Mahindra Group
-
ఎయిర్‌బస్ హెలికాప్టర్లో ‘మేకిన్ ఇండియా’
మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్‌పీఎల్) ఎయిర్‌బస్ నుంచి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును పొందింది. ఎయిర్‌బస్‌కు చెందిన హెచ్ 130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ తయారీ, అసెంబుల్ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇది భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' విజన్‌కు ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ కార్యదర్శి వుమ్లన్మాంగ్ వుల్నామ్, భారత్, దక్షిణాసియాలో ఎయిర్‌బస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్ 130 హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ అసెంబ్లీని మహీంద్రా ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐరోపాలోని ఎయిర్ బస్ హెలికాప్టర్ల కేంద్రానికి రవాణా చేస్తారు. ఉత్పత్తి వెంటనే ప్రారంభం కానుంది. మొదటి క్యాబిన్ అసెంబ్లీ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది.మహీంద్రా ఇప్పటికే ఎయిర్ బస్ వాణిజ్య విమాన కార్యక్రమాల కోసం వివిధ రకాల విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్ లను సరఫరా చేస్తోంది. విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్లే కాకుండా భారీ, మరింత సంక్లిష్టమైన ఏరో స్ట్రక్చర్ తయారీ, సరఫరాకు మహీంద్రా తన సామర్థ్యాల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్న క్రమంలో తాజా ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.ఎయిర్ బస్ కు భారత్ ప్రధాన మార్కెట్, వ్యూహాత్మక వనరుల కేంద్రంగా ఉంది. ప్రతి ఎయిర్ బస్ వాణిజ్య విమానంలోనూ భారతదేశంలో తయారైన విడిభాగాలు, సాంకేతికతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ బస్ భారత్ నుంచి విడిభాగాలు, సేవల కొనుగోలు విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.హెచ్ 130 అనేది ప్రయాణికుల రవాణా, పర్యాటకం, ప్రైవేట్, వ్యాపార విమానయానం, అలాగే మెడికల్ ఎయిర్ లిఫ్ట్, నిఘా మిషన్ల కోసం రూపొందించిన ఇంటర్మీడియట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో విశాలమైన, అడ్డంకులు లేని క్యాబిన్ ఉంటుంది. పైలట్, మరో ఏడుగురు ఇందులో ప్రయాణించవచ్చు. చుట్టూ పెద్ద విండ్ స్క్రీన్, వెడల్పాటి కిటికీల ద్వారా అద్భుతమైన విజిబిలిటీ ఉంటుంది. -
దేశంలో లక్షకుపైగా ఎలక్ట్రిక్ ఆటోలు అమ్మిన కంపెనీ
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్ఎంఎంఎల్) ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల (ఈవీ) తయారీదారుగా తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఎల్ 5 కేటగిరీలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రెండు లక్షల కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు చెప్పింది. ఈ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని 2024 ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం నుంచి 24.2 శాతానికి పెంచినట్లు పేర్కొంది. సుస్థిర మొబిలిటీ, సృజనాత్మక ఉత్పత్తుల తయారీకి కంపెనీ కట్టుబడి ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా లక్షకుపైగా ట్రియో మోడల్ ఎలక్ట్రిక్ ఆటోలను విక్రయించి ఈ విభాగంలో మొదటిస్థానంలో నిలిచామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?త్రివీలర్ కమర్షియల్ వాహనాలకు సంబంధించి ఎల్ 5 కేటగిరీలో ఎంఎల్ఎంఎంఎల్ ముందంజలో ఉందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ట్రియో, జోర్ గ్రాండ్ వంటి ఉత్పత్తులు ఈ వృద్ధికి కీలకంగా నిలిచాయని తెలిపింది. ట్రియో 1,00,000 యూనిట్లకు పైగా విక్రయించడంతో ఈ వాహనాలకు వినియోగదారుల్లో విశ్వసనీయత నెలకొందని చెప్పింది. ఎల్5 ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలో 37.3 శాతం మార్కెట్ వాటాతో ఎంఎల్ఎంఎంఎల్ ఆధిపత్యం వహిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీన్ని కొనసాగించడానికి, వివిధ వ్యాపార అవసరాలను తీర్చడానికి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలైన మెటల్ బాడీ ట్రియో, మహీంద్రా జీఈఓ మోడళ్ల విక్రయాలు ఎంతో తోడ్పడుతున్నాయని పేర్కొన్నాయి. -
మహిళల ‘సెకండ్ కెరియర్’కు మహీంద్రా ప్రోగ్రామ్
వృత్తి జీవితాలను ఇతర కారణాలతో మధ్యలో వదిలేసిన మహిళలకు మహీంద్రా గ్రూప్(Mahindra Group) శుభవార్త చెప్పింది. సుదీర్ఘ విరామం తరువాత మహిళా ప్రొఫెషనల్స్(women professionals) తిరిగి వృత్తి జీవితంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఎస్ఓఏఆర్ (సీమ్‌లెస్ అపర్చునిటీ ఫర్ అమేజింగ్ రిటర్న్‌షిప్) పేరుతో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు విరామం తీసుకున్న కనీసం ఐదు సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉన్న మహిళలకు ఈ ప్రాగ్రామ్ ద్వారా సాయం అందించనున్నారు.మహీంద్రా గ్రూప్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రెసిడెంట్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు రుజ్ బెహ్ ఇరానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘తిరిగి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి గణనీయమైన వృద్ధిని తీసుకువస్తారు. సోర్ ప్రోగ్రామ్‌లో భాగంగా మహిళలకు మెంటార్ షిప్, అప్ స్కిల్, ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్, నెట్ వర్కింగ్ సెషన్లు అందిస్తారు. ప్రతి ఒకరికి ఒక మెంటార్‌ను కేటాయిస్తారు. దాంతో ప్రోగ్రామ్ సమయంలో ఏదైనా అనుమానాలు వస్తే నిత్యం మెంటార్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు’ అని అన్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదంకార్పొరేట్ హెచ్ఆర్ అండ్ గ్రూప్ టాలెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి హండా మాట్లాడుతూ..‘పనిప్రాంతంలో లింగ వైవిధ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే కొంత పని అనుభవం ఉన్న మహిళలు కొన్ని కారణాల వల్ల పని చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు. అలాంటి వారికి కొంత ప్రోత్సాహం, సమయం ఇస్తే తిరిగి వారు శ్రామికశక్తి(workforce)లో భాగమవుతారు. అందుకు కంపెనీ అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి సంస్థ సంస్కృతి, విలువల గురించి పరిచయం చేయడం కోసం మహీంద్రా లీడర్షిప్ యూనివర్శిటీలో ప్రత్యేక కోర్సు కూడా ఉంటుంది. -
పటిష్ట స్థితిలో భారత్..
న్యూఢిల్లీ: సైనిక శక్తి, రాజకీయ సుస్థిరత, బలమైన ప్రజాస్వామ్యం తదితర అంశాల దన్నుతో అంతర్జాతీయంగా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని, మరింతగా ఎదిగే సత్తా దేశానికి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అనిశ్చితులను.. భారత్ అవకాశాలుగా మల్చుకోవచ్చని మహీంద్రా చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగంగా మారొచ్చని నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు ఇచి్చన సందేశంలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగా ఉంటుందని మహీంద్రా తెలిపారు. తమ గ్రూప్ అధిగమించిన కీలక మైలురాళ్లను ప్రస్తావిస్తూ .. అత్యంత విలువైన వాహనాల తయారీ దిగ్గజంగా ప్రపంచంలోనే 11వ స్థానానికి చేరడం, ఎలక్ట్రిక్ వాహనాలు అంచనాలకు మించి విజయవంతం కావడం గర్వించతగ్గ విషయాలని ఆయన పేర్కొన్నారు. గ్రూప్‌లోని ఇతర కంపెనీల పనితీరును కూడా ప్రశంసించారు. ఆకాంక్షలను సాకారం చేసుకోగలమనే స్ఫూర్తితో భవిష్యత్తుపై ఆశావహంగా ఉండాలని సూచించారు. -
జావా కొత్త బైక్ 42 ఎఫ్‌జే
ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
భారత్‌లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్‌స్టార్ 650 మోడల్‌తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్‌తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్‌ను 1910లో విడుదల చేసింది. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్‌లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్‌లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగం!
Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియోపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 2002లో విడుదలైన స్కార్పియోకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆ వెహికల్ ఫ్లాప్ అయి ఉంటే బోర్డు నన్ను తొలగించేది. స్కార్పియో నమ్మకమైన యుద్ధ గుర్రం. అది ఎల్లప్పుడూ నా వెంటే ఉంటుంది. స్కార్పియో విఫలమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మహీంద్రా సంస్థ 2002లో స్కార్పియోని విడుదల చేసింది. స్కార్పియో రాకతో మహీంద్ర దశ మారింది. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని సంస్థ పేరు ప్రఖ్యాతలు గడించింది. తాజాగా, ఆ వెహికల్ 9 లక్షల అమ్మకాల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా ఆటోమొబైల్ ఎడిటోరియల్ సంస్థ ఆటోకార్ ఇండియా ఎడిటర్ హోర్మజ్డ్ సోరాబ్జీ స్కార్పియో విక్రయాలపై ట్వీట్ చేశారు. I’m sure you haven’t forgotten how we were in Nashik together to road test the prototype @hormazdsorabjee Phew, we’ve come a long way since then! But this trusty warhorse has always been at our side, ready to ride into battle with us. If it had flopped, the board would have fired… https://t.co/qklIM7lbtw — anand mahindra (@anandmahindra) July 1, 2023 ఆ ట్వీట్లో 2002లో మార్కెట్లో విడుదలైన స్కార్పియో మహీంద్రా బ్రాండ్ వ్యాల్యూను మార్చేసింది. ఏకంగా ఇప్పుడు 9లక్షల యూనిట్ల అమ్మకాల్ని సాధించింది. మిలియన్ మార్క్‌కు చేరువలో ఉందని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు మహీంద్రా స్పందించారు. ప్రోటోటైప్ ప్యూను రోడ్ టెస్ట్ చేయడానికి మేము నాసిక్‌లో ఎలా ఉన్నామో మీరు మర్చిపోలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా నుంచి చాలా దూరం ప్రయాణించాం. ఈ ప్రయాణంలో ఈ నమ్మకమైన యుద్ధ గుర్రం (స్కార్పియో) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. మాతో యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ అది విఫలమై ఉంటే బోర్డు నన్ను నుంచి తొలగించేది. అందుకని స్కార్పియోకు జీవితాంతం రుణపడి ఉంటానని ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి : ‘భారతీయులకు అంత సీన్‌లేదన్నాడు..రిషి సునాక్ చేసి చూపించారు..’ -
మహీంద్రా ఎక్స్‌యూవీ400 టార్గెట్ 20,000 యూనిట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
మంచు కొండల్లో మహీంద్రా కారు బీభత్సం.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!
మహీంద్రా కార్లుకు భారతీయ మార్కెట్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ వాహనాలు లాంచ్ చేస్తే రికార్డ్ బుకింగ్స్ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఈ కారు ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇంతలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది. మహీంద్రా కారా మజాకా మార్కెట్లో ఇంకా అఫిషియల్‌గా లాంచ్ కాక ముందే అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా పేరు సంపాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవ్ ప్రారంభించి 24 గంటల్లో 751 కి.మీ ప్రయాణించింది. సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా దూసుకెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుని ఈ అరుదైన రికార్డ్‌ను తన పేరిట నమోదు చేసుకుంది. ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం XUV400 112 Ah కెపాసిటీ రేటింగ్‌తో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. బ్యాటరీ ప్యాక్‌లో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఎలక్ట్రో-కెమికల్ కూర్పు ఉంది. ఈ వాహనం బరువు 1,960 కిలోలు, ఇందులో బ్యాటరీ ప్యాక్ 309 కిలోల బరువు ఉంటుంది. అధికారికంగా, XUV400 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది లగ్జరీయేతర సెగ్మెంట్‌ను మినహాయించి దేశంలో తయారైన అత్యంత వేగవంతమైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. ఈ కారు అత్యధికంగా 150 kmph స్పీడ్‌ను అందుకోగలదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, XUV400 తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీలపై ఫోకస్ పెట్టింది. అందుకే మహీంద్రా సహకారంతో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. అయితే, బ్యాటరీ కంట్రోలర్, ఎలక్ట్రిక్ మోటార్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 17 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఉండచ్చని తెలుస్తోంది. మరో వైపు ప్రత్యేర్థి టాటా నెక్సన్ ఈవీ కంటే.. ఫీచర్లు, ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
ఈవీలపై రూ. 10,000 కోట్లు పెట్టుబడి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం వచ్చే 7–8 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. మహారాష్ట్ర విద్యుత్ వాహనాల ప్రోత్సాహక పథకం కింద తమ ప్రణాళికకు ఆమోదం లభించినట్లు పేర్కొంది. ‘మహారాష్ట్రలోని పుణేలో మా బార్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) కోసం తయారీ, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై అనుబంధ సంస్థ ద్వారా వచ్చే 7–8 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. ఎంఅండ్ఎం ఆగస్టులో 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. వీటిలో నాలుగు వాహనాలు 2024–26 మధ్యలో మార్కెట్లోకి రానున్నాయి. ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి రానుంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
‘నేను భారత్‌లో ఎప్పటికీ నెం.1 కాలేను’.. ఆనంద్ మహీంద్రా రిప్లైకి నెటిజన్లు ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన ట్విటర్లో యాక్టివ్‌గా పలు అంశాలపై స్పందిస్తూ వాటిని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే! ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో 10 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయిని సాధించిన సందర్భంగా తన ట్విట్టర్లో ఈ అంశంపై నవంబర్ 10న ఒక ట్వీట్ చేశారు. అందులో.. తనకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితో ఓ నెటిజన్ మాత్రం మహీంద్రాను ఓ ప్రశ్న అడిగాడు. అందులో.. "భారత్‌లో ప్రస్తుతం అత్యంత ధనవంతుల్లో మీరు 73వ స్థానంలో ఉన్నారు. మరి మీరు ఎప్పుడు మొదటి స్థానానికి(నెం.1) చేరుకుంటారు (ఏక్ కబ్ ఆవోగే?) అని ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. “నిజం ఏమిటంటే నేను భారత్‌లో ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదని బదలిచ్చాడు. దీంతో ఇక నెటిజన్లు మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్ 25 వేల కంటే ఎక్కువ లైక్‌లతో పాటు, వెయ్యికి పైగా రీట్వీట్లు అందుకుంది. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 सच तो ये है कि सबसे अमीर कभी नहीं बनूँगा। क्योंकि ये कभी मेरी ख़्वाहिश ही ना थी… https://t.co/fpRrIf39Z6 — anand mahindra (@anandmahindra) December 11, 2022 చదవండి టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
‘భారత్ విజయం.. ఆ విషయంలో ఇంతకుమించిన ఆనందం మరొకటిలేదు’
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరుంటది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఈ దాయాది దేశాల పోరు చూసేందుకు సిద్ధంగా ఉంటారు. సెలబ్రిటీల నుంచి, సామాన్య ప్రజలు వరకు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తారు. తాజాగా ఆదివారం( అక్టోబర్ 23) జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిస్తూ పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో ట్వీట్‌తో స్పందించారు. ఇంతకన్నా ఆనందం మరొకటి లేదు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీ ఇంటెరాక్టర్ అనేది అందరికీ తెలిసిందే. సమాజంలో జరుగుతున్న అంశాలపై స్పందించడంతో పాటు టాలెంట్‌ను ప్రోత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన పెడుతున్న పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఆయన పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడం పట్ల స్పందిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. భారత్ మైండ్‌వర్స్ స్టేడియంలో విజయం సాధించింది. ప్రత్యర్థిపై సులభమైన విజయం కన్నా ఉత్కంఠ భరితమైన గెలుపే ఉత్సాహాన్నిస్తుంది. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం, అంతకన్నా సంతోషం మరొకటి లేదు. జయహో ఇండియా అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. India win in the ‘Mindverse’ Stadium!! A much more powerful, morale-boosting victory than an easy conquest. This was about PURE MENTAL STRENGTH. And I couldn’t be happier that King #ViratKohli is back on this throne. JAI HO INDIA! 👏🏽👏🏽👏🏽 #indiaVsPakistan https://t.co/jnkYAlXSQg — anand mahindra (@anandmahindra) October 23, 2022 చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
మహీంద్రా లైఫ్‌స్పేస్, యాక్టిస్ జోడీ
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ యాక్టిస్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2,200 కోట్ల ముందస్తు పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ కేంద్రాలను ఇరు సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌లో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్‌కు 26–40 శాతం వాటా, మిగిలినది యాక్టిస్, అనుబంధ కంపెనీలు సొంతం చేసుకుంటాయి. మహీంద్రా వరల్డ్ సిటీస్‌లో 100 ఎకరాల వరకు ఇందుకోసం కేటాయిస్తారు. కొత్త కేంద్రాల స్థాపనతోపాటు ఇప్పటికే ఉన్న ఫెసిలిటీలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థలు నిర్ణయించాయి. బహుళజాతి, భారతీయ క్లయింట్ల నుండి గ్రేడ్–ఏ గిడ్డంగులు, తయారీ సౌకర్యాల కోసం బలమైన, వేగవంతమైన డిమాండ్‌ను చూస్తున్నామని మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఎండీ అరవింద్ సుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు. చెన్నై, జైపూర్‌లో ఇటువంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. -
’థర్డ్ పార్టీ’ జప్తులు నిలిపివేశాం
న్యూఢిల్లీ: వాహన రుణాల రికవరీలకు సంబంధించి థర్డ్–పార్టీ ఏజంట్ల ద్వారా జప్తులు చేయడాన్ని నిలిపివేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్) వెల్లడించింది. ఇటీవలి విషాద ఘటన నేపథ్యంలో థర్డ్ పార్టీ ఏజంట్లను ఎలా వినియోగించుకోవచ్చనే అంశాన్ని అధ్యయనం చేయనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ రమేష్ అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్టర్ రుణ రికవరీ కోసం వచ్చిన ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్ థర్డ్ పార్టీ ఏజంటు .. ఆ వాహనాన్ని మీద నుంచి పోనివ్వడంతో గత వారం 27 ఏళ్ల గర్భిణీ మృతి చెందిన ఘటన గత వారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణాల రికవరీల కోసం ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్.. థర్డ్ పార్టీ ఏజంట్లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. రికవరీ, జప్తుల కోసం సొంత ఉద్యోగులను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
మహీంద్రా, బీఐఐ రూ.4,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభా గం కోసం మహీంద్రా గ్రూప్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్(బీఐఐ) రూ.4,000 కోట్లు పెట్టు బడి చేయాలని నిర్ణయించాయి. మహీంద్రా ఈవీ విభా గం అయిన ఈవీ కో కంపెనీలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్ర ణాళికాబద్ధమైన ఉత్పత్తులకు 2023–24 నుంచి 2026–27 మధ్య నూతన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మొత్తం రూ.8,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసం ఈవీ కో కంపెనీలోకి మరింత మంది పెట్టుబడిదార్లను తీసుకు వస్తామని మహీంద్రా గ్రూప్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాటా 25 శాతం.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఎక్స్‌యూవీ 400 మోడల్‌ను మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించింది. అయిదు రకాల ఈ–ఎస్‌యూవీలను భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిచయం చేస్తామని యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌యూవీతోపాటు బీఈ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్ శ్రేణి లో ఈ నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు లేదు. అయితే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహ న విభాగంలో సంస్థకు ఏకంగా 70% వాటా ఉంది. 2027 నాటికి సంస్థ విక్రయించే అన్ని ఎస్‌యూవీల్లో ఎలక్ట్రిక్ వాటా 25% ఉంటుందని భావిస్తోంది. -
వాతావరణ మార్పులపై పోరులో భారత్ ముందంజ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్)పై పోరాటంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించగలదని, ఇప్పటికే ఎన్నో భారత కంపెనీలు అంతర్జాతీయంగా ఈ విషయంలో ముందంజలో ఉన్నట్టు మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈవో అనీష్ షా పేర్కొన్నారు. భూమిపై వేడి అసాధారణ స్థాయిలో పెరిగిపోవడం ఎన్నో విపత్తులకు దారితీస్తుండడం తెలిసిందే. ఇది ఇలానే కొనసాగితే విపత్కర పరిమాణాలకు దారితీస్తుందని ‘ఫిక్కీ లీడ్స్ 2022’ కార్యక్రమంలో భాగంగా అనీష్ షా చెప్పారు. ‘‘మన ప్రధాని ఎంతో సాహసోపేతమైన ప్రకటనలు చేయడాన్ని చూశాం. 2030 నాటికి 50 శాతం పునరుత్పాదక ఇంధన వనరులు ఇందులో ఒకటి. ఈ విషయంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించగలదన్న నిజాన్ని మనం అంగీకరించాల్సిందే’’అని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీలు, పర్యావరణ అనుకూల మెటీరియల్స్, డీకార్బనైజింగ్ పరిశ్రమలతో భారత కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. కనుక భారత్ దీన్ని ముందుండి నడిపించాలని అభిప్రాయపడ్డారు. క్లైమేట్ చేంజ్‌పై పోరాటంలో భారత్ కీలకంగా వ్యవహరించగలదని హిందుస్థాన్ యూనిలీవర్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా సైతం పేర్కొన్నారు. భారత్ స్థిరంగా 8–9 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా!
చెన్నై: గత కొంత కాలంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్‌ని విడుదల చేసింది. అనంతరం తమ తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎక్స్‌యూవీ 400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. 2022 డిసెంబర్లో టెస్ట్ డ్రైవ్‌లు, 2023 జనవరి తొలి వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసి ఓ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి మహీంద్రా ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్‌లో పాత రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా కూడా ఈ కారుపై హైప్ క్రియేట్ చేసేందకు సెప్టంబర్ 8 సాయంత్రం 7.30 ఎక్స్‌యూవీ 400 కారు లుక్కు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో చూశాక కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
ప్రత్యర్థులకు ధీటుగా మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం!
దేశంలోని ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీ కార్లకు ఓ క్రేజ్ ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ కావడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్‌ని విడుదల చేసింది. అయితే మహీంద్రా ఈ కారు విడుదలకు ముందే, టీజర్లతో కారుపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400తో కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ ఈవీ(EV) గురించి కంపెనీ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లుక్స్ పరంగా చూస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 400.. ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్లు, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో కూడిన కొత్త హెడ్లైట్లతో పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో 150హార్స్ పవర్, రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఒక సారి ఛార్జింగ్‌పై 400కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చ . 4.2 మీటర్లు పొడవు, XUV 300తో పోలిస్తే స్పేస్ పెద్దదని తెలుస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు. వాటర్ ప్రూప్ బ్యాటరీ ప్యాక్, ప్రతీ చక్రానికి డిస్క్ బ్రేకులు, రియర్ వ్యూ కెమరా ఇతర ఫీచర్లు ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీ కాగా 8.3 సెకన్లకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్ లుక్ అదిరిందయ్యా! -
మహీంద్రా లైఫ్‌స్పేస్ @ బిలియన్ డాలర్ల మార్కెట్
న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్‌లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్‌లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ చైర్‌పర్సన్‌గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. మిగతా కంపెనీలకు దెబ్బే!
ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ అందుకు నిదర్శనం. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ( SUV) మోడల్ని విడుదల చేసింది. అయితే ఈ కారు విడుదలకు ముందే, మహీంద్రా వీలు దొరికినప్పుడల్లా టీజర్లతో ఈ కారుపై హైప్‌ను పెంచుతోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, భారతీయ వాహన తయారీ సంస్థ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUV) విడుదల చేయాలని యోచిస్తోంది. వీటిని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) రూపొందించిందని గమనించాలి. కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్‌ల ప్రకారం, SUVలకు XUV-e1, SUV-e2, SUV-e3, SUV-e5, SUV-e6, SUV-e7, SUV-e8. SUV-e9 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ట్రేడ్‌మార్క్ చేసిన పేర్లలో 4వ సంఖ్యతో ఉన్న పేరు సిరీస్‌లో లేకుండా పోయింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVల ఫీచర్లు, ఇంటీరియర్ల గురించి ఈ టీజర్ ద్వారా కస్టమర్లకు క్లూ ఇచ్చింది. ఇందులో కస్టమర్ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్‌లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్ల కారణంగా కస్టమర్లు.. కాల్స్, టెక్స్ట్‌లు, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. And the curtain rises… pic.twitter.com/wRFQrejABu — anand mahindra (@anandmahindra) August 15, 2022 చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..
న్యూఢిల్లీ: ఖజురహో నృత్యోత్సవాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతాయని మీకు తెలుసా? పోనీ .. ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యమనే సంగతి తెలుసా? కొంత మందికి తెలిసి ఉండొచ్చేమో గానీ.. చాలా మంది భారతీయులకు మన దేశం, చరిత్ర, సంస్కృతి, ఆహార విహారాలు మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహనే ఉండటం లేదు. మహీంద్రా హాలిడేస్ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘తమ దేశం గురించి, దేశ భిన్నత్వం, విస్తృతి, సంస్కృతి, వారసత్వం, వంటకాలు మొదలైన వాటి గురించి మన వారిలో అవగాహన లేమి .. ఆశ్చర్యపర్చేలా ఉంది’’ అని సర్వే పేర్కొంది. ఇందులో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మన దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పర్యటన స్థలాలు, వాతావరణం, ఆహారం మొదలైన వాటి గురించి తమకు అంతగా తెలియదని వెల్లడించారు. ‘‘భారతదేశ వైవిధ్యంపై అవగాహన, పరిజ్ఞానం గురించి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం చాలా మందికి మన వంటకాల గురించి అతి తక్కువగా తెలుసు. నిజానికి భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్‌లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే’’ అని సర్వే పేర్కొంది. దేశీయంగా వివిధ ప్రాంతాలను సందర్శించే కొద్దీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి తమకు తెలియని సంస్కృతులు, వంటకాలు మొదలైన వాటి గురించి ఆసక్తి పెరుగుతుందని, తద్వారా భారతదేశ వైవిధ్యం గురించి అవగాహన పెంచుకోవచ్చని మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా ఎండీ కవీందర్ సింగ్ తెలిపారు. సర్వేలో మరిన్ని వివరాలు.. ► భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వంపై కూడా ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమేనని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు ఖజురహో ఉత్సవాలను మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తారన్న సంగతి మూడో వంతు మందికి (39 శాతం) పైగా తెలియదు. ఇక మహారాష్ట్ర .. పైఠనీ చీరలకు పెట్టింది పేరని సుమారు మూడో వంతు మంది (32 శాతం)కి తెలియదు. ► భారతదేశ భౌగోళికాంశాలపై కూడా ప్రజల్లో పరిజ్ఞానం ఒక మోస్తరుగానే ఉంది. భారతదేశంలోని గిర్ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం మూడొంతుల మందికి (దాదాపు 39 శాతం) తెలియదు. అలాగే, ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరంగా వ్యవహరిస్తారని, చైనా వాల్ తర్వాత అత్యంత పొడవైన గోడ గల కుంభల్గఢ్ కోట .. రాజస్థాన్‌లో ఉందన్న సంగతి గానీ సుమారు మూడోవంతు మందికి తెలియదు. ► టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్ ఈ సర్వే నివేదిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు. -
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ఇలా చేస్తే సైక్లింగ్ బూమ్ రావచ్చు: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ కీలక అంశాలపై స్పందిస్తారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. నెటిజన్లతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉంటారు. కరెంట్ అఫైర్స్ మీద, స్ఫూర్తినిచ్చే కథనాలు ఇలా అన్ని విషయాలపై ఆనంద్ ట్వీట్లు చేస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్రా మరొక పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కవరేజీని పెంచడానికి ఊదేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.."వాట్ ఆన్ ఐడియా సర్జీ.. మా దేశంలో సోలార్ ఉత్పత్తి కోసం కాలువలపై సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ నిర్మిస్తాము, కానీ మీ ఐడియా మాత్రం సోలార్ ఎనర్జీ కవరేజీని గణనీయంగా పెంచుతుంది. సైక్లిస్టులు ఎక్స్ ప్రెస్ వేలను ఉపయోగించకుండా చూడటం విలువైనది.. ఎవరికి తెలుసు, బహుశా ఇది సైక్లింగ్ బూమ్ క్రియేట్ చేయవచ్చు" అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ఎరిక్ సోల్హిమ్ చేసిన ట్వీట్'ను మహీంద్రా రీట్వీట్ చేశారు. What an idea sirji… We have been doing similar things by covering canals, but this would substantially increase coverage. It’s worth looking at even if cyclists don’t use expressways…and who knows, maybe it’ll kick off a recreational cycling boom.. @nitin_gadkari https://t.co/zrZk8CqjFK — anand mahindra (@anandmahindra) March 2, 2022 దక్షిణ కొరియా హైవే మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చిన ఒక వీడియోను సోల్హిమ్ పంచుకున్నారు. ఫిబ్రవరి 25న సోల్హిమ్ ట్వీట్ చేస్తూ.. "దక్షిణ కొరియాలో హైవే మధ్యలో ఉన్న సోలార్ ప్యానెల్స్ కింద సైకిల్ మార్గం ఉంది. సైక్లిస్టులు సూర్యుడి నుంచి రక్షించబడతారు. అలాగే, ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడంతో పాటు ఆ దేశం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయగలదు" అని అన్నారు. (చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!) -
NSE INDIA : మహీంద్రా గ్రూప్ సిల్వర్ జూబ్లీ
దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా అనేక రికార్డులు సృష్టిస్తున్న మహీంద్రా గ్రూపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో అడుగు పెట్టి నేటికి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. దేశంలో రెండో స్టాక్ ఎక్సేంజీగా వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో సైతం మహీంద్రా తనదైన ముద్రను వేసింది. 1996 జనవరి 3న ఎన్ఎస్ఈలో మహీంద్రా లిస్టయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఈ ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీకి జీపులు తయారు చేసే కంపెనీగా మార్కెట్లోకి అడుగు పెట్టిన మహీంద్రా అండ్ మహ్మద్ కంపెనీ ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాగా మారింది. గత 75 ఏళ్లలో మహీంద్రా గ్రూపు ఎన్నో విజయాలు సాధించింది. వాహనాల తయారీ నుంచి బ్యాంకింగ్ సెక్టార్ వరకు అనేక రంగంలో పాదం మోపి విజయం సాధించింది. Hearty congratulations from all of us at NSE to Mahindra & Mahindra Ltd. One of India's leading automobile companies on completing 25 years of being listed on the NSE. #ThisDayThatYear #NSE #NSEIndia pic.twitter.com/mK2kGN9qw6 — NSEIndia (@NSEIndia) January 3, 2022 -
రెట్రో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! సరికొత్తగా యెజ్దీ బైక్..! లాంచ్ ఎప్పుడంటే!
Classic Legends Announces Ressurection Date For Yezdi Motorcycles: జావా మోటార్ సైకిల్స్, బీఎస్ఏ క్లాసిక్ లెజెండ్స్ తరువాత భారత్‌లోకి మరో రెట్రో బైక్ మార్కెట్లలోకి రానుంది. రెట్రో బైక్స్‌లో యెజ్దీ బైక్‌లకు ఉండే క్రేజే వేరు. యెజ్దీ రయ్ రయ్‌మంటూ చేసే సౌండ్ బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ట్విన్ సైలెన్సర్ బైక్‌లను యెజ్దీ రూపొందించింది. భారత్‌లో యెజ్దీ బైక్స్ మరోసారి కనువిందు చేయనున్నాయి. యెజ్డిస్ భారతీయ మోటర్‌స్పోర్ట్ రంగంలో కూడా బలమైన ఖ్యాతిని కలిగి ఉంది. 1980-1990లలో వీపరితమైన క్రేజ్‌ను యెజ్దీ రోడ్ కింగ్ బైక్‌లకు వచ్చింది. మహీంద్రా గ్రూప్‌తో పునరాగమనం..! భారత మార్కెట్లలోకి తొలుత జావా మోటార్స్ యెజ్దీ బైక్‌లను లాంచ్ చేయాలని భావించింది. అది కాస్త వీలు కాకపోవడంతో మహీంద్రా గ్రూప్‌కు చెందిన క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యెజ్దీ బైక్‌లను భారత్‌లో పరిచయం చేయనుంది. ఫోటో క్రెడిట్: MotorBeam లాంచ్ ఎప్పుడంటే..! ట్విన్ సైలెన్సర్ బైక్ యెజ్దీ భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 13న లాంచ్ కానుంది. యెజ్దీ బైక్స్‌లో భాగంగా కనీసం మూడు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యెజ్దీ తన లైనప్‌లో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయనుంది. ఈ బైక్‌ల ధర, స్పెసిఫికేషన్లు, లభ్యతపై మరిన్ని వివరాలు వచ్చే నెలలో తెలియనున్నాయి. ఫోటో క్రెడిట్: MotorBeam యెజ్దీ బైక్ స్పెసిఫికేషన్స్ అంచనా..! జావా మోటార్‌సైకిల్ పెరాక్‌లో కనిపించే 334 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. పెరాక్ సుమారు 30 బీహెచ్పీ 32.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కాగా ఈ బైక్ పూర్తి వివరాలు తెలియాలంటే లాంచ్ డేట్ వరకు ఆగాల్సిందే. చదవండి: ఊపిరి పీల్చుకోండి..! 2022లో మరోసారి భారీగా పెరగనున్న ఆయా వస్తువుల ధరలు..! -
రిలయన్స్‌తో జట్టు కట్టిన మహీంద్రా గ్రూపు.. ఆ సెక్టార్లో సంచలన మార్పులు
దేశీ పారిశ్రామిక రంగంలో దిగ్గజ సంస్థలైన రియలన్స్, మహీంద్రా గ్రూపులు చేతులు కలిపాయి. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈవీ సెగ్మెంట్లో ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి.ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీగా జియో బీపీ పేరుతో ఫ్యూయల్ స్టేషన్లు నిర్వహిస్తోంది. ఇక్కడ సంప్రదాయ పెట్రోలు డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తొలి ఫ్యూయల్ స్టేషన్‌ని ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించింది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా పేరున్న మహీంద్రా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించింది. ఆటో మొదలు బస్సుల వరకు మహీంద్రా పలు రకాల వాహనాలను మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ల కొరత దేశ వ్యాప్తంగా అతి పెద్ద సమస్యగా ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయల కొరత అధిగమించే దిశగా పని చేయాలని మహీంద్రా, రిలయన్స్ నిర్ణయించాయి. జియో బీపీ స్టేషన్లలో ఛార్జింగ్, స్వాపింగ్, సర్వీసింగ్ తదితర సేవలు మహీంద్రా వాహనాలకు అందుతాయి. -
Mahindra : కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి
Mahindra Finance Vehicle Leasing & Subscription Business Under Quiklyz Brand: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ క్విక్లీజ్ పేరుతో లీజ్ ఆధారిత సబ్స్క్రిప్షన్ సేవలను పరిచయం చేసింది. ఆన్లైన్ వేదికగా రిటైల్, కార్పొరేట్ క్లయింట్లు లక్ష్యంగా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన కార్లను అద్దె విధానంలో ఆఫర్ చేస్తుంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. కనీస చందా నెలకు రూ.10,000 ఉంది. 24–60 నెలల కాలానికి కస్టమర్ తనకు నచ్చిన సరికొత్త కారును అద్దెకు తీసుకోవచ్చు. ఈ పద్దతిలో క్విక్లీజ్ వెబ్సైట్లో లాగిన్ అయి కారుతోపాటు కంపెనీ నుంచి ఎటువంటి సేవలు కావాలో ఎంచుకోవాలి. అవసరమైన పత్రాలు జతచేసి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. స్టాక్నుబట్టి కొద్ది రోజుల్లోనే కస్టమర్ పేరునే వైట్ నంబర్ ప్లేట్‌తో ఇంటి ముంగిట వాహనం ఉంటుంది. కాల పరిమితి తర్వాత కారును వెనక్కి ఇవ్వొచ్చు. లేదా అదే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మరో కారుకు అప్‌గ్రేడ్‌కూ అవ కాశం ఉంది. ఎనిమిది మోడళ్లు బుధవారం నాటికి ఎనిమిది బ్రాండ్లకు చెందిన 22 మోడళ్లు కొలువుదీరాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను జోడిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌సహా ఎనిమిది నగరాల్లో క్విక్లీజ్ అందుబాటులో ఉంది. ఏడాదిలో 30 నగరాలకు సేవలను విస్తరించాలన్నది సంస్థ ఆలోచన. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: -
బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్యువి700 పరిచయ ఆఫర్ కింద తక్కువ ధరలతో లాంఛ్ చేశారు. మొదటి 25,000 బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఎంట్రీ వేరియంట్ ఎక్స్యువి700 ధరలు ₹12.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ వేరియంట్ ధరలను కంపెనీ ₹50,000 వరకు పెంచింది. బుకింగ్స్ మళ్లీ అక్టోబర్ 8న ఉదయం 10 నుంచి తిరిగి తెరవనున్నారు. కస్టమర్లు డీలర్ షిప్ లేదా డిజిటల్ ఫ్లాట్ ఫారాల ద్వారా ఎక్స్యువి 700ని బుక్ చేసుకోవచ్చు, మహీంద్రా ఈ రోజు మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ 25,000 మంది కారు బుక్ చేసుకున్న తర్వాత ధరలను పెంచింది. అన్ని వేరియెంట్ల ధరలను పెంచలేదు. కొన్ని వేరియెంట్ల ధరలను మాత్రమే పెంచింది. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.(చదవండి: ఫేస్బుక్ ద్వారా డబ్బుల్ని ఇలా సంపాదించండి) -
మహీంద్రా సంచలన నిర్ణయం.. త్వరలో హైపర్ కార్
ట్రాక్టర్ల తయారీ నుంచి మొదలు పెట్టి ఎస్‌యూవీల వరకు వాహన తయారీ రంగంలో స్వదేశి సంస్థగా చెరగని ముద్ర వేసిన మహీంద్రా మరో సంచలనానికి తెరలేపింది. ఏషియా ఆటోమోబైల్ కంపెనీలకు వెనక్కి నెట్టి హైపర్ కారు తయారీపై ఫోకస్ పెట్టింది. బ్రాండ్ ఇమేజ్ ఆటోమొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకోవడంతో పాటు బ్రాండ్ ఇమేజ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది మహీంద్రా. తమ కంపెనీ నుంచి ట్రాక్టర్లు, జీపులు మొదలు హైపర్ కార్ల వరకు అన్నీ దొరుకుతాయనే మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా హై ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్లో రెనాల్ట్, ఫోర్డ్‌లతో కలిసి ముందుకు సాగాలపి ఇప్పటికే డిసైడ్ అయ్యింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పినిన్‌ఫరినా హైపర్ కార్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన ఫినిన్‌ఫరినాతో జట్టు కట్టేందుకు మహీంద్రా సిద్ధమైందంటూ బ్లూబ్‌బర్గ్ మీడియా ప్రచురించింది. దీని ప్రకారం రాబోయే రెండేళ్లలో మహీంద్రా, ఫినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్ కారుని మార్కెట్లోకి తేనున్నాయి. బటిస్టా జెనివాలో 2019లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఫినిన్‌ఫరినా బటిస్టా కాన్సెప్టు కారును తొలిసారి ప్రదర్శించింది. 2020లో మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా కారు తయారీ పనులకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ఈ సంస్థ 2022 ప్రథమార్థంలో కారును తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కారు తయారీలో భాగస్వామ్యం కావాలని మహీంద్రా యోచిస్తోంది. ఫీచర్లు అన్నీ అనుకూలిస్తే మహీంద్రా - ఫినిన్‌ఫరినాల ఆధ్వర్యంలో రాబోయే హైపర్కారుని పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్‌గా తయారు చేయబోతున్నారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ధర మహీంద్రా- ఫినిన్ఫరినాలు సంయుక్తంగా మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉన్న ఈ హైపర్ కారు ధర 2.3 మిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి తొలి ఐదు బుకింగ్స్ పూర్తయ్యాయి. కేవలం 150 కార్లు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. చదవండి : Mahindra XUV700: బుకింగ్స్ ప్రారంభం.. ముందు వచ్చిన వారికే ఆ ఆఫర్ -
MAHINDRA XUV700: అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే ఇంటిలిజెన్స్..
Mahindra XUV 700 Car Unvieled Highlights: విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి రీలీజ్ చేయనుంది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది. కొత్త లోగోతో మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. సాటిలేని ఫీచర్లు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిస్తు్న ఆకారుగా మహీందద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోంటైన్మెంట్లో ఇంటీరియర్‌లో అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటిలిజెన్స్ ఆధారిత 10.25 ఇంచ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్‌రూఫ్, , స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ , డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర కీ ఫీచర్లు - జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. - డ్రైవర్‌తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. - 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు. - ఎక్స్‌యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. - హై ఎండ్ మోడల్లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి. You've heard about it You've talked about it, You've seen it in disguise. It’s the most awaited SUV It is the XUV700 driven by AdrenoX. Watch its debut using this link https://t.co/2yS6hOBboX on 14th August at 4 pm and experience a rush like never before. pic.twitter.com/9bcB8nHJIm — MahindraXUV700 (@MahindraXUV700) August 13, 2021 -
కొత్త దారిని ఎంచుకున్నందుకు...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో ఆరుగురు కొత్త కుర్రాళ్లు కీలకపాత్ర పోషించారు. సిరాజ్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లు ఇదే సిరీస్‌లో అరంగేట్రం చేయగా, శార్దుల్ ఠాకూర్‌కు కూడా బ్రిస్బేన్ మ్యాచ్ దాదాపు తొలి టెస్టులాంటిదే. వీరి ప్రదర్శనను అభినందిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన తరఫు నుంచి ప్రత్యేకంగా జీప్లను కానుకలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రికెటర్లకు కొత్త మోడల్ ‘థార్–ఎస్యూవీ’లు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 13 లక్షలు విలువ చేసే థార్–ఎస్యూవీ జీప్‌ను మహీంద్రా సంస్థ నుంచి కాకుండా తన సొంత డబ్బులతో వీటిని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘భవిష్యత్తులో భారత యువకులు పెద్ద కలలు కనవచ్చని, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించవచ్చనే నమ్మకాన్ని వీరు కలిగించారు. ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లగలిగిన వీరి విజయ గాథల్లో ఎంతో వాస్తవం ఉంది. జీవితంలో అన్ని రంగాలకు ఇవి స్ఫూర్తినందిస్తాయి. ఈ ఆరుగురికి కంపెనీ సొమ్ము నుంచి కాకుండా నా సొంత డబ్బులతో కొత్త థార్ ఎస్యూవీ వాహనాలను కానుకగా అందించడం పట్ల ఎంతో ఆనందిస్తున్నా. వీరంతా తమపై తాము ఎంతో నమ్మకముంచి నలుగురు నడిచిన దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకొనే సాహసం చేయడమే నేను బహుమతి ఇవ్వడానికి కారణం. వీరికి నా అభినందనలు. వీలైనంత తొందరగా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి ‘థార్’లు అందజేయమని మహీంద్రా కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. -
‘మహీంద్రా’ శాంగ్యాంగ్ దివాలా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన దక్షిణ కొరియా కంపెనీ శాంగ్యాంగ్ మోటార్ (ఎస్‌వైఎంసీ) దివాలా తీసింది. నష్టాలు, భారీ రుణభారంతో కుదేలవడమే ఇందుకు కారణం. దివాలా చట్టం కింద పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలంటూ సియోల్ దివాలా కోర్టులో శాంగ్యాంగ్ దరఖాస్తు చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణపరమైన మద్దతుకు కోర్టు ఆమోదముద్ర వేసిన పక్షంలో.. బోర్డు పర్యవేక్షణలో రుణదాతలు మొదలైన వర్గాలతో పునరుద్ధరణ ప్యాకేజీపై కంపెనీ చర్చలు జరపగలదని పేర్కొంది. ఎస్‌వైఎంసీ దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలా లేదా అన్నది సియోల్ దివాలా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఎంఅండ్ఎం పేర్కొంది. దాదాపు రూ. 408 కోట్ల రుణాన్ని ఇటీవల తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. శాంగ్యాంగ్ విఫలమైంది. నష్టాల్లో ఉన్న శాంగ్‌యాంగ్‌ను ఎంఅండ్ఎం 2010లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని లాభాల బాట పట్టించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. శాంగ్‌యాంగ్‌లో ఎంఅండ్ఎంకు 75 శాతం వాటా ఉంది. ఇప్పటిదాకా 110 మిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. 2017 నుంచి శాంగ్యాంగ్ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు రుణ భారం దాదాపు రూ. 680 కోట్లకు పెరిగిపోయింది. మరింతగా పెట్టుబడులు పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో శాంగ్యాంగ్ ప్రతిపాదించినప్పటికీ.. ఎంఅండ్ఎం తిరస్కరించింది. (చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలంటున్నారు) -
మార్కెట్లోకి మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో
సాక్షి, హైదరాబాద్ : మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ఎలక్ర్టిక్ మొబిలిటీ లిమిటెడ్ నూతన ఎలక్ర్టిక్ త్రీవీలర్ మహీంద్రా ట్రియోను సోమవారం తెలంగాణ మార్కెట్లో ప్రవేశపెట్టింది. రాయితీల అనంతరం 2.7 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్ ధరతో ఈ వాహనం అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. మహీంద్రా ట్రియో ఎలక్ర్టిక్ ఆటోనూ పూర్తిగా భారత్‌లో రూపొందించి అభివృద్ది చేశారు. ఈ వాహనం కేవలం 2.3 సెకన్లలోనే 0 నుంచి 20 కేఎంపీహెచ్ వేగాన్ని అందిపుచ్చుకుంటుంది. మహీంద్రా ట్రియోతో వాహనదారులు ఏటా 45వేల రూపాయలను ఆదా చేసుకనే వెసులుబాటు లభిస్తుంది. ఈ వాహనాన్ని కేవలం 50 వేల రూపాయల డౌన్‌పేమెంట్ చెల్లించి ఆపై మహీంద్రా ఫైనాన్స్, ఎస్బీఐ నుంచి అతితక్కువ వడ్డీరేటు (10.8)కు రుణాలను పొందవచ్చు. తెలంగాణ ప్రకటించిన ఎలక్ర్టానిక్ వాహన విధానంతో రాష్ట్రంలో ఎలక్ర్టిక్ వాహనాలు అందుబాట ధరల్లో అందరికీ చేరువయ్యాయని మహీంద్రా ఎలక్ర్టిక్ ఎండీ, సీఈఓ మహేష్ బాబు పేర్కొన్నారు. ఎలక్ర్టిక్ త్రీవీలర్స్ ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా అనుకూలంగా ఉంటాయని అన్నారు. మూడు సంవత్సరాల ప్రామాణిక వారెంటీ సహా అమ్మకం తర్వాత మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దేశవ్యాప్తంగా 140కి పైగా డీలర్‌షిప్‌లతో కూడిన సేవా నెట్వర్క్ ఉందని తెలిపారు. చదవండి : 30 ఏళ్ల కృషి; ఆనంద్ మహింద్రా ఔదార్యం -
ఎంఅండ్ఎం ఫైనాన్షియల్.. భలే జోరు
మహీంద్రా గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 157 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 159ను సైతం అధిగమించింది. గత రెండు వారాల్లో ఈ షేరు 34 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కంపెనీ రైట్స్ ఇష్యూ చేపట్టేందుకు ఇటీవలే బోర్డు అనుమతించింది. దీనిలో భాగంగా రైట్స్ పొందేందుకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 23గా ప్రకటించింది. దీంతో నేటి నుంచి ఎక్స్‌రైట్స్‌లో ఈ కౌంటర్ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.. 1:1 నిష్పత్తిలో.. రైట్స్ ఇష్యూలో భాగంగా ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులకు తమదగ్గరున్న ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఆఫర్ చేస్తోంది. ఇందుకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 50 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్ 11న ముగియనుంది. రైట్స్ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. క్యూ1 ఓకే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. -
లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే...
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని, కానీ లాక్డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం మాత్రం ఉండబోదని మహీంద్రా అభిప్రాయపడ్డారు. ‘గతంలో నేను ట్వీట్ చేసినట్లుగా లాక్డౌన్ పొడిగింపులు ఆర్థికంగా వినాశకరం మాత్రమే కాదు మరో వైద్యపరమైన సంక్షోభానికి కూడా దారితీసే ప్రమాదముంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో మహీంద్రా ట్వీట్ చేశారు. మానసిక ఆరోగ్యంపై లాక్డౌన్ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని గుర్తు చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు. 49 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను సమగ్రమైన విధంగా ఎత్తివేయాలంటూ మహీంద్రా గతంలో కూడా ప్రతిపాదించారు. -
వైరస్‌తో కలిసి సహజీవనం తప్పదు..
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం పాటు పొడిగించిన పక్షంలో దేశానికి ఆర్థికంగా.. ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు పొంచి ఉందని పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. లాక్డౌన్ వల్ల లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగినప్పటికీ.. పొడిగిస్తూ పోవడం వల్ల బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ‘టెస్టింగ్ పెరిగే కొద్దీ, కేసుల సంఖ్యపెరగడం కూడా సాధారణంగా జరిగేదే. అయితే, లాక్‌డౌన్‌ను మరింత దీర్ఘకాలం పొడిగిస్తే మాత్రం ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు ఉంది. వైరస్‌తో కలిసి సహజీవనం చేయక తప్పదు’ అని ట్వీట్ చేశారు. -
కుబేరుడి కుమారునికి ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్
ముంబై: మిలీనియర్ ఆయిల్ ట్రెడర్ కుమారుడికి తమ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మిలీనియర్ రాకేశ్ థక్కర్ కొడుకు ద్వార్‌కేశ్ థక్కర్.ఇంజనీరింగ్ చదువుతున్న ద్వార్‌కేశ్‌కు చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా తన స్వస్థలం పాంద్రా నుంచి సిమ్లాకు వెళ్లాడు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని అక్కడ ఓ హోటళ్లో అంట్లు శుభ్రం చేసే పనిలో చేరాడు. ప్రతి రోజు అంట్లను శుభ్రం చేసి.. రోడ్లపైనే నిద్రపోయేవాడు. ఈక్రమంలో సిమ్లా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా.. అతను ఓ మిలీనియర్ కొడుకు అని తేలింది. ఓ మిలీనియర్ కొడుకు అంట్లు తోముతున్న దృశ్యాలు ప్రధాన పత్రికల్లో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఆనంద్.. అతనికి తన కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించారు. ఈ విషయంపై థక్కర్ స్పందిస్తు మహీంద్ర కంపెనీ ఆఫర్‌ను కచ్చితంగా స్వీకరిస్తానని తెలిపాడు. కంపెనీ అధికారులను త్వరలోనే కలుస్తానని ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మరోవైపు థక్కర్ తండ్రి రాకేశ్ థక్కర్.. మహీంద్ర ఆఫర్ చేసిన ఇంటర్న్‌షిప్‌పై స్పందిస్తూ తన కుమారుడికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉందని, కచ్చితంగా ఏదో ఒక రోజు నెరవెరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తుల్లో గొప్ప పారిశ్రామికవేత్తగా ద్వార్‌కేశ్ థక్కర్ ఎదుగుతాడని ఆనంద్ మహీంద్ర చెప్పడం విశేషం. -
‘కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయా’
న్యూఢిల్లీ : పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు చేతులు లేని ఓ చిన్నారి కాళ్ల సహాయంతో ఆహారం తినేందుకు చేస్తున్న ప్రయత్నం తనలో ఆశావాదాన్ని పెంపొందిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘ నా మనవడిని ఇటీవలే కలిశాను. కానీ ఈ వాట్సాప్ పోస్టు చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. జీవితం అనేది ఎన్నో సవాళ్లతో, ప్రతికూలతలతో నిండి ఉంటుంది. అయితే ఆ బహుమతిని ఏ విధంగా మలచుకున్నామనే విషయం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఫొటోలు చూసినపుడు నాలో ఆశావాదం పెంపొందుతుంది. నూతనోత్సాహాన్ని నింపుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఆనంద్ మహీంద్ర ట్విటర్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ట్వీట్‌కు స్పందించిన భారత్ గ్యాస్ విభాగం తమిళనాడుకు చెందిన ఇడ్లీ అవ్వ కమలాతాళ్‌కు గ్యాస్ స్టవ్ అందించిన విషయం తెలిసిందే.(చదవండి : మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా!) Been seeing my grandson recently, which is why I couldn’t restrain the tears when I saw this whatsapp post. Life, whatever its imperfections & challenges, is a gift; it’s up to us to make the most of it. Images like this help me retain my unfailing optimism pic.twitter.com/AXRYAqsuG0 — anand mahindra (@anandmahindra) September 21, 2019 -
చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!
చిటపట చినుకులు పడుతూ ఉంటే ఇంట్లో కూర్చుని వేడివేడిగా పకోడీలో లేదా బజ్జీలో తింటే ఆ టేస్టే వేరు. ఇక ఎప్పుడూ వంటగది వైపే చూడని భర్త తన కోసం ఇలాంటి వంటకాలు చేస్తే భార్యకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది. మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర భార్య కూడా ఇలాంటి అనుభూతి పొందాలనుకున్నారు. అందుకే తన కోసం వంట చేయమని గోముగా భర్తను అడిగారట. అయితే ఆనంద్ మహీంద్ర మాత్రం తనదైన శైలిలో ఓ ఫొటో పంపి సున్నితంగానే ఆమె అభ్యర్థనను తిరస్కరించారట. ఈ విషయం గురించి ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...‘ ఓ వర్షాకాలపు సాయంత్రం మేమిద్దరం ఇంట్లో ఉన్నాం. తన కోసం ఏదైనా వంట చేయాల్సిందిగా నా భార్య నన్ను కోరింది. అప్పుడు తనకు ఇదిగో ఈ ఫొటో పంపించాను. నేను వంట చేస్తే ఎలా ఉంటుందో.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే ఈ ఫొటోను పంపాను. నిజంగా ఇలా చేస్తే బాగుంటుందా అని తనని అడిగాను’ అంటూ ఓ వ్యక్తి ఇస్త్రీపెట్టెతో రొట్టెను కాలుస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో... ‘ఓహో ఇలా చేస్తే మీ భార్య ఇంకోసారి మిమ్మల్ని వంట గురించి అడగరు అని భావిస్తున్నారా లేదా నా విధులన్నీ నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను కదా అని చెబుతున్నారా. ఏదేమైనా మీ ఆన్సర్ సూపర్ సార్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా...‘ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ చపాతీలను కూడా తయారు చేస్తారా సార్’ అంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా సృజనాత్మకత, టైమింగ్‌తో ఆకట్టుకునే ఆనంద్ మహీంద్ర ట్వీట్లకు ఫాలోవర్లు ఎక్కువగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. A rainy weekend & we’re staying home. My wife asked me if I wanted to help cook some interesting dishes. I sent her this picture saying this is how I work & asked if she was sure my skills were relevant... pic.twitter.com/lKWYfnTphS — anand mahindra (@anandmahindra) July 28, 2019 -
తెలివైన భార్య ఉంటే ఇదే ప్రమాదం!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర మరోసారి తన కామిక్ సెన్స్‌ను బహిర్గతం చేశారు. తను చదివిన ఓ ఇంగ్లీష్ న్యూస్ ఆర్టికల్‌ను ట్విటర్లో పోస్ట్ చేయటమే కాకుండా తను అడిగిన ప్రశ్నకు భార్య ఇచ్చిన సమాధానాన్ని సైతం పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భార్య మాట వినాల్సి వస్తుందని, ఓ వ్యక్తి తను చెవిటి, మూగ వాడిగా నటించి.. 62 సంవత్సరాలు భార్యను ఎలా మోసం చేశాడన్న వార్తను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రం. ఆ వార్త చదవగానే తాను 5నిమిషాల పాటు విరగబడి నవ్వుకున్నానని పేర్కొన్నారు. ఈ వార్తను భార్యకు చెప్పి ఈ సందర్భంగా.. ఆయన అడిగిన ప్రశ్న.. ఆమె చెప్పిన సమాధానం.. ఆనంద్ మహీంద్ర : నేను కూడా ఇలాగ మూగ, చెవిటి వాడిలా నటించి నిన్ను మోసం చేస్తే? భార్య : నిజమా?.. నువ్వు నీ మొబైల్ ఫోన్లో ఓ ఐదు నిమిషాల పాటు మాట్లాడకుండా ఉండు చాలు.( అతడి ప్రశ్నకు వెనువెంటనే ఆమె ఇచ్చిన సమాధానం) దీంతో ఆనంద్ మహీంద్ర నోట్లో పచ్చివెలక్కాయ పడ్డటైంది. ‘‘తెలివైన భార్య ఉంటే ఇదే ప్రమాదం’’ అంటూ ఆశ్చర్యపోయారు. Laughed non-stop for 5 mins on reading this. Asked my wife if I could have fooled her like this. She didn’t waste even a few seconds in replying: She said “Really? Would you have lasted 5 mins without speaking into your cellphone?” Aah, the perils of having a smart wife! pic.twitter.com/msWJLbB1ZD — anand mahindra (@anandmahindra) April 28, 2019 -
మహీంద్రా సీఐఈ చేతికి ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్
న్యూఢిల్లీ: ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ కంపెనీని(ఏఈఎల్) వాహన విడిభాగాల సంస్థ, మహీంద్రా సీఐఈ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని మహీంద్రా సీఐఈ వెల్లడించింది. ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్‌లో మొత్తం వాటాను రూ.876 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అండెర్ అరెనాజ తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుతో తాము అల్యూమినియం డై కాస్టింగ్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశిస్తామని చెప్పారాయన. వచ్చే నెల 10లోపు ఈ డీల్ పూర్తవ్వగలదని అంచనా. కాగా, ఎమ్‌సీఐఈ, సీఐఈలతో భాగస్వామ్యం తమ కంపెనీకి మంచి జోరునిస్తుందని ఏఈఎల్ సీఎండీ రిషి బగ్లా చెప్పారు. 1985లో ప్రారంభమైన ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ కంపెనీ అల్యూమినియం డై–కాస్టింగ్ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి ఔరంగాబాద్, పుణే, పంత్‌నగర్‌లలో ఐదు ప్లాంట్లున్నాయి. వీటిలో మొత్తం 3,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్షిక విక్రయాలు రూ.850 కోట్ల మేర ఉన్నాయి. ఇక స్పెయిన్‌కు చెందిన సీఐఈ ఆటోమోటివ్‌లో భాగమైన మహీంద్రా సీఐఈలో మహీంద్రా గ్రూప్‌నకు 11.5 శాతం వాటా ఉంది. -
మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్లు !
న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్లు మంచి పరిష్కారమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని, దీని నుంచి గట్టెక్కేందుకు భారత్‌లో ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్లను అందించే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ గంటకు 25 కిమీ. దూరం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. మడవగలిగే వీలున్న ఛాసిస్, దీనిపై పొడవైన డెక్ ఉంటుందని, స్కూటర్ పయ్యల కంటే చిన్న సైజు పయ్యలతో ఉండే ఈ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్‌పై వ్యక్తి నిలబడి నడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నడపటానికి శిక్షణ అవసరమని, వీటిని దశలవారీగా ప్రవేశపెడతామని, తగిన శిక్షణను కూడా ఇస్తామని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ వివరించారు. -
రెండు రెట్లు పెరిగిన మహీంద్రా ఫైనాన్షియల్స్ లాభం
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.164 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.381 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం, ఇతర ఆదాయం కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,540 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 40 శాతం వృద్ధితో రూ.2,148 కోట్లకు పెరిగింది. 39 శాతం అప్... ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.21,194 కోట్ల రుణాలిచ్చామని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇచ్చిన రుణాలు(రూ.15,206 కోట్లు)తో పోల్చితే 39 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.47,213 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 26 శాతం వృద్ధితో రూ.59,473 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తమ మొత్తం ఖాతాదారుల సంఖ్య 56 లక్షలకు పెరిగిందని వివరించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో వినియోగదారులకు ఈ కంపెనీ ఆర్థిక సేవలను అందిస్తోంది. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లకు రుణాలను, చిన్ని, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు కూడా రుణాలందిస్తోంది. మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్, మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, మహీంద్రా ఫైనాన్స్... ఈ అనుబంధ సంస్థలతో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నికర లాభం రెండు రెట్లు పెరగడంతో బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ 7.5 శాతం లాభంతో రూ.401 వద్ద ముగిసింది. -
కార్పొరేట్లపై విశ్వాసానికి ఊతం..
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న పారిశ్రామికవేత్తలతో కలిసి తిరగడానికి తాను భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. వ్యాపారవర్గాలపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఇవి దోహదపడగలవని ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘ఒకానొక దురదృష్టకర పార్శ్వం కారణంగా పరిశ్రమపై విముఖత పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని వ్యాఖ్యలు విశ్వాసాన్ని పెంపొందించేవిగా ఉన్నాయి‘ అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇటు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తానని భరోసానిస్తూనే.. అటు దేశానికి, ఎకానమీకి హానిచేసే వ్యాపారవేత్తలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. పరిశ్రమపై ప్రజలకు దురభిప్రాయాలేవైనా ఉంటే వాటిని తొలగించేందుకు, ప్రైవేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా చెప్పారు. రైతులు, కార్మికులు, బ్యాంకర్లలాగే వ్యాపారవేత్తలు కూడా దేశాభివృద్ధికి తోడ్పడ్డారని, వారితో కలిసి కనిపించడానికి తానేమీ సంకోచించబోనని ఆదివారం లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. -
ఈవీ విధానంపై ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం
గుర్గావ్: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి ప్రత్యేక విధానమేదీ లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరికాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లో ఈ రంగం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందని, విధి విధానాల రూపకల్పన కూడా క్రమంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహీంద్రా–టెరి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఈ విషయాలు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించిందని, అయితే రెడీమేడ్‌గా సమగ్ర విధానమేదీ లేదంటూ కేంద్రాన్ని తప్పుపట్టలేమని ఆయన పేర్కొన్నారు. దీన్ని రూపొందించేందుకు ప్రైవేట్ రంగంతో కూడా సంప్రదింపులు జరుపుతోందని ఆనంద్ మహీంద్రా వివరించారు. 2030 నాటికి ప్రజా రవాణా వ్యవస్థలో పూర్తిగాను, ఇతరత్రా వ్యక్తిగత వాహనాలకు సంబంధించి కనీసం 40 శాతం మేర ఎలక్ట్రిక్ వాహనాల వినియోగ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలంటూ నీతి ఆయోగ్ గతేడాది అభిప్రాయపడింది. అయితే, ఇందుకు సంబంధించి కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల విధానమేదీ రూపొందించే యోచనేదీ లేదంటూ కేంద్రం ఫిబ్రవరిలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మహీంద్రా ‘ట్రాక్టర్ బాజీ’ ప్రారంభం
పాలమూరు: మహీంద్రా గ్రూపు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ల విక్రయంలోకి అధికారికంగా ప్రవేశించింది. దేశంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ‘ట్రాక్టర్ బాజీ’ పేరిట బుధవారం ఈ కేంద్రాన్ని ఎం అండ్ ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతో సాహా, జోనల్–1 హెడ్ విజయ్‌శర్మ, తెలంగాణ రీజినల్ మేనేజర్ మహావీర్ మాథూర్ ఆరంభించారు. పాత ట్రాక్టర్లకు మరమ్మత్తు చేసి టీఆర్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసి కొత్త ఆర్సీ ఇవ్వడంతో పాటు లబ్ధిదారుడికి ఏడాది వారంటీ ఇవ్వడం ఈ ‘ట్రాక్టర్ బాజీ’ ప్రత్యేకత. షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం సుబ్రతో సాహా, స్థానిక జయరామ ఆటోమొబైల్స్ ఎండీ బెక్కరి రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బయటి మార్కెట్ కంటే ఈ ఎక్సే్ఛంజ్ బజార్లో తక్కువ ధరలు ఉంటాయని, పాత ట్రాక్టర్‌ను పూర్తిగా 81 రకాల మరమ్మతులు చేసి కొత్త ట్రాక్టర్‌గా మార్పు చేసి విక్రయిస్తామని చెప్పారు. ‘‘ట్రాక్టర్ బాజీ వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. పాత ట్రాక్టర్ ఇచ్చి కొత్త ట్రాక్టర్ కొనే అవకాశంతో పాటు కేవలం ట్రాక్టర్‌ను విక్రయించటం కూడా చేయొచ్చు’’ అని తెలియజేశారు. -
‘షి దిపీపుల్.టీవీ’లో మహీంద్రా పెట్టుబడులు
ముంబై: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మహిళలకు సంబంధించిన డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్, ‘షి దిపీపుల్.టీవీ’లో పెట్టుబడులు పెట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ శైలి చోప్రా ప్రారంభించిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆనంద్ మహీంద్రా వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారన్నది వెల్లడి కాలేదు. వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళల గాధలను ఈ సంస్థ వీడియోల రూపం లో అందిస్తోంది. ‘‘రేపటి నాయకురాళ్లుగా ఎదిగే మహిళలకు ఈ సంస్థ తగిన స్ఫూర్తినందిస్తుందనే నమ్మకం కానుంది’’ అని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహీంద్రా పెట్టుబడులను భవిష్యత్ విస్తరణకు ఉపయోగిస్తామని శైలి చోప్రా చెప్పారు. ఈ సంస్థ ప్రొఫైల్‌లో ఇప్పటివరకూ 10వేల మందికి పైగా మహిళల విజయగాధలున్నాయి. ఈ కథలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో లభ్యమవుతాయి. -
మహీంద్రా మోజో @ రూ.1,69,600
హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ మహీంద్రా మోజో బైక్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ధర రూ.1,69,600(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్/వైజాగ్) అని మహీంద్రా టూవీలర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని, స్టైల్, పనితీరు, రైడింగ్ క్వాలిటీ వంటి విషయాల్లో ఈ బైక్ కొత్త ఒరవడిని సృష్టించిందని మహీంద్ర టూ వీలర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వినోద్ సహాయ్ పేర్కొన్నారు. ఈ బైక్ హైదరాబాద్‌లోని సిల్వర్ మోటార్స్, యువిఖ ఆటోమోటివ్స్, శ్రీ సూర్య వీల్స్ ప్రైవేట్, వైజాగ్‌లోని రామ్‌కార్తీక్ మోటార్స్‌ల వద్ద లభ్యమవుతుందని వివరించారు. మోజో ట్రైబ్ మొబెల్ యాప్ ద్వారా మోజో బైక్ వినియోగదారులు తమ రైడింగ్ అనుభవాలను షేర్, అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. మోజో బైక్‌లో డబుల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్ (డీఓహెచ్సీ) టెక్నాలజీతో కూడిన ఇంజిన్, రెండు పొగ గొట్టాలు, ఎలక్ట్రిక్ ఫ్యూయల్ ఇగ్నిషన్, ఇరిడియమ్ స్పార్క్ ప్లగ్, ట్విన్ పాడ్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
ఇక మహీంద్రా మ్యూచువల్ ఫండ్లు
3-4 నెలల్లో మార్కెట్లోకి.. ముంబై: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 3-4 నెలల్లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నది. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణ కోసం సెబీ ఆమోదం పొందిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నది. మహీంద్రా ఫైనాన్స్ ఈ మార్కెట్లలో పటిష్టంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ, చిన్న పట్టణాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీ తమదే కానున్నదని మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ అశుతోష్ బిష్ణోయ్ చెప్పారు. ఈక్విటీ, బ్యాలెన్స్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్, లిక్విడ్ కేటగిరిల్లో మ్యూచువల్ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తామన్నారు. -
5న ముంబైకి సత్య నాదెళ్ల
ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల నవంబర్ 5న ముంబైకి రానున్నారు. నాదెళ్ల ఆ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ హెడ్ శిఖా శర్మ, టాటా స్టార్‌బక్స్ సీఈవో అవని ద్వాదా వంటి తదితర పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వాములను, వినియోగదారులను, ప్రము ఖ ప్రభుత్వ అధికారులను కూడా కలవనున్నారు. అలాగే ఆయన ఇక్కడ జరగనున్న మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీష్డ్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు పరిశ్రమ సంబంధిత వ్యక్తులు, ఎంటర్ప్రైజెస్ హెడ్స్, డెవలపర్స్, ఎంట్రప్రెన్యూర్స్ హాజరవుతారు. -
మహీంద్రా 300 సీసీ బైక్.. మోజో
ధర రూ.1.58 లక్షలు దీపావళి తర్వాత 20,000-30,000 వరకూ పెంపు న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ 300 సీసీ బైక్, మోజోను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ బైక్ ధరను రూ.1.58 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపనీ పేర్కొంది. వివిధ వినూత్నమైన ఫీచర్లతో ఈ బైక్‌ను అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఇది ప్రారంభ ధర మాత్రమేనని, దీపావళి తర్వాత ధరను సవరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబై, పుణే, ఢిల్లీ, బెంగళూరు- ఈ నాలుగు నగరాల్లోనే ఈ బైక్‌ను విక్రయించనున్నామని, తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మోజో బైక్‌లో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇగ్నీషన్, ఇరిడీయమ్ స్పార్క్ ప్లగ్, రెసోనేటర్ ఫిట్టెట్ ఇన్‌టేక్ సిస్టమ్, రెండు ఎగ్జాస్లు వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. . 21 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉందని, ఈ కేటగిరీలో అతి పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న బైక్ ఇదేనని తెలిపారు. మోజోట్రైబ్ ఏర్పాటు.. మోజో యజమానులతో మోజోట్రైబ్ కమ్యూనిటీని ఏర్పాటు చేస్తున్నామని మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఫార్మ్ ఎక్విప్మెంట్, టూ వీలర్ డివిజన్) రాజేశ్ జుజురికర్ చెప్పారు. ఈ మోజో ట్రైబ్ సభ్యులు కలసిమెలసి లాంగ్ రైడ్స్‌ను నిర్వహించి ఆనందం పొందుతారని పేర్కొన్నారు. -
ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’
ముంబై: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి ఎం2ఆల్.కామ్ పేరిట పోర్టల్‌ను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన వాహనం మహీంద్రా టీయూవీ300కి సంబంధించిన ఆర్డర్లు దీని ద్వారా తీసుకోవడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ సీఎఫ్‌వో వీఎస్ పార్థసారథి తెలిపారు. -
అద్దె కార్లతో పరిశ్రమకు దెబ్బ!
కార్లు కొనకుండా.. అద్దెకు తీసుకోవటం పెరుగుతోంది - టీయూవీ 300 వాహనంతో మార్కెట్లో మళ్లీ జోష్ - రూ.1,500 కోట్ల పెట్టుబడులతో టీయూవీ 300 తయారీ - ఈ ఏడాది ముగింపులోగా విపణిలోకి మరో 4 వాహనాలు - మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చకాన్ (పుణే) నుంచి ఆడేపు శ్రీనాథ్ ‘‘ఉబర్, ఓలా, జూమ్‌కార్ వంటి అద్దె కార్ల కంపెనీలతో ఆటో పరిశ్రమ కుదేలవుతోంది. పోటీ పడుతూ కారు అద్దె ధరలను తగ్గిస్తుండటం, కిలోమీటర్లను బట్టి చార్జీలుండటం, నిర్వహణ వంటి సమస్యలూ లేకపోవటంతో అద్దె కార్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో లక్షలు వెచ్చించి కారును కొనడం బదులు అవసరాన్ని బట్టి అద్దెకు తీసుకోవటమే ఉత్తమమనే భావన ప్రజల్లో చొచ్చుకుపోయింది’’ ఈ మాటలన్నది ఎవరో కాదు! వాహన తయారీ దిగ్గజమైన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే... ప్రజల దృష్టిని వాహనాల కొనుగోలు వైపు మళ్లించాలని, అందుకోసం వారి అభిరుచులకు తగ్గ డిజైన్‌ను తీసుకురావాలని చెప్పారాయన. అందుకే తాము ఇటలీకి చెందిన పెనిన్ఫెరినా కారు డిజైన్ సంస్థతో కలిసి నాలుగేళ్లు శ్రమించి టీయూవీ (టఫ్ యుటిలిటీ వెహికల్) 300 వాహనాన్ని డిజైన్ చేశామని చెప్పారు. పుణెలోని చకాన్ ప్లాంట్‌లో టీయూవీ 300 వాహనాన్ని విడుదల చేసిన సందర్భంగా గురువారం ఎంఅండ్ఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయంకా, ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షాతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. టీయూవీ 300పై రూ.1,500 కోట్లు: టీయూవీ 300 వాహనం తయారీ, ప్రొడక్ట్ డిజైన్, డ్రైవ్ లైన్, ఏఎంటీల కోసం రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఇందులో రూ.1,200 కోట్లు మహీంద్రా సొంత పెట్టుబడులు కాగా... సంస్థకు విడిభాగాలు సరఫరా చేసే సప్లయర్లు మరో రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టారని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘‘చెన్నైలోని మహీంద్రా ఆర్అండ్డీ సెంటర్‌కు చెందిన 700 మంది ఇంజనీర్లు, పెనిన్ఫెరినా డిజైనర్లు కలిసి నాలుగేళ్లు శ్రమించి టీయూవీ 300 వాహనాన్ని డిజైన్ చేశారు. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర ్చయింది’’ అని తెలియజేశారు. మహీంద్రా యూవీ వాహనాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, టీయూవీ 300 వాహనాలను మన దేశంతో పాటు దక్షిణాఫ్రికాకూ ఎగుమతి చేస్తామని చెప్పారు. ‘‘చకాన్ ప్లాంట్‌కు నెలకు 5 వేల టీయూవీ 300 వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. డిమాండ్‌ను బట్టి దీన్ని విస్తరిస్తాం. రెండేళ్లలో మహీంద్రా నుంచి కొత్తగా మరో 9 వాహనాలు మార్కెట్లోకి వస్తాయి. ఈ ఏడాది ముగిసేలోగా మరో 4 వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తాం’’ అన్నారాయన. ప్రారంభ ధర రూ. 6.90 లక్షలు మహీంద్రా నుంచి ఏఎంటీ టెక్నాలజీతో తయారు చేసిన తొలి వాహనం ఇదేనని, నీలం, సిల్వర్, తెలుపు, ఎరుపు, నలుపు, ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో టీ4, టీ6, టీ8 వేరియంట్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ‘‘వీటి ప్రారంభ ధరలు రూ.6.90 లక్షల నుంచి 8.40 లక్షల వరకున్నాయి. ప్రస్తుతం డీజిల్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే పెట్రోల్ వర్షన్‌ను కూడా తెస్తాం’’ అన్నారు. టీయూవీ 300 మైలేజ్ 18.49 కిలోమీటర్లు. 5+2 సీటింగ్ సామర్థ్యం ఉంది. దేశంలో యుటిలిటీ వాహనాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని, గతేడాది 38 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 41 శాతానికి చేరిందని మహీంద్రా తెలియజేశారు. ‘‘దేశంలో నెలకు 55 వేల యూవీ వాహనాలు విక్రయమవుతుంటే.. ఇందులో 5-6 వేల వాహనాలు మా గ్రూప్‌వే. మా విక్రయాల్లో ఎగుమతుల వాటా 8 శాతం. మిగతా 4 వాహనాలు కూడా మార్కెట్లోకి వస్తే 15 శాతానికి చేరుకుంటాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. -
కేటీఆర్‌తో మహీంద్రా ప్రతినిధుల భేటీ
ఐటీ, మోటార్స్ రంగాల్లో కంపెనీలను విస్తరిస్తామన్న ప్రతినిధులు హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌కు చెందిన 6 కంపెనీల ప్రతినిధులు గురువారం పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ అయ్యారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ కంపెనీల విస్తరణకు సంబంధించి భేటీలో చర్చించారు. హైదరాబాద్‌లో చెత్త సేకరణకు జీహెచ్ఎంసీకి అవసరమైన వాహనాలను త్వరలో అందిస్తామన్నారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై తమ ప్రణాళికలు వివరించారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మహీంద్రా ప్లాంట్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలను ఇస్తామన్నారు. కాగా, ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మహీంద్రా కంపెనీ నుంచి తగు ప్రణాళికలు ఇవ్వాలని కేటీఆర్ ప్రతినిధులను కోరారు. అలాగే ఎరోస్పేస్, రక్షణ రంగాల్లో విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
వంట నూనెల వ్యాపారంలోకి మహీంద్రా
న్యూప్రో బ్రాండ్‌లో ఆవాల నూనె కోల్‌కత : మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ వంటనూనెల వ్యాపారంలోకి ప్రవేశించింది. గ్రూప్‌నకు చెందిన వ్యవసాయ వ్యాపార విభాగం న్యూప్రో బ్రాండ్ పేరుతో ఆవాల నూనెను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నూనెను ముందుగా కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చామని గ్రూప్ ఆగ్రి బిజనెస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ చెప్పారు. తర్వాత ఒడిశా, జార్ఖండ్‌ల్లో ప్రవేశపెడతామని వివరించారు. త్వరలోనే పాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసుల రిటైల్ సెగ్మెంట్లోకి అడుగిడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం పప్పు దినుసులను బీ2బీ చానళ్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపారు. త్వరలోనే సన్‌ఫ్లవర్, సోయా, రైస్ బ్రాండ్ తదితర ఇతర వంటనూనెల రకాలను అందిస్తామని చెప్పారు. గత నాలుగేళ్లలో తమ వ్యవసాయ-వ్యాపారం ఆదాయం రూ.70 కోట్ల నుంచి రూ.580 కోట్లకు పెరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
మహీంద్రా హెలికాప్టర్లు వస్తాయ్..
- ఎయిర్‌బస్‌తో జాయింట్‌వెంచర్ న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాలకు అవసరమయ్యే హెలికాప్టర్ల తయారీ కోసం మహీంద్రా గ్రూప్, యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ చేతులు కలిపాయి. ఎయిర్‌బస్ హెలికాప్టర్స్, మహీంద్రా డిఫెన్స్ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ సంస్థను నెలకొల్పనున్నాయి. మేకిన్ ఇండియా నినాదం కింద తొలి భారతీయ ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ సంస్థ స్వరూపాన్ని ఖరారు చేసేందుకు త్వరలో చర్చలు జరపనున్నట్లు ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ వెంచర్‌తో వందల కొద్దీ హై-టెక్ ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుందని, అత్యుత్తమ సాంకేతికతను భారత్‌లోకి తీసుకురావడం సాధ్యపడుతుందని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రెసిడెంట్ గిలామ్ ఫౌరీ పేర్కొన్నారు. దేశ రక్షణ అవసరాలను తీర్చడంతో పాటు ఈ హెలికాప్టర్లను ఎగుమతి కూడా చేసే అవకాశాలున్నాయని మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి ఎస్పీ శుక్లా చెప్పారు. -
పేటీఎంతో మహీంద్రా టూవీలర్స్ ఒప్పందం
సెంచురో, రొడియో యూజోలను ఆన్లైన్లో కొనొచ్చు న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్, మొబైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మహీంద్రా సెంచురో మోటార్ సైకిళ్లను, మహీంద్రా రొడియో యూజో రేంజ్ స్కూటర్లను ఆన్లైన్లో విక్రయించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని మహీంద్రా టూవీలర్స్ బుధవారం తెలియజేసింది. దీంతో వినియోగదారులు పేటీఎం ద్వారా కూడా ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు చేరువ కావడానికి ఇదొక వినూత్న మార్గమని మహీంద్రా టూవీలర్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) ధర్మేంద్ర మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పేటీఎంతో భాగస్వామ్యం కారణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో సహా ఇంటర్నెట్ ఉపయోగించే వారందరికీ మరింత చేరువవుతామని తెలియజేశారు. ఈ ఒప్పందం కారణంగా తమ ఆటోమోటివ్ విభాగానికి మరింత ఊపు వస్తుందని పేటీఎం జనరల్ మేనేజర్ అమిత్ బగారియా చెప్పారు. -
మహీంద్రా విమానాలు వస్తున్నాయ్...
మెల్బోర్న్: మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేసే విమానాలను భారత్‌లో విక్రయించడానికి ఆమోదం లభించింది. నిబంధనల్లో మార్పు కారణంగా తమ విమానాలకు ఆమోదం లభించిందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. మహీంద్రా జిప్స్ పేరుతో 5 నుంచి 10 సీట్లు ఉన్న ఈ విమానాలను మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేస్తోంది. భారత్‌లో నలుగురు ప్రయాణించే విమానాలకు మాత్రమే ప్రభుత్వ ఆమోదం ఉంది. దీంతో ఈ విమానాల విక్రయానికి ఆమోదం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. తాజాగా అంతర్జాతీయ ధ్రువీకరణ ప్రమాణాలకనుగుణంగా నిబంధనలను మార్చామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో మహీంద్రా విమానాలను భారత్‌లో విక్రయించడానికి ఆమోదం లభించింది. ప్రధాని పనితీరు భేష్ 2009లో మహీంద్రా కంపెనీ రెండు ఆస్ట్రేలియా విమాన సంస్థల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కోసం విమానాలు, సంబంధిత విడి భాగాలు తయారు చేసి విక్రయించే యోచనలో భాగంగా మహీంద్రా కంపెనీ ఈ రెండు సంస్థల్లో ఒక్కో దాంట్లో 75 శాతం వాటాను రూ.175 కోట్లకు కొనుగోలు చేసింది. వీటి ద్వారా విమానాలు తయారు చేసి కాలిఫోర్నియాలో విక్రయిస్తున్నామని ఆనంద్ మహీంద్రా చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారానికి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా సందర్శిస్తున్న సీఈఓ ప్రతినిధి బృందంలో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. నరేంద్ర మోదీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, అడ్డంకులు తొలగిస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైతే, భారీ స్థాయిలో ముడి పదార్ధాలు అవసరమవుతాయని ఆస్ట్రేలియాతో వ్యాపార అవకాశాలు అపారంగా పెరుగుతాయని పేర్కొన్నారు. -
వడ్డీ రేట్ల కోతకు సరైన సమయమిదే
న్యూఢిల్లీ: దేశీ ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంపై దృష్టి పెట్టేందుకు ఇది సరైన సమయమని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ అవకాశాన్ని చేజారనివ్వకూడదని, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మహీంద్రా ఈ విషయాలు చెప్పారు. ధరల కట్టడి కోసం ఆర్బీఐ గవర్నర్ ఇప్పటిదాకా భేషైన చర్యలే తీసుకున్నారని మహీంద్రా కితాబిచ్చారు. ‘నియంతలాగా కొరడా ఝుళిపించి మరీ ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేగలిగే వ్యక్తి అవసరం నెలకొందన్న విషయాన్ని ఎవరూ విస్మరించరాదు. ఆ పనిని ఆయన అద్భుతంగా నిర్వర్తించారు. ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి ప్రపంచానికి ఆయన సానుకూల సంకేతాలు పంపారు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారినందున ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించేందుకు విభిన్నమైన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని మహీంద్రా చెప్పారు. మరోవైపు మళ్లీ రెండంకెల స్థాయి వృద్ధి సాధించే విషయంపై స్పందిస్తూ.. రాత్రికి రాత్రి అద్భుతాలను ఆశించకూడదన్నారు. సరైన పనులు చేస్తూ, సరైన స్థాయిలో సంస్కరణలతో పాటు వడ్డీ రేట్ల తగ్గుదల వంటి అంశాలు తోడైతే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి వృద్ధి మరింత మెరుగుపడగ లిగే సంకేతాలు కనిపించగలవని మహీంద్రా చెప్పారు. రేటు తగ్గించినా పెట్టుబడులకు ఊతం ఉండదు: క్రిసిల్ ఇటీవలి ఎకానమీ మందగమనానికి, అధిక వడ్డీ రేట్లకు సంబంధమేమీ లేదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. విధానపరమైన అనిశ్చితి, దేశీయంగా డిమాండ్ అంతంత మాత్రంగా ఉండటమే ఎకానమీ మందగమనానికి కారణమని వివరించింది. ప్రస్తుతం రెపో రేటును ఆర్బీఐ తగ్గించినా పెట్టుబడులకు పెద్దగా ఊతం ఇవ్వకపోవచ్చని తెలిపింది. వడ్డీ రేట్లను తగ్గించాలంటూ పారిశ్రామిక దిగ్గజాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో క్రిసిల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్టుబడులపై అధిక రాబడులు వచ్చే విధంగా ప్రభుత్వం విధానపరంగా పరిస్థితులను మెరుగుపరిస్తే ప్రయోజనం ఉండగలదని క్రిసిల్ తెలిపింది. -
మహీంద్రా ఎలక్ట్రిక్ కారులో ప్రీమియం వెర్షన్
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ చిన్న కారు ఈ2ఓలో ప్రీమియం వేరియంట్‌ను గురువారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.5.72 లక్షలు(ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ) అని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. ఇంధన చార్జీలు నెలకు రూ.2,999 చొప్పున ఐదేళ్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ చార్జీలతో ఐదేళ్లలో ఈ కారు యజమాని 50,000 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ కారులో ఎలక్ట్రిక పవర్ స్టీరింగ్ ఉందని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఈ కారులో ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, రియర్ కెమెరా, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఈ కారును స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చని, బ్యాటరీ లెవల్స్, ఏసీ సిస్టమ్, దగ్గర్లోని చార్జింగ్ స్టేషన్లు తదితర సమాచారాన్ని పొందవచ్చని వివరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేల్లో ఇప్పటికే 300కు పైగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది చివరికల్లా మరో వంద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
మహీంద్రా నుంచి కొత్త ట్రాక్టర్
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెంటర్(ఎఫ్ఈఎస్) కంపెనీ కొత్త ట్రాక్టర్, అర్జున్ నోవో 605ను బుధవారం ఆవిష్కరించింది. ప్రస్తుత ం మార్కెట్లో ఉన్న అర్జున్ 605 డీఐ మోడల్ స్థానంలో ఈ అర్జున్ నోవోను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ ట్రాక్టర్‌ను చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా, కంపెనీ వ్యవసాయ యంత్రాల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ జెజుల్కర్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఎంఆర్వీ తొలి ఉత్పాదన ఇక్కడి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ(ఎంఆర్వీ)లోనే ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశామని పవన్ గోయెంకా పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ వ్యాలీ నుంచి వస్తున్న తొలి ఉత్పాదన ఇదని వివరించారు. ఈ ట్రాక్టర్‌ను రెండు వేరియంట్లలో -52 హెచ్‌పీ-605 డిఐ-పీఎస్(ధర రూ.7.15 లక్షలు) 57 హెచ్‌పీ -605 డిఐ(ధర రూ.7.35 లక్షలు. రెండు ధరలు ఎక్స్ షోరూమ్, పుణే)ల్లో అందిస్తున్నామని వివరించారు. ఇంతకు ముందటి అర్జున్ ట్రాక్టర్‌తో పోల్చితే ధర రూ.15,000 అధికమని వివరించారు. ఓపెన్ స్టేషన్, ఏసీ క్యాబిన్(57 హెచ్‌పీ ట్రాక్టర్ ధర రూ.9.5 లక్షలు) ఆప్షన్లలలో ఈ రెండు వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త అర్జున్ ట్రాక్టర్ ఎక్కువ మైలేజీని ఇస్తుందని, 2,200 కేజీల బరువును ఎత్తగలిగే ప్రెసిషన్ హైడ్రాలిక్స్, అత్యాధునిక 15 ఎఫ్ ప్లస్ 3 ఆర్ ట్రాన్సిమిషన్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత పట్ల అవగాహన ఉన్న రైతు మొదటి ఎంపిక ఈ ట్రాక్టరే అవుతుందని వివరించారు. ఈ ట్రాక్టర్‌ను వ్యవసాయ పనుల్లో 40 రకాల అవసరాల కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ అర్జున్ నోవో ట్రాక్టర్‌ను అభివృద్ధి చేయడానికి రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టామని, మరిన్ని వేరియంట్ల పరిశోధన కోసం మరో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ట్రాక్టర్లను నాగ్‌పూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నామని, ఆర్నెల్లలో ఈ ట్రాక్టర్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు. భవిష్యత్ కొత్త మోడల్ తెలంగాణ ప్లాంట్ నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో 10 రోజుల్లో ఈ ట్రాక్టర్ల విక్రయాలు ప్రారంభిస్తామని పవన్ గోయోంకా తెలిపారు. కంపెనీ మొత్తం ట్రాక్టర్ల విక్రయాల్లో ఏపీ, తెలంగాణ వాటా 8-10 శాతమని చెప్పారు. జహీరాబాద్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకు ఒక షిఫ్ట్‌లో వంద ట్రాక్టర్లను (తక్కువ హార్స్ పవర్ ఉన్నవి)ఉత్పత్తి చేస్తున్నామని, అవసరాన్ని బట్టి రెండో షిఫ్ట్‌ను కూడా ప్రారంభిస్తామని వివరించారు. భవిష్యత్‌లో తాము అందించే కొత్త ట్రాక్టర్ మోడల్ జహీరా బాద్ ప్లాంట్ నుంచే ఉంటుందని పవన్ గోయెంకా చెప్పారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలు లేవని రాజేష్ జుజుల్కర్ పేర్కొన్నారు. -
దమ్ముకు ప్రత్యేకం మహీంద్రా 575 ట్రాక్టర్
హైదరాబాద్: వ్యవసాయ పనులకు వినియోగపడే 575 మోడల్ ట్రాక్టర్‌ను రాష్ట్ర మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. దమ్ము నిర్వహణ తదితర వ్యవసాయ పనులకు అత్యంత అనువైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించినట్లు పేర్కొంది. రాష్ట్ర మార్కెట్ కోసం 45 హెచ్‌పీ విభాగంలో పవర్ స్టీరింగ్‌తో ఈ ట్రాక్టర్‌ను విడుదల చేసినట్లు వివరించింది. రైతుల కోసం మెరుగైన ఇంధన సామర్థ్యంతోపాటు, అడ్వాన్స్డ్ హైడ్రాలిక్స్‌తో అత్యంత సౌకర్యవంతంగా ఈ ట్రాక్టర్‌ను రూపొందించినట్లు తెలిపింది. -
మహిళలు.. మధ్యలోనే కెరీర్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలను మధ్యలోనే వదిలేస్తున్నారని నిపుణులంటున్నారు. పనిచేసే చోట లింగ వివక్షకు తావులేదంటూ ప్రచారం హోరెత్తిపోతున్నప్పటికీ, 60 శాతం మంది మహిళలు మధ్యలోనే తమ కెరీర్‌కు మంగళం పాడేస్తున్నారని వారంటున్నారు. మహీంద్రా గ్రూప్‌కు చెందిన బ్రిజిల్‌కోన్, గ్లోబల్ హంట్, పీడబ్ల్యూసీ ఇండియా, తదితర సంస్థల నిపుణుల అభిప్రాయాల ప్రకారం... చాలా కంపెనీలు ఎంట్రీ లెవల్లో మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకొని, వారికి తగిన శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఈ విషయంలో అవి వంద శాతం విజయం సాధిస్తున్నాయి. అయితే సమస్య అంతా వారు మధ్య స్థాయి నిర్వహణ ఉద్యోగాల్లోకి వచ్చేటప్పటికి ఉత్పన్నమవుతోంది. ఈ స్థాయికి వచ్చేటప్పటికి చాలా మంది మహిళలకు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. మరో వైపు కంపెనీల్లో మరింతగా ఎదగటానికి తగిన తోడ్పాటు లభించడం లేదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళ, పురుష ఉద్యోగులకు సమాన అవకాశాలు ఇవ్వడం, లింగ వివక్షతకు తావులేని విధానాలు అనుసరించడం తదితర చర్యల ద్వారా ఈ సమస్య నుంచి కొంత వరకూ గట్టెక్కవచ్చు. అయితే మహిళలకు సాధికారత కల్పించడం సమాజానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విషయంలో టాటా స్టీల్ తేజస్విని పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద గతంలో పురుషులకే పరిమితమైన ఉద్యోగాలకు మహిళలను తీసుకొని, వారికి తగిన శిక్షణనిస్తోంది. -
సామాజిక బాధ్యతగా ఎంఈసీ
ప్రపంచస్థాయి బోధన, వసతులతో ‘మహీంద్ర’కళాశాల పూర్తిగా పరిశ్రమలతో అనుసంధానం... విద్యార్థికి ఏటా ఇంటర్న్‌షిప్ ‘సాక్షి’తో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్ సాక్షి, హైదరాబాద్: దేశ పారిశ్రామికరంగంపై తనదైన ముద్రవేసిన మహీంద్ర గ్రూప్ ఇప్పుడు సమాజానికి తనవంతు చేయూతగా విద్యారంగంలోకి అడుగుపెట్టిందని మహీంద్ర ఎకోల్ సెంట్రల్(ఎంఈసీ) బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్ పేర్కొన్నారు. ఎంఈసీ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా నేచురల్ సెన్సైస్‌పై ప్రధానంగా దృష్టిపెడుతూ అంతర్జాతీయ బోధన ప్రమాణాలు, మౌలిక వసతులతో నిపుణులైన ఇంజనీర్లను తయారుచేయనున్నట్లు తెలిపారు. ఎంఈసీ ఏర్పాటు లక్ష్యాలపై ఆయన సాక్షితో మాట్లాడారు. సాక్షి: రాష్ట్రంలో ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్, ట్రిపుల్‌ఐటీలు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఈసీ అవసరమేంటి? రాహుల్: సామాజిక బాధ్యతగా మహీంద్ర గ్రూప్ ఈ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత విద్యావిధానం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా లేదు. ఆ అవసరాలను తీర్చడానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థను నెలకొల్పే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: ఎంఈసీ ఇతర విద్యాసంస్థలకు ఏవిధంగా భిన్నం? రాహుల్: ఐఐటీలు సహా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ 40 ఏళ్ల నాటి కరికులమ్‌తో బోధిస్తున్నాయి. ఆ కరికులమ్ ఉత్పత్తిరంగానికి ఉద్దేశించినది. కానీ ఇప్పుడు ఉత్పత్తిరంగ వాటా కేవలం 18 శాతమే. అందుకే యూరప్ విద్యావిధానంలో 200 ఏళ్ల అనుభవమున్న ఎకోల్ సెంట్రల్, జేఎన్టీయూహెచ్లతో ఒప్పందం చేసుకుని ఐదేళ్ల ఎంటెక్ డిగ్రీ కోర్సు కోసం అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక అవసరాలను తీర్చగలిగే కరికులం రూపొందించాం. సాక్షి: ప్రస్తుత కరికులంతో ఉపయోగం లేదా? రాహుల్: అది పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లేదు. ఆత్మవిశ్వాసం, భాష, టీంవర్క్, ప్రాజెక్టు రూపకల్పన నైపుణ్యాలు లోపించాయి. మా ఐదేళ్ల కోర్సులో ఫ్రెంచ్ భాష కూడా నే ర్పిస్తాం. తొలి రెండున్నరేళ్లు నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్ బోధిస్తాం. ఆ తర్వాతే స్పెషలైజేషన్ బోధనలు ఉంటాయి. సాక్షి: ఎంఈసీలో మౌలిక వసతులు ఎలా ఉంటాయి? రాహుల్: ఎంఈసీది సమీకృత అనుసంధానిత వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడినుంచైనా ముఖాముఖిగా బోధనలు వినే, పారిశ్రామిక నిపుణులతో మాట్లాడే సదుపాయాలు ఉన్నాయి. పరిశోధనలు లక్ష్యంగా ఎనర్జీ, ఇన్ఫ్రా, మెటీరియల్ సైన్స్, డిఫెన్స్, కంప్యూటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాలకు సంబంధించి ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. సాక్షి: ఎలాంటి బోధన వసతులు ఉంటాయి? రాహుల్: పరిశోధనల ప్రాతిపదికగా బోధనలు ఉంటాయి. అధ్యాపకులు వారి సమయంలో సగాన్ని పరిశోధనలకే కేటాయిస్తారు. వారిలో 40 శాతం మంది విదేశీ ప్రొఫెసర్లే. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి 1:10గా ఉంటుంది. సాక్షి: విద్యార్థులకు మీ సంస్థలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? రాహుల్: ఇక్కడే చదివే విద్యార్థులకు విదేశాల్లో 6 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. దీనివల్ల అంతర్జాతీయ పనితీరుపై అవగాహన వస్తుంది. దీనికితోడు విద్యార్థి ఐదేళ్లపాటు ప్రతి ఏటా ఇంటర్న్‌షిప్ చేయాలి. హైదరాబాద్‌లో మహీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రాన్స్ వర్సిటీ ఎకోల్ సెంట్రల్తో భాగస్వామ్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీ, బిట్స్ వంటి విద్యాసంస్థల సరసన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చేరబోతోంది. ట్రాక్టర్లు, కార్లు, రవాణా వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన మహీంద్ర గ్రూప్ హైదరాబాద్‌లో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ) ఇంజనీరింగ్ కాలేజీని స్థాపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఎకోల్ సెంట్రల్ భాగస్వామ్యంతో బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర క్యాంపస్ (గతంలో సత్యం క్యాంపస్)లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల వ్యయంతో నెలకొల్పుతోంది. ఇప్పటికే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల సమీకృత ఎంటెక్ కోర్సును అందించేందుకు జేఎన్టీయూహెచ్తో ఒప్పం దం చేసుకుంది. వచ్చే ఏడాదే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ-మెయిన్ ర్యాంకుల ఆధారంగా కాలేజీ సీట్లు భర్తీ చేయనున్నారు. తొలి ఏడాది 300 సీట్లు, రెండో ఏడాది 360 సీట్లు, మూడో ఏడాది 420 సీట్లు భర్తీచేయనున్నారు. తొలి ఏడాది సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్న తరుణంలో విద్యాసంస్థలకు పారిశ్రామిక అనుసంధానమనే ఆలోచనలతో మహీంద్ర గ్రూప్ ఎంఈసీని ఏర్పాటు చేస్తోంది. -
మహీంద్రా... బ్రాండెడ్ పండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుమారు రెండు లక్షల కోట్ల విలువైన దేశీయ పండ్ల మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రవేశించింది. ఇందులో భాగంగా ‘సబొరో’ బ్రాండ్ పేరు మీద యాపిల్ పండ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘సబొరో’ బ్రాండ్‌ను జాతీయ స్థాయిలో లాంఛనంగా ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే బ్రాండెడ్ పండ్లకు హైదరాబాద్ పెద్ద మార్కెట్ కావడంతో ‘సబొరో’ బ్రాండ్‌ను ఇక్కడ ప్రారంభించినట్లు ఎం అండ్ ఎం అగ్రి, అల్లైడ్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు. బ్రాండెడ్ పండ్లను పరిచయం చేసిన తొలి దేశీయ కంపెనీగా ఎంఅండ్ఎం రికార్డులకు ఎక్కిందనివచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సొంతంగా ఔట్లెట్లను ఏర్పాటు చేయడం లేదని, వివిధ రిటైల్ సంస్థల ద్వారా ఈ బ్రాండ్‌ను విక్రయించనున్నట్లు అశోక్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో 200 రిటైల్ ఔట్లెట్లలో సొబొరో బ్రాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం హెరిటేజ్ ఫ్రెష్, గోద్రేజ్ నేచుర్స్ బాస్కెట్ వంటి రిటైల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరికొన్ని రిటైల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు అశోక్ వివరించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కింద యాపిల్‌ను మాత్రమే పరిచయం చేశామని, ఇక ధరల విషయానికి వస్తే దిగుమతి చేసుకున్న యాపిల్ ధరల కంటే 20 శాతం తక్కువగాను, దేశీయంగా అందుబాటులో ఉండే యాపిల్ కంటే 10 నుంచి 15 శాతం ధర అధికంగా ఉంటాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎగుమతి చేస్తున్న ద్రాక్ష పండ్లను ఈ సీజన్ మొదలు కాగానే దేశీయంగా కూడా విక్రయించనున్నట్లు తెలిపారు. గతేడాది రూ.65 కోట్ల ద్రాక్ష ఎగుమతులు చేయగా, ఈ ఏడాది రూ.90 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో దేశీయ అరటి పండ్లను, సిట్రస్, పీర్స్ వంటి విదేశీ పండ్లను పరిచయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటి వరకు రూ.20 కోట్లు వెచ్చించామని, భవిష్యత్తు విస్తరణ కోసం రూ.40 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సేకరించిన యాపిల్ పండ్లను హైదరాబాద్ శీతల గిడ్డంగుల్లో భద్రపర్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు అశోక్ వివరించారు. పులివెందుల రైతులతో చర్చలు రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను సేకరించడానికి వివిధ రాష్ట్రాల్లోన్ని రైతులతో కాంట్రాక్టింగ్ వ్యవసాయ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎం అండ్ ఎం శుభ్లాభా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ పురి తెలిపారు. రాష్ట్రంలో ద్రాక్షకు సంబంధించి 10 మంది రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అరటికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో పండించే కావిండిష్ రకం అరటి పండుకు మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించి అక్కడి రైతులతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. దీని తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రాంత రైతులపై దృష్టి పెట్టనున్నట్లు విక్రమ్ తెలిపారు. -
రెండేళ్లలో దేశీయ చిన్న విమానం రెడీ
బెంగళూరు: దేశీయంగా తమ తొలి 8 సీట్ల చిన్న విమానాన్ని మహీంద్రా ఏరోస్పేస్ మరో రెండేళ్లలో తయారు చేయనుంది. నూతన ప్లాంటు ప్రారంభం సందర్భంగా మహీంద్రా సిస్టెక్ ప్రెసిడెంట్ హేమంత్ లూథ్రా ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం తమ ఆస్ట్రేలియా కంపెనీలైన ఏరోస్టాఫ్, గ్రిప్స్ఏరోల్లో ఈ తరహా జీఏ8 యుటిలిటీ విమానాలను తయారు చేస్తున్నట్లు లూథ్రా వివరించారు. ఆస్ట్రేలియా నుంచి ఇప్పటిదాకా 250 దాకా విమానాలను ఎగుమతి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 18 మంది ప్రయాణికులకు సరిపడే జీఏ18 విమాన తయారీపై కసరత్తు చేస్తున్నట్లు లూథ్రా తెలిపారు. ప్రతిపాదిత ఎయిట్సీటర్ జీఏ8 విమానం సుమారు 1,100 కి.మీ. దూరం ప్రయాణించగలుగుతుంది. చిన్న పట్టణాలు, నగరాలను అనుసంధానించేందుకు ఈ విమానాలు అనువుగా ఉండనున్నాయి. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రధానంగా రోడ్డు లేదా రైల్వే మార్గాల మీదే ఆధారపడే దేశీ టూరిస్టులకు ఇవి ఉపయోగకరంగా ఉండగలవని లూథ్రా పేర్కొన్నారు. మహీంద్రా సిస్టెక్లో మహీంద్రా ఏరోస్పేస్ భాగం. మహీంద్రా ఏరోస్పేస్ ప్లాంటును రూ. 150 కోట్లతో ఏర్పాటు చేయగా, 400 మందికి ఉపాధి లభించనుంది. కంపెనీకి ఇది సుమారు రూ. 250 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించి పెట్టగలదని అంచనా. Mahindra Systech మరోవైపు, ఈ ప్లాంటు దేశీయ ప్రైవేట్ రంగంలోనే తొలి ఏరోస్ట్రక్చర్ కేంద్రమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. తాము తయారు చేసే విమానాలు కఠినమైన ప్రాంతాల్లోనూ లాండింగ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. చిన్న విమానాలకు దేశీయంగా మంచి డిమాండ్ ఉండగలదని, ఈ నేపథ్యంలో విమానాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. విమాన రంగంలో వినియోగదారు హోదా నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తిదారుగా భారత్ ఎదిగే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని నిర్దేశించుకున్నట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు. ప్రస్తుతం భారత్ పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్, బోయింగ్‌ల నుంచి.. 70-80 సీటర్లను ఎంబ్రేయర్, బొంబార్డియర్ వంటి సంస్థల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చిన్న చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు వివిధ విదేశీ సంస్థల నుంచి దిగుమతి అవుతున్నాయి. -
విద్యారంగంలోకి మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా విద్యా రంగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఇకోల్ సెంట్రల్ (ఎంఈసీ) పేరిట ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఫ్రాన్స్‌కి చెందిన ఇకోల్ సెంట్రల్ ప్యారిస్, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)తో కలిపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఈ కళాశాలను నిర్వహిస్తుంది. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ విద్యకు మాత్రమే పరిమితం కాకుండా మేనేజ్మెంట్ నైపుణ్యాలు కూడా అలవర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ లీడర్లుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణను కల్పించేందుకు ఎంఈసీని ఏర్పాటు చేసినట్లు టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. 2014 నుంచి తరగతులు మొదలవుతాయని, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును అందించనున్నామని వివరించారు. నాలుగేళ్లకు బీటెక్, అయిదో ఏట ఎంటెక్ పట్టా పొందవచ్చన్నారు. ప్రారంభంలో 300 మంది విద్యార్థులను చేర్చుకుంటామని, క్రమంగా ఈ సంఖ్య 2,500కి పెరగగలదని మహీంద్రా ఇకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు సీపీ గుర్నాణీ చెప్పారు. ఐఐటీ ఎంట్రన్స్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఫీజు వివరాలపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తర్వాత దశల్లో చెన్నై, జైపూర్, పుణె, గోవా తదితర ప్రాంతాల్లో అనుబంధ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.