![Reliance Industries Abu Dhabi Chemical Company Form 2 Bn Dollars Production JV - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/7/mukesh-ambani.jpg.webp?itok=fnJYBL7X)
అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ (TA'ZIZ)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కట్టింది. అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. యూఎఈలో పెట్రోకెమికల్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సంయుక్తంగా 2 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 15 వేల కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నాయి.
పశ్చిమ అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం (ADNOC) రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ (ADQ) ఇటీవల ఏర్పరిచిన TA'ZIZ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ చేరనుంది. ఈ కొత్త ‘TA'ZIZ EDC & PVC’ జాయింట్ వెంచర్‌తో 2 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడితో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్ , పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సౌకర్యాన్ని నిర్మించి, నిర్వహించనున్నాయి.
యూఎఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి TA'ZIZ మిషన్ మద్దతునివ్వనుంది.రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్ వెంచర్ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ADNOC మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో, యూఎఈ ఇండస్ట్రీస్ మినిష్టర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ , రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అధినేతల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...భారత్, యూఎఈ మధ్య దీర్ఘకాల, విలువైన సంబంధాలను మరింత సుస్థిరం చేస్తోందని అన్నారు.
చదవండి: 120 సెకండ్లలో హాట్‌కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇవే...!
Comments
Please login to add a commentAdd a comment