
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను గమనిస్తుంటాం. ఆ కోడ్‌ను స్కాన్(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్‌గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్ కోడ్‌తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్‌ల్ ఉన్న క్యూఆర్‌ను లేదా ఫేన్‌పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్‌ను స్కాన్ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్‌కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్ కోడ్ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్‌ను తిరిగి వేరే ఫోన్‌కు పంపించి అందులోనుంచి మీ డివైజ్‌లో స్కాన్ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్ స్కాన్ చేసే మార్గం ఉంది.
గూగుల్ లెన్స్
ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్‌ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు.
ఎలా ఉపయోగించాలంటే..
ఫోన్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్‌షాట్(Screen Shot) తీసుకోవాలి.
గూగుల్ ఫోటోలు లేదా గూగుల్(Google) యాప్‌ను ఓపెన్ చేయాలి.
సెర్చ్ బటన్ పక్కన లెన్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది.
ఫోటోలకు యాక్సెస్ ఇచ్చి అప్పటికే స్క్రీన్‌షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
గూగుల్ లెన్స్(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్ చేస్తుంది.
వేరే ఫోన్ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్‌కాపీ లేదా స్క్రీన్‌షాట్ తీసిన క్యూఆర్ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.
ఇదీ చదవండి: భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..
ప్రస్తుతం చాలా ఫోన్ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్‌ల్లోనే నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్ లెన్స్ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్ చేసి క్యూఆర్‌ను స్కాన్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment