మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ 3-4 నెలల్లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నది.
3-4 నెలల్లో మార్కెట్లోకి..
ముంబై: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ 3-4 నెలల్లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నది. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణ కోసం సెబీ ఆమోదం పొందిన మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నది. మహీంద్రా ఫైనాన్స్ ఈ మార్కెట్లలో పటిష్టంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ, చిన్న పట్టణాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీ తమదే కానున్నదని మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ అశుతోష్ బిష్ణోయ్ చెప్పారు. ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, లిక్విడ్ కేటగిరిల్లో మ్యూచువల్ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తామన్నారు.