న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ యాక్టిస్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2,200 కోట్ల ముందస్తు పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ కేంద్రాలను ఇరు సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తాయి.
ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌లో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్‌కు 26–40 శాతం వాటా, మిగిలినది యాక్టిస్, అనుబంధ కంపెనీలు సొంతం చేసుకుంటాయి. మహీంద్రా వరల్డ్ సిటీస్‌లో 100 ఎకరాల వరకు ఇందుకోసం కేటాయిస్తారు. కొత్త కేంద్రాల స్థాపనతోపాటు ఇప్పటికే ఉన్న ఫెసిలిటీలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థలు నిర్ణయించాయి.
బహుళజాతి, భారతీయ క్లయింట్ల నుండి గ్రేడ్–ఏ గిడ్డంగులు, తయారీ సౌకర్యాల కోసం బలమైన, వేగవంతమైన డిమాండ్‌ను చూస్తున్నామని మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఎండీ అరవింద్ సుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు. చెన్నై, జైపూర్‌లో ఇటువంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment