గాలి నుంచీ కంప్యూటర్ వైరస్! | New computer virus 'secretly leaks data' through air | Sakshi
Sakshi News home page

గాలి నుంచీ కంప్యూటర్ వైరస్!

Published Thu, Dec 5 2013 6:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

ఇంటర్‌నెట్.. బ్లూటూత్.. వైఫై.. పెన్‌డ్రైవ్‌లు, మెమరీకార్డుల వంటి సమాచార నిల్వ పరికరాలు..ఇవన్నీ కంప్యూటర్లకు వైరస్‌లు, మాల్‌వేర్‌లు వ్యాప్తిచెందడానికి కారణాలు.

వాషింగ్టన్: ఇంటర్‌నెట్.. బ్లూటూత్.. వైఫై.. పెన్‌డ్రైవ్‌లు, మెమరీకార్డుల వంటి సమాచార నిల్వ పరికరాలు..ఇవన్నీ కంప్యూటర్లకు వైరస్‌లు, మాల్‌వేర్‌లు వ్యాప్తిచెందడానికి కారణాలు. కానీ, ఇప్పు డు ఏకంగా.. కేవలం ధ్వని తరంగాల ద్వారా వ్యాపించే వైరస్ వచ్చేసింది. మానవుడు వినలేని అత్యంత పౌనపున్యం ఉన్న ధ్వని తరంగాలను ఉపయోగించుకొనే సరికొత్త ‘మాల్‌వేర్ (ఒక రకం కంప్యూటర్ వైరస్)’ను జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇది మనం టైప్ చేసే పాస్‌వర్డ్‌లు, అకౌంట్ల వివరాలు వంటి రహస్య సమాచారాన్ని నిర్దేశిత చోటికి చేరవేస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఈ మాల్‌వేర్ 20 మీటర్ల దూరంలోని కంప్యూటర్లకే సమాచారాన్ని పంపగలదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement