‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్‌ మహీంద్రా భావోద్వేగం! | If Scorpio Has Failed The Board Would Have Fired Me Said Anand Mahindra | Sakshi
Sakshi News home page

స్కార్పియో విఫలమై ఉంటే.. ఆనంద్‌ మహీంద్రా భావోద్వేగం!

Published Sun, Jul 2 2023 8:02 PM | Last Updated on Mon, Jul 3 2023 7:38 AM

If Scorpio Has Failed The Board Would Have Fired Me Said Anand Mahindra - Sakshi

Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియోపై మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 2002లో విడుదలైన స్కార్పియోకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆ వెహికల్‌ ఫ్లాప్ అయి ఉంటే బోర్డు నన్ను తొలగించేది. స్కార్పియో నమ్మకమైన యుద్ధ గుర్రం. అది ఎల్లప్పుడూ నా వెంటే ఉంటుంది. స్కార్పియో విఫలమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  

మహీంద్రా సంస్థ 2002లో స్కార్పియోని విడుదల చేసింది. స్కార్పియో రాకతో మహీంద్ర దశ మారింది. ఇండియన్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో తిరుగులేని సంస్థ పేరు ప్రఖ్యాతలు గడించింది. తాజాగా, ఆ వెహికల్‌ 9 లక్షల అమ్మకాల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా ఆటోమొబైల్‌ ఎడిటోరియల్‌ సంస్థ  ఆటోకార్‌ ఇండియా ఎడిటర్‌ హోర్మజ్డ్ సోరాబ్జీ స్కార్పియో విక్రయాలపై ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీట్‌లో  2002లో మార్కెట్‌లో విడుదలైన స్కార్పియో మహీంద్రా బ్రాండ్‌ వ్యాల్యూను మార్చేసింది. ఏకంగా ఇప్పుడు 9లక్షల యూనిట్ల అమ్మకాల్ని సాధించింది. మిలియన్ మార్క్‌కు చేరువలో ఉందని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు మహీంద్రా స్పందించారు. 

ప్రోటోటైప్ ప్యూను రోడ్ టెస్ట్ చేయడానికి మేము నాసిక్‌లో ఎలా ఉన్నామో మీరు మర్చిపోలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా నుంచి చాలా దూరం ప్రయాణించాం. ఈ ప్రయాణంలో ఈ నమ్మకమైన యుద్ధ గుర్రం (స్కార్పియో) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. మాతో యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ అది విఫలమై ఉంటే బోర్డు నన్ను నుంచి తొలగించేది. అందుకని స్కార‍్పియోకు జీవితాంతం రుణపడి ఉంటానని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

చదవండి : ‘భారతీయులకు అంత సీన్‌లేదన్నాడు..రిషి సునాక్‌ చేసి చూపించారు..’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement