రూ.3 వేలకే సెల్‌కాన్ క్వాడ్‌కోర్ మోడల్ | Celkon Q405 launched at Rs 3199, offers quad core processor | Sakshi
Sakshi News home page

రూ.3 వేలకే సెల్‌కాన్ క్వాడ్‌కోర్ మోడల్

Published Fri, May 22 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

రూ.3 వేలకే సెల్‌కాన్ క్వాడ్‌కోర్ మోడల్

రూ.3 వేలకే సెల్‌కాన్ క్వాడ్‌కోర్ మోడల్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ సెల్‌కాన్.. క్యాంపస్ సిరీస్‌లో క్యూ405 మోడల్‌ను స్నాప్‌డీల్‌లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రూపొందిన ఈ మోడల్ ధర రూ.3,199 మాత్రమే. ఫీచర్ ఫోన్ ధరకే హై ఎండ్ ఫీచర్లను అందిస్త్తున్నట్టు సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్ట్ వేగంగా కంపోజ్ చేసేందుకు వీలుగా అంతర్గతంగా స్విఫ్ట్‌కీ ఫీచర్‌ను పొందుపరిచారు.

4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్, డ్యూయల్ సిమ్, ఫ్లాష్‌తో 3.2 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్‌బిల్ట్ జీపీఎస్, 3జీ, వైఫై తదితర ఫీచర్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement