Celkon Group Acquires Touch Mobiles To Expand Chain Through Franchise Model - Sakshi
Sakshi News home page

Celkon-Touch Mobiles: సెల్‌కాన్‌ చేతికి టచ్‌ మొబైల్స్‌ - మహిళలకు అవకాశాలు.. ట్రైనింగ్‌ సెంటర్‌ కూడా!

Published Fri, Jul 14 2023 8:13 AM | Last Updated on Fri, Jul 14 2023 10:06 AM

Celkon group acquires touch mobiles expand chain - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్స్‌ తయారీలో ఉన్న సెల్‌కాన్‌ గ్రూప్‌ తాజాగా మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ టచ్‌ మొబైల్స్‌ను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టచ్‌ మొబైల్స్‌కు 42 స్టోర్లు ఉన్నాయి. టచ్‌ బ్రాండ్‌ కింద దక్షిణాదితోపాటు మహారాష్ట్రలో 200 ఫ్రాంచైజీ స్టోర్లను స్థాపిస్తామని సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు గురువారం మీడియాకు తెలిపారు.

‘కంపెనీ యాజమాన్యంలో మరో 50 ఔట్‌లెట్లు రానున్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పోటీతో చిన్న రిటైలర్ల మనుగడ కష్టం. గ్రూప్‌ కంపెనీల ద్వారా తయారీ సంస్థల నుంచి నేరుగా మొబైల్స్, గ్యాడ్జెట్స్‌ కొనుగోలు చేసి ఫ్రాంచైజీలకు సరఫరా చేస్తాం. తద్వారా ఆన్‌లైన్‌ కంటే తక్కువ ధరకే వీటిని విక్రయించవచ్చు’ అని వివరించారు.   

ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..
మొబైల్స్‌ సర్వీస్, విక్రయాలలో సమగ్ర శిక్షణను అందించడానికి హైదరాబాద్‌లో ట్రైనింగ్‌ సెంటర్‌ స్థాపించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏటా 1,000 మంది వరకు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని సెల్‌కాన్‌ ఈడీ మురళి రేతినేని తెలిపారు. 

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సెల్‌కాన్‌ గ్రూప్‌ 2022–23లో రూ.2,600 కోట్ల టర్నోవర్‌ ఆర్జించింది. ఇంటెరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్, ట్యాబ్లెట్‌ పీసీలు, ఇతర ఉపకరణాల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ రూ.5,000 కోట్లు ఆశిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement