![Mahindra Group Ties Up With Jio bp Joint Venture To Improve EV Business - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/8/Mahindra-Group.jpg.webp?itok=BYc9qYSI)
దేశీ పారిశ్రామిక రంగంలో దిగ్గజ సంస్థలైన రియలన్స్, మహీంద్రా గ్రూపులు చేతులు కలిపాయి. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈవీ సెగ్మెంట్‌లో ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి.ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీగా జియో బీపీ పేరుతో ఫ్యూయల్ స్టేషన్లు నిర్వహిస్తోంది. ఇక్కడ సంప్రదాయ పెట్రోలు డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తొలి ఫ్యూయల్ స్టేషన్‌ని ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించింది.
దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా పేరున్న మహీంద్రా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించింది. ఆటో మొదలు బస్సుల వరకు మహీంద్రా పలు రకాల వాహనాలను మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ల కొరత దేశ వ్యాప్తంగా అతి పెద్ద సమస్యగా ఉంది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో మౌలిక సదుపాయల కొరత అధిగమించే దిశగా పని చేయాలని మహీంద్రా, రిలయన్స్ నిర్ణయించాయి. జియో బీపీ స్టేషన్లలో ఛార్జింగ్, స్వాపింగ్, సర్వీసింగ్ తదితర సేవలు మహీంద్రా వాహనాలకు అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment