దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా అనేక రికార్డులు సృష్టిస్తున్న మహీంద్రా గ్రూపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో అడుగు పెట్టి నేటికి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. దేశంలో రెండో స్టాక్ ఎక్సేంజీగా వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో సైతం మహీంద్రా తనదైన ముద్రను వేసింది. 1996 జనవరి 3న ఎన్‌ఎస్‌ఈలో మహీంద్రా లిస్టయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఈ ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీకి జీపులు తయారు చేసే కంపెనీగా మార్కెట్‌లోకి అడుగు పెట్టిన మహీంద్రా అండ్ మహ్మద్ కంపెనీ ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాగా మారింది. గత 75 ఏళ్లలో మహీంద్రా గ్రూపు ఎన్నో విజయాలు సాధించింది. వాహనాల తయారీ నుంచి బ్యాంకింగ్ సెక్టార్ వరకు అనేక రంగంలో పాదం మోపి విజయం సాధించింది.
Hearty congratulations from all of us at NSE to Mahindra & Mahindra Ltd. One of India's leading automobile companies on completing 25 years of being listed on the NSE. #ThisDayThatYear #NSE #NSEIndia pic.twitter.com/mK2kGN9qw6
— NSEIndia (@NSEIndia) January 3, 2022
Comments
Please login to add a commentAdd a comment