
సాక్షి,న్యూఢిల్లీ: యూపీఏ, ఎన్డీఏ పాలన మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ ప్రభుత్వం స్థిరమైనదని, విధానాల రూపకల్పన, పరిపాలనతో స్థిరత్వం తీసుకొచ్చిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో బీజేపీ శనివారం నిర్వహించిన యువ సంకల్ప్ ర్యాలీకీ మోదీ వర్చువల్‌గా హాజరై ఈమేరకు మాట్లాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా తాను సభకు ప్రత్యక్షంగా రాలేకపోయినట్లు చెప్పారు.
కొన్ని దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అందుకే సుపరిపాలన విషయంలో అస్థిరత ఉండేదని పేర్కొన్నారు. ఆ కారణంగానే ప్రపంచ దేశాలు భారత్‌పై సందేహాస్పదంగా ఉండేవన్నారు. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలో స్థిరత్వం వచ్చిందన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారేవని, కానీ బీజేపీ స్థిరమైన పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తమకే పట్టంగట్టారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి స్థిరత్వం ముఖ్యమని ప్రజలు గుర్తించారని చెప్పారు.
చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment