stability
-
పటిష్ట స్థితిలో భారత్..
న్యూఢిల్లీ: సైనిక శక్తి, రాజకీయ సుస్థిరత, బలమైన ప్రజాస్వామ్యం తదితర అంశాల దన్నుతో అంతర్జాతీయంగా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని, మరింతగా ఎదిగే సత్తా దేశానికి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అనిశ్చితులను.. భారత్ అవకాశాలుగా మల్చుకోవచ్చని మహీంద్రా చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగంగా మారొచ్చని నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు ఇచి్చన సందేశంలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువగా ఉంటుందని మహీంద్రా తెలిపారు. తమ గ్రూప్ అధిగమించిన కీలక మైలురాళ్లను ప్రస్తావిస్తూ .. అత్యంత విలువైన వాహనాల తయారీ దిగ్గజంగా ప్రపంచంలోనే 11వ స్థానానికి చేరడం, ఎలక్ట్రిక్ వాహనాలు అంచనాలకు మించి విజయవంతం కావడం గర్వించతగ్గ విషయాలని ఆయన పేర్కొన్నారు. గ్రూప్‌లోని ఇతర కంపెనీల పనితీరును కూడా ప్రశంసించారు. ఆకాంక్షలను సాకారం చేసుకోగలమనే స్ఫూర్తితో భవిష్యత్తుపై ఆశావహంగా ఉండాలని సూచించారు. -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్‌ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్‌కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్‌పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్‌పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
స్థిరత్వం లేని ట్రంప్‌ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
శామ్కో నుంచి డైనమిక్ అస్సెట్ ఫండ్
ముంబై: శామ్కో అస్సెట్ మేనేజ్మెంట్ ‘డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్’ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు, మార్కెట్ల కరెక్షన్లలో రక్షణ ప్రయోజనాలతో ఈ పథకం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లలో మరీ ప్రతికూల పరిస్థితులు కనిపించిన సందర్భాల్లో పెట్టుబడులను పూర్తిగా డెట్‌లోకి మార్చడం ఈ పథకం విధానంలో భాగంగా ఉంటుంది. పెట్టుబడులు అన్నింటినీ డెట్‌కు మార్చే తొలి డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా మారినప్పుడు అవసరమైతే నూరు శాతం పెట్టుబడులను అందులోకి మళ్లించగలదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీల మధ్య పెట్టుబడులను మారుస్తూ, రిస్క్ తగ్గించి, మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. డిసెంబర్ 7 నుంచి 21వ తేదీ వరకు ఈ నూతన పథకం (ఎన్ఎఫ్వో) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి
బీజింగ్: భారత్–చైనా సరిహద్దులో ప్రస్తుతం సాధారణ స్థిరత్వం నెలకొని ఉందని చైనా విదేశాంగ మంత్రి జనరల్ లీ షాంగ్ఫు చెప్పారు. ఇరు దేశాల సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నాయని వివరించారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన లీ షాంగ్ఫు శుక్రవారం భారత విదేశాంగ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్–చైనా సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితి, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఉన్న మొత్తం ఆధారం చెరిగిపోతుందని చైనాకు రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. సరిహద్దుకు సంబంధించిన ఏ వివాదమైనా ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో జనరల్ లీ షాంగ్ఫు ఆచితూచి స్పందించారు. -
యూపీఏ, ఎన్డీఏ.. తేడా అదే.. మోదీ ఏం చెప్పారంటే?
సాక్షి,న్యూఢిల్లీ: యూపీఏ, ఎన్డీఏ పాలన మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ ప్రభుత్వం స్థిరమైనదని, విధానాల రూపకల్పన, పరిపాలనతో స్థిరత్వం తీసుకొచ్చిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో బీజేపీ శనివారం నిర్వహించిన యువ సంకల్ప్ ర్యాలీకీ మోదీ వర్చువల్‌గా హాజరై ఈమేరకు మాట్లాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా తాను సభకు ప్రత్యక్షంగా రాలేకపోయినట్లు చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అందుకే సుపరిపాలన విషయంలో అస్థిరత ఉండేదని పేర్కొన్నారు. ఆ కారణంగానే ప్రపంచ దేశాలు భారత్‌పై సందేహాస్పదంగా ఉండేవన్నారు. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలో స్థిరత్వం వచ్చిందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారేవని, కానీ బీజేపీ స్థిరమైన పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తమకే పట్టంగట్టారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి స్థిరత్వం ముఖ్యమని ప్రజలు గుర్తించారని చెప్పారు. చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు -
మనోబలమే మహౌషధం
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్షవారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నాం. శారీరక వ్యాయామం వల్ల శరీరం మాత్రమే దృఢమవుతుంది. కాని ప్రశాంతతకు దూరమైన మనసు బలహీనమవుతుంది. అది మన లోని శక్తిని నీరుకారుస్తుంది. అసహనంతో అకారణమైన, అసమంజసమైన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపి, వారి ప్రేమకు దూరమయేలా చేస్తుంది. వారిది కూడ తనలాంటి మానసిక స్థితేనా? అన్న ఆలోచన, విచక్షణ వివేచనలు కోల్పోయిన మనసుకు తోచదు. అది తన కుటుంబానికే కాక సమాజానికి, దేశానికి చేటు చేస్తుంది. మరెలా దీన్ని అధిగమించాలి? ఓర్పుతో మాత్రమే దీన్ని అలవరుచుకోవాలి. ఓర్పే నేటి గడ్డు కాలంలో గొప్ప రక్షణ కవచం. ‘దుర్దశే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ‘ అన్నాడు ప్రపంచ విఖ్యాత నాటకకర్త షేక్సి్పయర్. అదే మనిషిలోని ధీ శక్తిని వెలికి తీసే అవసరాన్ని, అవకాశాన్ని కల్పిస్తుంది. మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టే కష్టాలు, అననుకూలతలు ఏర్పడినప్పుడు మనిషి కి మనోబలం అవసరం. మనోబలమున్న ధీరులలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ఆదేశాలు, ఆచరణ అంతర్వాహినిగా ఉంటాయి. మనోబలం వల్ల ఈ కష్టాల ఊబి నుండి బైట పడగలిగే శక్తి చేకూరుతుంది. సాధారణంగా మనోబలం కలవారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. కొందరయితే మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. ఎంత మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనం కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. మానసికంగా బలంగా వున్నప్పుడు, శారీరకంగా శక్తిమంతుడు కాకపోయినా ఏమైనా చేయగలనన్న ధీమా ఉంటుంది. ఎవరినైనా, దేన్నైనా ఎదుర్కొనే సంసిద్ధత వస్తుంది. ఆ మానసిక సంసిద్ధతే నేడు కావలసింది. దానిని అందరూ అలవరచుకుంటూ, పెంచుకుంటూ మానసికంగా బలోపేతులు కావాలి. ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్పబలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది. మనోబలం అందుకు దన్నుగా నిలుస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపటానికి, అభ్యుదయ మార్గంలో సమాజాన్ని నడిపించటానికి రాజా రామమోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతి రావు ఫూలే వంటి అనేక మంది సంస్కర్తలు తమ జీవితాన్ని సమాజం కోసం ధార పోశారు. సమాజం నుంచి ఎన్నో ప్రతికూలతలు, అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా, మొక్కవోని మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఈ తరం న్యూటన్‌గా ప్రపంచం కొనియాడిన స్టీఫెన్ విలియం హాకింగ్స్ నరాలకు సంబంధించిన వ్యాధి పీడితుడై, శరీరం చచ్చుబడినా, తన అమోఘమైన మేధస్సుతో అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చేసాడు. మనోబలానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది? దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్ష వారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. అనేక ప్రకృతి వెపరీత్యాలకు, మానవ ప్రేరిత విధ్వంసాలకు, ప్రజ అతలాకుతలమైంది. కాని, గుండె దిటవు చేసుకుంటూ తునాతునకలైన ఆశను మనోబలంతో ప్రోది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంది. ఇన్ని విపత్తులను దాటటానికి మనోబలమే కారణం. మనోబలమే మనిషికి నిజమైన శక్తి! ప్రస్తుత కాలంలో జనాన్ని వణికిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న కరోనాను సులభంగా జయించటానికి అవసరమైనది ఈ మనోబలమే! కాబట్టి మనోబలాన్ని రక్షణ కవచంగా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళదాం. కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకుందాం. – బొడ్డపాటి చంద్రశేఖర్ -
పలకరింపు
‘‘ఇరవై ఆరేళ్ల వయసులో పదమూడు ఉద్యోగాలను వద్దనుకుని, లక్షల జీతాలను పరిత్యజించి, ఇక్కడికి ఎందుకు వచ్చారు మిస్టర్ నెరూడా..!’’.. ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురిలో మొదట్నుంచీ కాస్త భిన్నంగా ప్రశ్నలు వేస్తున్న వ్యక్తి అడిగాడు. ‘‘మీ కంపెనీలో ఉమెన్ ఎంప్లాయీస్ ఉండరని తెలుసుకునే సీవీ పంపాను సర్’’ అన్నాడు నెరూడా. ‘‘ఉండకపోవడం కాదు, లేకపోవడం’’ అన్నాడు ఆ భిన్నంగా మాట్లాడే వ్యక్తి. వెంటనే రెండో వ్యక్తి అందుకున్నాడు. ‘‘మాదేం నాన్–ఉమెన్ ఆఫీస్ కాదు మిస్టర్ నెరూడా. వస్తే తీసుకునేవాళ్లమే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు వచ్చినా తీసుకునే ఉద్దేశం లేదు. అలాగని పేపర్లో బహిరంగంగా ప్రకటన ఇవ్వలేం కదా.. ‘మహిళలు దరఖాస్తు చెయ్యనవసరం లేదు’ అని! చట్టం ఒప్పుకోదు. ఉమెన్ క్యాండిడేట్స్ అసలే ఒప్పుకోరు.’’ వింటున్నాడు నెరూడా. మీరొచ్చి జాయిన్ అయిపోవచ్చు అనే మాట కోసం చూస్తున్నాడతను. పేపర్ లెస్ ఆఫీస్‌లా, ఉమన్ లెస్ ఆఫీస్‌లో పని చేయాలని ఉందతడికి. ‘‘ఇంత చిన్న వయసులో అన్ని ఉద్యోగాలు మారారంటే రెండు కారణాలు ఉంటాయి నెరూడా. ఒకటి.. మీలో స్థిరత్వం లేకపోవడం. రెండు.. కంపెనీకి స్థిరమైన ఎదుగుదల లేకపోవడం’’ అన్నాడు భిన్నంగా మాట్లాడే వ్యక్తి. ‘‘నేను ఉద్యోగాలు మారలేదు సర్. ఆఫీసులు మారాను. స్థిరత్వం అంటారా! స్థిరత్వం నాకూ ఉందీ, నేను పని చేసిన కంపెనీలకూ ఉంది. నా సీవీలో చూసే ఉంటారు. అన్నీ పెద్ద పెద్ద కంపెనీలు. అవేవీ నన్ను తీసేయలేదు. నేనే వద్దనుకుని బయటికి వచ్చేశాను. అలా రావడానికి కారణం.. అక్కడ పని చేసే ఉమెన్ ఎంప్లాయీస్’’.. చెప్పాడు నెరూడా! ‘‘ఇలాంటి కారణమేదో ఉంటుందని నేను ఊహించాను మిస్టర్ నెరూడా. బై ద వే. మీకు నెరూడా అని పేరు పెట్టింది మీ నాన్నగారే కనుకైతే ఆయన చిలీ దేశపు మహాకవి పాబ్లో నెరూడా పేరునే మీకు పెట్టి ఉంటారని అనుకుంటున్నాను. యామై రైట్?’’ అన్నాడు భిన్నంగా మాట్లాడే వ్యక్తి. నెరూడా నవ్వాడు. ‘‘మీరు రైట్ కాదు సర్’’ అన్నాడు. ‘‘ఆ పేరు నాకు మా అమ్మ పెట్టింది. నెరూడా ప్రేమ కవితల్లోని తాత్వికతకు ఆమె అభిమానురాలు..’’ ‘‘కానీ మిస్టర్ నెరూడా. నేనూ చదివాను అతడిని. నలుగుర్ని ప్రేమించి, ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆడవాళ్లెవరికీ అతడంటే ఇష్టం ఉండదని అంటారు. స్ట్రేంజ్ ఏమిటంటే.. అందుకు రివర్స్‌గా ఇప్పుడు నా ఎదురుగా ఉన్న నెరూడాకు ఆడవాళ్లంటే ఇష్టం లేదు’’ అని పెద్దగా నవ్వాడు భి.వ్య. (భిన్నంగా మాట్లాడే వ్యక్తి). ‘‘నో.. నో.. సర్. నాకు ఆడవాళ్లంటే ఇష్టం లేకపోవడమో, పడకపోవడమో కాదు. ఆడవాళ్లు ఉన్నచోట ప్రేమలు అవీ ఉంటాయి. అవి ఇష్టం ఉండదు నాకు’’ అన్నాడు నెరూడా. ‘‘ఏ! మగవాళ్లు ఉన్నచోట్ల ప్రేమలు ఉండవా?’’ అని ఒకాయన అంటుండగానే.. ‘‘అంటే.. ఈ పదమూడు ఉద్యోగాలూ ఆ ఆడవాళ్ల ప్రేమలు పడలేకే మీరు మానేశారా మిస్టర్ నెరూడా..’’ అని ఇంకొకాయన అడిగాడు. ‘‘నో.. నో.. సర్’’ అన్నాడు నెరూడా మళ్లీ. ఇంటర్వ్యూయర్లు అతడి వైపే చూస్తున్నారు. ‘‘సర్. నన్నెవరూ ప్రేమించలేదు. నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమ పర్యవసానాల్ని చూళ్లేక మానేశాను! ‘నాకే ఇలా ఎందుకు జరిగింది.. నెరూ..’ అని నా మేల్ కొలీగ్ నాతో అన్న రోజు రాత్రే సూసైడ్ చేసుకున్నాడు. అతడికి జరిగిందేమిటంటే.. నా ఫిమేల్ కొలీగ్ అతడి ప్రేమను తిరస్కరించడం! తిరస్కరించడం ఆమె తప్పేమీ కాదు. కానీ అతను అలా అనుకోలేకపోయాడు. ప్రతి ఆఫీస్‌లోనూ ఏదో ఒకటి నాకు ఇలాగే అనుభవం అయింది సర్. సూసైడ్ చేసుకున్నవాళ్లు, సూసైడ్ అటెంప్ట్ చేసినవాళ్లు.. అందరూ మగవాళ్లే’’ అని చెప్పి, ఆగాడు నెరూడా. ‘‘మీరేమంటున్నారు నెరూడా. ఆఫీసుల్లో మగవాళ్ల వల్ల సూసైడ్ చేసుకున్న ఆడవాళ్లు లేరా?!’’ అన్నాడు భి.వ్య. ‘‘అలా అనట్లేదు సర్. నాకెందుకో అంతా మగవాళ్లే ఉండే ఆఫీస్‌లో పని చేయాలని ఉంది’’ అన్నాడు. ‘‘కె.. నెరూడా, మీరు వెళ్లొచ్చు’ అన్న తర్వాత, ఆ సాయంత్రం అతడికి మెయిల్ వచ్చింది.. జాయిన్ అవ్వొచ్చని! ఆఫీసంతా మగవాళ్లతో కళకళలాడుతూ కనిపించింది నెరూడాకి. నెరూడా పోస్ట్ పెద్దది. ఆఫీస్‌లో అతడికో క్యాబిన్ ఉంది. ఒక్కొక్కళ్లూ లోపలికి వచ్చి విష్ చేసి వెళుతున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడాడు. వచ్చిన రోజే చాలా పని చేశాడు. చాలా పని చేస్తే అలసటగా ఉండాలి. కానీ ఉత్సాహంగా ఉంది. అందుకు కారణం ఆడవాళ్లే లేని ఆఫీసులో పని చేస్తున్నానన్న భావనే.ఐదో అంతస్తులో ఉన్న విశాలమైన ఆఫీస్ అది. ఈవెనింగ్.. స్టాఫ్ అంతా వెళ్లిపోగానే ఇంకా విశాలంగా కనిపించింది. కాసేపు స్టాఫ్ ఉండే వరుసల్లో తిరిగి, అద్దాల్లోంచి రోడ్డు బయటికి చూసి మళ్లీ వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు నెరూడా. క్యాబిన్లోకి వచ్చే ముందు, ఇంకా ఎవరో కీ బోర్డ్‌పై టైప్ చేస్తున్నట్లనిపిస్తే వెనక్కు తిరిగి చూశాడు. ఎవరూ లేరు! క్యాబిన్లోకి వచ్చాక టైమ్ చూసుకున్నాడు. ఎనిమిదిన్నర! ‘అప్పుడే ఎనిమిదిన్నరా!’ అనుకున్నాడు. కూర్చున్న వెంటనే, మళ్లీ వాష్‌రూమ్‌కని లేచాడు. అతడి క్యాబిన్‌లోనే వెనుక వైపు అటాచ్డ్గా వాష్‌రూమ్ ఉంటుంది. లోపలికి వెళ్లాడు. లోపల అద్దం ఉంది. ముఖం చూసుకున్నాడు. ఫ్రెష్‌గా ఉంది. అయినా కొంచెం చన్నీళ్లు చిలకరించుకుని కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు. తుడుచుకుంటున్నప్పుడు అతడు అద్దం చూసుకోలేదు. తుడుచుకున్నాక అద్దంలోకి చూస్తే అద్దంలో ఎవరో కనిపించి మాయమైనట్లనిపించింది అతడికి! ఉలిక్కిపడి, వెంటనే నవ్వుకున్నాడు. భ్రమ!అయితే ఆ నవ్వు ఎన్నో క్షణాలు అతడి ముఖంపై లేదు! వాష్‌రూమ్ తలుపు తోసుకుని క్యాబిన్లోకి రాగానే, తన సీటు ఎదురుగా ఉన్న సీట్లో ఎవరో అటువైపు తిరిగి కూర్చొని ఉన్నారు!నెరూడా భయస్తుడు కాదు. కానీ ఒక్కసారిగా భయపడ్డాడు. ‘‘హాయ్.. నా పేరు అనుమిత! ఈ రోజే జాయిన్ అయ్యాను..’’ చెయిర్‌లోని మనిషి ఇటువైపు తిరిగి, పలకరింపుగా నవ్వి చెప్పింది. రెండో రోజు ఆఫీస్‌కి వచ్చాక భిన్నంగా మాట్లాడే వ్యక్తిని కలిసి అనుమిత గురించి అడిగాడు నెరూడా. ‘‘చెప్పడానికేం లేదు. ఒకప్పుడు తను మా స్టాఫ్. కొలీగ్ని ప్రేమించి, అతడు మోసం చేస్తే.. సూసైడ్ చేసుకుంది. అతణ్ణి ఉద్యోగంలోంచి తీసేశాం. అనుమితను మాత్రం అతడి ప్రేమలోంచి తీసేయలేకపోయాం’’... చెప్పాడు ఆయన. ఇంటికొచ్చాక తల్లిని అడిగాడు నెరూడా. ‘‘అమ్మా.. అనుమిత అంటే అర్థం ఏమిటి?’’‘ప్రేమ’’ చెప్పిందావిడ. ∙మాధవ్ శింగరాజు -
సుస్థిరతకు భారత్ ఆవాసం
♦ అపార అవకాశాలున్నాయ్ ♦ నిలకడగా వృద్ధి సాధనకు మరిన్ని చర్యలు అవసరం ♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న ప్రస్తుత తరుణంలో భారతదేశం సుస్థిరతకు ఆవాసంగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నిలకడగా వృద్ధి సాధించేందుకు భారత్ మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సివిల్ అకౌంట్స్ డే-2016 కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అసాధారణ స్థాయిలో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్లలో భయాలు నె లకొన్నాయి. రికవరీ మళ్లీ పట్టాలు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ పెట్టాం. ఇలాంటి సమయంలో కూడా ఇండియా సుస్థిరతకు, అవకాశాలకు ఆవాసంగా నిలుస్తోంది’’ అని ఆయన వివరించారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణ కట్టడి.. ఆర్థిక స్థిరత్వ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారాయన. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. ఎగుమతుల బలహీనత, రెండేళ్లుగా వర్షాలు మెరుగ్గా లేకపోయినా భారత్ ఈ స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హమని చెప్పారు. అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ దీన్ని నిలబెట్టుకోవడమనేది ప్రస్తుతం దేశం ముందున్న సవాల్ అని జైట్లీ చెప్పారు. ఇందుకోసం మెరుగైన ఆర్థిక నిర్వహణ అవసరమన్నారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని, అది ఇటీవలే నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.