‘షి దిపీపుల్.టీవీ’లో మహీంద్రా పెట్టుబడులు | Anand Mahindra invests in women's platform SheThePeople.TV | Sakshi
Sakshi News home page

‘షి దిపీపుల్.టీవీ’లో మహీంద్రా పెట్టుబడులు

Published Tue, May 24 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

‘షి దిపీపుల్.టీవీ’లో మహీంద్రా పెట్టుబడులు

‘షి దిపీపుల్.టీవీ’లో మహీంద్రా పెట్టుబడులు

ముంబై: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మహిళలకు సంబంధించిన డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్, ‘షి దిపీపుల్.టీవీ’లో పెట్టుబడులు పెట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ శైలి చోప్రా ప్రారంభించిన ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆనంద్ మహీంద్రా వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారన్నది వెల్లడి కాలేదు. వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళల గాధలను ఈ సంస్థ వీడియోల రూపం లో అందిస్తోంది.

‘‘రేపటి నాయకురాళ్లుగా ఎదిగే మహిళలకు ఈ సంస్థ తగిన స్ఫూర్తినందిస్తుందనే నమ్మకం కానుంది’’ అని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహీంద్రా పెట్టుబడులను భవిష్యత్ విస్తరణకు ఉపయోగిస్తామని శైలి చోప్రా చెప్పారు. ఈ సంస్థ ప్రొఫైల్‌లో ఇప్పటివరకూ 10వేల మందికి పైగా మహిళల విజయగాధలున్నాయి. ఈ కథలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో లభ్యమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement