఆర్ఎఫ్లు ప్రధానంగా దృష్టి పెడతాయి. 2030 నాటికి రోజుకు కనీసం సుమారు 500 టన్నుల వనరుల రికవరీ సామర్థ్యాన్ని సాధించాలని భాగస్వామ్యం నిర్దేశించుకుంది. అలాగే మెటీరియల్, పవర్ సర్క్యులారిటీని గరిష్ట స్థాయిలో మెరుగుపర్చే దిశగా, ReSL కార్యకలాపాల ద్వారా కూడా ఉత్పత్తయ్యే వాటితో సహా వివిధ ఫీడ్స్టాక్స్ను పరిశీలించాలని కూడా నిర్దేశించుకుంది.ఈ భాగస్వామ్యం కింద తొలి ప్లాస్టిక్స్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ప్లాంటు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ప్రాంతీయంగా అధునాతన రీసైక్లింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది. పర్యావరణహితమైన విధంగా వ్యర్ధాల నిర్వహణను చేపట్టే దిశగా సాగుతున్న భారత ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా నిలవగలదు. సుస్థిరత మరియు సాంకేతిక ఆవిష్కరణల విషయంలో ఇరు సంస్థలకు గల నిబద్ధతకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశపు రీసైక్లింగ్ మరియు వ్యర్ధాల నిర్వహణ రంగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా, అధునాతన పీఎంఆర్ఎఫ్లను రూపొందించి, నిర్వహించేందుకు తగిన అగ్రగామి సాంకేతిక భాగస్వాములను జాయింట్ వెంచర్ కంపెనీ ఎంచుకుంటుంది.“పర్యావరణహితంగా వనరులను నిర్వహించే దిశగా సాగుతున్న మా ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. వ్యర్ధాల నిర్వహణ మరియు వనరుల రికవరీకి సంబంధించి మాకున్న అపార అనుభవం మరియు ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క సుసంపన్నమైన వారసత్వం మరియు స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఆ సంస్థకున్న 40 ఏళ్ల అనుభవం ఈ భాగస్వామ్య ఒప్పందానికి దన్నుగా నిలవనున్నాయి. క్రిటికల్ వ్యర్ధాల సవాళ్లను పరిష్కరించే అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాకు తోడ్పడనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలు మరియు పర్యావరణహిత విధానాలను ఉపయోగించడం ద్వారా వనరులను సమర్ధంగా నిర్వహించుకోవడం మరియు సర్క్యులారిటీ తోడ్పాటుతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థను సృష్టించాలనేది మా లక్ష్యం. భారత్‌లోను, ఇతర ప్రాంతాల్లోనూ సుస్థిర అభివృద్ధికి సంబంధించి మేము సమష్టిగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాం” అని రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో Mr. మసూద్ మాలిక్ తెలిపారు.“ACL, ReSRL మధ్య భాగస్వామ్యమనేది, రెండు దిగ్గజ సంస్థల శక్తి, సామర్థ్యాల మేలు కలయిక ద్వారా, సుస్థిరతకు నవకల్పనలను మేళవించి తీవ్రమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు తోడ్పడగలదు. ఈ జేవీ ద్వారా భారతదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ రీసైక్లింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనేది మా లక్ష్యం. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం, సహజ వనరుల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమనే ఏసీఎల్ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుంది” అని ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ డైరెక్టర్ Mr. మిరిక్ గోగ్రి (Mirik Gogri) తెలిపారు. -
ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతీ తరహా విప్లవం.. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు. ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ జేవీ
గోవా: దేశీ చమురు–గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ, అతిపెద్ద విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి. ఈ జేవీ ద్వారా భారత్‌తోపాటు విదేశాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంతోపాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి. -
ఇక మేడిన్ ఇండియా హెలికాప్టర్లు!
ముంబై: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్‌తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ఎయిర్‌బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్‌ఏఎల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. డెలివరీలవరకూ.. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో కలసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) ఎఫ్‌ఏఎల్‌ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్ భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో హెచ్125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్‌తో సహా.. డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్ఏఎల్ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్ ఇండియా) హెచ్125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. కీలక పాత్ర... జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్‌బస్ సీఈవో గిలామ్ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్‌కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్‌కు చెందిన అత్యుత్తమ హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను భారత్‌తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. -
అదానీ గ్రీన్‌లో టోటల్ ఎనర్జీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది. మరో 250 మె.వా సోలార్, విండ్ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీతో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ తొలిసారి పబ్లిక్ డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్.. 2,353 మె.వా. పోర్ట్‌ఫోలియోగల ఏజీఈ23ఎల్(జేవీ)లో అదానీ గ్రీన్‌తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను టోటల్ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
గ్రీన్ హైడ్రోజన్‌కు అదానీ జేవీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా జపాన్ దిగ్గజం కోవా గ్రూప్‌తో చేతులు కలిపింది. సమాన వాటా(50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా జపాన్, తైవాన్, హవాయ్ మార్కెట్లలో గ్రీన్ హైడ్రోజన్ విక్రయాలను చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో దేశీయంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ప్రకటించింది. దీనిలో భాగంగా తొలి దశలో మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తెరతీయనుంది. తదుపరి దశలో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచనుంది. ఈ బాటలో తాజాగా సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా కోవా హోల్డింగ్స్ ఏషియా పీటీఈతో జేవీని నెలకొలి్పంది. వెరసి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, వీటి డెరివేటివ్ అమ్మకాలు, మార్కెటింగ్ చేపట్టనుంది. శుద్ధ ఇంధన తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడనుంది. ప్రధానంగా రిఫైనింగ్, కెమికల్ రంగాలలో వినియోగిస్తారు. అదానీ ఇప్పటికే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించింది. గుజరాత్, ముంద్రా సెజ్‌లోని సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను వార్షికంగా 10 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక్కడ మెటలర్జికల్ గ్రేడ్(ఎంజీ) సిలికాన్, పాలీసిలికాన్, ఇన్గాట్స్, వేఫర్స్, సెల్స్ తదితరాలను రూపొందించేందుకు వీలుంది. వీటిని సౌర ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రక్రియలో వినియోగిస్తారు. -
ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్! ఇక దూకుడే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్‌తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు అలియాభట్. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు. (తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!) ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్లైన్ షాపింగ్ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. దేశంలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రంగంలోని ప్రత్యర్థులను ఢికొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవల డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్స్తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇరు సంస్థల సమ భాగస్వామ్యంతో జియో బ్లాక్‌రాక్ అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొత్తం 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతమ జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన కొద్ది రోజులకే ఈ డీల్ కుదుర్చుకోవడం విశేషంగా నిలుస్తోంది. జూన్ చివరి నాటికి 9.4 ట్రిలియన్ డాలర్లు ఆస్తుల నిర్వహణలో ఉన్న బ్లాక్‌రాక్‌తో దాదాపు 20 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాప్‌తో ఉన్న జియో ఫైనాన్సియల్స్ డీల్ కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణుల అంచనా. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి భారతదేశంలో రాబోయే జాయింట్ వెంచర్ ద్వారా ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరణకు కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని, బ్లాక్‌రాక్‌కు ఇది కీలక అడుగు అని బ్లాక్‌రాక్ చైర్మన్, సీఈవో లారీ ఫింక్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, రిస్క్ మేనేజ్ మెంట్లో బ్లాక్‌రాక్ లోతైన నైపుణ్యంతో, సాంకేతిక సామర్థ్యం జియో ఫైనాన్షియల్స్ లోతైన మార్కెట్ నైపుణ్యం కలగలిసి తమ డిజిటల్ ప్రొడక్ట్స్ డెలివరీ బాటలు వేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో హితేష్ సేథియా చెప్పారు. (Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) -
చిప్ ప్లాంట్‌కు వేదాంత ఫాక్స్‌కాన్ మళ్లీ దరఖాస్తు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్‌కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్‌కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు. -
స్మాల్‌కేస్‌తో జిరోధా జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: కొత్తగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్న బ్రోకరేజీ సంస్థ జిరోధా తాజాగా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ స్మాల్‌కేస్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ సాధనాలను రూపొందించడంలో స్మాల్కేస్కు 6 ఏళ్ల పైగా అనుభవం ఉందని, ఈ నేపథ్యంలోనే దానితో చేతులు కలిపామని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లపై భారీ వ్యయాలు భారం లేకుండా మెరుగైన మ్యూచువల్ ఫండ్ పథకాలను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆశిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ను పరిచయం చేయడానికి ఈ భాగస్వా మ్యం తోడ్పడగలదని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీని ప్రారంభించేందుకు జిరోధా 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది. 2021 సెప్టెంబర్‌లో సెబీ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది అనుమతుల కోసం జిరోధా ఎదురుచూస్తోంది. ప్రస్తు తం 42 మ్యుచువల్ ఫండ్ కంపెనీలు రూ. 40.5 లక్షల కోట్ల పైగా ఆస్తులను నిర్వహిస్తున్నాయి. -
జియో–బీపీ బంకుల్లో ఈ20 పెట్రోల్
న్యూఢిల్లీ: జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఈ20 పెట్రోల్ లభించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ తరహా ఇంధనంలో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ముడిచమురు దిగుమతులను అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ20 పెట్రోల్‌కు అనుగుణంగా ఉండే వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడవచ్చని జియో–బీపీ పేర్కొంది. ఇంధనాల విక్రయం కోసం దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి రిలయన్స్ బీపీ మొబిలిటీ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇది జియో–బీపీ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ జేవీకి దేశవ్యాప్తంగా 1,510 ఎనర్జీ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్, రిఫ్రెష్మెంట్లు వంటి సదుపాయాలు కూడా అందిస్తోంది. -
హిందుస్తాన్ మోటర్స్.. ఎలక్ట్రిక్ టూవీలర్స్
కోల్‌కతా: ఒకప్పటి అంబాసిడర్ కార్ల తయారీ సంస్థ హిందుస్తాన్ మోటర్స్ (హెచ్ఎం) తాజాగా ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం యూరప్‌కి చెందిన సంస్థతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాదిలో వాహనాల తయారీని ప్రారంభించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించారు. తర్వాత దశలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు సంస్థలకు సంబంధించిన ఆర్థిక అంశాల మదింపు జూలైలోనే ప్రారంభం అవుతుందని, ఇందుకోసం రెండు నెలల సమయం పట్టొచ్చని బోస్ చెప్పారు. అటు పైన జాయింట్ వెంచర్ సాంకేతిక అంశాల మదింపు ప్రారంభం అవుతుందని, దీనికి మరో నెల రోజులు పట్టొచ్చని పేర్కొన్నారు. ఆ తర్వాత పెట్టుబడుల స్వరూపం గురించి నిర్ణయం తీసుకోవడం, కొత్త సంస్థను ఏర్పాటు చేయడం మొదలైనవి ఉంటాయన్నారు. ఇదంతా ఫిబ్రవరి 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని బోస్ వివరించారు. ‘కొత్త సంస్థ ఏర్పాటు చేశాక, ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన మొదలెట్టడానికి మరో రెండు క్వార్టర్లు పడుతుంది. మొత్తం మీద వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తుది ఉత్పత్తిని ఆవిష్కరించవచ్చు‘ అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల ప్రాజెక్టు అమల్లోకి వచ్చిన రెండేళ్లకు కార్ల తయారీపై దృష్టి పెడతామని బోస్ చెప్పారు. -
యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన లాజిస్టిక్స్ సర్వీసులను అందించే దిశగా అమెరికాకు చెందిన యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు కట్టింది. ఇందుకోసం మొవిన్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా బీ2బీ లాజిస్టిక్స్ సేవలను మొవిన్ అందించనుంది. దేశీయంగా బీ2బీ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోనున్నామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జేబీ సింగ్ తెలిపారు. జేవీ సంస్థ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తోందని .. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు కూడా ప్రారంభించిందని వివరించారు. 220 పైగా దేశాలు, ప్రాంతాల్లో యూపీఎస్ సర్వీసులు అందిస్తోంది. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ .. ఏవియేషన్ (ఇండిగో ఎయిర్‌లైన్స్), ఆతిథ్య తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన లాజిస్టిక్స్ సర్వీసులను అందించే దిశగా అమెరికాకు చెందిన యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు కట్టింది. ఇందుకోసం మొవిన్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా బీ2బీ లాజిస్టిక్స్ సేవలను మొవిన్ అందించనుంది. దేశీయంగా బీ2బీ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోనున్నామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జేబీ సింగ్ తెలిపారు. జేవీ సంస్థ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తోందని .. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు కూడా ప్రారంభించిందని వివరించారు. 220 పైగా దేశాలు, ప్రాంతాల్లో యూపీఎస్ సర్వీసులు అందిస్తోంది. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ .. ఏవియేషన్ (ఇండిగో ఎయిర్‌లైన్స్), ఆతిథ్య తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
సాధారణ బీమా కోసం పేటీఎం జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: సాధారణ బీమా కోసం ‘పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’ (పీజీఐఎల్) పేరుతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) నిర్ణయం తీసుకుంది. ఆరంభంలో వన్ 97 కమ్యూనికేషన్స్‌కు పీజీఐఎల్‌లో 49 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 51 శాతం వాటా సంస్థ ఎండీ శేఖర్ శర్మకు చెందిన వీఎస్ఎస్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కలిగి ఉంటుందని స్టాక్ ఎక్సేంజ్‌లకు వన్ 97 కమ్యూనికేషన్స్ తెలియజేసింది. పీజీఐఎల్‌లో పదేళ్లలో రూ.950 కోట్లను వన్ 97 కమ్యూనికేషన్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడుల తర్వాత జాయింట్ వెంచర్ కంపెనీలో వన్ 97 వాటా 74 శాతానికి పెరుగుతుంది. శేఖర్ శర్మ సొంత సంస్థ వాటా 26 శాతానికి తగ్గుతుంది. ఐఆర్డీఏఐ నుంచి వచ్చే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌కు లోబడి పీజీఐఎల్ కార్యకలాపాల ప్రారంభం ఆధారపడి ఉంటుందని వన్ 97 కమ్యూనికేషన్స్ తెలిపింది. -
Reliance : తగ్గేదేలే.. ఇకపై ఈ రంగంలో పెను మార్పులే!
ఏ పని చేపట్టినా పక్కా వ్యూహంతో గ్రాండ్‌గా మొదలు పెట్టి సక్సెస్ కొట్టడమనేది రిలయన్స్ స్టైల్. ఫ్యూచర్ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్ ఫ్యూయల్‌పై ఇప్పటిగా భారీగా పెట్టుబడులు పెడుతూ గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్‌లోకి ఎంటర్ అవుతోంది రిలయన్స్. రిలయన్స్ డిజిటల్ పేరుతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ స్టోర్లు ఈ గ్రూపు ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే వివిధ కంపెనీలకు చెందిన బ్రాండ్లనే ఇక్కడ విక్రయిస్తున్నారు తప్పితే రిలయన్స్‌కు అంటూ సొంత బ్రాండ్ లేదు. ఈ లోటును తీర్చే పనిలో పడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ సాన్మినాతో రిలయన్స్ జట్టు కట్టింది. సాని్మనా ఇండియాలో 50 శాతం షేర్లను రూ. 1670 కోట్లతో రిలయన్స్ కొనుగోలు చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారత్‌లో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు ఉత్పత్తి చేయనున్నాయి. సన్మినాకు చెన్నైలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ప్లాంటు ఉంది. తాజాగా కుదిరిన జాయింట్ వెంచర్ ప్లాన్స్‌ను అనుసరించి ఇదే ప్లాంటులో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని చేపడుతారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గటుగా ఇతర ప్రాంతాల్లోనూ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను నెలకొల్పుతామని రిలయన్స్ తెలిపింది. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ప్రవేశించినట్టు రిలయన్స్ తెలిపింది. దేశ అవసరాలకు తగ్గట్టు క్లౌడ్ కంప్యూటింగ్, 5జీ టెక్నాలజీ విస్తరణ, మెడికల్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్, క్లీన్టెక్, డిఫెన్స్, ఎయిరోస్పేస్ సెకార్టకు అవసరమై ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై ఫోకస్ చేస్తున్నామని రిలయన్స్ తెలిపింది. జియో రాకతో ఇండియాలో ఇంటర్నేట్ యూసేజ్‌లో పెను మార్పులు సంభవించాయి. ఈ కామర్స్ రంగం పది మెట్లు పైకి చేరుకుంది. పేపర్‌లెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. రిలయన్స్ రాక కారణంగా త్వరలో ఎలక్ట్రానిక్ సెక్టార్‌లోనూ ఇదే తరహా మార్పులు చూడవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ఏ అండ్ టీలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు -
ఖతర్నాక్ ఐడియాతో రిలయన్స్ జియో..!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారీ ప్రణాళికను రూపొందించింది. మొబైల్ నెట్వర్క్ సేవలనే కాకుండా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు జియో ప్రణాళికలను రచిస్తోంది. జాయింట్ వెంచర్‌గా..! భారత్‌లో అతి తక్కువ సమయంలో నంబర్ వన్ మొబైల్ నెట్వర్క్ సేవలను అందిస్తోన్న టెలికాం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాటిలైట్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిచేందుకుగాను రిలయన్స్ జియో సంస్థ జాయింట్ వెంచర్‌ను నెలకొల్పింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, లక్సెంబర్గ్‌కు చెందిన శాటిలైట్, టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ ప్రొవైడర్ ఎస్ఈఎస్ సంయుక్తంగా జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జాయింట్ వెంచర్లో జియో ప్లాట్‌ఫామ్స్ 51 శాతం, ఎస్ఈఎస్ 49 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. జియో స్టేషనరీ, మీడియం ఎర్త్ ఆర్బిట్లలో పలు శాటిలైట్లను ప్రయోగించనున్నాయి. ఈ శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను రిలయన్స్ జియో అందించనుంది. మరిన్ని కంపెనీలు ఎలాగైనా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్‌లో నెలకొల్పాలనే ఎలన్‌మస్క్ ప్రణాళికలకు రిలయన్స్ జియో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. స్టార్‌లింక్ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టాలనే మస్క్ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. భారత్‌తో పాటుగా పొరుగుదేశాలకు కూడా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రిలయన్స్ జియో అందించనుంది. ఇక శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో మరో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముందుంది. టాటా గ్రూపు సైతం ఈ పనులు ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే 66 శాతం పైగా శాటిలైట్లను వన్‌వెబ్ సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది. చదవండి: రయ్‌మంటూ దూసుకెళ్లిన రిలయన్స్..! డీలా పడ్డ టీసీఎస్..! -
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక నిర్ణయం..!
స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్‌లో అందించేందుకు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సిద్దమైన విషయం తెలిసిందే. పలు కారణాలతో స్టార్‌లింక్ పనులు భారత్‌లో నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా ఉండగా స్టార్‌లింక్‌కు పోటీగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలపై పలు టెలికాం సంస్థలు కూడా కన్నేశాయి. భారత్‌లో శాటిలైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా సన్నద్ధమైంది. జాయింట్ వెంచర్ ఏర్పాటు..! శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి హ్యూస్ కమ్యూనికేషన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాయింట్ వెంచర్లో ఎయిర్టెల్ సుమారు 33 శాతం, హ్యూస్ కమ్యూనికేషన్స్ 67 శాతం వాటాలను కల్గి ఉన్నాయి. వీరు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ భారత్‌లో శాటిలైల్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నాయి. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్టెల్,హ్యూస్ కమ్యూనికేషన్స్‌తో 2019లోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరు కంపెనీల ‘వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (VSAT)’ వ్యాపారాలను ఇకపై కలిపేయనున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్‌గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది.. చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..? -
అనామికా ఖన్నాతో రిలయన్స్ బ్రాండ్స్ జట్టు
న్యూఢిల్లీ: రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) తాజాగా దేశీ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నాతో చేతులు కలిపింది. ఏకే–ఓకే ఫ్యాషన్ బ్రాండ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఈ జాయింట్ వెంచర్లో ఆర్‌బీఎల్‌కు 60 శాతం అనామికా ఖన్నాకు 40 శాతం వాటాలు ఉంటాయి. ఏకే–ఓకే బ్రాండ్ క్రియేటివ్ డైరెక్టరుగా అనామిక కొనసాగుతారు. 2007లో ఆర్బీఎల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం అర్మానీ ఎక్సే్చంజ్, బ్రూక్స్ బ్రదర్స్, బర్బరీ, కెనాలీ, డీజిల్ తదితర బ్రాండ్స్‌తో భాగస్వామ్యాలు ఉన్నాయి. దేశీయంగా ఫ్యాషన్ దిగ్గజాలు మనీష్ మల్హోత్రా, రాఘవేంద్ర రాథోడ్ బ్రాండ్స్‌లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. 680 స్టోర్లు, 916 షాప్–ఇన్–షాప్స్ ద్వారా విక్రయాలు సాగిస్తోంది. -
రిలయన్స్‌తో జట్టు కట్టిన మహీంద్రా గ్రూపు.. ఆ సెక్టార్లో సంచలన మార్పులు
దేశీ పారిశ్రామిక రంగంలో దిగ్గజ సంస్థలైన రియలన్స్, మహీంద్రా గ్రూపులు చేతులు కలిపాయి. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈవీ సెగ్మెంట్లో ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి.ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీగా జియో బీపీ పేరుతో ఫ్యూయల్ స్టేషన్లు నిర్వహిస్తోంది. ఇక్కడ సంప్రదాయ పెట్రోలు డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తొలి ఫ్యూయల్ స్టేషన్‌ని ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించింది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా పేరున్న మహీంద్రా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించింది. ఆటో మొదలు బస్సుల వరకు మహీంద్రా పలు రకాల వాహనాలను మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ల కొరత దేశ వ్యాప్తంగా అతి పెద్ద సమస్యగా ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయల కొరత అధిగమించే దిశగా పని చేయాలని మహీంద్రా, రిలయన్స్ నిర్ణయించాయి. జియో బీపీ స్టేషన్లలో ఛార్జింగ్, స్వాపింగ్, సర్వీసింగ్ తదితర సేవలు మహీంద్రా వాహనాలకు అందుతాయి. -
సుమారు రూ. 15 వేల కోట్లు..! అబుదాబీ కంపెనీతో జతకట్టిన రిలయన్స్..! ఎందుకంటే..!
అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ (TA'ZIZ)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కట్టింది. అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. యూఎఈలో పెట్రోకెమికల్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సంయుక్తంగా 2 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 15 వేల కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నాయి. పశ్చిమ అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం (ADNOC) రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ (ADQ) ఇటీవల ఏర్పరిచిన TA'ZIZ జాయింట్ వెంచర్లో రిలయన్స్ చేరనుంది. ఈ కొత్త ‘TA'ZIZ EDC & PVC’ జాయింట్ వెంచర్‌తో 2 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడితో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్ , పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సౌకర్యాన్ని నిర్మించి, నిర్వహించనున్నాయి. యూఎఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి TA'ZIZ మిషన్ మద్దతునివ్వనుంది.రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్ వెంచర్ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ADNOC మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో, యూఎఈ ఇండస్ట్రీస్ మినిష్టర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ , రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అధినేతల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...భారత్, యూఎఈ మధ్య దీర్ఘకాల, విలువైన సంబంధాలను మరింత సుస్థిరం చేస్తోందని అన్నారు. చదవండి: 120 సెకండ్లలో హాట్‌కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...! -
అశ్విని నేత్రాలయంతో మ్యాక్సివిజన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన డాక్టర్ ఏఏవీ రామలింగా రెడ్డి సంస్థ అశ్విని నేత్రాలయంతో చేతులు కలిపింది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇది మ్యాక్సివిజన్ డాక్టర్ రామలింగా రెడ్డి ఐ హాస్పిటల్స్ పేరిట కార్యకలాపాలు సాగించనున్నట్లు ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మాచర్ల, గుంటూరులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ నేత్ర వైద్యుడు శరత్ బాబు చిలుకూరితో కలిసి శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ పేరిట ఈ తరహాలో తెలంగాణ వ్యాప్తంగా జేవీ కింద ఐ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వేలు చెప్పారు. ప్రస్తుతం తమకు సుమారు 20 పైచిలుకు సెంటర్స్ ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 50 దాకా పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, జేవీ విధానం కారణంగా నిర్వహణ, వ్యాపార విస్తరణను నిపుణులకు అప్పగించి, వైద్యులు ప్రధానంగా వైద్య సేవలపై మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని మ్యాక్సివిజన్ వ్యవస్థాపక మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని రామలింగా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో 6 జిల్లాల్లోకి విస్తరించనున్నట్లు శరత్ బాబు పేర్కొన్నారు. -
రిలయన్స్-బీపీ జాయింట్ వెంచర్ లాంచ్
సాక్షి, ముంబై:ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఇంధన రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ (బీపీ) భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ ను లాంచ్ చేసింది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) పేరుతో దీన్ని ప్రారంభించినట్లు గురువారం ప్రకటించింది. గత ఆగస్టులోనే జాయింట్ వెంచర్ కంపెనీ రూపొందించే ప్రణాళికను రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కంపెనీలో 51శాతం రిలయన్స్ సొంతం కాగా, మిగిలిన 49 శాతం వాటా బీపీ యాజమాన్యంలో ఉంటుంది. ఇందుకు ఏడు వేల కోట్ల రూపాయలను బీపీ చెల్లించనుందని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. రవాణా ఇంధనాల మార్కెటింగ్‌కు అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలను ఆర్‌బీఎంఎల్ సాధించిందనీ ప్రస్తుత రిటైల్ అవులెట్లో సేవలు తక్షణమే అమలు చేయడం ప్రారంభిస్తుందని తెలిపింది. త్వరలోనే దీన్ని “జియో-బిపి” గా మార్చనున్నామని రిలయన్స్ వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశ ఇంధనాలు, మొబిలిటీ మార్కెట్లలో అగ్రభాగాన నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బీపీ తెలిపింది. 21 రాష్ట్రాలలో మిలియన్ల వినియోగదారుల ద్వారా రిలయన్స్ ఉనికిని మరింత పెంచుతుందని పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని నిర్మించడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశమని బీపీ సీఈవో బెర్నార్డ్ లూనీ వ్యాఖ్యానించారు. తాజా భాగస్వామ్యంతో ఆయిల్ మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత దూసుకెళ్తుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా రిటైల్, ఏవియేషన్ ఇంధనాలలో బీపీతో బలమైన, విలువైన భాగస్వామ్యకొనసాగుతుందన్నారు. అలాగే సర్వీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య నాలుగు రెట్లు పెరగనుందని పేర్కొన్నారు. 20 వేల నుంచి 80వేల వరకు ఈ సంఖ్య పెరుగుతుందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 30 నుండి 45 విమానాశ్రయాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉండగా, ఇపుడు మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. వీటి ద్వారా ఇండియన్ కస్టమర్స్‌కు అధిక-నాణ్యత, తక్కువ కార్బన ఉద్గారాల విభిన్న ఇంధనాలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, ఇతర సేవలను అందించనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. ప్రస్తుతం రిలయన్స్ పెట్రోల్ విమానయాన ఇంధన నెట్ వర్క్‌లో బీపీ భాగస్వామ్యం కానుంది. తాజా ఒప్పందంతో జియో- బీపీ బ్రాండ్ జాయింట్ వెంచర్ భారత్‌లో చమురు, మొబిలిటీ మార్కెట్లో లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. రాబోయే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్ అవుతుందని, దేశంలో కార్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా. -
జియో-బీపీ పేరుతో రిలయన్స్ పెట్రోలు బంకులు
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన ఇంధన రిటైల్ వ్యాపారాన్ని బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ బీపీతో తుది ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆర్ఐఎల్, బీసీ సోమవారం ఒక ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేశాయని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జియో-బీపీ బ్రాండ్ ఇంధన మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత అభివృద్ది చెందనుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రెగ్యులేటరీ, ఇతర ఆమోదాలకు లోబడి, 2020 మొదటి భాగంలో జియో-బీపీ జాయింట్ వెంచర్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ 51 శాతం, బీపీ 49 శాతం వాటా ఉంటుంది. ఈ వాటా కోసం బీపీ రూ.7,000 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం ఆర్ఐఎల్కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలని లక్ష్యం. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతీయ వినియోగదారులకు అధిక-నాణ్యత విభిన్న ఇంధనాలు, ఇతర సేవలను అందించనున్నామని ఆర్ఐఎల్ తెలిపింది. కాగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని మరో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లోని సంస్థాగత భాగస్వాముల నుండి రూ .25,215 కోట్ల పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే. -
మహీంద్రా చేతికి ‘ఫోర్డ్ ఇండియా’
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార పరంగా తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ(ఎఫ్ఎంసీ) మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)తో జట్టు కట్టింది. రెండు కంపెనీల ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్(జేవీ)కు ఫోర్డ్ మోటార్ కంపెనీ భారత వ్యాపార కార్యకలాపాలు బదిలీ అవుతాయి. ఈ జేవీలో ఎంఅండ్ఎంకు 51 శాతం వాటా, మిగిలిన 49 శాతం వాటా ఫోర్డ్ మోటార్‌కు ఉంటుంది. గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న ఇంజిన్ల తయారీ ప్లాంట్ మాత్రం ఫోర్డ్ అధీనంలో ఉంటుంది. భారత్‌లో ఫోర్డ్ బ్రాండ్ కింద వాహనాల అభివృద్ధితోపాటు విక్రయాలను ఈ జేవీ చూస్తుంది. అదే విధంగా అధిక వృద్ధి అవకాశాలుఉన్న విదేశీ మార్కెట్లలో మహీంద్రా, ఫోర్డ్ బ్రాండ్ల వాహనాలను కూడా విక్రయిస్తుంది. జాయింట్ వెంచర్ స్వరూపం.. ఒప్పందంలో భాగంగా ఫోర్డ్ మోటార్ అనుబంధ కంపెనీ ఆర్డోర్ ఆటోమోటివ్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఎంఅండ్ఎం 51 శాతం వాటా తీసుకుంటుంది. ఇందుకోసం ఎంఅండ్ఎం రూ.657 కోట్లు చెల్లిస్తుంది. మిగిలిన 49 శాతం వాటా ఫోర్ట్ మోటార్ చేతుల్లోనే ఉంటుంది. 51 శాతం వాటా కోసం చేసే పెట్టుబడులు సహా మొత్తం రూ.1,400 కోట్లను ఆర్డోర్ ఆటోమోటివ్ పరిధిలో వ్యాపార వృద్ధికి ఎంఅండ్ఎం వెచ్చించనుంది. ఫోర్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలోని భారత వ్యాపార కార్యకలాపాలు ఆర్డోర్ ఆటోమోటివ్‌కు బదిలీ చేస్తారు. చెన్నై, సనంద్ ప్లాంట్లు కూడా బదిలీ అవుతాయి. కాకపోతే సనంద్‌లోని పవర్‌ట్రెయిన్ తయారీ ప్లాంట్‌ను ఈ ఒప్పందంలో చేర్చలేదు. ఫోర్డ్ ఇండియా 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.26,324 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరాల్లో వరుసగా రూ.25,010, రూ.22,103 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. మూడు యుటిలిటీ వాహనాలు మిడ్‌సైజ్ ఎస్‌యూవీతోపాటు మూడు నూతన యుటిలిటీ వాహనాలను ఫోర్డ్ బ్రాండ్ కింద జాయింట్ వెంచర్ తీసుకురానుంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ జేవీ దృష్టి పెడుతుంది. వర్ధమాన మార్కెట్ల కోసం వాహనాలను అభివృద్ధి చేయడంతోపాటు ఎగుమతి కూడా చేస్తుంది. ఈ రెండు సంస్థల మధ్య లావాదేవీ 2020 మధ్య నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఫోర్డ్, ఎంఅండ్ఎం 2017 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక ఒప్పందం ఒకటి చేసుకున్నాయి. ఉత్పత్తుల అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలు, పంపిణీ విషయంలో సహకరించుకోవడం నాటి ఒప్పందం కాగా, ఇప్పుడు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. కలసి సాగితే లాభం..: ‘‘ఇంజనీరింగ్, విజయవంతమైన నిర్వహణలో మహీంద్రాకు అనుభవం ఉంది. ఫోర్డ్‌కు సాంకేతికత, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానత, భవిష్యత్తు టెక్నాలజీలను అందిపుచ్చుకునే బలాలు ఉన్నాయి’’ అని ఎంఅండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఉమ్మడి సహకారంతో వినియోగదారులకు మరిన్ని వాహనాలను అందించడం సాధ్యపడుతుందని ఫోర్డ్ మోటార్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిల్‌ఫోర్డ్ అన్నారు. -
ఇక రిలయన్స్, బీపీ బంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్ ప్రకారం కొత్త వెంచర్లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఇంధన రిటైలింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది‘ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘రిలయన్స్‌తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం‘ అని బాబ్ డడ్లీ పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ను 5,500 పెట్రోల్ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘భారత్‌లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్‌కు ఉన్న ఇంధన రిటైలింగ్ నెట్వర్క్, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం‘ అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్‌కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నది మాత్రం వెల్లడించలేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ ఆరామ్కోతో రిలయన్స్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్ వెంచర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్కో కూడా భారత్‌లో ఇంధనాల రిటైలింగ్ కార్యకలాపాల వెంచర్‌పై దృష్టి పెట్టింది. మూడో జేవీ.. 2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్ వెంచర్ కానుంది. 2011లో రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్ సోర్సింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ (ఐజీఎస్‌పీఎల్) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్–బీపీ వదిలేసుకున్నాయి. ఐజీఎస్‌పీఎల్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంధన రిటైలింగ్‌లో పీఎస్‌యూల హవా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు మార్కెటింగ్ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్)కు 5,244 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వచ్చే 2–3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ డచ్ షెల్‌కు ప్రస్తుతం 151 అవుట్‌లెట్స్ ఉండగా, కొత్తగా మరో 150–200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో 3,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీ 2016లోనే లైసెన్సు పొందింది. -
మహీంద్రాతో ఫోర్డ్ జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టతరంగా మారుతుండటంతో విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. అమెరికన్ సంస్థ జనరల్ మోటార్స్ .. భారత్‌లో కార్యకలాపాలను తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా కార్ల విక్రయాలు నిలిపివేసింది. తాజాగా అదే బాటలో మరో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ తాజాగా భారత్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునే దిశగా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఫోర్డ్ భారత్‌లో స్వతంత్రంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఇకపై నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చల సారాంశం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే జాయింట్ వెంచర్లో ఫోర్డ్‌కు 49 శాతం, మహీంద్రాకు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో తమ ఆటోమోటివ్ వ్యాపార కార్యకలాపాలు, అసెట్స్, ఉద్యోగులు మొదలైనవన్నీ కూడా ఫోర్డ్ ఈ కొత్త సంస్థకు బదలాయిస్తుంది. ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడి కానప్పటికీ.. మొత్తం మీద 90 రోజుల్లోగా ఒప్పందం పూర్తి కావొచ్చని అంచనాలు ఉన్నాయి. దీన్ని ఒకరకంగా భారత్ నుంచి ఫోర్డ్ పాక్షిక నిష్క్రమణగానే భావించవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ఫోర్డ్ భారత విభాగం మాతృసంస్థకు రాయల్టీలు చెల్లించాల్సి వస్తుండటం వల్ల కార్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. ఒకవేళ డీల్ కానీ సాకారమైన పక్షంలో రాయల్టీల ప్రసక్తి ఉండదు కాబట్టి.. ఫోర్డ్ కార్ల రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అలాగే తక్కువ వ్యయాలతో ఫోర్డ్, మహీంద్రా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్‌ను వేగవంతంగా ప్రవేశపెట్టేందుకు ఈ జేవీ ఉపయోగపడనుంది. డీల్ కారణంగా భారత విభాగానికి వచ్చే నిధులతో నష్టాలను కొంత మేర భర్తీ చేసుకోవచ్చని ఫోర్డ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ డీల్ ఒకరకంగా రెండు సంస్థలకు ప్రయోజనకరంగానే ఉండగలదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2017లోనే మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రెండు సంస్థలూ కలిసి కొత్తగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్ మొదలైన వాహనాలు నిర్మించాలని తలపెట్టాయి. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. కష్టతరమైన భారత మార్కెట్.. భారత వాహనాల మార్కెట్ వృద్ధి గణనీయంగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కొంత మందగించింది. గత ఆర్థిక సంవత్సరం కార్ల అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతానికే పరిమితమైంది. 33 లక్షల కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల వృద్ధి ఏకంగా 8 శాతం మేర నమోదైంది. ప్రస్తుతానికి విక్రయాల వృద్ధి మందగించినా 2023 నాటికల్లా ఏటా 50 లక్షల పైచిలుకు అమ్మకాలతో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా అవతరించవచ్చని అంచనాలున్నాయి. అయితే, మారుతీ సుజుకీ వంటి దేశీ దిగ్గజం, కొరియాకు చెందిన హ్యుందాయ్ ఆధిపత్యం అధికంగా ఉన్న దేశీ మార్కెట్లో ఇతర దేశాల కార్ల కంపెనీలు పట్టు సాధించడం కష్టతరంగా ఉంటోంది. ఫోర్డ్ గత ఆర్థిక సంవత్సరం కేవలం 93,000 వాహనాలు మాత్రమే విక్రయించగలిగింది. గడిచిన 2 దశాబ్దాల్లో భారత మార్కెట్‌పై ఫోర్డ్ 2 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా, భారత మార్కెట్లో ఫోర్డ్ వాటా కేవలం 3 శాతానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఫోర్డ్ తాజాగా ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తోంది. -
ఆర్‌ఐడీసీలోకి కడప–బెంగళూరు రైలుమార్గం
► జాయింట్ వెంచర్లో రైలుమార్గానికి కదలిక ► కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మ«ధ్య కుదిరిన ఒప్పందం ► నాలుగు దశల్లో రైలుమార్గం నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసుల కలగా మిగిలిన కడప– వయా మదనపల్లె – బెంగళూరు రైలుమార్గంలో మలిదశ పనులు మొదలయ్యాయి. ఆర్‌ఐడీసీలోకి ఆ మార్గాన్ని తీసుకోవడంతో కాస్తంత ఊరట లభించినట్లైంది. త్వరగా ఆ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. మదనపల్లె సిటీ : కడప– బెంగళూరు మధ్య రైలు మార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబర్‌లోఅప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు. ఇది దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక, ఈ రైలుమార్గానికి 2008–09 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యాయి. 258 కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మాణానికి 1,531 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యం 15 ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2 కోట్లు కేటాయించా రు. కాగా రైల్వేలైన్ నిర్మాణానికి 2016–17లో రూ.58 కోట్లు, 2017–18లో రూ.240 కోట్లను కేటాయించా రు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే పెండ్లిమర్రి వరకు లైను సిద్ధం చేసి డెమో రైలును నడిపిస్తున్నారు. మొత్తం నాలుగు దశల్లో కడప–బెంగళూరు రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించుకుంది. రూ.100 కోట్ల వ్యయంతో ఆర్‌ఐడీసీ.. రైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు, సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా నూతనంగా రూ.వందకోట్ల వ్యయంతో రైల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. నిర్మాణ దశలు ఇలా... మొదటి దశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89 కోట్లలో రూ.20 కోట్లను రైల్వేశాఖ వ్యయం చేసింది. ఈ దశలో 21.8 కిలోమీటర్ల వరకు లైన్ నిర్మాణం చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు. 311.84 ఎరరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రూ.199.2 కోట్లు నిర్మాణం కోసం వ్యయం చేశారు. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి – వాల్మీకిపురం లైన్ చేపట్టనున్నారు. మూడవ దశలో మదనపల్లెరోడ్డు – మదగట్ట(ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట– ముళబాగల్ (కర్ణాటక రాష్ట్ర సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. నాలుగవ దశలో ముళబాగల్– కోలార్ మధ్య నిర్మాణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్ రూపకల్పన జరిగింది. -
నీ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
మంత్రి ఇంద్రకరణ్‌కు రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం తో నిర్మిస్తున్న జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అవినీతిని బహిరంగంగా నిరూపించడానికి సిద్ధమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రక టించారు. జేవీ ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపించాలంటూ ఇంద్రకరణ్ చేసిన సవాల్‌కు రేవంత్ ఈ మేరకు ప్రతి సవాల్ విసిరారు. సోమవారం ఇక్కడ రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ... తాను చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావడానికి భయపడి వ్యక్తిగత దూషణలకు దిగితే మంత్రి బతుకేమిటో బయటపెడతానని హెచ్చరించారు. జేవీ ప్రాజెక్టుల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 17 ప్రాజెక్టులకు హౌసింగ్ బోర్డు భూమిని కేటాయించారని, ఈ ప్రాజెక్టుల ఆదాయంలో వాటా ఇవ్వడంతోపాటు 10 శాతం బలహీన వర్గాల కోసం ఎల్‌ఐజీలు నిర్మించాల్సి ఉందన్నారు. ప్రైవేటు సంస్థలు నిర్మించే గృహ సముదాయాల ఆదాయంలో 3.5శాతం, వాణిజ్య సముదాయాల్లో 5శాతం ప్రభుత్వానికి చెల్లించాల నేది ఒప్పందమని రేవంత్ వివరించారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటాతో పాటు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లు ఇవ్వకుండా ప్రైవేటు సంస్థలు అమ్ముకున్నాయని... దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిఫారసు కూడా చేశారన్నారు. అయితే ఇంద్రకరణ్ ప్రైవేటు సంస్థల నుంచి ముడుపులు తీసుకుని వాటికి ఎన్ఓసీలు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. -
ఆంటనోవ్తో రిలయన్స్ డిఫెన్స్ జట్టు
రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి జాయింట్ వెంచర్ న్యూఢిల్లీ: భారత వైమానిక దళం ఉపయోగించే ‘ఏఎన్32’ విమానాలను తయారు చేసే ఉక్రెయిన్ సంస్థ ఆంటనోవ్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ వెల్లడించింది. మిలిటరీ, పారా మిలిటరీ, సాధారణ రవాణా అవసరాలకు ఉపయోగపడే ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి ఈ జేవీ ఉపయోగపడనున్నట్లు తెలిపింది. భారత్ కొత్త రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవడం, 105 ఏఎన్ 32 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేసుకునే ప్రక్రియలో ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వివిధ అవసరాలకు ఉపయోగపడే ఎయిర్‌క్రాఫ్ట్‌లు 500కు పైగా కావాల్సి ఉందని, రాబోయే 15 ఏళ్లలో ఈ మార్కెట్ పరిమాణం రూ. 35,000 కోట్ల పైగా ఉండగలదని అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
ఇజ్రాయేల్ రాఫెల్ తో రిలయన్స్ డిఫెన్స్ జట్టు
♦ మధ్య ప్రదేశ్‌లో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ♦ పదేళ్లలో రూ.65 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులు లక్ష్యం ♦ 3,000 ఉద్యోగాలు వస్తాయ్ : రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడి న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ, ఇజ్రాయేల్‌కు చెం దిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్‌తో కలసి ఒక జాయింట్ వెంచర్(జేవీ)ని ఏర్పాటు చేయనున్నది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన వంద శాతం అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ జేవీలో 51 శాతం, రాఫెల్‌కు 49 శాతం వాటాలుంటాయి. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మిస్సైళ్లతో పాటు వివిధ రక్షణ ప్రాజెక్టుల కోసం ఈ జేవీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. పదేళ్లలో రూ.65వేల కోట్ల ప్రాజెక్టులు సాధించడం లక్ష్యమని వివరించింది. ఒక భారత కంపెనీ, ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)తో ఏర్పాటు చేస్తున్న పెద్ద జాయింట్ వెంచర్లలో ఇది ఒకటని పేర్కొంది. ఈ జేవీ కారణంగా దేశీయ తయారీకి మంచి ఊపువస్తుందని రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. అంతేకాకుండా అత్యంత ఆధునిక ఆయుధ వ్యవస్థల తయారీకి జోష్‌నిస్తుందని వివరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని పీతంపూర్లో ఈ జేవీ కంపెనీని ఏర్పాటు చేస్తామని, 3,000కు పైగా అత్యధిక నైపుణ్యమున్న ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. రూ.1,300 కోట్ల మూలధన నిధులతో ఈ జేవీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. గగనతలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల తయారీలో రాఫెల్ కంపెనీయే అగ్రస్థానంలో ఉంది. పైధాన్, డెర్బీ వంటివి ప్రాచుర్యం పొందిన ఈ కంపెనీ ఉత్పత్తులు. -
లైకోస్, అపోలో ఇంటర్నేషనల్‌ల ఈ-కామర్స్ వెంచర్
హైదరాబాద్: ఇంటర్నెట్ బ్రాండ్ లైకోస్, అపోలో ఇంటర్నేషనల్ సంస్థలు ఈ-కామర్స్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అపోలో లైకోస్ నెట్కామర్స్ పేరుతో ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటవుతోంది. భారత వినియోగదారులు లక్ష్యంగా కస్టమ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పాటు చేయడానికి గ్లోబల్ బ్రాండ్స్‌కు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్ ఈ వెంచర్ అంది స్తుంది. భారత వినియోగదారులకు వినూత్నమైన డిజిటల్ షాపింగ్ అనుభూతిని ఈ జాయిం ట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తెస్తామని అపోలో వైస్-చైర్మన్, ఎండీ రాజా కన్వర్ చెప్పారు. అంతర్జాతీయ దిగ్గజం బ్రాండ్లు భారత్‌లోకి ప్రవేశించడానికి వినూత్నమైన సర్వీసులందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లైకోస్ చైర్మన్, సీఈఓ సురేశ్ రెడ్డి చెప్పారు. -
హారిసన్-సేఫ్ స్కైస్ జేవీ...
భారత్ , అమెరికా ప్రముఖ లాక్స్ (తాళాలు) బ్రాండ్స్ హారిసన్, సేఫ్ స్కైస్లు జాయింట్ వెంచర్‌కు శ్రీకారం చుట్టాయి. దీని ప్రకారం ‘హారిసన్ సేఫ్ స్కైస్’ పేరుతో కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కరచాలనం చేసుకుంటున్న హారిసన్ లాక్స్ ఎండీ ఉమాంగ్ మోంగా (కుడి వ్యక్తి), సేఫ్ స్కైస్ ప్రెసిడెంట్ డేవిడ్ ఆడమ్ ట్రోప్‌లను చిత్రంలో తిలకించవచ్చు. భారత్‌సహా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, జీసీసీ దేశాల్లో మార్కెట్ విస్తరణ లక్ష్యంగా రెండు ప్రముఖ కంపెనీల మధ్య తాజా అవగాహన కుదిరింది. -
ఫాక్స్‌కాన్‌తో అదాని జాయింట్ వెంచర్?
న్యూఢిల్లీ: అదాని ఎంటర్ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో కలసి ఒక జాయిం ట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా అదాని ఎంటర్ప్రైజెస్ భారత్‌లో యాపిల్ ఐఫోన్స్‌ను తయారు చేస్తుందని సమాచారం. కంపెనీ వ్యాపార విస్తరణ కోసం గత నెలలో అదాని షేర్హోల్డర్లు సెక్యూరిటీల ఇష్యూ ద్వారా రూ.6,000 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 11 శాతం పెరిగి రూ.94 వద్ద ముగిసింది. -
రామగుండం ఎరువుల ప్లాంటుకు జేవీ ఏర్పాటు
న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కలసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ నెల 17న జేవీని ఏర్పాటు చేసినట్లు బీఎస్ఈకి నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్) తెలియజేసింది. కొత్తగా ఏర్పడిన సంస్థలో ఎన్ఎఫ్ఎల్, ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) కంపెనీలకు చెరి 26 శాతం, ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌కి 11 శాతం వాటాలు ఉంటాయి. జేవీలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చే ఇతర సంస్థలకు మిగతా వాటాలు దక్కనున్నాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ఎరువుల యూనిట్లో 1999 నుంచి యూరియా, అమ్మోనియా ఉత్పత్తిని నిలిపివేశారు. లాభదాయకత లేకపోవడమే ఇందుకు కారణం. తాజాగా మూతబడిన ఎరువుల ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రామగుండం ప్లాంటుకు కూడా మోక్షం లభించింది. దాదాపు రూ. 5,000 కోట్ల వ్యయంతో దీన్ని పునరుద్ధరించనున్నారు. -
మృత్యుంజయులు
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు అచ్యుతాపురం : సముద్రంలో మృత్యువుతో పోరాడి మత్స్యకారులు బుధవారం పూడిమడక తీరానికి క్షేమంగా చేరుకున్నారు. ఈ నెల 14న పూడిమడకకు చెందిన ఉమ్మిడి దుర్గారావు, ఉమ్మిడి మసేను, ఉమ్మిడి దేముడు, మేరుగు తాతారావు, ఎరిపల్లి సత్తియ్య వేటకు వెళ్లారు. వీరు మంగళవారం రాత్రికి తీరానికి చేరుకోవాలి. సమయం మించిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. వలలు, వేట, భోజన సామగ్రి, డీజిల్, తాగునీరు క్యాన్లు, బట్టలు కోల్పోయారు. కట్టుబట్టలు, పడవతో తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంటాలమ్మ దేవతే తమను కాపాడిందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, బుధవారం ఈదురు గాలులు వీచి పడవ తిరగబడిపోయిందని తెలిపారు. సామగ్రి మొత్తం సముద్రంలో మునిగిపోయాయి. పడవను పలుమార్లు సరిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఒక దశలో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. గంటలపాటు బోర్లా పడిన పడవను పట్టుకొని సేదదీరారు. గాలులు తగ్గడంతో తీరానికి రాగలిగామని వారు తెలిపారు. మత్స్యకారులు తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి తీసుకున్నారు.