![Apple CEO Tim Cook Says Android Has 47 Times More Malware - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/18/tim-cook-apple.jpg.webp?itok=JV2pDY8Q)
పారిస్: ఆపిల్ సీఈవో టిక్‌కుక్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపిల్ ఫోన్లతో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలోనే అత్యధికంగా మాల్‌వేర్ ఉన్నాయని ఆపిల్ సీఈవో టిక్‌కుక్ పేర్కొన్నారు. జూన్ 16 న పారిస్‌లో జరిగిన వివాటెక్ 2021 వర్చ్యువల్ కాన్పరెన్స్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లపై తన అక్కసును బయటపెట్టాడు. ఆపిల్ ఐవోస్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఎక్కువగా మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని తెలిపాడు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఆపిల్ కంటే 47 రెట్లు ఎక్కువ మాల్ వేర్ కలిగి ఉందని కుక్ పేర్కొన్నారు.
యూరోపియన్ దేశాల్లో తెస్తోన్న డిజిటల్ మార్కెట్ చట్టంతో ఆపిల్,గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం అమలుతో సైడ్‌లోడింగ్ యాప్స్ (థర్డ్ పార్టీ యాప్స్)ను యూజర్లు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏలాంటి అడ్డంకులు రావు. కాగా టిమ్ కుక్ ఈ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు.
చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..!
Comments
Please login to add a commentAdd a comment