Mobile Phone Company
-
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండిలా..
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను గమనిస్తుంటాం. ఆ కోడ్‌ను స్కాన్(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్‌గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్ కోడ్‌తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్ల్ ఉన్న క్యూఆర్‌ను లేదా ఫేన్పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్‌ను స్కాన్ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్‌కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్ కోడ్ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్‌ను తిరిగి వేరే ఫోన్‌కు పంపించి అందులోనుంచి మీ డివైజ్‌లో స్కాన్ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్ స్కాన్ చేసే మార్గం ఉంది.గూగుల్ లెన్స్ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్‌ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు.ఎలా ఉపయోగించాలంటే..ఫోన్లోని క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్‌షాట్(Screen Shot) తీసుకోవాలి.గూగుల్ ఫోటోలు లేదా గూగుల్(Google) యాప్‌ను ఓపెన్ చేయాలి.సెర్చ్ బటన్ పక్కన లెన్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది.ఫోటోలకు యాక్సెస్ ఇచ్చి అప్పటికే స్క్రీన్‌షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.గూగుల్ లెన్స్(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్ చేస్తుంది.వేరే ఫోన్ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్‌కాపీ లేదా స్క్రీన్‌షాట్ తీసిన క్యూఆర్ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.ఇదీ చదవండి: భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుతం చాలా ఫోన్ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్‌ల్లోనే నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్ లెన్స్ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్ చేసి క్యూఆర్‌ను స్కాన్ చేయవచ్చు. -
మొబైల్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సర్వీస్ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్క్యులేటర్ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల రెండింటిని పోల్చి చూసుకుని తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం టెల్కోలు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టాక.. పాత ప్లాన్ల వివరాలను తొలగించేస్తున్నాయి. ఫలితంగా సరైన సమాచారం లేకపోవడం లేదా వివరాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం లేదా అస్పష్టంగా ఉండటం వంటి వివిధ కారణాలతో యూజర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఇక యూజరు తను ఎంత డేటా, ఎన్ని నిమిషాల అవుట్గోయింగ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు, ఎన్నాళ్ల వేలిడిటీ కోరుకుంటున్నారు తదితర వివరాలిస్తే.. వారికి అత్యంత అనువైన ప్లాన్స్‌ను సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, ఫెయిర్ యూసేజీ పాలసీ (ఎఫ్‌యూపీ), ఫస్ట్ రీచార్జ్ కండీషన్ (ఎఫ్ఆర్సీ) వంటి విధానాలు అమలు చేసేటప్పుడు షరతులు, నిబంధనలను సవివరంగా తెలపకపోవడం లేదా తెలిపినా స్పష్టత లేకపోవడం వంటి అంశాల వల్ల యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సర్వీసులు మెరుగుపర్చడానికి టెల్కోలు ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ టెలికం యూజర్లకు ట్రాయ్ సూచించింది. అభిప్రాయాలు పంపేందుకు తుది గడువు డిసెంబర్ 26 కాగా.. పరిశ్రమ వర్గాలు కౌంటర్ కామెంట్స్ సమర్పించేందుకు జనవరి 9 ఆఖరు తేదీగా ట్రాయ్ నిర్ణయించింది. కాగా, చార్జీలు పెంచాలని టెల్కోలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై జోక్యం చేసుకోరాదని ట్రాయ్ భావిస్తున్నట్లు సమాచారం. టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ భేటీ.. వచ్చే ఏడాది (2020) దేశీ టెలికం రంగానికి సంబంధించిన అజెండా రూపకల్పనలో భాగంగా వొడాఫోన్–ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ సహా వివిధ టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ సమావేశమయ్యారు. 2020లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. -
సొల్లు కబుర్లు ఆపండయ్యా..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘తిరుపతి సెల్‌ఫోన్ ఉత్పత్లుల్లో అగ్రస్థానంలో నిలువనుంది. నెలకు 10లక్షల సెల్ఫోన్ల ఉత్పత్తే లక్ష్యం. ప్రారంభంలో 2,500 మందికి 2020 నాటికి ప్రత్యక్షంగా 10వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.150 కోట్లతో సెల్కాన్ సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వారికి అనువుగా భూమి, నీరు, విద్యుత్, సౌకర్యాలు కల్పించాం. సెల్ఫోన్లతోపాటు, సెట్ టాప్ బాక్సులు, బ్యాటరీలు, చార్జర్లు, ఇయర్ ఫోన్లు, మైక్, స్పీకర్లు, కెమెరా ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఉత్పత్తి కానున్నాయి. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుస్తాం’’ అని 2017లో అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2017 జూన్ 22న ముఖ్యమంత్రి హోదాలో వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చౌకగా భూమిని కొల్లగొట్ట డమే అసలు ధ్యేయమని రూఢీ అవుతోంది. అందుకు అనుగుణంగానే పరిశ్రమ అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగానే సెల్కాన్ స్థానంలో ‘వింగ్‌టెక్’ వచ్చి చేరిం దని పలువురు వివరిస్తున్నారు. ప్రారంభం నాటి మాటలు, ఆచరణలో కన్పించలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న పెద్ద మనుషులకు ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. ఉద్యోగాలు కల్పిస్తున్నామనే మాటున.. పరిశ్రమలతో పురోభివృద్ధి సహజం. ప్రభుత్వాలు ఆ మేరకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సరైందే. ఆ ముసుగులో కోట్లాది రూపాయాలు విలువైన భూమిని చౌకగా కొట్టేయాలనే అంతర్గత ఎత్తుగడలకు ఆస్కారం ఇవ్వడమే అభ్యంతరకరమని పలువురు విమర్శిస్తున్నారు. సెల్కాన్ కంపెనీకి రేణిగుంట సమీపంలో 16 ఎకరాల భూమి అప్పగించారు. ఎకరం రూ.25లక్షల చొప్పున రూ.4కోట్లకు కేటాయించారు. రూ.150కోట్లు పెట్టుబడితో ప్రత్యక్షంగా 10వేల మందికి పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. ప్రారంభంలోనే 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో చెప్పారు. 2020 నాటికి 10వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దాంతో బహిరంగ మార్కెట్లో రూ.100కోట్లు విలువైన భూమిని సెల్కాన్ సంస్థకు కేటాయించారు. ఆపై ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసిన సంస్థకు ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. రెండు విడతలుగా 1,200 మందిని తీసుకున్న ఆ సంస్థ తర్వాత 170 మందిని తొలగించింది. మరో ఏడాదిలో 9వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదనే పలువురు స్పష్టం చేస్తున్నారు. సెల్కాన్ స్థానంలో వింగ్‌టెక్ సెల్కాన్ సంస్థకు అత్యంత విలువైన భూమిని అప్పగించడం వెనుక అప్పటి మంత్రులు నారా లోకేష్, అమర్నాథరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పలువురు బాహాటంగా వెల్లడిస్తున్నారు. వినియోగానికి మించిన భూమి అప్పగించడానికి అదే కారణమని ఆరోపణలున్నాయి. పరిశ్రమ ముసుగులో విలువైన భూమి దక్కించుకోవడమే లక్ష్యంగా ఆ సంస్థ వ్యవహరించిందని పేర్కొంటున్నారు. ఆ మేరకు పరిశ్రమ నిర్మాణం అవసరానికి మించి భూకేటాయింపులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా నాడు సెల్కాన్ పేరుతో ఏర్పాటైన సంస్థ ప్రస్తుతం వింగ్‌టెక్‌గా మారింది. వింగ్టెక్తోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ సెల్కాన్ పేరుతో ఉన్న ఆ సంస్థ వింగ్‌టెక్‌గా మారడం వెనుక వ్యూహాత్మకత దాగిందని పలువురు వివరిస్తున్నారు. భవిష్యత్తులో సంస్థ యాజమాన్యం మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆరోపిస్తున్నారు. ఐటీ మంత్రి సీరియస్ సెల్కాన్ సంస్థలో స్థానికులను 170 మందిని తొలగించడంపై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ పరిశ్రమను సందర్శించిన మంత్రి సెల్కాన్ ప్రతినిధి గురు, వైస్ చైర్మన్ నరసింహన్, డైరెక్టర్లును నిలదీశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని భావిస్తే ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. లక్ష్య సాధనలో ఎందుకు విఫలమయ్యారు, ఎప్పటికి పూర్తిస్థాయిలో విస్తరిస్తారు, ఉద్యోగాలు ఎప్పటికి దక్కుతాయని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పరిశ్రమల స్థాపనలో నాటి ప్రభుత్వ పెద్దల మాటలన్నీ సొల్లు కబుర్లేనని సెల్కాన్ సంస్థ ద్వారా రూఢీ అయ్యిందనే విమర్శలున్నాయి. -
రూ.3 వేలకే సెల్కాన్ క్వాడ్‌కోర్ మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ సెల్కాన్.. క్యాంపస్ సిరీస్‌లో క్యూ405 మోడల్‌ను స్నాప్‌డీల్‌లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రూపొందిన ఈ మోడల్ ధర రూ.3,199 మాత్రమే. ఫీచర్ ఫోన్ ధరకే హై ఎండ్ ఫీచర్లను అందిస్త్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్ట్ వేగంగా కంపోజ్ చేసేందుకు వీలుగా అంతర్గతంగా స్విఫ్ట్‌కీ ఫీచర్‌ను పొందుపరిచారు. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్ప్లే, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్, డ్యూయల్ సిమ్, ఫ్లాష్‌తో 3.2 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్‌బిల్ట్ జీపీఎస్, 3జీ, వైఫై తదితర ఫీచర్లున్నాయి. -
మొబైల్ కొంటున్నారా?
శేఖర్ మొబైల్ ఫోన్ మార్చాలనుకున్నాడు. ఎలాగూ మారుస్తున్నాం కదా... చక్కని ఫీచర్లున్న బ్రాండెడ్ మొబైల్... అది కూడా కెమెరా, ర్యామ్, ప్రాసెసర్ అన్నీ బాగా అప్‌గ్రేడెడ్ అయి ఉంటే బాగుండుననుకున్నాడు. అందుకే... జీతంలోంచి నెలనెలా దాచిన మొత్తాన్ని తీసి దాదాపు రూ.50 వేలు పెట్టి కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఇంతా చేసి పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేశాడు కానీ... దానికి గాను తగ్గించిన మొత్తం కేవలం రూ.3వేలు. కొన్నపుడేమో ఆ ఫోన్ కూడా దాదాపు 12 వేలు పెట్టి కొన్నదే. కాకుంటే ఏడాది వాడకానికే దాని ధర రూ.3 వేలకు పడిపోయింది. సరే! పోతే పోయిందని కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో తీసుకున్న శేఖర్ సంతోషం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇపుడు ఆఫీసులో అతనిదే లేటెస్ట్ ఫీచర్లున్న హై-ఎండ్ మొబైల్. నాలుగు నెలలు గడిచింది. ఆ రోజే కొన్న కొత్త ఫోన్‌ను తెచ్చి శేఖర్‌కు చూపించాడు రఘు. అందులో ఉన్న ఫీచర్లను వివరిస్తుంటే శేఖర్ బుర్ర తిరిగింది. ఎందుకంటే అన్నీ శేఖర్ ఫోన్‌కన్నా ఆధునిక ఫీచర్లే. కెమెరా నుంచి ర్యామ్, మెమరీ వరకూ అన్నీ ఎక్కువే. ధర మాత్రం కేవలం రూ.17,500. శేఖర్ కొన్న బ్రాండ్ కాకపోయినా అది కూడా మంచి బ్రాండే. శేఖర్‌కు ఆ రోజంతా నిద్రపట్టలేదు. తను రూ.50వేలు పెట్టి ఫోన్ కొని నిండా నాలుగు నెలలు కాలేదు. అంతకన్నా మంచి ఫోన్... అంతకన్నా చాలా తక్కువ ధరకే!! ఎలా సాధ్యం? మర్నాడు రఘుతో ఇదే మాటంటే తనేమన్నాడో తెలుసా? నువ్వు కొన్న ఫోన్ కూడా ఇపుడు రూ.30 వేలకే వస్తోందోయ్!! అని! గతేడాది భారతదేశ మార్కెట్లోకి 1,137 మోడళ్ల మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి. అంటే... రోజుకు 3.11 కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చి చేరాయన్న మాట. మరి ఎంత కొత్త ఫోనైనా ఇలాంటి మార్కెట్లో నెల తిరిగేసరికి పాతబడిపోతోందంటే వింతేముంది? ఇక స్మార్ట్ఫోన్లను చూస్తే గతేడాదికి అంతర్జాతీయంగా విడుదలైన 691 మోడళ్లలో 476 మోడళ్లు భారతీయ కంపెనీలవే. అంటే సగటున భారతీయ కంపెనీలు రోజుకు 1.3 స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయన్నమాట. మరి రోజుకో కొత్త ఫోను మార్కెట్లోకి వస్తున్నపుడు ఏ ఫోనైనా ఎన్నాళ్లు కొత్తగా ఉంటుంది చెప్పండి? అందుకే... ఫోన్లు కొనే టపుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ తరవాత బాధ పడాల్సిన అవసరం రాకపోవచ్చనేది నిపుణుల సలహా. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో * ఒక దాన్ని మించి మరొకదాన్లో ఫీచర్లు; ధరలోనూ పోటీ * విడుదల చేసిన ఐదారు నెలలకే ధరలు తగ్గిస్తున్న కంపెనీలు * అందుకే కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు అవసరాన్ని తెలుసుకోండి! * ఫోన్ కొనేముందు మీ అవసరమేంటో తెలుసుకోండి. కేవలం మాట్లాడటానికా? లేక గేమ్స్ ఆడటానికా? మంచి ఫొటోలు తీసుకోవటానికా? డిజిటల్ అసిస్టెంట్‌లా వివిధ అవసరాలకు వాడుకోవటానికా? ఇలా అవసరమేంటో తెలుసుకోవాలి. * ఫొటోలకోసం అనుకోండి. అప్పట్లో మార్కెట్లో అత్యధిక పిక్సెల్ కెమెరాతో ఏ ఫోన్ ఉంటే అది కొనుక్కునే ప్రయత్నం చేయాలి. గేమ్స్ కోసమనుకుంటే అధిక ర్యామ్ ఉండే ఫోన్‌ను, వీడియోల కోసం తీసుకునేవారు పెద్ద డిస్ప్లేను చూసుకోవాలి. ఇలా మన అవసరానికి తగ్గ ఫీచర్ హైఎండ్‌లో ఉన్నది చూసుకుని మిగతా విషయాల్లో రాజీ పడొచ్చు. అప్పుడు ఫోన్ తక్కువ ధరకే వస్తుంది. - కొన్నాళ్ల తర్వాత మరిన్ని ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా... మన అవసరానికి సంబంధించిన ఫీచర్ మాత్రం మరీ మారిపోయే అవకాశాలు తక్కువ. బాధేమీ ఉండదు. కొన్నాళ్లు వేచి చూడండి... ఫోన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొనేసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. తరవాత మరింత హైఎండ్ ఫోన్ వస్తే అది కూడా కొనేయొచ్చునని అనుకుంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఇబ్బం దులేవీ ఉండవు. కానీ ఎప్పుడో ఒకసారి దాచుకున్న సొమ్మం తా పెట్టి కొత్త ఫోన్ కొనేవారు మాత్రం మార్కెట్లోకి రాగానే కొనేయటం సరికాదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాకే ఆ ఫోన్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఒకవేళ వినియోగదారులకు నచ్చకపోతే తయారు చేసిన స్టాకంతా విక్రయించాలి కనుక రేటు తగ్గించి అమ్మటానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. బాగా సక్సెస్ అయిన ఒకటిరెండు మోడళ్లు మినహా ఏ మోడల్ ధరైనా కొద్ది నెలలకే దాదాపు 30-40% తగ్గిపోవటానికి ప్రధాన కారణమిదే. అందుకని కాస్త వేచిచూస్తే బెటర్. హోంవర్క్ చేస్తే మంచిది... ఏదైనా ఫోన్ కొనాలనుకున్నపుడు దాని ఫీచర్లు, ధర ఇతరత్రా వివరాలు తెలుసుకుని... మార్కెట్లో అలాంటి ఫీచర్లున్న ఇతర ఫోన్ల ధరలు కూడా ఎంతున్నాయో తెలుసుకోవాలి. ఇపుడు చాలా దుకాణాలు ఇలాంటి కంపేరిజన్ను అందిస్తున్నాయి. ఇక ఆన్లైన్ సైట్లయితే చెప్పనే అక్కర్లేదు. ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్లినా మూడు నాలుగు ఫోన్లను ఎంచుకుని వాటిలో ఫీచర్లను, ధరను పోల్చి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కొన్ని ఫోన్లను పోల్చి చూసుకున్నాకే ఎంచుకుంటే, తక్కువ ధరకే నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ధరలెందుకు తగ్గుతున్నాయంటే... కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి. ధరలెందుకు తగ్గుతున్నాయంటే.. కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి.