మొబైల్ వినియోగదారులకు అలర్ట్. స్మార్ట్‌ఫోన్లలో మాల్‌వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ పరికరాన్ని సులభంగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ పొంది అందులో డబ్బులు కూడా మాయం చేస్తాయి. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) సంస్థలు ఈ ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించాయి.
వీటిని తొలగించేందుకు ఈ రెండు సంస్థలు ఇప్పటికే గూగుల్ (Google) యాపిల్ (Apple)ని సంప్రదించాయి. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో తన iOSలో ఈ ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందన్నదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ కోరింది.
ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్‌ను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. తద్వారా మీ మెసేజెస్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఏటీఎం పిన్, కార్డ్ వివరాలను తెలుసుకోవడం లాంటివి జరగొచ్చు.
ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్‌ను పూర్తిగా రీసెట్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment