న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) డివైజ్‌లకు సంబంధించి అత్యధికంగా మాల్‌వేర్ ఇన్ఫెక్షన్లకు కేంద్రంగా నిల్చిన టాప్ 3 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ విషయంలో చైనా, అమెరికా తర్వాత స్థానాల్లో భారత్ ఉన్నట్లు ఒక నివేదికలో పేర్కొంది.
దీని ప్రకారం అత్యధికంగా 38 శాతం ఐవోటీ మాల్‌వేర్‌లు చైనా నుంచి, 18 శాతం అమెరికా నుంచి, 10 శా తం ఇండియా నుంచి వ్యా ప్తి చెందాయి. సాంప్రదా య ఐటీ పరికరాలు, ఆపరేషన్ టెక్నాలజీ (ఓటీ) కంట్రోలర్లు, రూటర్లు.. కెమెరాల వంటి ఐవోటీ డివైజ్‌లతో ఐవోటీ మాల్‌వేర్ ముప్పులు ఎక్కువగా ఉంటున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment