సెల్‌కాన్‌తో ఎయిర్‌సెల్ జట్టు | Celkon and Aircel join hands to bring smart offers | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్‌తో ఎయిర్‌సెల్ జట్టు

Published Thu, Mar 5 2015 12:51 AM | Last Updated on Fri, May 25 2018 6:02 PM

సెల్‌కాన్‌తో ఎయిర్‌సెల్ జట్టు - Sakshi

సెల్‌కాన్‌తో ఎయిర్‌సెల్ జట్టు

హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్‌తో టెలికం కంపెనీ ఎయిర్‌సెల్ చేతులు కలిపింది. క్యాంపస్ ఏ356 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై సీ329 ఫీచర్ ఫోన్‌ను సెల్‌కాన్ ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు ఫోన్లకు ఎయిర్‌సెల్ 1.5 జీబీ వరకు 3జీ డాటాను ఉచితంగా ఇవ్వనుంది. కిట్‌క్యాట్, డ్యూయల్ సిమ్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల తెర, 2 ఎంపీ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటివి ఏ356 విశిష్టతలు.

1.8 అంగుళాల స్క్రీన్‌తో డ్యూయల్ సిమ్ కలిగి ఉన్న సెల్‌కాన్ సీ329లో ఆడియో, వీడియో ప్లేయర్లతోపాటు ఆటోకాల్ రికార్డింగ్, ఎఫ్‌ఎం, బ్లూటూత్, జీపీఆర్‌ఎస్, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్యాక్ ధర రూ.3,333. ఈ ఒప్పందం ఇరు కంపెనీలకు కలిసి వస్తుందని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement