![PURE EV signed MOU with Jio Things Limited to integrate smart digital clusters and telematics](/styles/webp/s3/article_images/2025/02/18/pure01.jpg.webp?itok=tdpH_kFz)
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ప్యూర్ ఈవీ(PURE EV) తన ఉత్పత్తుల్లో స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను ఏకీకృతం చేయడానికి జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల అధునాతన ఐఓటీ(ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్) పరిష్కారాలు, అంతరాయం లేని కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇంటిగ్రేషన్‌ను అందించేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.
జియోథింగ్స్ ఇంటిగ్రేషన్ సాయంతో ద్విచక్రవాహనంలో ఎంటర్‌టైన్‌మెంట్, నావిగేషన్ సేవలు వంటివాటిని వాయిస్ ద్వారా నియంత్రించవచ్చని సంస్థ పేర్కొంది. వాహనదారులు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా వాహనంలోని టెక్నాలజీ ఇంటర్‌ఫేస్‌ను మార్చుకోవచ్చు. అందుకోసం వాయిస్ కమాండ్లను ఉపయోగించవచ్చు. దాంతో మెరుగైన రైడింగ్ అనుభూతిని పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
ప్యూర్ ఈవీ జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ల సాయంతో ఎండ్-టు-ఎండ్ ఐఓటీ పరిష్కారాలు అందించేందుకు ప్రయత్నిస్తుంది. వాహనాల పనితీరును ట్రాక్ చేయడానికి 4G కనెక్టివిటీ ఎనేబుల్ చేసిన టెలిమాటిక్స్ ద్వారా రియల్ టైమ్‌లో వాహనం కండిషన్‌ను పర్యవేక్షించవచ్చు. ఇందుకోసం జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏఓఎస్‌పీ) ‘అవ్ని ఓఎస్’ను ఉపయోగిస్తుంది. ఇది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, టూ వీలర్ ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కంపాటబిలిటీని అందిస్తుంది. జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నావిగేషన్, గేమింగ్‌తోపాటు మరెన్నో సదుపాయాలను అందిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!
జియో థింగ్స్ ఐఓటీ టెక్నాలజీ సాయంతో ప్యూర్ ఈవీ ఉత్పత్తులను పరిశ్రమ అత్యున్నత ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ నిశాంత్ డోంగారి అన్నారు. వాహనాల సామర్థ్యం, ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంస్థ వినియోగదారులకు సాంకేతికత సాయంతో మెరుగైన కనెక్టివిటీ, ఫంక్షనాలిటీని అందించనున్నట్లు చెప్పారు. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశిష్ లోధా మాట్లాడుతూ.. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో సృజనాత్మకతను పెంచుకోవాలనుకునే ప్యూర్ ఈవీ వంటి సంస్థతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మా అధునాతన ఐఓటీ పరిష్కారాలను ఏకీకృతం చేయడం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment