Celkon
-
సెల్కాన్ చేతికి టచ్ మొబైల్స్ - మహిళలకు అవకాశాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న సెల్కాన్ గ్రూప్ తాజాగా మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ టచ్ మొబైల్స్‌ను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టచ్ మొబైల్స్‌కు 42 స్టోర్లు ఉన్నాయి. టచ్ బ్రాండ్ కింద దక్షిణాదితోపాటు మహారాష్ట్రలో 200 ఫ్రాంచైజీ స్టోర్లను స్థాపిస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు గురువారం మీడియాకు తెలిపారు. ‘కంపెనీ యాజమాన్యంలో మరో 50 ఔట్లెట్లు రానున్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. ఆన్లైన్ పోటీతో చిన్న రిటైలర్ల మనుగడ కష్టం. గ్రూప్ కంపెనీల ద్వారా తయారీ సంస్థల నుంచి నేరుగా మొబైల్స్, గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసి ఫ్రాంచైజీలకు సరఫరా చేస్తాం. తద్వారా ఆన్లైన్ కంటే తక్కువ ధరకే వీటిని విక్రయించవచ్చు’ అని వివరించారు. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు.. మొబైల్స్ సర్వీస్, విక్రయాలలో సమగ్ర శిక్షణను అందించడానికి హైదరాబాద్‌లో ట్రైనింగ్ సెంటర్ స్థాపించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏటా 1,000 మంది వరకు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సెల్కాన్ గ్రూప్ 2022–23లో రూ.2,600 కోట్ల టర్నోవర్ ఆర్జించింది. ఇంటెరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఇతర ఉపకరణాల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.5,000 కోట్లు ఆశిస్తోంది. -
జియో ఫోన్‌కు ఎయిర్టెల్ మరో పోటీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్, రిలయన్స్ జియోకు పోటీగా మరో స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దించింది. సెల్కాన్ భాగస్వామ్యంలో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను నేడు లాంచ్ చేసింది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' కార్యక్రమంలో భాగంగా సెల్కాన్ స్టార్ 4జీ ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సెల్కాన్ భాగస్వామ్యంలో ఎయిర్టెల్ విడుదల చేసిన డివైజ్‌ల్లో ఇది రెండవది. సెల్కాన్ స్టార్ 4జీ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర 2,999 రూపాయలు. అయితే రూ.1,249కే ఇది లభ్యమవుతోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి తొలుత రూ. 2749 డౌన్‌పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం 36 నెలల పాటు కచ్చితంగా రూ.169తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో 18 నెలల అనంతరం రూ.500 నగదు రీఫండ్ అవుతోంది. మరో వెయ్యి రూపాయలు 36 నెలల అనంతరం రీఫండ్ చేస్తారు. మొత్తంగా రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అన్ని దిగ్గజ మొబైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. సెల్కాన్ స్టార్ 4జీ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 4 అంగుళాల టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 1800 ఎంఏహెచ్ బ్యాటరీ మై ఎయిర్టెల్ యాప్, ఎయిర్టెల్ టీవీ యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయి -
సెల్కాన్ స్విఫ్ట్ 4జీ @ రూ.4,199
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ కంపెనీ సెల్కాన్ తాజాగా స్విఫ్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 4.5 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 7.0 ఓఎస్, ఫ్లాష్‌లైట్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లను జోడించారు. ధర రూ.4,199. బడ్జెట్ ధరలో ఇన్ని ఫీచర్లతో ఇది అత్యుత్తమ మోడల్‌గా నిలుస్తుందని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. -
జియోకు చెక్ : ఎయిర్టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్
-
జియోకు చెక్:ఎయిర్టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్..తక్కువ ధరలో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం మేజర్ భారతీ ఎయిర్టెల్ సెల్కాన్ ..మొబైల్ ఫోన్ తయారీదారు సెల్‌కాన్‌తో జతకట్టింది. ముఖ్యంగా ప్రత్యర్థి రిలయన్స్ జియోకు చెక్ పెట్టేలా త క్కువ ధరలో 4 జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. తన చందాదారులకు అతి తక్కువ ధరకే మొబైల్ అందించే వ్యూహంలో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. సెల్కాన్ తో కలిసి రూ.1,349 కే స్మార్ట్‌ఫోన్‌ను అందజేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ పథకంలో భాగంగా ఫీచర్ ఫోన్ ధరలోనే స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. 'సెల్కాన్న్ స్మార్ట్ 4 జి' (మార్కెట్ ధర రూ. 3,500) పేరుతో దీన్ని విడుదల చేయనుంది. 4 అంగుళాల టచ్ స్క్రీన్ డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్ లో గూగుల్ ప్లే లోని వాట్సాప్, ఫేస్బుక్, యూ ట్యూబ్ తదితర అన్ని యాప్‌లకు అనుమతి ఉంది. ఇటీవల కార్బన్ ఎ40 ఇండియన్ పేరిట కేవలం రూ.1399కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసిన ఎయిర్టెల్ తాజాగా సెల్‌కాన్‌తో జతకట్టి మరో 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ సెల్కాన్ స్మార్ట్ 4జీ ఫోన్‌ను వినియోగదారులు ముందుగా రూ.2,849 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుది. ఇందులో నెలకు రూ.169 రీచార్జ్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఇలా నెలకు రూ.169 చొప్పున 36 నెలల పాటు రీచార్జి చేస్తూ ఫోన్‌ను వాడాలి. అలా వాడితే మొదటి 18 నెలలకు రూ.500, తరువాత 36 నెలలకు రూ.1000 వెనక్కి ఇస్తారు. అంటే మూడు సంవత్సరాలకు మొత్తం రూ.1500 వెనక్కి ఇస్తుంది. ఈ లెక్క ప్రకారం ఫోన్ ధర కేవలం రూ.1349 మాత్రమే అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ తోపాటు రోజుకు 500 ఎంబీ 4జీ డేటా ఉచితం. వాలిడిటీ 28 రోజులు. ఒకవేళ రూ .169 రీచార్జ్ ఇష్టంలేని వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఏ రీఛార్జ్ ప్లాన్ అయినా వినియోగించుకోవచ్చు. అయితే, రూ .500 మొదటి వాపసును క్లెయిమ్ చేయటానికి, మొదటి 18 నెలల్లో రూ. 3000 విలువ గల రీఛార్జిలు చేసుకోవాలి. అలాగే రూ. 1,000 రిఫండ్ కావాలంటే 18 నెలల్లో రూ. 3000 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే 36 నెలలు, మొత్తం రీఛార్జి రూ. 6,000. కాగా దక్షిణ భారత మార్కెట్లలో బలమైన బ్రాండ్ అనుబంధం, తక్కువధరలో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను అందించేందుకు సెల్‌కాన్‌తో జత కట్టడం సంతోషంగా ఉందని భారతి ఎయిర్టెల్ సీఎంవో పూడిపెద్ది రాజ్ ప్రకటించారు. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ తమకు మంచి ప్రోత్సాహం లభించిందనీ, ఈ సిరీస్‌లో భవిష్యత్తులో మరిన్ని భాగస్వామ్యాలతో ,మరిని డివైస్‌లను లాంచ్ చేయనున్నామని తెలిపారు. సెల్కాన్ స్మార్ట్ 4జీ ఫీచర్లు 4 అంగుళాల డిస్ప్లే 800 x 480 రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాల్లౌ 1 జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 3.2 ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా 1500 ఎంఏహెచ్ బ్యాటరీ తక్కువ ధరలో ఎయిర్టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ -
ఫీచర్ ఫోన్ కొంటే రిపేర్ ఫ్రీ
► సెల్కాన్ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్ ► త్వరలో 2,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్ ► ప్రతి జిల్లాలోనూ సొంత సర్వీస్ సెంటర్ ► సెల్కాన్ చైర్మన్, ఎండీ వై.గురు వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘సెల్కాన్’ తాజాగా దేశంలో తొలిసారిగా వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లపై జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ బాగా అమ్ముడవుతున్న కొన్ని పాపులర్ హ్యాండ్సెట్లకే వర్తిస్తుందని, ఆ తర్వాత ఇతర ఫోన్లకు కూడా విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఆఫర్లో భాగంగా యూజర్లు వారి ఫోన్లను ఎన్ని సంవత్సరాల పాటైనా (జీవితాంతం) ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చు. ‘అన్ని ఫోన్లను దేశీయంగానే తయారు చేస్తున్నాం. నాణ్యతపై పూర్తిగా పట్టు సాధించాం. కంపెనీ వృద్ధికి కారణంగా నిలిచిన వినియోగదారులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. అందుకే ఈ జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించాం’ అని సెల్కాన్ మొబైల్స్ చైర్మన్, ఎండీ వై.గురు తెలిపారు. శుక్రవారమిక్కడ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన గురు... పలు ఇతర ఆఫర్లను కూడా ఆవిష్కరించారు. అలాగే డిసెంబర్ చివరి నాటికి నెలకు 10 లక్షల ఫోన్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. మొబైల్ హ్యాండ్సెట్లను స్థానికంగా విక్రయించడమే కాకుండా ఎగుమతి కూడా చేస్తున్నామన్నారు. సిల్వర్ ఎడిషన్ కంపెనీ తాజాగా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పలు ఆఫర్లను ప్రకటించింది. అందులో సిల్వర్ ఎడిషన్ ఒకటి. ఇక్కడ సెల్కాన్ హ్యాండ్సెట్ కొన్న వారు వెండి నాణేన్ని ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ కొన్ని ఫోన్లకే వర్తిస్తుంది. రూ.899 పెట్టి ఫోన్ కొనుగోలు చేస్తే.. రెండో ఫోన్‌పై 50 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. పది రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చే 10 రోజుల్లో రూ.2,999కే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు గురు ప్రకటించారు. ఇందులో 4 అంగుళాల డిస్ప్లే, అధిక బ్యాటరీ సామర్థ్యం, మూన్‌లైన్ సెల్పీ కెమెరా, 4జీ వంటి పలు ప్రత్యేకతలుంటాయని చెప్పారు. వచ్చేనెలలో డ్యూయెల్ రియర్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు కూడా వెల్లడించారు. వీటి ధర రూ.10,000లోపు ఉంటుందని తెలియజేశారు. టెల్కోలతో కలిసి పలు ఆఫర్లతో రూ.1,000లోపు ఫీచర్ ఫోన్లను తీసుకువస్తామన్నారు. ఇప్పటికే పలు టెలికం ఆపరేటర్లతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్ నేపథ్యంలో కంపెనీ ప్రతి జిల్లా కేంద్రంలోనూ సొంత సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం సంస్థకు 1,400 వరకూ సర్వీస్ సెంటర్లున్నాయి. -
నెలకు 20లక్షల ఫోన్లు విక్రయిస్తాం
♦ ఏడాదిలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం ♦ ఇప్పటిదాకా డిమాండ్ ఉన్నా ఉత్పత్తి లేదు ♦ తిరుపతి యూనిట్‌తో ఆ సమస్య తీరిపోయింది ♦ తొలిసారిగా వినూత్న ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు ♦ ఏడాదిలో ఫ్యాబ్‌సిటీ ప్లాంటు; ఆర్ అండ్ డీ హబ్ ♦ ‘సాక్షి’తో సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మొబైల్స్ తయారీలో ఉన్న సెల్కాన్... నెలకు 20 లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి చెందిన మేడ్చల్ ప్లాంటులో నెలకు 3 లక్షలు, థర్డ్ పార్టీ యూనిట్లలో 2 లక్షల మొబైళ్లను నెలకు తయారు చేస్తున్నారు. ఇటీవలే తిరుపతి ప్లాంటు కూడా అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఒక షిఫ్ట్‌లో నెలకు 10 లక్షల మొబైల్స్‌ను తయారుచేస్తుండటంతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం నెలకు 15 లక్షల యూనిట్లకు చేరింది. కొన్నాళ్లుగా డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి అందుబాటులో లేక మొబైళ్లను సరఫరా చేయలేకపోయామని సెల్కాన్ సీఎండీ వై.గురు చెప్పారు. బుధవారంనాడు ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ అంశాలపై గురు ఏమన్నారంటే... సామర్థ్యం పెరగటంతో కొత్త మార్కెట్లలోకి... ప్రస్తుతం యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, నైజీరియా, బోట్స్వానా, కెన్యా, జింబాబ్వే వంటి 12 దేశాలకు కంపెనీ మొబైల్స్‌ను ఎగుమతి చేస్తోంది. తయారీ సామర్థ్యం పెరగడంతో భారత్‌లో పూర్తి స్థాయిలో విస్తరించటంతో పాటు కొత్త మార్కెట్లలోకి అడుగు పెట్టేందుకూ సిద్ధమవుతున్నాం. దక్షిణాఫ్రికాలో బండిల్ ఆఫర్లో సెల్కాన్ ఫోన్లను ఆఫర్ చేసేందుకు ఎతిసలాత్ గ్రూప్ నుంచి మాకు ఆర్డరుంది. ఇప్పటికే ఈ టెలికం కంపెనీ పలు మార్కెట్లలో సెల్కాన్ ఫోన్లను విక్రయించింది కూడా. 20 లక్షల ఫోన్ల అమ్మకం లక్ష్యాన్ని ఏడాదిలో చేరతామనే నమ్మకం మాకుంది. అన్ని విడిభాగాలు ఇక్కడే... ప్రస్తుతం పీసీబీ, ఎల్సీడీ వంటి ప్రధాన విడిభాగాలను దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌ను దేశీయంగా చేపడుతున్నాం. చార్జర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, స్పీకర్లను పూర్తిగా ఇక్కడే తయారు చేస్తున్నాం. దశలవారీగా ఇతర యాక్సెసరీస్, విడిభాగాల ఉత్పత్తిని కూడా ఇక్కడే చేపట్టాలనుకుంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ లక్ష్యానికి అనుగుణంగా మా ప్లాంట్లను తీర్చిదిద్దుతున్నాం. ఇందులో భాగంగానే చైనా, తైవాన్‌కు చెందిన కంపెనీల సహకారంతో పీసీబీ, ఎల్సీడీలను ఇక్కడ రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నాం. 2019 నాటికి అన్ని విడిభాగాలను.. అంటే నూరు శాతం దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. మరోవంక వినూత్న ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను డిజైన్ చేసేందుకు టెక్నోవేషన్ పేరిట ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కొత్త మోడళ్లు: మురళి టెక్నోవేషన్ టీమ్ అభివృద్ధి చేసిన క్లిక్, యూనిక్ మోడళ్లు త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు సెల్కాన్ ఈడీ మురళి రేతినేని చెప్పారు. ఇప్పటిదాకా ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేని ఫీచర్లు కొన్ని వీటిలో ఉంటాయన్నారు. థర్డ్ పార్టీల ద్వారా 650 సర్వీసింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, ఈ నెలలోనే ప్రధాన నగరాల్లో 20 సెంటర్లను సొంతంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. ఎక్స్‌క్లూజివ్ కేంద్రాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ‘‘90% సమస్యలను ఒక్కరోజులోనే పరిష్కరిస్తాం. విడిభాగాలను కంపెనీకి వచ్చిన ధరకే ఇస్తున్నాం. 30 రోజుల్లో ఫోన్ రిపేర్ కాకపోతే కస్టమర్లు కొత్త ఫోన్ పొందొచ్చు. 3 కోట్ల పైచిలుకు కస్టమర్ల కోసం ఇటీవల ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించాం. పాత ఫోన్‌ను మార్చుకున్న వినియోగదార్లకు తక్కువ ధరలో కొత్త మోడళ్లను అందించాం. దీనికి మంచి స్పందన వచ్చింది’’ అని మురళి వివరించారు. ఫ్యాబ్‌సిటీ యూనిట్‌కు రూ.100 కోట్లు.. హైదరాబాద్ ఫ్యాబ్‌సిటీలో మేం ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ను ఏడాదిలో పూర్తి చేయాలనుకుంటున్నాం. ఒక్కో షిఫ్టుకు నెలకు 5 లక్షల మొబైళ్లు తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంటు సొంతం. దీనికోసం రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాం. 1,200 మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే గచ్చిబౌలిలో ఆర్అండ్డీ హబ్‌కు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వం అనుమతిస్తే 20 అంతస్తుల భవనాన్ని నిర్మించటానికి సిద్ధంగా ఉన్నాం. 2018 చివరినాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మౌలిక వసతులు, ల్యాబ్ కోసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నాం. ఈ హబ్ ద్వారా కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలొస్తాయి. 1,500 మంది కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. -
సెల్కాన్ తిరుపతి ప్లాంటు నేడు ప్రారంభం
♦ తొలి దశలో రూ.150 కోట్ల పెట్టుబడి ♦ సెల్కాన్ వ్యవస్థాపకుడు వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న సెల్కాన్ సంస్థ తిరుపతి సమీపంలో నెలకొల్పిన తయారీ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనుంది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద శ్రీ వెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో ఏర్పాటైన తొలి ప్లాంటు ఇదే. రోజుకు 72,000 మొబైల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం బేసిక్ మొబైళ్లు, స్మార్ట్ఫోన్లతోపాటు ట్యాబ్లెట్ పీసీలను తయారు చేస్తారు. రానున్న రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, సీసీటీవీ కెమెరాలను సైతం రూపొందిస్తామని సెల్కాన్ వ్యవస్థాపకుడు వై.గురు బుధవారం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తొలి దశలో రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో ప్లాంటు ఏర్పాటుకై 2015 సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సెల్కాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఫ్యాబ్‌సిటీ వద్ద మరో ప్లాంటును సైతం ఏర్పాటు చేస్తోంది. -
సెల్కాన్ 3జీ స్మార్ట్‌ఫోన్ @ రూ.1,999
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ తాజాగా ఏ355 పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,999 ధరలో ప్రవేశపెట్టింది. ఈ ధరలో ప్రస్తుతం దేశంలో ఏ కంపెనీ కూడా 3జీ మోడల్‌ను విక్రయించడం లేదని సంస్థ సీఎండీ వై.గురు తెలిపారు. 3.5 అంగుళాల టచ్ స్క్రీన్, 1 గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీ పొందుపరిచారు. 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ, 2 ఎంపీ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 3జీ వీడియో కాల్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర ఫీచర్లు. బరువు 97.55 గ్రాములు ఉంది. అయిదు రంగుల్లో లభిస్తుంది. హైఎండ్పై గురి..: ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పలు సాఫ్ట్వేర్ కంపెనీలతో సెల్కాన్ చేతులు కలిపింది. కెమెరా, మెమరీ, డిస్ప్లే విషయంలో స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు వినూత్న అనుభూతి కల్పించే లక్ష్యంగా ఈ కంపెనీలతో కలిసి పనిచేస్తామని గురు వెల్లడించారు. ఏప్రిల్ తర్వాత నుంచి రూ.10 వేలు ఆపైన విభాగంలో కొత్త మోడళ్లు తీసుకొస్తామని చెప్పారు. -
మేడిన్ ఇండియా ఫోన్లు కోరుతున్నారు..
-
మేడిన్ ఇండియా ఫోన్లు కోరుతున్నారు..
♦ చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత ♦ రెండేళ్లలో తయారీ హబ్‌గా భారత్ ♦ సెల్కాన్ సీఎండీ వై.గురు ♦ డైమండ్ సిరీస్‌లో కొత్త 4జీ ఫోన్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటి దాకా చైనా ఉత్పత్తులు వెల్లువెత్తుతున్న భారత సెల్‌ఫోన్ మార్కెట్లో వినూత్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత కస్టమర్లు ప్రస్తుతం మేడిన్ ఇండియా ఫోన్లనే కోరుతున్నారని సెల్కాన్ సీఎండీ వై.గురు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోందన్న కారణంగా చైనా ఉత్పత్తుల వాడకం పట్ల భారత్‌లో పెరుగుతున్న వ్యతిరేకతే ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందన్నారు. అలాగే భారత్‌లో తయారైన ఫోన్ల కోసం పలు దేశాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని వెల్లడించారు. ఈయూ దేశాల కోసం ఒక ప్రముఖ విదేశీ టెలికం కంపెనీ నుంచి భారీ ఆర్డరును దక్కించుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ కోసం 4జీ స్మార్ట్ఫోన్లను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. 2018 కల్లా పూర్తిగా ఇక్కడే.. చైనా ఉత్పత్తుల విషయంలో కంపెనీలు, కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దేశీయ సెల్‌ఫోన్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. పీసీబీ, ఎల్సీడీ, చిప్సెట్లను కొరియా, తైవాన్ నుంచి, మెమరీ కార్డులు జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. చార్జర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, బాక్స్‌ల వంటి మిగిలిన విడిభాగాలన్నీ భారత్‌లోనే తయారు చేయిస్తున్నట్టు గురు తెలిపారు. చైనా కంటే ఇక్కడే తయారీ వ్యయం తక్కువగా ఉందన్నారు. అన్ని విడిభాగాలు భారత్‌లోనే తయారు చేయాలన్న నిబంధన 2018 నాటికి ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందన్నారు. మరిన్ని కొత్త మోడళ్లు.. డిసెంబర్‌కల్లా మరో రెండు 4జీ, రెండు 3జీ స్మార్ట్ఫోన్లను సెల్కాన్ ప్రవేశపెడుతోంది. అధిక మెగా పిక్సెల్‌తోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌తో రూ.7 వేలలోపు ధరల శ్రేణిలో మోడళ్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం 4జీ విభాగంలో ట్యాబ్లెట్ పీసీలతో కలిపి మొత్తం 4 మోడళ్లను విక్రయిస్తోంది. అన్ని మోడళ్లనూ మేడ్చల్ ప్లాంటులో తయారు చేస్తోంది. కంపెనీ అమ్మకాలు సాగిస్తున్న ధరల శ్రేణిలో తెలంగాణలో 41 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం మార్కెట్ వాటా ఉన్నట్టు సెల్కాన్ తెలిపింది. మరో రెండు 4జీ మోడళ్లు.. డైమండ్ సిరీస్‌లో ఏస్, పాప్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లను సెల్కాన్ విడుదల చేసింది. ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్, 5 ఎంపీ కెమెరాను రెండు మోడళ్లలోనూ పొందుపరిచారు. డైమండ్ ఏస్‌ను 5 అంగుళాల డిస్ప్లే, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రూపొందించారు. ధర రూ.4,999. డైమండ్ పాప్‌ను 4.5 అంగుళాల స్క్రీన్‌తో తయారు చేశారు. ఫోన్ ధర రూ.4,699 ఉంది. స్క్రీన్ పగలకుండా ఉండేందుకు డ్రాగన్ట్రైల్ గ్లాస్‌ను వాడామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. అన్ని మోడళ్లకూ జియో వెల్కం ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. -
రూ.2,999కే ‘సీటీ111’ ట్యాబ్లెట్
హైదరాబాద్: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ కంపెనీ సెల్కాన్ తాజాగా ‘సీటీ111’ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,999. ఇందులో 7 అంగుళాల తెర, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఓఎస్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, వై-ఫై, 2 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరా, ఓటీజీ సపోర్ట్, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సీటీ111’ ట్యాబ్లెట్ తమ వృద్ధికి మరింత దోహదపడుతుందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వై.గురు తెలిపారు. దేశీ, విదేశీ మార్కెట్లలో ఇతర మొబైల్ హ్యాండ్సెట్స్ కంపెనీల కన్నా ముందుండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. -
సెల్కాన్ డైమండ్ ప్రో వచ్చేసింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ తాజాగా డైమండ్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. గొరిల్లా గ్లాస్, మెటాలిక్ ఫినిషింగ్ ఈ మోడల్‌కు ఉన్న ప్రత్యేకలు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కన్నడ యువ హీరో యశ్ చేతుల మీదుగా కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 4.5 అంగుళాల స్క్రీన్, ఫుల్ ల్యామినేషన్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. 3జీ, ఫ్లాష్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,650 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర ఫీచర్లు. ధర రూ.5,777. అన్ని మొబైల్ రిటైల్ దుకాణాల్లో లభిస్తుంది. భారత్‌లో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా నిలవడంలో ఎంతో ప్రగతిని సాధించామని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో కంపెనీ వాటా మరింత వృద్ధికి డైమండ్ ప్రో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో సెల్కాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యష్ వ్యవహరిస్తారు. -
సెల్కాన్ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ తొలి ట్యాబ్లెట్
ఇంటెల్ ప్రాసెసర్‌తో రూపకల్పన 40 దేశాలకు ఎగుమతి చేస్తాం సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ సీటీ722 పేరుతో ఇంటెల్ ప్రాసెసర్‌తో కూడిన ట్యాబ్లెట్ పీసీని రూపొందించింది. తెలంగాణలో తయారైన తొలి ట్యాబ్లెట్ ఇదే. డబ్ల్యూఎస్‌వీజీఏ డిస్ప్లేతో 7 అంగుళాల స్క్రీన్ , 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, లాలీపాప్ 5.1.1 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీని దీనికి పొందుపరిచారు. 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, ఓటీజీ, 3.2 ఎంపీ కెమెరా, ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ ఇతర ఫీచర్లు. ధర రూ.4,999. భారత్‌లో స్నాప్‌డీల్ ద్వారా ఇది లభిస్తుంది. హైదరాబాద్ సమీపంలోని సెల్‌కాన్‌కు చెందిన మేడ్చల్ ప్లాంటులో సీటీ722 తయారైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారమిక్కడ ఈ మోడల్‌ను ఆవిష్కరించారు. మొబైల్ హబ్ ఏర్పాటులో భాగంగా ఇతర కంపెనీలతోనూ చర్చిస్తున్నట్టు మంత్రి చెప్పారు. అంచనాలను మించి.. కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ మినహాయింపు కారణంగా ట్యాబ్లెట్‌ను 20 శాతం తక్కువ ధరకు విక్రయించేందుకు వీలైందని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ‘సీటీ722 కోసం ప్రపంచ దేశాల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. 40 దేశాలకు ఎగుమతి చేయనున్నాం. అందుబాటు ధరతోపాటు ఇంటెల్ ప్రాసెసర్‌తో రూపొందడంతో అంచనాలను మించి డిమాండ్ ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని అన్నారు. కంపెనీ తయారీ సామర్థ్యం జూన్ నాటికి నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని చెప్పారు. టీవీల తయారీకై డిసెంబర్లో భాగస్వామ్య కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఈ నెలలోనే రూ.5-10 వేల శ్రేణిలో నాలుగు 4జీ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలను ప్రవేశ పెడుతున్నట్టు సెల్కాన్ ఈడీ మురళి రేతినేని వెల్లడించారు. చైనాలోని షెంజెన్‌లో ఉన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ ప్లాంటులో 30 మోడళ్లను తయారు చేస్తున్నామని, వీటిని 12 దేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. స్నాప్‌డీల్‌లో కార్ల విక్రయం.. ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ ప్రస్తుతం హీరో, మహీంద్రా, వెస్పా, సుజుకి కంపెనీల ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క హీరో బ్రాండ్ టూ వీలర్లు రోజుకు 2,000 దాకా యూనిట్లు అమ్ముతున్నట్టు స్నాప్‌డీల్ స్ట్రాటజిక్ అలియాన్సెస్ వైస్ ప్రెసిడెంట్ కరన్ఖ రా తెలిపారు. త్వరలో కార్లను కూడా వెబ్సైట్లో చేరుస్తామని వెల్లడించారు. ఇక మొత్తం అమ్మకాల్లో మొబైల్స్ వాటా 30-40 శాతముందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.39,000 కోట్లకుపైగా వ్యాపారాన్ని నమోదు చేస్తామని అంచనాగా చెప్పారు. -
ఇక సెల్కాన్ ఎల్ఈడీ టీవీలు!
సెల్కాన్ సీఎండీ వై. గురు * సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి తయారీకి రూ.100 కోట్లు వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రంగంలో ఉన్న సెల్కాన్ త్వరలో ఎల్ఈడీ టీవీల తయారీలోకి అడుగుపెడుతోంది. 14 అంగుళాల నుంచి 50 అంగుళాల సైజులో ఉండే టీవీలను రూపొందిస్తారు. దీనికోసం అంతర్జాతీయ బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేస్తున్న చైనా, తైవాన్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలతో సెల్కాన్ చేతులు కలిపింది. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్‌లో ఉన్న మొబై ల్స్ అసెంబ్లింగ్ ప్లాంటులోనే టీవీలను కూడా తయా రు చేస్తారు. ఈ విషయాన్ని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్కాన్ సీఎండీ వై. గురు ధ్రువీకరించారు. సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి టీవీలను ప్రవేశపెడతామన్నారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. టీవీల తయారీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి తొలి కంపెనీగా రాబోతున్నారు. ఈ విభాగంలో మీ భవిష్యత్ వ్యూహమేంటి? అందుబాటు ధరలో ఆకర్షణీయ మోడళ్లను అందించడం ద్వారా మొబైల్స్ మార్కెట్లో సెల్కాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే ఊపుతో ఇప్పుడు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశిస్తున్నాం. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలోకి ప్రవేశించిన తొలి కంపెనీ మాదే అవుతుంది. టీవీ విడిభాగాల తయారీలో పేరున్న లిస్టెడ్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. సంక్రాంతికి సెల్కాన్ టీవీలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ముందుగా ఈ-కామర్స్ వేదికగా విక్రయిస్తాం. ఆ తర్వాత రిటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి. టీవీల తయారీ కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తున్నాం. మరో రెండు మొబైల్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నారు కదా! ఎక్కడివరకూ వచ్చింది? రేణిగుంట ప్లాంటుకు ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాబ్‌సిటీలో మరో ప్లాంటును నెలకొల్పుతున్నాం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 11.5 ఎకరాలను కేటాయించింది. ఈ రెండు ప్లాంట్లలో మార్చికల్లా తయారీని ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలతోపాటు ఎల్ఈడీ టీవీలను సైతం వీటిల్లో ఉత్పత్తి చేస్తాం. ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లను భవిష్యత్తులో రూపొందిస్తాం. నిధుల సమీకరణ సంగతో..? ముందుగా ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకోవాలి. ఆ తర్వాత విస్తరణకు పీఈ ఫండ్ల నుంచి నిధులు సేకరించాలనే ఆలోచన ఉంది. అయితే ఎంత మొత్తం సమీకరించేదీ ఇంకా నిర్ణయించలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు, భాగస్వామ్యానికి ఈ రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాథ హంతో సెల్కాన్లో విదేశీ కంపెనీలు పెట్టుబడికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. జేవీకి సైతం ప్రతిపాదనలు చేస్తున్నాయి. ప్రస్తుతం మాకు బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి మద్దతుంది. నిధులకు ఢోకా లేదు. 4జీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తున్నారు? ట్యాబ్లెట్ పీసీల విపణిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు మోడళ్లున్నాయి. రెండు మూడు నెలల్లో అయిదు మోడళ్లు రానున్నాయి. ఇందులో 4జీ వేరియంట్ కూడా తెస్తున్నాం. ఇంటెల్ చిప్సెట్తో ఒక ట్యాబ్లెట్‌ను కొద్ది రోజుల్లో ఆవిష్కరిస్తాం. ఈ మోడల్‌ను ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తాం. ఇప్పటి వరకు 3జీ స్మార్ట్ఫోన్లకే పరిమితమయ్యాం. డిసెంబరులో 4జీ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ప్రవేశిస్తాం. -
హైదరాబాద్ శివార్లలో మొబైల్ హబ్ ఏర్పాటు : కేటీఆర్
హైదరాబాద్ (మేడ్చల్) : హైదరాబాద్ శివార్లలో మొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ పారిశ్రామికవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్కాన్ మొబైల్ తయారీ కంపెనీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక పాలసీతో తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమ కేవలం గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలకే పరిమితం కాదని ఆ రంగాన్ని నగరం నలుమూలలకు విస్తరింపచేస్తామన్నారు. దేశంలో కోట్ల మంది సెల్ ఫోన్లు వాడుతున్నా దేశీయ మొబైల్ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక పాలసీలతో సెల్కాన్ మొబైల్ సంస్థ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా మేడ్చల్‌లో సెల్ఫోన్ల తయారీ పరిశ్రమను స్థాపించడం హర్షణీయమని మంత్రి తెలిపారు. మరిన్ని సెల్‌ఫోన్ సంస్థలను తెలంగాణలో స్ధాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్‌తో చర్చలు జరుపుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలు తెలంగాణలో ఏర్పాటు చేయుడం వల్ల తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి సైతం ఉపాధి దొరుకుతుందని అన్నారు. సెల్కాన్ మొబైల్ సంస్ధ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళి రేతినేని మాట్లాడుతూ ప్రస్తుతం మేడ్చల్ పరిశ్రమ ద్వారా రెండు లక్షల ఫోన్లను ఉత్పత్తి చేస్తామని, నెలకు 10లక్షల మొబైల్‌లు ఉత్పత్తి చేసే విధంగా కంపెనీని అభివృద్ధి చేస్తామని అన్నారు. -
హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్
-
హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్
⇒ 1,000 ఎకరాలిచ్చేందుకు ప్రభుత్వం ఓకే ⇒ ప్లాంట్ల ఏర్పాటుకు సెల్కాన్, కార్బన్ రెడీ ⇒ ఆసక్తి చూపుతున్న మరిన్ని కంపెనీలు సాక్షి, హైదరాబాద్/బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) భాగ్యనగరిపై మొగ్గు చూపుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హబ్‌ను ప్రతిపాదించగా దానికి పూర్తి మద్దతిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే భారత్‌లో మొబైల్స్ తయారీకి తొలి కేంద్రంగా హైదరాబాద్ నిలువనుంది. హబ్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు సెల్కాన్, కార్బన్‌తోపాటు చైనాకు చెందిన రెండు మూడు కంపెనీలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. నెలకు 10 లక్షల మొబైల్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని సీఎంను కలిసిన అనంతరం సెల్కాన్ సీఎండీ వై.గురు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఐసీఏ చొరవతో.. భారత్‌లో మొబైల్స్ తయారీకి హబ్ ఉండాలన్న తలంపుతో కొన్ని నెలలుగా ఐసీఏ తీవ్రంగా యత్నిస్తోంది. ఇందుకు సహకరించాలని పలు రాష్ట్రాలను సంప్రదించింది. మేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును సైతం కంపెనీల ప్రతినిధులు కలిశారు. మంగళవారం ఇదే విషయమై కేసీఆర్‌ను ఐసీఏ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ, సెల్కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ, ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫూల్జే, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని కలిశారు. హబ్ వస్తే 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు సీఎంకు తెలిపారు. ఐసీఏ ప్రతిపాదనను స్వాగతిస్తూ హైదరాబాద్ ప్రాంత విశిష్టతలను, రానున్న రోజుల్లో తెలంగాణ రూపురేఖలు ఏ విధంగా మారనున్నాయో ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రాయితీల్ని తామిస్తామని స్పష్టం చేశారు. ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతోనూ ఐసీఏ ప్రతినిధులు చర్చించారు. హబ్ కార్యరూపం దాల్చేందుకు వెన్నంటి ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. భారీ ఆఫర్.. కేంద్ర తయారీ విధానం-2012 ప్రకారం ప్లాంటుపై పెట్టే పెట్టుబడిలో 25 శాతాన్ని కేంద్రం రిఫండ్ చేస్తుంది. జూలైతో ముగియనున్న ఈ స్కీంను కొన్నాళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని ఐసీఏ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. సీఎం వెంటనే స్పందించి ఈ మేరకు కేంద్రానికి లేఖను పంపాలని అధికారుల్ని కోరారు. హబ్ ఏర్పాటుకు 200 ఎకరాలు అవసరమవుతాయని కంపెనీలు ప్రతిపాదించగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1,000 ఎకరాలు కేటాయించేందుకు సీఎం సిద్ధపడ్డారు. మొబైల్స్‌పై వ్యాట్ విషయంలో నెలకొన్న అస్పష్టతను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లగా 5 శాతానికే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చొరవ భేష్ అంటూ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి, మహేశ్వరం, రావిర్యాల్ ప్రాంతాల్లో భూములను కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. -
రూ.3 వేలకే సెల్కాన్ క్వాడ్‌కోర్ మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ సెల్కాన్.. క్యాంపస్ సిరీస్‌లో క్యూ405 మోడల్‌ను స్నాప్‌డీల్‌లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రూపొందిన ఈ మోడల్ ధర రూ.3,199 మాత్రమే. ఫీచర్ ఫోన్ ధరకే హై ఎండ్ ఫీచర్లను అందిస్త్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. టెక్స్ట్ వేగంగా కంపోజ్ చేసేందుకు వీలుగా అంతర్గతంగా స్విఫ్ట్‌కీ ఫీచర్‌ను పొందుపరిచారు. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్ప్లే, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్, డ్యూయల్ సిమ్, ఫ్లాష్‌తో 3.2 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్‌బిల్ట్ జీపీఎస్, 3జీ, వైఫై తదితర ఫీచర్లున్నాయి. -
సెల్కాన్ నుంచి మిలీనియా క్యూ450
ధర రూ. 4,799 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగ సంస్థ సెల్కాన్ తాజాగా మిలీనియా సిరీస్‌లో క్యూ450 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అందమైన బ్యాక్ కవర్‌తో గోల్డ్, వైట్, గ్రే రంగుల్లో దీనిని రూపొందించింది. 4.5 అంగుళాల కెపాసిటివ్ ఎఫ్‌డబ్ల్యువీజీఏ, ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. డ్యూయల్ సిమ్, 3జీ, వీడియో కాలింగ్, 5 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై, బ్లూటూత్ ఫోన్ ఇతర విశిష్టతలు. ధర రూ.4,799. మిలీనియా సిరీస్‌లో తొలిసారి రూ.5 వేలలోపు ధరలో ఈ మోడల్ తీసుకొచ్చామని సెల్కాన్ సీఎండీ వై.గురు గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. మార్కెట్లో ఈ మోడల్ సంచలనం సృష్టించడం ఖాయమని అన్నారు. వచ్చే త్రైమాసికంలో.. 2015-16 తొలి త్రైమాసికంలో 20 మోడళ్ల వరకు విడుదల చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. వీటిలో నాలుగు ట్యాబ్లెట్ మోడళ్లు ఉంటాయని వై.గురు తెలిపారు. 5 అంగుళాల స్క్రీన్‌తో రెండు వైపులా గొరిల్లా గ్లాస్‌తో ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ తదితర ఫీచర్లతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు చెప్పారు. మందం 7 మిల్లీమీటర్ల లోపే ఉంటుందని వివరించారు. రూ.10 వేల ధరలో విడుదల చేస్తామని చెప్పారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్ సైతం ప్రవేశపెడతామన్నారు. మే నెల లో 4జీ హ్యాండ్సెట్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. -
మిలీనియం Q450 ఫోన్ లాంచ్
-
సెల్‌కాన్‌తో ఎయిర్‌సెల్ జట్టు
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్‌తో టెలికం కంపెనీ ఎయిర్‌సెల్ చేతులు కలిపింది. క్యాంపస్ ఏ356 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై సీ329 ఫీచర్ ఫోన్‌ను సెల్కాన్ ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు ఫోన్లకు ఎయిర్‌సెల్ 1.5 జీబీ వరకు 3జీ డాటాను ఉచితంగా ఇవ్వనుంది. కిట్‌క్యాట్, డ్యూయల్ సిమ్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల తెర, 2 ఎంపీ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటివి ఏ356 విశిష్టతలు. 1.8 అంగుళాల స్క్రీన్‌తో డ్యూయల్ సిమ్ కలిగి ఉన్న సెల్కాన్ సీ329లో ఆడియో, వీడియో ప్లేయర్లతోపాటు ఆటోకాల్ రికార్డింగ్, ఎఫ్ఎం, బ్లూటూత్, జీపీఆర్ఎస్, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్యాక్ ధర రూ.3,333. ఈ ఒప్పందం ఇరు కంపెనీలకు కలిసి వస్తుందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా తెలిపారు. -
దక్షిణాది టాప్ ప్లేయర్‌గా సెల్కాన్
నెలకు 4 లక్షల మొబైల్స్ విక్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ దక్షిణాది రాష్ట్రాల్లో తన హవాను కొనసాగిస్తోంది. అమ్మకాల పరంగా దక్షిణాదిన తొలి స్థానంలో నిలిచిన సంస్థ.. ఇదే ఊపుతో ఇప్పుడు విదేశీ మార్కెట్లపై దృష్టిసారించింది. ఈ ఏడాది కొత్తగా 30 దేశాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విపణిలో నెలకు 5 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. 2014లో 25 మోడళ్లను ఆవిష్కరించిన కంపెనీ ఈ ఏడాది 40 కొత్త ఫోన్లను పరిచయం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు 24 లక్షల ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో సెల్కాన్ వాటా 4 లక్షల యూనిట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 9 లక్షల పీసులు విక్రయమవుతుండగా, సెల్కాన్ 3 లక్షల యూనిట ్లతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో ఉన్న కంపెనీ నెలకు 2 లక్షల యూనిట్లు విక్రయిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ నుంచి ఇటీవలే టాప్ ఇంపోర్టర్ అవార్డును సైతం సెల్కాన్ దక్కించుకుంది. వాయిస్ కాల్ ట్యాబ్ రూ.4 వేలకే.. ట్యాబ్లెట్ల అమ్మకాల్లో 2012లో దక్షిణాదిన తొలి స్థానాన్ని సెల్కాన్ దక్కించుకుంది. దేశీయ మార్కెట్లో ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీ తిరిగి ఈ విభాగంపై దృష్టిసారించింది. రూ.4 వేలకే డ్యుయల్ సిమ్ ట్యాబ్లెట్‌ను తీసుకొస్తోంది. అలాగే ఇంటెల్ ప్రాసెసర్‌తో 3జీ క్వాడ్‌కోర్ ట్యాబ్‌ను ప్రవేశపెడుతోంది. 8 అంగుళాల మోడల్ కూడా రానుంది. అన్నీ రూ.10 వేల లోపు ధరలో ఉంటాయి. ఇక కార్పొరేట్ కంపెనీల కోసం కస్టమైజ్డ్ ట్యాబ్స్‌ను అందిస్తున్నామని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ట్యాబ్లెట్లను సరఫరా చేసేందుకు జాతీయ స్థాయిలో ప్రభుత్వంతోనూ చర్చిస్తున్నట్టు చెప్పారు. ఇవీ కొత్త మోడళ్లు.. అక్టాకోర్లో రూ.6 వేలకే స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో వస్తోంది. గతేడాది ఇదే ధరలో క్వాడ్కోర్ను అందించింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రానుంది. రూ.5,555 ధరలో క్యూ54 పేరుతో 5 అంగుళాల స్క్రీన్‌తో, క్వాడ్‌కోర్, 3జీ ఫీచర్లతో సెల్ఫీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వైపులా 5 ఎంపీ కెమెరాలను పొందుపరిచారు. వేలి ముద్ర, మొహం, మాటలను గుర్తించి పనిచేసే వ్యవస్థ ఉంది. కార్పొరేట్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్లను జత చేశారు. యాక్సెసరీస్ విషయంలో ప్రధానంగా పవర్ బ్యాంక్‌ల పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో అధిక సామర్థ్యం గల మోడళ్లను సంస్థ తీసుకొస్తోంది. 4జీ కోసం బార్సిలోనా.. ఈ నెల 2-5 తేదీల్లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ పాల్గొంటోంది. స్మార్ట్ఫోన్ల రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటామని గురు తెలిపారు. ప్రధానంగా 4జీపై దృష్టిసారిస్తామని వెల్లడించారు. 2015లో కంపెనీ ప్రధాన ఫోకస్ స్మార్ ్టఫోన్లపైనే ఉంటుందని చెప్పారు. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీలతో బార్సిలోనా వేదికగా చేతులు కలుపుతామని వెల్లడించారు. కస్టమర్లకు అందుబాటు ధరలో ఆధునిక ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చైనాలోని షెంజెన్‌లో నెలకు 5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో అసెంబ్లింగ్ యూనిట్‌ను సెల్కాన్ ఏర్పాటు చేసింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు ఫోన్లను పరీక్షించేందుకు ల్యాబ్‌ను నెలకొల్పింది. సెల్కాన్ కేర్.. సర్వీసింగ్‌కు పెద్ద పీట వేస్తూ సెల్కాన్ కేర్ కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. తక్కువ సమయంలో ఫోన్ల రిపేర్ పూర్తి కావాలన్నది కంపెనీ ఉద్దేశం. ఇటువంటివి ప్రస్తుతం 20 సెంటర్లున్నాయి. మార్చికల్లా దక్షిణాదిన మరో 50 ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాదిన మూడు నెలల్లో 20 కేంద్రాలు రానున్నాయి. సెల్కాన్ పాత ఫోన్ల విడిభాగాలు, కొత్త మోడళ్లు, యాక్సెసరీస్ ఇక్కడ లభిస్తాయి. పాత ఫోన్ ఇచ్చి కొత్తది కొనుక్కునే అవకాశమూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 850పైగా అధీకృత సర్వీస్ సెంటర్లను కంపెనీ నిర్వహిస్తోంది. తరగని డిమాండ్.. ఏ35కే ! 3జీ, కిట్‌క్యాట్ ఓఎస్‌తో కంపెనీ ప్రవేశపెట్టిన ఏ35కే మోడల్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. రూ.2,999 ధరలో భారత్‌లో ఇటువంటి మోడల్ ప్రవేశపెట్టిన ఘనత సెల్‌కాన్‌దే. రష్యా, స్పెయిన్, ఆఫ్రికా నుంచి కొత్త ఆర్డర్లు వెల్లువెత్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 2 లక్షల పీసులు అమ్ముడయ్యాయి. మరో 5 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం సెల్కాన్ 15 దేశాల్లో సెల్ఫోన్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది మరో 30 దే శాల్లో అడుగు పెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. రష్యా, దుబాయ్‌లో పెద్ద ఎత్తున విస్తరించేందుకు కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. ఆఫ్రికా దేశాల కోసం ప్రత్యేక సేల్స్ టీమ్‌ను నియమించింది. -
సెల్కాన్ నుంచి 5 ఎంపీ సెల్ఫీ ఫోన్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ సంస్థ సెల్కాన్ తన మిల్లీనియా సిరీస్‌లో ‘ఎమ్ఈ క్యూ54’ అనే మరో రకం మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫ్లాష్‌తో కూడిన 5 ఎంపీ రియర్ కెమెరా, 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతోపాటు 5 రకాల రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ.5555 అని సెల్కాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కిట్ క్యాట్-4.4.2 ఓఎస్‌పై నడిచే ఈ ఫోన్లో 1.2 గిగా క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ రామ్, 3జి- వీడియో కాలింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌తో సహా ఈ ఏడాది రెండు విభిన్న మొబైళ్లను మార్కెట్లోకి విడుదల చేశామని సంస్థ సీఎండీ వై.గురు అన్నారు. -
మైక్రోసాఫ్ట్‌తో సెల్కాన్ జట్టు
విండోస్ ఫోన్ విన్400 ఆవిష్కరణ భారత్‌లో చవకైన విండోస్ ఫోన్ మార్చికల్లా విండోస్ ట్యాబ్లెట్ పీసీ సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ విండోస్ విభాగంలోకి ప్రవేశించింది. విన్400 పేరుతో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారమిక్కడ ఆవిష్కరించింది. ధర రూ.4,979. ఇంత తక్కువ ధరలో భారత్‌లో లభించే విండోస్ ఫోన్ ఇదే కావడం విశేషం. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, ఫ్లాష్ లైట్-ఆటో ఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ముందు కెమెరాను నిక్షిప్తం చేశారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వన్‌డ్రైవ్‌లో 15 జీబీ ఉచిత స్టోరేజ్ ఉంది. 3జీ, డ్యూయల్ సిమ్, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ, 10.5 మిల్లీమీటర్ల మందం, 120 గ్రాముల బరువు ఇతర విశిష్టతలు. విండోస్‌లో మరిన్ని మోడళ్లు..: మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మార్చికల్లా మరో రెండు విండోస్ ఫోన్లు తేనున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వీటిలో 5 అంగుళాల స్క్రీన్ కలిగిన మోడల్ కూడా ఉంటుందన్నారు. ట్యాబ్లెట్ పీసీని రూ.10 వేల లోపు ధరలో పరిచయం చేస్తామన్నారు. విన్400కు మంచి స్పందన ఉందని, డిసెంబర్లోనే దేశీయ మార్కెట్లో 20 వేల యూనిట్లు విక్రయించే అవకాశముందన్నారు. అక్టాకోర్ ప్రాసెసర్‌తో కూడిన ఫోన్‌ను ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. విండోస్ అనగానే ఖరీదైన ఫోన్ అనుకుంటారు. సామాన్యులకూ అందుబాటులో ఉండాలని విన్400 ధర రూ.5 వేల లోపే నిర్ణయించామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. స్మార్ట్ఫోన్ల విభాగంలో సెల్కాన్ వాటాను ప్రస్తుతమున్న 4 శాతం నుంచి మార్చికల్లా 7-8 శాతానికి చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్టు చెప్పారు. 2015లో 4కె స్క్రీన్..: అత్యంత స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ కలిగిన 4కె రిజొల్యూషన్(4096గీ2160) స్క్రీ న్ 2015లో కార్యరూపం దాలుస్తుందని క్వాల్కామ్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ డెరైక్టర్ రోహిత్ కపూర్ తెలిపారు. విండోస్ ఫోన్ల విపణిలో మరిన్ని కంపెనీలతో జట్టుకడతామని మైక్రోసాఫ్ట్ ఇండియా మొబిలిటీ డెరైక్టర్ రాజీవ్ అహ్లవత్ పేర్కొన్నారు. -
మార్కెట్లోకి సెల్కాన్ ఎపిక్ క్యూ550
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల సంస్థ సెల్కాన్.. మిలీనియా సిరీస్‌లో ఎపిక్ క్యూ550 మోడల్‌ను ఆవిష్కరించింది. 8 మిల్లీమీటర్ల మందం, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణ. 24 రోజుల స్టాండ్ బై ఉంటుందని కంపెనీ తెలిపింది. 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ వన్ గ్లాస్ సొల్యూషన్ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, క్వాడ్‌కోర్ 1.3 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటివి అదనపు హంగులు. ఆటోఫోకస్, ఫ్లాష్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ముందు కెమెరా ఉన్నాయి. 64 జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. పెన్‌డ్రైవ్, మౌస్, కీ బోర్డును ఫోన్‌కు అనుసంధానించొచ్చు. ధర రూ.10,499. బరువు 143 గ్రాములు. బ్యాటరీని బయటకు తీయడానికి వీలులేని యూనిబాడీ డిజైన్‌తో ఫోన్‌ను రూపొందించినట్టు కంపెనీ ఈడీ మురళి రేతినేని ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. భారత్‌లో తొలిసారిగా.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల తొలి ప్రాధాన్యత బ్యాటరీ బ్యాకప్ అని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక బ్యాటరీ బ్యాకప్‌తోపాటు తక్కువ మందంతో తేలికైన ఎపిక్ క్యూ550 మోడల్‌కు రూపకల్పన చేశామని చెప్పారు. ఇంత తక్కువ ధరలో, ఈ ఫీచర్లతో కూడిన మొబైల్ మార్కెట్లోకి రావడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రిటైలర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని గుర్తు చేశారు. 5.5 అంగుళాల స్క్రీన్ ఉన్న మోడళ్లకు గిరాకీ పెరుగుతోందన్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో ఫోన్ డిజైన్ చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఔట్‌లెట్లతోపాటు స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్లలో ఫోన్ లభిస్తుందని తెలిపారు. శ్రీలంక, నేపాల్, సింగపూర్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు వెల్లడించారు. -
రూ.2 వేలకే సెల్కాన్ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ రంగ సంస్థ సెల్కాన్ ‘క్యాంపస్ నోవా ఏ352ఈ’ పేరుతో చవకైన స్మార్ట్‌ఫోన్‌ను బుధవారమిక్కడ ఆవి ష్కరించింది. ఒపేరా మినీ మొబైల్ బ్రౌజర్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేశారు. ఇందుకోసం ఒపేరా సాఫ్ట్‌వేర్‌తో ఒప్పం దం చేసుకుంది. ఆన్‌డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3.5 అంగుళాల స్క్రీన్, 256 ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2 ఎంపీ కెమెరా, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వైఫై వంటి ఫీచర్లతో రూపొందించారు. ధర రూ.2 వేలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఫీచర్లతో ప్రపంచంలోకెల్లా చౌక స్మార్ట్‌ఫోన్ ఇదేనని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా చెప్పారు. తొలుత ఆన్లైన్లో స్నాప్‌డీల్ ద్వారా, దీపావళి నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపారు. లక్ష ఫోన్లు విక్రయించే అవకాశం ఉందన్నారు. దీపావళికి విండోస్ ఫోన్లు..: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను దీపావళికి ప్రవేశపెట్టనున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. 4 అంగుళాల స్క్రీన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీతో తీసుకొస్తున్నట్టు చెప్పారు. రూ.6 వేలలోపు ధర ఉంటుందన్నారు. డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో కూడిన ట్యాబ్లెట్ పీసీ సైతం రానుందని చెప్పారు. కాగా, ఒపేరా బ్రౌజర్ ప్రీ-ఇన్స్టాల్ చేసిన నోకియా ఫోన్లు 2015 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఒపేరా సాఫ్ట్వేర్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ సునీల్ కామత్ వెల్లడించారు. నోకియా భవిష్యత్ ఫోన్లు తమ కంపెనీ బ్రౌజర్‌తో రానున్నాయన్నారు. ఒపేరా మినీ బ్రౌజర్ వాడకం భారత్‌లో 2013 నుంచి 24% వృద్ధి చెందిందని చెప్పారు. భారత్‌కు చెందిన 16 మొబైల్ కంపెనీలు ఆపెరాతో చేతులు కలిపాయి. -
ఎయిర్‌టెల్‌తో సెల్కాన్ భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ మిలీనియం డాజిల్ క్యూ44ను సోమవారమిక్కడ ఆవిష్కరించింది. టెలికం కంపెనీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో డాజిల్ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 500 ఎంబీ చొప్పున రెండు నెలలు ఉచిత 3జీ డేటాను ఆఫర్ చేస్తోంది. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ ఐపీఎస్ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్, గెస్చర్ సెన్సార్, 3జీ వీడియో కాలింగ్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.6,499. వెనుకవైపు కవర్‌ను అల్యూమినియంతో తయారు చేశారు. గోల్డ్, సిల్వర్, గ్రే రంగుల్లో లభిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలను తలదన్నేలా దీనిని రూపొందించామని కంపెనీ చెబుతోంది. సెల్కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని, ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సేల్స్ హెడ్ శేఖర్ గావంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేటికవే ప్రత్యేకం.. తేలికైన, పలుచని స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్శించామని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. విడుదల చేస్తున్న ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకమైనదని చెప్పారు. ‘ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో రూ.2,999 ధరలో రూపొందించిన 3జీ ఫోన్ ఏ35కె మోడల్‌కు యూరప్ నుంచి కూడా ఆర్డర్లున్నాయి. ఒక లక్ష ఫోన్లు విక్రయించాం. మరో 2 లక్షల ఫోన్లకు ఆర్డర్లున్నాయి. ఇంత తక్కువ ధరలో ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో 3జీ ఫోన్ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని పేర్కొన్నారు. ఎంటీకే, స్పెక్ట్రమ్ కంపెనీల చిప్సెట్లతో అందుబాటు ధరలో ఫోన్లను విక్రయించేందుకు కంపెనీకి వీలైందని అన్నారు. ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి.. సెల్కాన్ త్వరలో ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి అడుగు పెడుతోంది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7.9 మిల్లీమీటర్ల మందం, క్వాడ్‌కోర్ ఓఎస్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్‌తో రూపుదిద్దుకుంటోంది. ధర రూ.10 వేలలోపు ఉండొచ్చు. కిట్‌క్యాట్ ఓఎస్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో ట్యాబ్లెట్ పీసీ కూడా రానుంది. ప్రతి జిల్లా కేంద్రంలో స్మార్ట్ సర్వీస్ కేంద్రాలను సెల్కాన్ ఏర్పాటు చేస్తోంది. స్మార్ట్ఫోన్ల సర్వీసింగ్‌తోపాటు కంపెనీ యాక్సెసరీస్ ఈ కేంద్రాల్లో లభిస్తాయి. ప్రభుత్వాలకు సరఫరా చేస్తాం... ట్యాబ్లెట్ పీసీలు కావాల్సిన ఫీచర్లతో రాష్ట్ర ప్రభుత్వాల విద్యా కార్యక్రమాలకు అతి తక్కువ ధరలో, నాణ్యమైన ట్యాబ్లెట్స్ను సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సెల్కాన్ సీఎండీ వెల్లడించారు. అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాము నెలకొల్పుతామని, కేంద్రం విడుదల చే సే మొబైల్ పాలసీని బట్టి ప్లాంటు ఎక్కడ పెట్టేది నిర్ణయిస్తాం. మాతోపాటు ఇతర కంపెనీలనూ తీసుకొస్తాం’ అని అన్నారు. -
సెల్కాన్.. స్లిమ్ స్మార్ట్‌ఫోన్
►7.9 మిల్లీమీటర్ల మందం ►ఆవిష్కరించిన సానియా మిర్జా ►10 రోజుల్లో లక్ష ఫోన్లు విక్రయిస్తాం ►సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ ‘మిలీనియం వోగ్ క్యూ455’ పేరుతో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించింది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా దీన్ని విడుదల చేశారు. 7.9 మిల్లీ మీటర్ల మందం, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. 4.5 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ కెమెరా, 1.3 ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లున్నాయి. ధర రూ.7,999. క్వాడ్‌కోర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇంత పలుచని ఫోన్ మార్కెట్లో లేదని సెల్కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. సొంత డిజైన్‌లో ఆరు నెలల పరిశోధన తర్వాత మోడల్‌ను విడుదల చేశామన్నారు. గేమ్ చేంజర్ మోడల్.. వోగ్ క్యూ455 మోడల్ కోసం ఇప్పటికే 20 వేల బుకింగ్స్ ఉన్నాయని, 10 రోజుల్లో ఒక లక్ష ఫోన్లు విక్రయిస్తామని గురు ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్ఫోన్ల రంగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందన్నారు. ‘భారత్‌లో మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో రూ.6-12 వేల ధరలో లభించే మోడళ్ల వాటా 60 శాతంగా ఉంది. ఈ ధరను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా అత్యుత్తమ ఫీచర్లతో మోడళ్లను పరిచయం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మిలీనియం సిరీస్‌లో ఇప్పటికే మూడు మోడళ్లను తెచ్చాం. మరో 7 మోడళ్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రూ.10-12 వేల లోపు ధరలో పలు మోడళ్లు ఆగస్టు చివరికల్లా మార్కెట్లోకి రానున్నాయి’ అని చెప్పారు. తొలుత వారంపాటు స్నాప్‌డీల్‌కు, ఆ తర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఆన్లైన్ కంపెనీలకు విక్రయిస్తామని పేర్కొన్నారు. మరో 10 దేశాలకు.. ఇప్పటి వరకు 500లకుపైగా మోడల్స్ విడుదల చేశామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. దక్షిణాదిన తొలి స్థానంలో, భారత్‌లో టాప్-5 కంపెనీల్లో సెల్కాన్ ఉందన్నారు. ప్రస్తుతం భారత్‌తోపాటు దుబాయి, జింబాబ్వే, జాంబియా, నేపాల్, శ్రీలంక తదితర దేశాల్లో సెల్కాన్ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. తాజాగా మాల్దీవులు, మారిషస్ తదితర 10 దేశాల్లో అడుగుపెట్టనుంది. ఆగస్టు నుంచి ఎగుమతుల ద్వారా కంపెనీ నెలకు రూ.50 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. -
3వేలకే ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్!!
చవక సెల్ఫోన్లతో మార్కెట్లో తనదైన వాటాను ఆక్రమిస్తున్న సెల్కాన్ మరో అడుగు ముందుకేసింది. కేవలం 3 వేల రూపాయలకే ఫ్రంట్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. 'క్యాంపస్ ఎ35కె' పేరుతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను అచ్చంగా స్నాప్‌డీల్ ద్వారా మాత్రమే అమ్ముతోంది. దీని ధరను రూ. 2,999గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ఫోన్లలో ఇదే అత్యంత చవకైనదని కంపెనీ చెబుతోంది. డ్యూయల్ సిమ్‌లు పనిచేసే ఈ ఫోన్‌కు 1గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్ ఉన్నాయి. 3.5 అంగుళాల డిస్ప్లేతో పాటు 3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, .3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా , 512 ఎంపీ ఇన్‌బిల్ట్ స్టోరేజి ఉన్నాయి. దీన్ని 32 జిబి వరకు విస్తరించుకోవచ్చు. వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, ఏజీపీఎస్ కనెక్టివిటీలతో పాటు దీనికి 3జీ కనెక్టివిటీ కూడా ఉంది. ఆండ్రాయడ్ కిట్‌కాట్ అనేది గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అత్యంత తాజా వెర్షన్. ఇప్పటివరకు జెల్లీబీన్ ఓఎస్ ఉన్న ఫోన్లు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. దాంతో ఇప్పుడు అంతా కొత్త ఓఎస్ మీదే దృష్టిపెట్టారు. -
మార్కెట్లోకి సల్కాన్ తెలుగు స్మార్ట్ ఫోన్లు
-
సెల్కాన్ ఫోన్లలో తెలుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంక్షిప్త సందేశాలతోపాటు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి అప్లికేషన్లను తెలుగులో వినియోగించుకునే వీలున్న సెల్ఫోన్లను సెల్కాన్ ఆవిష్కరించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా మంగళవారమిక్కడ వీటిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో 90 శాతంపైగా మోడళ్లలో తెలుగు భాషను నిక్షిప్తం చేస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా చెప్పారు. ఫోన్లన్నీ ఇంగ్లీషులో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఎస్ఎంఎస్లు, యాప్స్ వాడకం తెలియడం లేదని, ఈ కారణంగానే గ్రామాల్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పారాయన. రూ.1,000లోపు ధరలో ఉన్న మోడల్లో కూడా తాము తెలుగును ప్రవేశపెట్టామని, ఇది ఒకరకంగా సంచలనమేనని వ్యాఖ్యానించారు. హిందీ, తమిళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మలయాళం భాషల సాఫ్ట్వేర్లను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే సెల్కాన్ స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారు స్థానిక భాషలు కావాలంటే సర్వీసింగ్ కేంద్రానికి వెళ్లాలి. దూసుకెళ్తున్న స్మార్ ్టఫోన్ల వాటా.. సెల్కాన్ ప్రస్తుతం నెలకు 6 లక్షల సెల్ఫోన్లను విక్రయిస్తోంది. ఆదాయంలో స్మార్ట్ఫోన్ల వాటా 50 శాతంగా ఉంది. డిసెంబరు నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. పరిమాణం ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 40 శాతానికి ఎగబాకుతుందని గురు తెలిపారు. తెలుగు నిక్షిప్తమైన ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీచర్ ఫోన్లలో కూడా జీపీఆర్ఎస్, వాట్సాప్‌ను పొందుపర్చనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరిలో దుబాయిలో అడుగు పెడుతున్నామని తెలియజేవారు. ప్లాంటుకు తోడ్పాటు: పొన్నాల అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటుకు సెల్కాన్ ముందుకు వస్తే తగు ప్రోత్సాహమిస్తామని పొన్నాల హామీ ఇచ్చారు. సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నామని సెల్కాన్ ప్రతినిధులు చెప్పగా.. ముందు మీరు ప్లాంటు ప్రారంభించండి, కావాల్సిన సహాయం చేస్తామంటూ మంత్రి పేర్కొన్నారు. -
సెల్కాన్.. రెహ్మానిష్క్ ఫోన్
కోల్‌కతా, సాక్షి ప్రతినిధి: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ సెల్కాన్.. సంగీత ప్రియులు, యువత కోసం రెహ్మానిష్క్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్‌తో కలిసి సెల్కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని ఏఆర్45 ఫోన్‌ని ఆవిష్కరించారు. కొత్త టెక్నాలజీతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోందంటూ ఈ సందర్భంగా రెహ్మాన్ సెల్కాన్ని అభినందించారు. సాధ్యమైనంత వరకూ దేశీయ కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. సంగీతానికి సంబంధించి అత్యాధునిక వాద్య పరికరాల తయారీ ఇక్కడ తక్కువ కావడంతో తాను విదేశీవి కొనాల్సి వస్తోందని చెప్పారు. ఫోన్ ఆవిష్కరణలో తొలిసారిగా అత్యాధునిక 4డీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీని వినియోగించారు. త్వరలో మరిన్ని.. రెహ్మానిష్క్ పేరిట కోల్‌కతా, వైజాగ్ సహా నాలుగు ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఏఆర్ సిరీస్‌లో మరో మూడు స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తామని గురు తెలియజేశారు. ఒక్కో నగరంలో ఒక్కో మోడల్ చొప్పున ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఉంటాయన్నారు. వీటి ధరలు సుమారు రూ. 6,000 నుంచి రూ. 9,000 దాకా ఉంటాయని, దసరా సీజన్లో నెలకు లక్ష హ్యాండ్సెట్స్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వీటిని ఆఫ్రికా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు తెలియజేశారు. రెహ్మానిష్క్పై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారీ స్పందన వస్తోందని, ట్విట్టర్ ట్రెండ్స్‌లో ఇది నాలుగో స్థానంలో నిల్చిందని గురు చెప్పారు. రె హ్మానిష్క్ సిరీస్ ఫోన్ల కోసం రెహ్మాన్ ప్రత్యేకంగా జింగిల్ తయారు చేశారని, ఈ రింగ్టోన్ని మిగతా హ్యాండ్సెట్స్లోనూ అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో క్యాంపస్ సిరీస్‌లో ఏ-15 మోడల్ ప్రవేశపెడుతున్నామని, దీని ధర సుమారు రూ. 3,799గా ఉంటుందని చెప్పారు. రెహ్మానిష్క్ ఏఆర్45 ప్రత్యేకతలు... 4.5 అంగుళాల స్క్రీన్ ఉండే ఏఆర్45 ఫోన్... ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ఏ7 ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 4జీ ఆర్వోఎం, ఇంటరాక్టివ్ గేమింగ్ వంటి ఫీచర్లుంటాయి. ధర రూ.7,999. ఏఆర్ రె హ్మాన్ స్వరపర్చిన సూపర్‌హిట్ పాటలు ప్రీలోడెడ్ కంటెంట్‌గా లభిస్తాయి. మెరుగైన సంగీతానుభూతి ఇచ్చేందుకు కె-క్లాస్ యాంప్లిఫయర్తో డ్యూయల్ స్పీకర్లు రూపుదిద్దుకున్నాయి. ఇందులో షేక్ అండ్ ట్రాన్స్ఫర్, ఫోటా (ఫర్మ్‌వేర్ ఓవర్ ది ఎయిర్) వంటి సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించామని మురళి తెలి పారు. ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి కేబుల్స్, బ్లూటూత్ వంటివేమీ లేకుండా షేక్ చేయడం ద్వారా వేగంగా డేటాను పంపేందుకు షేక్ అండ్ ట్రాన్స్ఫర్ ఉపయోగపడుతుందని వివరించారు. 100 ఎంబీ డేటాను సైతం ఈ పద్ధతిలో కేవలం రెండు సెకన్లలో పంపొచ్చని మురళి చెప్పారు