IoT devices
-
ఐవోటీ మాల్వేర్ టాప్ 3 దేశాల్లో భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) డివైజ్‌లకు సంబంధించి అత్యధికంగా మాల్వేర్ ఇన్ఫెక్షన్లకు కేంద్రంగా నిల్చిన టాప్ 3 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ విషయంలో చైనా, అమెరికా తర్వాత స్థానాల్లో భారత్ ఉన్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం అత్యధికంగా 38 శాతం ఐవోటీ మాల్వేర్లు చైనా నుంచి, 18 శాతం అమెరికా నుంచి, 10 శా తం ఇండియా నుంచి వ్యా ప్తి చెందాయి. సాంప్రదా య ఐటీ పరికరాలు, ఆపరేషన్ టెక్నాలజీ (ఓటీ) కంట్రోలర్లు, రూటర్లు.. కెమెరాల వంటి ఐవోటీ డివైజ్లతో ఐవోటీ మాల్వేర్ ముప్పులు ఎక్కువగా ఉంటున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. -
జాన్సన్ లిఫ్టుల్లో ‘వాచ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిఫ్టులు, ఎస్కలేటర్స్ తయారీలో ఉన్న జాన్సన్ లిఫ్ట్స్.. వాచ్ పేరుతో ఐవోటీ ఆధారిత వైర్లెస్ సాఫ్ట్వేర్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లిఫ్ట్ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమేగాక సమస్య తలెత్తితే ఈ పరికరం వెంటనే గ్రహించి డేటా సెంటర్‌కు సమాచారం చేరవేస్తుంది. సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు వాచ్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
కొత్త టెక్నాలజీ గురూ..! కిలో మీటర్ దూరంలో ఉన్నా వైఫైని వినియోగించుకోవచ్చు..!
టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మానవుని జీవన విధానం మరింత సులభతరం అయ్యింది. ఇప్పటికే డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' వంటి టెక్నాలజీలు వర్క్ కల్చర్‌ను పూర్తిగా మార్చేయగా..ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అదే దారిలో పయనిస్తుంది. తాజాగా ఐఓటీ టెక్నాలజీతో మీరు కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే డివైజ్‌లను వినియోగించుకునేందుకు ఈ 'వైఫై హాలో'(wifi halow) ఉపయోగపడనుంది. 'వైఫై హాలో' అంటే? 'వైఫై హాలో' అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఐఓటీ ప్రొడక్ట్‌లు స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ ఎయిర్ కండీషనర్స్ తో పాటు స్మార్ట్ హోం సెక్యూరిటీ సిస్టం, వేరబుల్ హెల్త్ మానిటర్స్, బయో మెట్రిక్ సైబర్ సెక్యూరిటీ స్కానర్స్'ను కిలోమీటర్ దూరంలో ఉన్నా వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వైఫై నెట్ వర్క్‌లను అందించే 'వైఫై అలయన్స్' సంస్థ తెలిపింది. పరిమిత సంఖ్యలో వైఫై కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్న స్మార్ట్ డివైజెస్‌లో పనిచేస్తుందని చెప్పింది. వైఫై టెక్నాలజీ కోసం కొత్త ఎక్విప్మెంట్ అవసరం లేదని,ప్రస్తుతం మన రోజూ వారి జీవితంలో భాగమైన వైఫై సెటప్‌తోనే ఈ వైఫై హాలో పనిచేస్తుందని వెల్లడించింది. ఏ అప్లికేషన్లలో వైఫై హాలోని వినియోగించుకోవచ్చు? వైఫై హాలో'ని ఇళ్లు, సంస్థల్లో ఉండే స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేయడంతో పాటు వివిధ రకాలైన అప్లికేషన్లలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో (స్మార్ట్ అగ్రికల్చర్)సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా టెక్నాలజీ పరంగా మరింత అప్ డేట్ కావొచ్చని నిపుణులు చెబుతుండగా.. తక్కువ సమయంలో పెద్దమొత్తంలో ఉన్న డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగడపడే వైఫై నెట్ వర్క్‌కు ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు. 'వైఫై హాలో'ఎలా పని చేస్తుంది? వైఫై హాలో టెక్నాలజీ ఇళ్లులో, లేదంటే రైల్వే స్టేషన్లలో వినియోగించే వైఫై కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాధారణ వైఫై నెట్‌వర్క్‌లు వినియోగించడం వల్ల ఖర్చయ్యే కరెంట్ కంటే..తక్కువ స్థాయిలో కరెంట్ వినియోగంతో దూరంలో ఉన్నా సరే ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. బ్యాండ్ విడ్త్ పరంగా వైఫై హాలో సాధారణ వైఫై బ్యాండ్ విడ్త్ 2.4జీహెచ్‌జెడ్ నుండి 5జీహెచ్‌జెడ్'ల కంటే తక్కువ స్థాయిలో అంటే కేవలం 1జిహెచ్‌జెడ్ తో పనిచేసేలా డెవలప్ చేస్తున్నట్లు వైఫై అలయన్స్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. చదవండి: నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!
ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్‌ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది? సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది. అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది. (చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?) -
ఇక విద్యుత్ వృథా వ్యథకు చెక్!
స్వల్ప పెట్టుబడితో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల్లో విద్యుత్ వృథా అరికట్టడంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) దృష్టి సారించింది. ఐఐటీలో చదివి హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన ఔత్సాహిక ఇంజనీర్లు రూపొందించిన ఆటోమేటిక్ పవర్ మానిటరింగ్ డివైజ్ ద్వారా విద్యుత్తు వృథాను సమర్థంగా అరికట్టవచ్చని గుర్తించారు. దీన్ని ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అని వ్యవహరిస్తున్నారు. ఏమిటీ ఐఓటీ? ఆటోమేటిక్ పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. విద్యుత్‌తో పనిచేసే ప్రతి పరికరాన్నీ ఈ డివైజ్‌కు అనుసంధానిస్తారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, యంత్రాల్లో సాంకేతిక లోపాలు, విద్యుత్ సరఫరాలో వృథా, ఏది ఎంత విద్యుత్ వినియోగిస్తోందనే వివరాలను ఈ డివైజ్ సమగ్రంగా విశ్లేషించి మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు నాణ్యమైన కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకుంటారు. ఫలితంగా అనవసర వినియోగం తగ్గిపోయి బిల్లులు కూడా తక్కువగా వస్తాయి. దీని ద్వారా దూరం నుంచే నియంత్రించే వీలుంది. పిట్ట కొంచెం..కూత ఘనం పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు స్ధిర, శక్తి చార్జీలు విధిస్తారు. స్థిర చార్జీలు కేవీఏకు రూ.470, శక్తి చార్జీలు యూనిట్‌కు రూ.6.7 పైసలు చొప్పున ఉంటాయి. అధిక బిల్లులను నివారించడానికి కెపాసిటర్ బ్యాంకులు, ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్‌ను ఉపయోగిస్తారు. పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) సరిచేయడంలో ఏదైనా లోపం తలెత్తితే వెంటనే గుర్తించలేం. ఒకవేళ గుర్తించాలన్నా దాదాపు రూ.1,50,000 నుంచి రూ.2,00,000 వరకూ ఖర్చు చేయాలి. కేవలం రూ.20 వేలు ఖర్చయ్యే పోర్టబుల్ పరికరం ద్వారా దీన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. (చదవండి: గత 7 ఏళ్లలో భారీగా పెరిగిన సౌరశక్తి సామర్థ్యం) ప్రయోగం విజయవంతం తూర్పు గోదావరి జిల్లా పద్మ సిరామిక్స్‌లో గతేడాది మార్చిలో తొలిసారి ప్రయోగాత్మకంగా అమర్చిన ఈ పరికరం విజయవంతంగా పనిచేసింది. పరిశ్రమలోని పవర్ ప్యానెల్ సరిగా పనిచేయడం లేదని, కొన్ని స్విచ్ కాంటాక్టులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఐవోటీ పరికరం గుర్తించింది. అనుసంధానం చేసిన అన్ని పరికరాలకు ప్రతి 30 నిమిషాలకు క్రమం తప్పకుండా డేటాను అందించింది. సగటు శక్తి కారకం 0.87 కు పడిపోతున్నట్లు గమనించి మొబైల్‌ఫోన్ ద్వారా అప్రమత్తం చేసింది. మూడు కెపాసిటర్ బ్యాంకులు దెబ్బతిన్నట్లు గుర్తించి వెంటనే మార్చారు. ఫేజ్ 3లో ఒక కాంటాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గమనించి సరి చేశారు. ఐఓటీ పరికరం ఈ సమస్యను గుర్తించకుంటే సరిదిద్దేందుకు కనీసం నెల గడిచేది. ఐవోటీ ద్వారా మొత్తం క్లస్టర్లో సుమారు 11,000 యూనిట్ల వాడకం తగ్గడం ద్వారా ఏడాదిలో రూ.80,000 ఆదా అయింది. ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగి నష్టాలు తగ్గాయి. కర్చన ఉద్గారాల తగ్గింపుతో పర్యావరణహితంగా మారింది. (చదవండి: ఈ సోలార్ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!) రాష్ట్రమంతా విస్తరిస్తాం.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా 65 ఎంఎస్ఎంఈల్లో ఐఓటీ పరికరాలను అమర్చాలని బీఈఈ భావించింది. రూ.13 లక్షల నిధులతో ఉచితంగానే పరికరాలను అమర్చుతోంది. 65 ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆదాపై అధ్యయనం నిర్వహించి అనంతరం అన్ని ఎంఎస్ఎంఈలకు విస్తరించే కార్యక్రమాన్ని బీఈఈ చేపడుతుంది’’ -వినీత కన్వాల్, డైరెక్టర్, బీఈఈ. బిల్లు తగ్గుతోంది.. ‘‘ఐఓటీ పరికరం బిగించిన తర్వాత మూడు క్లిష్టమైన సమస్యలను గుర్తించడంలో నాకు సహాయపడింది. దీనివల్ల విద్యుత్తు బిల్లు తగ్గుతోంది. ఈ పరికరం నా మొబైల్‌కు హెచ్చరికలను పంపిస్తుంది. విద్యుత్ బిల్లు వచ్చాక బాధపడకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తోంది. ఊరికి దూరంగా ఉన్నప్పటికీ ఈ పరికరం తనపని తాను చేసుకుపోతోంది’’ -శంకర్, చైర్మన్, పద్మ సెరామిక్స్ -
ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్ ట్రాకర్స్ తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి చెప్పారు. సేల్స్ డైరెక్టర్ పి.ఆర్.రాజారామ్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్ 140 ప్రమాణాలు గల జీపీఎస్ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400–500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పరికరాలకు భారీ డిమాండ్..: నవంబర్ 26 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఐఎస్ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్ కంపెనీకి కలిసొస్తుంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచాం. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని కోణార్క్ వివరించారు. -
ఐదేళ్లలో హావెల్స్ 1500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ హావెల్స్ ఇండియా వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రూ.360 కోట్లతో రాజస్థాన్‌లోని ఘిలోట్లో లాయిడ్ బ్రాండ్ ఏసీ తయారీ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని, వచ్చే మార్చి నాటికి నిర్వహణలోకి వస్తుందని హావెల్స్ ఇండియా సీఎండీ అనిల్‌రాయ్ గుప్తా చెప్పారు. శనివారమిక్కడ విపణిలోకి ‘గ్రాండే’ నూతన శ్రేణి ఏసీలను ప్రవేశపెట్టారు. గతేడాది లాయిడ్ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులో ఏర్పాటు చేయనున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తామని.. ఇందులో సుమారు 100 మంది నూతన ఇంజనీర్లు, పరిశోధకుల అవసరముందని తెలిపారు. నూతన శ్రేణి ‘గ్రాండే’ ఎయిర్ కండీషన్ (ఏసీ)లను ప్రవేశపెట్టింది. 3 వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఏసీలు ప్రభుత్వ గుర్తింపు ఐఎస్‌ఈఈఆర్ రేటింగ్‌ను పొందాయని కంపెనీ తెలిపింది. ధరల శ్రేణి రూ.45,990 నుంచి రూ.79,990 మధ్య ఉన్నాయి. -
బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5
మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, గేమింగ్ కన్ సోల్స్ లో డేటా షేరింగ్ కు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైర్ లెస్ టెక్నాలజీ బ్లూటూత్ లో ఓ పెద్ద అప్ డేషన్ యూజర్ల ముందుకు రాబోతోంది. అప్ డేటెడ్ బ్లూటూత్ వెర్షన్-5 ను జూన్ 16న లండన్ లో ఆవిష్కరించనున్నట్టు బ్లూటూత్ స్ఫెషల్ ఇంటరెస్ట్ గ్రూప్(ఎస్ఐజీ) ప్రకటించింది. ప్రస్తుతమున్నపరిధి కంటే రెండింతలు ఎక్కువ పరిధిలో పనిచేసేలా ఈ వెర్షన్ అప్ గ్రేడ్ చేశారు. అలాగే డేటా ట్రాన్ ఫర్ కూడా ఈ వెర్షన్ తో నాలుగురెట్లు అధికంగా ఉండబోతోంది. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజ్ లన్నింటికీ కూడా ఈ వెర్షన్ సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. స్థాన సంబంధిత సమాచారం, నావిగేషన్ వంటి కనెక్షన్ సర్వీసులకు కొత్త కార్యచరణగా ఈ వెర్షన్ ఉపయోగపడనుంది. అడ్వర్ టైజింగ్ ట్రాన్సిమిషన్ లో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్ లు ఈ కొత్త బ్లూటూత్ స్టాండర్డ్ ను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో లండన్ లో జరగబోయే ఈవెంట్ లో వివరిస్తామని ఎస్ఐజీ తెలిపింది. ఈ వెర్షన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ లండన్ ఈవెంట్ లోనే వెల్లడించనుంది.