
ప్రారంభ ధర రూ.2.99 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్‌ఏ భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్‌స్టార్ 650 మోడల్‌తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్‌ఎం టార్క్‌తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది.
12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్‌ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్‌ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్‌ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్‌ను 1910లో విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment