Mahindra Asset Management Company
-
ఎంఅండ్ఎం ఫైనాన్స్ రైట్స్@ రూ. 50
వరుసగా మూడో రోజు హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఎన్బీఎఫ్సీ.. ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు రైట్స్ ఇష్యూ చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. 300 శాతం ప్లస్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 9.3 శాతం దూసుకెళ్లి రూ. 227 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 234 వరకూ ఎగసింది. 1:1 రైట్స్ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూ జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ తాజాగా వెల్లడించింది. ఒక్కో షేరుకీ రూ. 50 ధరలో చేపట్టనున్న రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇష్యూకి ఈ నెల 23(గురువారం) రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్ 11న ముగియనున్నట్లు తెలియజేసింది. రైట్స్‌లో భాగంగా వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 1 షేరుపై మరొక షేరుని పొందేందుకు వీలుంటుంది. ఇందుకు రూ. 50 ధరను చెల్లించవలసి ఉంటుంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల దాదాపు 62 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. -
ఇక మహీంద్రా మ్యూచువల్ ఫండ్లు
3-4 నెలల్లో మార్కెట్లోకి.. ముంబై: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 3-4 నెలల్లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నది. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణ కోసం సెబీ ఆమోదం పొందిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నది. మహీంద్రా ఫైనాన్స్ ఈ మార్కెట్లలో పటిష్టంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ, చిన్న పట్టణాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీ తమదే కానున్నదని మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ అశుతోష్ బిష్ణోయ్ చెప్పారు. ఈక్విటీ, బ్యాలెన్స్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్, లిక్విడ్ కేటగిరిల్లో మ్యూచువల్ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తామన్నారు.