మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: సైనిక శక్తి, రాజకీయ సుస్థిరత, బలమైన ప్రజాస్వామ్యం తదితర అంశాల దన్నుతో అంతర్జాతీయంగా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని, మరింతగా ఎదిగే సత్తా దేశానికి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అనిశ్చితులను.. భారత్ అవకాశాలుగా మల్చుకోవచ్చని మహీంద్రా చెప్పారు.
ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగంగా మారొచ్చని నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు ఇచి్చన సందేశంలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగా ఉంటుందని మహీంద్రా తెలిపారు.
తమ గ్రూప్ అధిగమించిన కీలక మైలురాళ్లను ప్రస్తావిస్తూ .. అత్యంత విలువైన వాహనాల తయారీ దిగ్గజంగా ప్రపంచంలోనే 11వ స్థానానికి చేరడం, ఎలక్ట్రిక్ వాహనాలు అంచనాలకు మించి విజయవంతం కావడం గర్వించతగ్గ విషయాలని ఆయన పేర్కొన్నారు. గ్రూప్‌లోని ఇతర కంపెనీల పనితీరును కూడా ప్రశంసించారు. ఆకాంక్షలను సాకారం చేసుకోగలమనే స్ఫూర్తితో భవిష్యత్తుపై ఆశావహంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment