malware
-
సరికొత్త ముప్పు సైబర్ టెర్రరిజం
సైబర్ నేరగాళ్లు.. లక్షలు, కోట్లలో డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లోంచి కొల్లగొట్టడమే కాదు..సైబర్ టెర్రరిజానికి తెరతీస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద ముప్పు క్రమంగా కొత్తరూపు సంతరించుకుంటోంది.. ఇది భవిష్యత్తులో జడలువిప్పుకుని సైబర్టెర్రరిజంగా మారి మానవాళికి ముప్పుగా మారబోతోందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? దీంతో ప్రపంచ దేశాలకు వచ్చే ముప్పు ఏంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలపై ‘సాక్షి ’ప్రత్యేక కథనం. మచ్చుకు కొన్ని ఘటనలను చూస్తే.. సైబర్ టెర్రరిజం వేళ్లూనుకుంటుందనడానికి ఇటీవలి కొన్ని పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. హ్యాకర్లు సోనీ అంతర్జాతీయ సంస్థపై సైబర్ దాడి చేసి గోప్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసి సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డేటాపై ర్యామ్సన్వేర్ఎటాక్ జరగడం, హైదరాబాద్లోఏపీ మహేశ్కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు హ్యాకింగ్ ఘటన, తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం కూడా ఇలాంటి కోవలోనివే. సాక్షి, హైదరాబాద్ : రోజువారీ జీవితంలో సాంకేతికతపై ఆధారపడటం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన తీవ్రవాదులు వారి ప్రయోజనాల కోసం ఇందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొనే అవకాశం కూడా పెరుగుతోంది. జనజీవనాన్ని స్తంభింపజేసి, వ్యవస్థలను గందరగోళపర్చి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు డిజిటల్ సాధనాలు, సాంకేతికతను ఉపయోగించడాన్ని సైబర్ టెర్రరిజంగా చెబుతున్నారు సైబర్ భద్రత నిపు ణులు. తరచుగా హింసపై ఆధారపడే సంప్రదాయక ఉగ్రవాద రూపాల్లా కాకుండా సైబర్ ఉగ్రవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించుకుని వర్చువల్‌గా పనిచేస్తారు. సైబర్ దాడులతో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను హ్యాక్ చేయడం, మౌలిక సదుపాయాలకు అంతరాయాన్ని కలిగించడం, సోషల్ మీడియా ద్వారా దు్రష్పచారం చేయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సైబర్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాలు. నాలుగు రకాలుగా హానిసైద్ధాంతిక ఉగ్రవాదం: సైబర్ ఉగ్రవాదులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, అనుచరులను నియమించుకోవడానికి, ప్రత్యర్థులపై హింసను ప్రేరేపించడానికి సైబర్‌స్పేస్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు: ప్రత్యర్థి ప్రభుత్వాలను అణగదొక్కడం, రహస్యమైన సమాచారాన్ని దొంగిలించడం, శత్రు భూభాగంలో కీలకమైన అవసరాలకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తారు. ఆర్థిక లాభం: సైబర్ టెర్రరిజం లక్ష్యం సైతం ఆర్థిక వ్యవస్థల్ని దోచుకోవడమే. ఉగ్ర సంస్థలు లేదా హ్యాకర్లు ర్యామ్సన్వేర్ దాడులు, ఆర్థిక మోసాలతో డబ్బులు కొల్లగొడుతారు. అవసరమైన డేటాను ఎన్‌క్రిప్‌్ట, డిక్రీప్ట్ చేయడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తారు. సైకలాజికల్ వార్ఫేర్: భయం, అనిశ్చితి, అపనమ్మకాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపేలా ప్రభుత్వరంగ సంస్థలను హ్యాక్ చేస్తుంటారు. ఎలా చేస్తారు?మాల్వేర్: వైరస్లు, ట్రోజన్లు, ర్యాన్సమ్వేర్ వంటి హానికర సాఫ్ట్వేర్లను సైబర్ ఉగ్రవాదులు ఎక్కువగా వాడుతున్నారు. ఫిషింగ్: వీటిని సోషల్ ఇంజనీరింగ్ ఎటాక్‌గా చెప్పొచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న సంస్థల నెట్‌వర్క్‌లు, సంస్థలు, వ్యక్తులకు మోసపూరిత ఈ– మెయిల్లు, ఎస్ఎంఎస్లలో లింకులు పెట్టి పంపుతారు. దీని ద్వారా హాక్ చేస్తే కలిగే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్: వీటినే డీడీఓఎస్ దాడులు అంటారు. టార్గెట్ చేసిన నెట్‌వర్క్‌కు విపరీతమైన ట్రాఫిక్ ఉండేలా చేసి వాటిని వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ఉపయోగిస్తారు. ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో గందరగోళం సృష్టించడం ఈ దాడి లక్ష్యం. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ ఎటాక్: సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ప్రోటోకాల్‌లోని చిన్నపాటి లోపాలను ఆసరాగా తీసుకుని దాడులు చేస్తారు. సప్లై చైన్ అటాక్స్: కస్టమర్లు లేదా క్లయింట్ల నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు థర్డ్ పార్టీ విక్రేతలుగా చేరి నెట్‌వర్క్‌కు హానికల్గిస్తారు.సైబర్ టెర్రరిజానికి గురవుతున్న ప్రధాన రంగాలు.. సైబర్ఉగ్రవాదులు ప్రభుత్వరంగసంస్థలు, పవర్ గ్రిడ్లు, రవాణానెట్వర్క్లు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలకు అంతరాయంసృష్టించి ప్రజా భద్రత, సంక్షేమానికి ఆటంకాలుకలిగిస్తారు. ప్రతికూల పరిస్థితులను సృష్టించిసామాజిక జీవనాన్ని బలహీనపర్చడం వీరిలక్ష్యం. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాల వ్యాప్తికి, హింసనుప్రేరేపించేందుకు సైబర్ టెర్రరిజాన్ని వాడుతున్నారు. సైబర్ టెర్రరిజాన్ని ఇలా ఎదుర్కోవచ్చు సైబర్ సెక్యూరిటీ చర్యలుసైబర్ టెర్రరిస్ట్‌ల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను, సైబర్ దాడులను అడ్డుకోవడానికి బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటుచేసుకోవాలి. చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు, ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటి కోసం ప్రభుత్వం అదనంగా పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పర సహకారంతో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేలా ఉమ్మడి ప్రణాళికలు అమలు చేయాలి. అంతర్జాతీయసహకారంసైబర్ ఉగ్రవాదం ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, సైబర్నేరగాళ్లను పట్టుకోవడానికి ఆయా దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. గుర్తించకపోతే అనర్థాలుసాంకేతికత వినియోగం పెరిగేకొద్దీ సైబర్ టెర్రరిజం ముప్పు కూడా పెరుగుతోంది. ఇది అనేక రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు చర్యలు ప్రారంభించాలి. భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే సైబర్ టెర్రరిజం ముప్పును గుర్తించకపోతే అనర్థాలు తప్పవు. –అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ ప్రజల్లో అవగాహన పెంచాలి ఫిషింగ్ స్కామ్‌లు, మాల్వేర్ బెదిరింపులు ఇతర సైబర్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు శిక్షణ, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలి. -
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
స్ట్రిప్డ్ ఫ్లై మాల్వేర్తో జాగ్రత్త
ఫుకెట్ (థాయిల్యాండ్): సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ.. స్ట్రిప్డ్ ఫ్లై అనే మాల్వేర్ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్ బహుళ మాడ్యూల్‌ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్‌గా, రామ్సమ్వేర్ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్స్కీ హెచ్చరించింది. బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్‌కు తెలియకుండానే, వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ షాట్లు ఈ మాల్వేర్ తీసుకోగలదని, స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్ ఫ్లై మాల్వేర్ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం, అప్లికేషన్లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. -
మూడున్నరేళ్లు..రూ. 258 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్: రోజుకు రూ.20 లక్షలు.. వారానికి రూ.1.41 కోట్లు.. నెలకు రూ.6.06 కోట్లు... ఏడాదికి రూ.73.7 కోట్లు.. నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన మొత్తం సరాసరీ ఇది. 2020 జనవరి 1–2023 జూన్ 30 మధ్య నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.258 కోట్లు స్వాహా చేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసులు వెల్లడిస్తున్న గణాంకాలివి. పరువు, మర్యాద, సమయం లేకపోవడం... ఇలా అనేక కారణాల వల్ల పోలీసుల వరకు రాని కేసుల్లో నçష్టపోయింది దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దర్యాప్తు అత్యంత జటిలం.. చాలా మందిలో అత్యాశ, తేలిగ్గా వచ్చే డబ్బుపై మక్కువే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల దర్యాప్తు, నేరగాళ్లను పట్టుకోవడం, అభియోగపత్రాల దాఖలు అంత కష్టం. కోవిడ్ కాలంలో ఉత్తరాదికి చెందిన వారిలో అనేక మంది జీవనోపాధి కోల్పోయారు. వీరిలో అత్యధికులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, పార్ట్ టైం ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, గిఫ్ట్‌లు, లాటరీ, కేబీసీ, ఓటీపీ, మాట్రిమోనియల్, ఆన్లైన్ సూడో పోలీసు, కేవైసీ అప్డేట్, కరెంట్ బిల్లులు చెల్లింపు, వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ ఫ్రాడ్స్, పార్ట్‌టైహ్ జాబ్స్.. ఇలా వివిధ పంథాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ లింకులు క్లిక్ చేస్తే ముప్పే.. రాజస్థాన్, బిహార్, యూపీ, ఢిల్లీ, ఝార్ఖండ్ సహా ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలకు చెందిన వారు వ్యవస్థీకృతంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితుల ప్రమేయం లేకుండానే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేసి ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారు. వీరికి నమ్మకం కలిగించేందుకు నలుగురైదుగురితో తాము ఇప్పుడే రూ.లక్షల లాభాలు ఆర్జించామని, ఆ మొత్తం డ్రా చేసినట్లు చాటింగ్ చేయిస్తున్నారు. ఇలా తమ వలలో పడిన వారికి ప్రత్యేక లింకులు పంపుతూ ఉచ్చులోకి దింపుతున్నారు. కొన్ని రకాల ప్రత్యేక లింకుల ద్వారా మాల్వేర్స్ పంపిస్తున్నారు. ఇలా వీరి సెల్‌ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు తమ అదీనంలోకి తీసుకుంటున్నారు. ఆపై నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ తస్కరించి అందినకాడికి దండుకుంటున్నారు. పట్టుకోవడం కష్టం.. రికవరీ అసాధ్యం.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సహా ఏ ఒక్కటీ తమ పేరుపై లేకుండా కథ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం, కాలయాపనతో కూడింది అవుతోంది. ఈలోపు వారి చేతుల్లోకి వెళ్లిన డబ్బు మరో చోటకు చేరడమో, ఖర్చు కావడమో జరిగిపోతోంది. ఫలితంగా నిందితులు దొరికినా రికవరీలు మాత్రం అసాధ్యమవుతున్నాయి. ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి, కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ సమయం పడుతోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు తదితరాలను విశ్లేíÙంచి, రిపోర్టు ఇవ్వడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద కాలయాపన జరుగుతోంది. ఫలితంగా అభియోగపత్రాల దాఖలు కు చాలా సమయం పడుతోంది. -
డేంజర్:వాట్సాప్‌లో పొరపాటున కూడా ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు
వాట్సప్‌లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్‌ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్‌లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్‌లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్‌ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్‌మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్‌లు లేదా లింక్‌లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్‌ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్‌తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్‌లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్‌ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్‌లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్‌ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్‌లోని జాబితాకు మెసేజ్‌లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్‌లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్‌ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్‌ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను తీసు కొచ్చింది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న సంస్థ తాజాగా మూడు సెక్యూరిటీ ఫీచర్లను పరిచయం చేసింది. వాట్సాప్‌ను వాడుతున్నది నిజంగా మీరేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి. మూడు సెక్యూరిటీ ఫీచర్లు అకౌంట్ ప్రొటెక్ట్ (Account Protect), డివైజ్ వెరిఫికేషన్ (Device Verification), ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ (Automatic Security Codes) అని పిలిచే ఈ మూడు ఫీచర్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా యూజర్ల ప్రైవసీ, భద్రత మరింత మెరుగు పడుతందని కంపెనీ వెల్లడించింది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు) అకౌంట్ ప్రొటెక్ట్ పాత స్మార్ట్‌ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు వాట్సాప్ అకౌంట్‌ను మార్చేటప్పుడు యూజర్లకు ఓల్డ్ అకౌంట్లో ఎలాంటి హెచ్చరికలు కనిపించవు దీంతో రియల్ యూజర్ స్థానంలో మరొకరు ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రొటెక్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ప్రకారం వెరిఫై చేస్తే గానీ కొత్త మొబైల్లో సంబంధిత నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ చేయడం కుదరదు. ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ వినియోగదారులు తాము మెసేజ్‌లు పంపుతున్న అవతల వ్యక్తికి సురక్షితమైన కనెక్షన్ ఉందో లేదో నిర్ధారించుకునే అవకాశం ఈ ఫీచర్ ద్వారా దొరుకుతుంది.'ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్లు' కింద, కంపెనీ "కీ ట్రాన్స్పరెన్సీ" అనే ప్రక్రియపై ఆధారపడి వినియోగదారులు తమ సంభాషణ సురక్షితంగా ఉందని ఆటోమేటిక్‌గా వెరిఫై చేయడానికి ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ తోడ్పడతాయి. ఎన్క్రిప్షన్ ట్యాబ్‌లో, చాట్ సురక్షితంగా ఉన్నదీ, లేనిదీ వెరిఫై చేసుకోవచ్చు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) డివైజ్ వెరిఫికేషన్ ఇక మూడవది డివైజ్ వెరిఫికేషన్. యూజర్ల ప్రైవసీ,సెక్యూరిటీ ప్రమాదంలో పడకుండా రక్షించే అదనపు భద్రతా ఫీచర్ ఇది. యూజర్ల అకౌంట్‌ను అథెంటికేట్ చేయడానికి, డివైజ్‌లోకి మాల్వేర్ చొరబడితే అకౌంట్‌ను రక్షించడానికి అదనపు భద్రతా చర్యలను వాట్సాప్ పరిచయం చేసింది. తద్వారా యూజర్లతో సంబంధం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో తమంతటమాల్వేర్జాడలను చెక్ చేస్తుంది. ఇందుకోసం వాట్సాప్ తన వినియోగదారులు టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలని కూడా సూచించింది. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) -
వార్నింగ్: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మొబైల్ వినియోగదారులకు అలర్ట్. స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ పరికరాన్ని సులభంగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ పొంది అందులో డబ్బులు కూడా మాయం చేస్తాయి. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) సంస్థలు ఈ ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించాయి. వీటిని తొలగించేందుకు ఈ రెండు సంస్థలు ఇప్పటికే గూగుల్ (Google) యాపిల్ (Apple)ని సంప్రదించాయి. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో తన iOSలో ఈ ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందన్నదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ కోరింది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్‌ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. తద్వారా మీ మెసేజెస్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఏటీఎం పిన్, కార్డ్ వివరాలను తెలుసుకోవడం లాంటివి జరగొచ్చు. ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్‌ను పూర్తిగా రీసెట్ చేయండి. -
ఐవోటీ మాల్వేర్ టాప్ 3 దేశాల్లో భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) డివైజ్‌లకు సంబంధించి అత్యధికంగా మాల్వేర్ ఇన్ఫెక్షన్లకు కేంద్రంగా నిల్చిన టాప్ 3 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ విషయంలో చైనా, అమెరికా తర్వాత స్థానాల్లో భారత్ ఉన్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం అత్యధికంగా 38 శాతం ఐవోటీ మాల్వేర్లు చైనా నుంచి, 18 శాతం అమెరికా నుంచి, 10 శా తం ఇండియా నుంచి వ్యా ప్తి చెందాయి. సాంప్రదా య ఐటీ పరికరాలు, ఆపరేషన్ టెక్నాలజీ (ఓటీ) కంట్రోలర్లు, రూటర్లు.. కెమెరాల వంటి ఐవోటీ డివైజ్లతో ఐవోటీ మాల్వేర్ ముప్పులు ఎక్కువగా ఉంటున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. -
గుడ్‌న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్‌తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్‌సమ్‌వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
వార్నింగ్: షార్క్‌బాట్ వచ్చేసింది.. మీ స్మార్ట్ఫోన్లలో ఆ యాప్స్‌ని డెలీట్ చేయండి!
గత దశబ్ద కాలంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయని సైబర్ నిపుణులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) అనే వైరస్ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది యాంటీవైరస్, క్లీనర్ వంటి యాప్‌ల రూపంలో ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తే ఇక అంతే.. అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తం చేసేందుకు తన ట్విట్టర్లో ఈ డేంజరెస్ సాఫ్ట్వేర్ గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ప్రధానంగా ఇది మిస్టర్ ఫోన్ క్లీనర్( Mister Phone Cleaner), కైల్హావీ మొబైల్ సెక్యూరిటీ ( Kylhavy Mobile Security) యాప్‌ల రూపంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుందన్నారు. అంతేకాకుండా అకౌంట్స్ నుంచి కుకీలను దొంగిలించగలదని చెప్పారు. ఈ మాల్వేర్ షార్క్‌బాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డివైజ్‌లోని 'ఫింగర్‌ప్రింట్‌తో లాగిన్' ఫీచర్‌ని పని చేయకుండా చేస్తుంది. దీంతో యూజర్ తప్పకుండా తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు పాస్వర్డ్, యూజర్ డీటైల్స్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా అధిగమించగలదు. చివరికి ఈ మాల్వేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి యూజర్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఆ రెండు యాప్‌లు డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గణాంకాల ప్రకారం, మిస్టర్ ఫోన్ క్లీనర్ యాప్‌ని ఇంతవరకు 50,000 పైగా డౌన్లోడ్ నమోదు కాగా, Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ఈ యాప్ 10,000 కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
నిగూఢంగానే మిగిలిన స్పైవేర్
పౌరుల గోప్యతకూ, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకూ పెనుముప్పు కలిగించ గలదని దేశమంతా భావించిన స్పైవేర్ పెగసస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక నిరాశనే మిగిల్చింది. మన దేశంలో మొత్తం 300 మంది ఫోన్లపై ఈ స్పైవేర్ దాడి చేసిందనీ, అందులో పాత్రికేయులతోపాటు కేంద్రంలోని ఇద్దరు మంత్రులూ, విపక్ష నేతలు ముగ్గురూ, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒకరు, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నాయకులు ఉన్నారనీ అప్పట్లో బయటికొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలనకు 29 మంది తమ ఫోన్లు అందజేయగా అందులో అయిదు ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్టు గుర్తించారు. అది పెగసస్ సాఫ్ట్‌వేరా కాదా అన్నది కమిటీ తేల్చలేకపోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తెలిపింది. నిపుణుల కమిటీ నివేదిక, పర్యవేక్షించిన మాజీ న్యాయమూర్తి నివేదిక సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచబోతోంది. ఆ తర్వాతగానీ ఈ విచారణ లోతుపాతులు తెలియవు. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ రూపొందించిన పెగసస్ గురించి నిరుడు వెల్లడైనప్పుడు ప్రపంచ దేశాల ప్రజానీకమంతా నివ్వెర పోయింది. పలు ప్రభుత్వాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంట్లో నలుసుగా మారినవారిపై నిఘా పెట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్పైవేర్‌ను మన ప్రభుత్వం 2017లో కొనుగోలు చేసిందని మొన్న జనవరిలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందంలో భాగంగానే ఇది జరిగినట్టు ఆ పత్రిక కథనం. మరో ఆసక్తికరమైన సంగతేమంటే... ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు సర్కారు ఈ స్పైవేర్‌ను కొన్న దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా ఇంటా బయటా అందరూ కోడై కూస్తున్నా కేంద్రం నోరు మెదపలేదు. పార్లమెంటులో అలజడి రేగినా, నిరుడు వర్షాకాల సమావేశాలు ఈ అంశంపైనే తుడిచిపెట్టుకుపోయినా ‘భద్రతా కారణాల రీత్యా’ ఏమీ చెప్పలేమన్న గంభీరమైన ప్రత్యుత్తరంతో సరిపెట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ అదే వైఖరి తీసుకుంది. ఇక చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన మొదటినుంచీ దబాయింపుతో నెట్టుకొస్తున్నారు. మన స్వాతంత్య్రోద్యమం ప్రజాజీవితంలోకి ఎన్నో కొత్త విలువలను మోసుకొచ్చింది. అట్టడుగు పౌరులకు సైతం ప్రజాస్వామ్య ఫలాలు అందాలన్న ఆకాంక్షతో ఆ విలువల ప్రాతిపదికనే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా, సమస్యలెన్ని ఎదురవుతున్నా అవన్నీ సంపూర్ణ రిపబ్లిక్ ఆవిర్భావానికి దేశం పడుతున్న పురుటి నొప్పులుగా మొదట్లో అందరూ భావించారు. కానీ రాను రాను ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేస్తున్నవారిదే పైచేయి అవుతున్న వైనం కనబడుతూనే ఉంది. ఈ పరిణామాలే చివరకు పెగసస్ వంటి స్పైవేర్ కొనుగోలుకు దారితీసినట్టు భావించాలి. పెగసస్ గురించి అధికారికంగా ఆధారాలేవీ బయటపడకపోయినా భీమా కోరెగావ్ కేసులో ఇరుక్కున్న ఒకరిద్దరి కార్యకర్తల లు, కంప్యూ టర్లలో అవాంఛనీయమైన సాఫ్ట్వేర్ చొరబడటంలో ఆ సాఫ్ట్వేర్ పాత్ర ఉందన్న సంగతి వెల్లడైంది. తమ స్పైవేర్‌ను ‘బాధ్యతాయుత ప్రభుత్వాలకు’ విక్రయించాం తప్ప ప్రైవేటు వ్యక్తులెవరికీ అంద జేయలేదని ఎన్ఎస్ఓ స్పష్టంగా చెబుతోంది. ఆ ‘బాధ్యతాయుత’ ప్రభుత్వాల జాబితా అది బయట పెట్టకపోయినా, వ్యక్తులెవరికీ ఆ సంస్థ విక్రయించలేదన్న సంగతైతే మీడియా సంస్థల అంతర్జాతీయ కన్సార్షియం దర్యాప్తులో తేటతెల్లమైంది. పైగా ధర రీత్యా ఆ సాఫ్ట్వేర్ బడా కోటీశ్వరులకు తప్ప అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇటు కేంద్రం నడత సందేహాలను నివృత్తి చేయకపోగా మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. గూఢచర్యం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రం ఖండిస్తున్న మాట నిజమే అయినా... రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై, కేంద్రమంత్రులపై నిఘా కొనసాగిందన్న అంశంలో అది నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం వింత కాదా? ప్రభుత్వ సంస్థలేవీ ఆ స్పైవేర్‌ను వినియోగించలేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం, తామే కాదు... వేరెవరూ కూడా ఆ పని చేయలేదని నిర్ద్వంద్వంగా ఎందుకు చెప్పలేకపోతోంది? కనీసం ఆ విషయంలో దర్యాప్తు చేశామనీ, ఫలానా అంశాలు వెల్లడయ్యాయనీ ఎందుకు వివరించడం లేదు? బహిరంగ అఫిడ విట్‌లో వివరాలు పొందుపరచడం సాధ్యపడదనీ, నిపుణుల కమిటీ నియామకానికి తనను అను మతిస్తే ఆ కమిటీకి నివేదిస్తాననీ నిరుడు కేంద్రం చేసిన వినతిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తానే కమిటీ ఏర్పాటుచేసింది. దానికైనా కేంద్రం వివరాలందజేస్తే బాగుండేది. ఆ పని చేయకపోవడం వల్ల కమిటీ నివేదిక కొత్తగా ఏమీ చెప్పలేకపోయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పెగసస్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం నీళ్లు నమలడం, దాటేయడం ఎవరి సలహా పర్యవసానమో గానీ ఈ వైఖరి దాని ప్రతిష్ఠను ఏమాత్రం పెంచదు. దేశ పౌరులనుంచి చట్టబద్ధ ప్రవర్తనను ఆశించే ప్రభుత్వాలూ, చట్ట ఉల్లంఘనకు పాల్పడే పౌరులపై చర్యలు తీసుకునేందుకు సర్వాధికారాలు ఉన్న ప్రభుత్వాలూ రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉండాలి. ఆదర్శవంతంగా మెలగాలి. రాజ్యమే రాజ్యాంగ ఉల్లంఘ నకు పాల్పడుతుంటే, అది రివాజుగా మారితే ఆ సమాజాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదు. -
వామ్మో బ్రాటా.. కొంచెం కొంచెంగా స్మార్ట్‌ఫోన్‌ను కబళిస్తది
Android Users ALERT: స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాంకు లాగిన్ వివరాలను లూటీ చేయడంతో పాటు ఫోన్ సర్వడాటాను కబళించేందుకు మహా డేంజర్ ఆండ్రాయిడ్ మాల్వేర్ ‘బ్రాటా’ సిద్ధమైపోయింది. అప్పుడెప్పుడో 2019లో ఈ ‘బ్యాంకింగ్’ మాల్వేర్ కలకలం సృష్టింంచిన విషయం తెలిసిందే. బ్రెజిల్ ఆర్థిక పురోగతిపై పంజా విసిరిన ఈ మాల్వేర్ ఇప్పుడు మరోసారి ఆండ్రాయిడ్ ఫోన్లపై దాడికి కోరలు చాచింది. గతంలో బ్రెజిల్ కేంద్రంగా బ్రాటాతో లక్షల యూజర్ల స్మార్ట్‌ఫోన్ డాటాలను దుండగులు కొల్లగొట్టారు. కాస్పర్ స్కీ గుర్తించి.. అప్రమత్తం చేయడంతో మిగతా యూజర్లు జాగ్రత్తపడ్డారు. ఆ టైంలో మాయమై.. మళ్లీ ఈమధ్యే ప్రత్యక్షమైంది. పోయిన నెల(డిసెంబర్)లో పలువురి బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం, ఆపై ఫోన్లలోని డేటా గాయబ్ అయిపోవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్లీఫీ అధ్యయనంలో ఈ విషయం తేలింది. బ్రిటన్, పోల్యాండ్, ఇటలీ, స్పెయిన్, చైనాతో పాటు పలు లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో క్లిఫీ స్టడీ మిగతా దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఎలాగంటే.. పుష్ నోటిఫికేషన్లు, గూగుల్ ప్లే, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ ద్వారా ‘బ్రాటా’ మాల్వేర్ ను యూజర్ల ఫోన్లలోకి జొప్పిస్తున్నారు సైబర్ దుండగులు. అయితే డౌన్ లోడర్ ద్వారా ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఈ వైరస్ ను యాంటీ వైరస్ లు కూడా అడ్డుకోలేకపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అచ్చం వైరస్ వేరియెంట్లలాగానే ఈ మాల్వేర్ వేరియెంట్లు సైతం స్టార్ట్ఫోన్ను కొంచెం కొంచెం కబళించేస్తుండడం విశేషం. మూడు రకాలుగా.. బ్రాటా.ఏ.. కొన్ని నెలలుగా ఎక్కువగా వ్యాప్తిలో ఉందని, దాంట్లోని జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ తో ఫోన్‌ను ఏకంగా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టే అవకాశం ఉంది. బ్రాటా.బీ.. లోనూ బ్రాటా ఏ టైప్ ఫీచర్లే ఉన్నాయి. కాకపోతే.. మొదటి రకంతో పోలిస్తే మరింత డేంజర్. రకరకాల కోడ్లు, పేజీలతో బ్యాంకుల లాగిన్ వివరాలను బ్రాటా.బీ తస్కరిస్తుంది. బ్రాటా.సీ విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్లలో మాల్వేర్ను జొప్పించడానికి ఉపయోగిస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకున్న యాప్(మాల్వేర్ యాప్) ద్వారా.. డాటా అంతా చోరీ చేస్తున్నారు. కాబట్టి దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గుర్తించడం ఎలా.. ►ఉన్నట్లుండి ఫోన్ స్లో కావడం, క్రాష్ కావడం, ఎర్రర్ మెసేజ్ అంటూ రిపీట్‌గా చూపించడం. ►రీబూట్(రీస్టార్ట్) లేదంటే షట్ డౌన్ కాకపోవడం ►ఏదైనా యాప్, సాఫ్ట్వేర్ ఎంతకు డిలీట్ కాకపోవడం, ►పాప్ అప్స్, సంబంధంలేని యాడ్స్, పేజీ కంటెంట్‌ను డిస్ట్రర్బ్ చేసే యాడ్స్ ►అధికారిక వెబ్సైట్లలోనూ అవసరమైన యాడ్స్ కనిపిస్తుండడం. ►పోర్న్ వీడియోలకు దూరంగా ఉండడం, అనధికారిక గేమ్స్ జోలికి పోకపోవడం!. ►ప్లేస్టోర్లోనూ అధికారిక యాప్‌లను.. అదీ రేటింగ్, రివ్యూలను చూశాకే డౌన్లోడ్ చేసుకోవడం. -
శాంసంగ్ యూజర్లకు అలర్ట్...! వీటితో జాగ్రత్త..!
శాంసంగ్ యూజర్లకు అలర్ట్..! శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో మాల్వేర్ ఆధారిత యాప్స్ ఉన్నాయని ప్రముఖ ఆన్లైన్ టెక్ పబ్లికేషన్స్ ఆండ్రాయిడ్ పోలీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. శాంసంగ్ మొబైల్ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రతి గెలాక్సీ స్టోర్‌లో ఈ మాల్వేర్స్ ఉన్నట్లు ఆండ్రాయిడ్ పోలీస్ ఒక ప్రచురణలో పేర్కొంది. నివేదిక ప్రకారం....స్ట్రీమింగ్ యాప్స్‌ల్లో మాల్వేర్ను కలిగి ఉండవచ్చునని అభిప్రాయపడింది. శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో షోబాక్స్ యాప్ అనేక క్లోన్(నకిలీ)యాప్స్‌ను కలిగి ఉందని పేర్కొంది. షోబాక్స్ యాప్ ఒక మూవీ, టీవీ సిరీస్‌లను ఉచితంగా అందించే ప్రసిద్ధ యాప్. షోబాక్స్ యాప్ తరహ సుమారు ఐదు నకిలీ యాప్స్ స్టోర్‌లో ఉన్నాయని ఆండ్రాయిడ్ పోలీస్ తన నివేదికలో పేర్కొంది. ఈ నకిలీ యాప్స్ అత్యంత ప్రమాదకమైనవని వెల్లడించింది. కొన్ని యాప్స్ కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, టెలిఫోన్‌కు యాక్సెస్‌తో సహా అనవసరమైన అనుమతులను కూడా యూజర్ ప్రమేయం లేకుండా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి సమస్య గతంలో హువావే స్మార్ట్ఫోన్లలో తలెత్తింది. అప్పట్లో డజనుపైగా హెచ్చరికలను జారీ చేశారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను రక్షించుకోవడానికి ఇలా చేయండి...? ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్వేర్తో నిండిన యాప్స్‌ను ఏదైనా ఇన్స్టాల్ చేశారో లేదో ముందుగా చెక్ చేసి, వెంటనే వాటిని తీసివేయాలి. ఇది ఎలా సాధ్యమౌతుందంటే గూగుల్ ప్లే ప్రోటెక్ట్ను ఆన్ చేయగానే..ఆయా యాప్స్ ప్రమాదకరమైనవని గూగుల్ సూచిస్తుంది. యూజర్లు కాస్పర్‌స్కై, నోర్టన్ 360 వంటి యాంటీ వైరస్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మంచింది. కొన్ని యాప్స్ పరిమిత కాలపు వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. మీకు కావాల్సిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచే కాకుండా ఆయా యాప్స్ అధికారిక వెబ్‌సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయడం ఉత్తమం. థర్డ్ పార్టీ యాప్స్ జోలికి వెళ్లకపోవడం మంచింది. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..! చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
Joker: ఈ యాప్స్ యమడేంజర్! సీక్రెట్‌గా డేటాను..
Joker Malware Strikes Again on Android Apps: ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం సురక్షితమేనా? చాలామందికి ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి. అయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ (యాప్స్)లోనూ కోడ్ రూపంలో డివైజ్‌ల మీద వైరస్ దాడి చేసే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాప్స్ డౌన్లోడ్ చేసేప్పుడు కొన్ని కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే జోకర్ లాంటి మాల్వేర్.. డివైజ్‌లోని డాటా మొత్తాన్ని గుంజేస్తుంటుంది మరి! 2017 నుంచి తన జోరు చూపిస్తున్న ‘జోకర్’ మాల్వేర్ విషయంలో గూగుల్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. కోడింగ్ బలంగా లేని యాప్స్ ద్వారా అది ప్రభావం చూపెడుతూనే వస్తోంది. తాజాగా 14 ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్‌ను గుర్తించినట్లు కాస్పర్‌స్కై అనలిస్ట్ తాన్య షిష్కోవా చెబుతున్నారు. డాటాను తస్కరించే ఈ మాల్వేర్ .. యాప్స్‌లో కోడింగ్ మార్చేయడం ద్వారా తన పని చేసుకుంటూ పోతుందని, తద్వారా కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఓటీపీల తస్కరణ, ఎస్సెమ్మెస్‌లను రీడ్ చేయడం చేస్తోందని షిష్కోవా చెబుతున్నారు. కోడ్‌లో దాగి ఉండే ఈ మాల్వేర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే రిస్క్ కూడా ఎక్కువేనని ఆండ్రాయిడ్ యూజర్లను షిష్కోవా హెచ్చరిస్తోంది. సూపర్ క్లిక్ వీపీఎన్, వాల్యూమ్ బూస్టింగ్ హియరింగ్ ఎయిడ్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ బబుల్ ఎఫెక్ట్స్, ప్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ ఆన్ కాల్, ఈజీ పీడీఎఫ్ స్కానర్, స్మార్ట్‌ఫోన్ రిమోట్, హలోవీన్ కలరింగ్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డు, వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వెలైజర్, సూపర్ హీరో ఎఫెక్ట్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ వాల్ పేపర్, డాజిలింగ్ కీబోర్డ్, ఎమోజీవన్ కీబోర్డు, నౌ క్యూఆర్ స్కాన్.. ఈ యాప్స్‌ను తక్షణమే అన్ఇన్స్టాల్ చేయడం మంచిదని షిష్కోవా చెబుతోంది. VIDEO: జోకర్ ఏం చేస్తాడో చూడండి -
అలర్ట్: ప్రమాదంలో 70 దేశాల ఆండ్రాయిడ్ యూజర్లు
ప్రపంచ వ్యాప్తంగా 70దేశాల్లో 10మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. సైబర్ నేరస్తులు 'గిఫ్ట్ హార్స్' అనే మాల్వేర్ సాయంతో సైబర్ నేరస్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపేరియం రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 70దేశాలకు చెందిన ఆండ్రాయిడ్ యూజర్స్ అకౌంట్లలో నుంచి ఉన్న మనీని కాజేసేందుకు క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జింపేరియం హెచ్చరికలు జారీ చేసింది.ఇదే విషయం తమ రీసెర్చ్‌లో వెలుగులోకి వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.సైబర్ నేరస్తులు పక్కా ప్లాన్‌తో గూగుల్ ప్లే స్టోర్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా(ఫిష్షీ) లింక్స్ పంపి యూజర్ల ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్లను తస్కరిస్తారు. Zimperium's zLabs team recently discovered an aggressive #mobile premium services campaign. This scam has hidden behind #malicious Android #apps acting as Trojans. The #Trojan attack, which we have named #GriftHorse, steals money from the victims. https://t.co/tz7R3KJ0yX — ZIMPERIUM (@ZIMPERIUM) September 29, 2021 డబ్బుల్ని ఎలా దొంగిలిస్తారు? సైబర్ నేరస్తులు ముందుగా లోకల్ లాంగ్వేజ్‌లో యూజర్లను అట్రాక్ట్ చేసేలా యాడ్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు సెండ్ చేస్తారు. ఆ యాడ్స్ లో ఉన్న లిక్ క్లిక్ చేస్తారో వారికి కళ్లు చెదిరే బహుమతులు అందిస్తామని ఊరిస్తారు. ఆ ఆఫర్లకు అట్రాక్ట్ అయిన యూజర్లు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీరు సెలక్ట్ చేసుకున్న గిఫ్ట్ మీకు కావాలనుకుంటే ఫోన్‌నెంబర్‌తో పాటు మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ పంపిస్తారు. వ్యక్తిగత వివరాల్ని యాడ్ చేసే సమయంలో ఐపీ అడ్రస్ ద్వారా వాటిని దొంగిలించి డైరెక్ట్‌గా యూజర్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారు. అంతేకాదు తాము అందించే భారీ గిఫ్ట్‌లు కావాలనుకుంటే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా 70 దేశాల్లో ఒక్కో యూజర్ నుంచి ప్రతి నెలా రూ.3100లు వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జెడ్‌ల్యాబ్స్ తెలిపింది. 2021లో ఇదే అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడి' అని అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి: ఆన్లైన్లో గేమ్స్ ఆడేవారిపై సైబర్ నేరస్తుల దాడులు..! -
ఈ 4 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!
దేశీయ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఎనీడెస్క్, క్విక్‌సపోర్ట్, టీమ్‌వ్యూయర్, మింగిల్‌వ్యూ అనే నాలుగు యాప్‌లను ఫోన్లో వాడవొద్దు అంటూ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఈ యాప్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలు "ఖాళీ" చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత నాలుగు నెలల్లోనే మోసగాళ్ళు చెప్పిన మాటలు విని వాటిని డౌన్ లోడ్ చేసిన వ్యక్తులు కనీసం 150 మంది ఎస్బీఐ వినియోగదారులు ₹70 లక్షలకు పైగా నష్టపోయినట్లు బ్యాంకు తెలిపింది. ఇలాంటి కేసుల సంఖ్య రోజు రోజుకి పేరుగుతుండటంతో దేశంలోని అతిపెద్ద బ్యాంకు తన వినియోగదారులను వారి ఫోన్లలో ఇన్ స్టాల్ చేయవద్దని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఎనీడెస్క్, క్విక్‌సపోర్ట్, టీమ్‌వ్యూయర్, మింగిల్‌వ్యూ అనే యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని బ్యాంక్ పేర్కొంది. అలాగే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ)ని ఉపయోగించేటప్పుడు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని సోర్స్ నుంచి క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే వాటిని తిరస్కరించాలని తెలిపింది.(చదవండి: ఇక ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!) ఎస్బీఐ పేరుతో పలు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని, తమ హెల్ప్‌లైన్ లేదా కస్టమర్ కేర్ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. "ప్రతి డిజిటల్ లావాదేవీ పూర్తి అయిన తర్వాత, కస్టమర్ ఫోన్ కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఒకవేళ ఖాతాదరులు లావాదేవీ చేయకపోతే ఎస్ఎమ్ఎస్ లో వచ్చే నెంబరుకు ఆ సందేశాన్ని ఫార్వర్డ్ చేయాలి"అని ఎస్బీఐ తెలిపింది. ఒకవేల ఏదైనా సైబర్ నేరం జరిగినట్లయితే, ఎస్బీఐ ఖాతాదారులు 1800111109, 9449112211, 08026599990 కస్టమర్ కేర్ నెంబర్లను సంప్రదించవచ్చు. అలాగే, 155260 నెంబరుకు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించింది. -
మీ ఫోన్లో నుంచి ఈ యాప్ వెంటనే తొలగించండి.. ముఖ్యంగా మహిళలు
ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ లో ఉన్న ఒక సెక్యూరిటీ బగ్ వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఒక భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ బంబుల్ యాప్ లో ఉన్న లోపం ద్వారా హ్యకర్లు దాడి చేసి వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంబుల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డేటింగ్ యాప్స్ కంటే ఈ డేటింగ్ యాప్ సురక్షితం అని మహిళా యూజర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, వారి అనుమతి లేకుండా ఏ పురుషుడు వారికి మెసేజ్ పంపలేరు. అయితే, తాజాగా ఈ బగ్ బయటపడటంతో మహిళా వినియోగదారులకు ఎక్కువగా హాని కలిగే అవకాశం ఉంది. స్ట్రైప్ సంస్థలో పనిచేసే పరిశోధకులు రాబర్ట్ హీటన్, బంబుల్ యాప్స్ లో ఉన్న బగ్ ను కనుగొన్నారు. ఈ లోపం వల్ల వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బ్లాగ్ పోస్ట్ లో నివేదించారు. ఇందుకు గాను అతనికి $2,000 బహుమతి కూడా లభించింది. సైబర్ క్రిమినల్స్ వినియోగదారుల ఖచ్చితమైన ఇంటి చిరునామాను తెలుసుకోవడానికి, వారి కదలికలను ట్రాక్ చేయడానికి వారు బంబుల్ యాప్ ఉపయోగించేకునే అవకాశం ఉంది అని హీటన్ పేర్కొన్నారు. అందుకే ఈ యాప్ ఉన్న యూజర్లు వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించాలని భద్రత నిపుణులు పేర్కొన్నారు.(చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు) -
జోకర్ రీఎంట్రీ... మీ ఫోన్లో ఈ 8 యాప్‌లు ఉంటే డిలీట్ చేయండి
Joker Virus Apps List 2021: జోకర్ మాల్వేర్ మళ్లీ వచ్చేసింది. ప్రమాదకరమైన 'జోకర్' వైరస్ తిరిగి వచ్చినట్లు బెల్జియం పోలీసులు ఇటీవల ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులను హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర వైరస్లలో ఒకటైన జోకర్ వైరస్ ఆండ్రాయిడ్ పరికరాలపై దాడి చేసి గూగుల్ ప్లే స్టోర్లలోని వివిధ యాప్స్ లో దాగి ఉంటుంది. ఈ వైరస్ యూజర్ అనుమతి లేకుండానే పేమెంట్ సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "గూగుల్ నిషేదించిన ఎనిమిది ప్లే స్టోర్ అప్లికేషన్లలో ఈ హానికరమైన వైరస్ ను గుర్తించినట్లు" బెల్జియన్ పోలీసులు తమ పోర్టల్ లో తెలిపారు. క్షణాల్లో ఖాతా ఖాళీ యాదృచ్ఛికంగా, ఈ 8 యాప్స్ ఈ ఏడాది జూన్ లో క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ పరిశోధకులు గుర్తించిన విధంగానే ఉన్నాయి. ఈ మాల్ వేర్ గురించి తెలిసిన తర్వాత గూగుల్ ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి తొలగించింది. అయితే, ఆండ్రాయిడ్ వినియోగదారులు వెంటనే తమ స్మార్ట్ఫోన్ల నుంచి ఈ యాప్స్ తొలిగించాలని పేర్కొంది. బెల్జియన్ అధికారుల ఇటీవలి హెచ్చరిక ప్రకారం.. ఇప్పటికీ ఈ యాప్స్ ఉన్న వినియోగదారులు జోకర్ మాల్వేర్ బాధితులుగా మారుతున్నారు.(చదవండి: ఈ రెండు ఆధార్ సేవలు నిలిపివేసిన యూఐడీఏఐ) ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే ఇక అంతే సంగతులు..! మీ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేగాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. క్విక్ హీల్ పరిశోధకుల ప్రకారం.. జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. 8 ఆండ్రాయిడ్ యాప్స్ జాబితా: Auxiliary Message Element Scanner Fast Magic SMS Free Cam Scanner Go Messages Super Message Super SMS Travel Wallpapers -
స్మార్ట్ఫోన్లపై విరుచుకుపడుతున్న జోకర్ మాల్వేర్
-
'పెగసస్' మీ స్మార్ట్‌ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?!
ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ పెగసస్ అనే సాఫ్ట్వేర్ ను డిజైన్ చేసింది. అయితే హ్యాకర్స్ ను ఈ సాఫ్ట్వేర్ లీక్ చేసి దాని సాయంతో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖుల స్మార్ట్ఫోన్లలోకి అక్రమంగా చొరబడి రహస్యాల్ని కనిపెట్టేస్తోంది. దీంతో వినియోగదారులు ఈ వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో యూకేకి చెందిన స్వచ్ఛంద సంస్థ 'అమ్నెస్టీ' ఇంటర్నేషనల్ కాల్డ్ మొబైల్ వెరిఫికేషన్ టూల్ (ఎంవీటీ) కిట్ ను డిజైన్ చేసింది. ఈ టూల్ కిట్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో పెగసస్ దాడి చేసిందా? లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న డేటాను ఎంవీటి ఫోల్డర్ లో బ్యాక్ అప్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ అప్ చేసిన అనంతరం ప్రోగ్రాం ద్వారా (కమాండ్ లైన్ ఇంటర్ ఫేస్) యూజర్లకు కాంటాక్ట్స్,ఫోటోలు దీంతో ఇతర ఫోల్డర్లను చెక్ చేస్తుంది. ఒకవేళ కమాండ్ లైన్ ఇంటర్ ఫేస్‌లో పెగసెస్ ఉంటే వెంటనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది. చదవండి: ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా -
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
బీ అలర్ట్..! ఈ యాప్‌లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి
జోకర్ మాల్వేర్ మళ్లీ వచ్చేసింది. ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే అంతే సంగతులు..! మీ ఫోన్లో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేకాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్ (సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. తాజాగా సైబర్ సెక్యూరిటీ ఫ్రిమ్ క్విక్ హీల్ టెక్నాలజీస్ జోకర్ వైరస్ మాల్వేర్ ఉన్న ఎనిమిది యాప్‌లను గుర్తించింది. వీటిని వెంటనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచి ఆన్ఇన్స్టాల్ చేయమని సూచించింది. జోకర్ మాల్వేర్కు గురైన యాప్స్ ఇవే... 1. ఆక్జిలారీ మెస్‌జ్ యాప్ 2. ఫాస్ట్ మ్యాజిక్ ఎస్ఎమ్ఎస్ 3. ఫ్రీ క్యామ్ స్కానర్ 4. సూపర్ మెసేజ్ 5. ఏలిమేంట్ స్కానర్ 6. గో మెసేజ్స్ 7. ట్రావెల్ వాల్‌పేపర్ 8. సూపర్ ఎస్ఎమ్ఎస్ జోకర్ వైరస్ మాల్వేర్: జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్స్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..!
పారిస్: ఆపిల్ సీఈవో టిక్‌కుక్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపిల్ ఫోన్లతో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలోనే అత్యధికంగా మాల్వేర్ ఉన్నాయని ఆపిల్ సీఈవో టిక్‌కుక్ పేర్కొన్నారు. జూన్ 16 న పారిస్‌లో జరిగిన వివాటెక్ 2021 వర్చ్యువల్ కాన్పరెన్స్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లపై తన అక్కసును బయటపెట్టాడు. ఆపిల్ ఐవోస్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఎక్కువగా మాల్వేర్ దాడులు జరుగుతున్నాయని తెలిపాడు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఆపిల్ కంటే 47 రెట్లు ఎక్కువ మాల్ వేర్ కలిగి ఉందని కుక్ పేర్కొన్నారు. యూరోపియన్ దేశాల్లో తెస్తోన్న డిజిటల్ మార్కెట్ చట్టంతో ఆపిల్,గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం అమలుతో సైడ్‌లోడింగ్ యాప్స్ (థర్డ్ పార్టీ యాప్స్)ను యూజర్లు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏలాంటి అడ్డంకులు రావు. కాగా టిమ్ కుక్ ఈ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు. చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..!