Dual Sim Phones
-
మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ - 4
-
డ్యూయల్ సిమ్ ఐఫోన్ వచ్చేసింది
క్యుపర్టినో, కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం యాపిల్ మొట్టమదటిసారిగా డ్యూయల్ సిమ్ ఐఫోన్లను తీసుకొచ్చింది. కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈవో టిమ్ కుక్.. ఐఫోన్ 10ఎస్ ఫోన్లను ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్) ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఇవి లభిస్తాయి. 64జీబీ, 256జీబీ, 512జీబీ మెమరీ వేరియంట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 21 నుంచి వీటి తొలి దశ డెలివరీ మొదలవుతుంది. రెండో దశ డెలివరీ సెప్టెంబర్ 28 నుంచి చేపట్టనుంది. ఆ సమయం నుంచే భారత్‌కు కూడా ఈ డివైజ్‌లు వస్తాయి. ఐఫోన్ 10ఎస్ ధర 999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుండగా.. ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ ధర 1099 డాలర్ల నుంచి మొదలువుతుంది. రెండింటిలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ను చేర్చారు. వాచ్‌లలో సిరీస్ 4ను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. పాత వాటితో పోలిస్తే ఈ వాచ్‌ల స్క్రీన్ 30 శాతం పెద్దదిగా ఉంటుంది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. వీటి ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డ్యూయల్ సిమ్ ఐఫోన్ వచ్చేస్తోంది..!
ఆపిల్ ఈ ఏడాది మూడు ఐఫోన్ మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త ఫోన్ల తయారీ కూడా ఆపిల్ ప్రారంభించింది. ఈ ఫోన్లపై గత కొంత కాలంగా వస్తున్న రిపోర్టుల బట్టి రెండు ఐఫోన్ మోడల్స్ ఓలెడ్ డిస్ప్లేతో, మూడో ఐఫోన్ ఎల్సీడీ డిస్ప్లేతో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. అయితే తాజాగా కేజీఐ సెక్యురిటీస్ విశ్లేషకుడు మింగ్-చి కువో రిపోర్టు ప్రకారం ఎల్సీడీ డిస్ప్లే కలిగిన ఐఫోన్ స్క్రీన్ సైజు 6.1 అంగుళాలు ఉంటుందని సమాచారం. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌తోనే ఆపిల్ డ్యూయల్ సిమ్ సపోర్టును అందిస్తుందని రిపోర్టు పేర్కొంది. ఓలెడ్ డిస్ప్లే ఐఫోన్ల కంటే కూడా ఈ ఐఫోనే తక్కువగా ఉంటుందని కువో అంచనా వేస్తున్నారు. 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుందని కువో చెబుతున్నారు. దీనిలో ఒకటి సింగిల్ సిమ్ సెటప్ కాగ, మరొకటి డ్యూయల్ సిమ్ సపోర్టును అందిస్తుందని తెలిపారు. డ్యూయల్ సిమ్ మోడల్ ఫోన్ 6.5 అంగుళాల స్క్రీన్‌తో రూపొందబోతోందని సమాచారం. ధర పరంగా సింగిల్ సిమ్ ఐఫోన్ ధర 550 డాలర్ల నుంచి 650 డాలర్ల రేంజ్లో ఉంటుందని టాక్. అంటే భారత్‌లో రూ.36వేల నుంచి రూ.42వేలలో ఉండనుంది. మరోవైపు డ్యూయల్ సిమ్ మోడల్ ధర ఎలాగైనా ఎక్కువగానే ఉంటుందని కువో రిపోర్టు చెబుతోంది. అంటే 650 డాలర్ల నుంచి 750 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.42వేల నుంచి రూ.50వేల వరకు అందించవచ్చని తెలుస్తోంది. అయితే ఆపిల్ తీసుకురాబోతోన్న సింగిల్ సిమ్ మోడల్ చైనా, ఇతర వాణిజ్య మార్కెట్లలో మార్కెట్ షేరును పెంచడానికి దోహదం చేస్తుందని కువో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్‌ను 100 మిలియన్ల నుంచి 120 మిలియన్ల యూనిట్ల విక్రయాలు చేపట్టాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కువో చెప్పారు. -
ఓపో ఎఫ్3 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఓపో తాజాగా ఎఫ్3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకత. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, అలాగే గ్రూప్ సెల్ఫీల కోసం 120 డిగ్రీల కోణంలో చిత్రాన్ని తీయగల 8 ఎంపీ కెమెరాను సైతం పొందుపరిచారు. వెనుకవైపు 13 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ఇన్–సెల్ స్క్రీన్, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4జీ డ్యూయల్ సిమ్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, మెటల్ బాడీ, ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ వంటి ఫీచర్లను జోడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఓపో ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఇది లభిస్తుంది. ధర రూ.19,990. మే 12 వరకు ప్రీ–ఆర్డర్లు స్వీకరిస్తారు. మే 13 నుంచి విక్రయాలు ప్రారంభం. హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ తెలంగాణ సీఈవో జోన్, నటి అదా శర్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. -
పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు
నాటకీయ పరిణామాలు అప్పగింత వద్ద ఉద్రిక్తత కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ రామారావుపేటలో ఈ నెల 2న హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల మృతదేహాలను పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తరలించారు. హత్య జరిగిన గురువారం జంట మృతదేహాలకు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారం అందజేయాలని, ఏ1 ముద్దాయిగా సుబ్బయ్య హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనే డిమాండ్లతో బాధిత కుటుంబాల సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు పోస్ట్‌మార్టం పూర్తయిన మృతదేహాలను మార్చురీ నుంచి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో నాలుగు రోజులుగా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి, జేసీకి వినతి పత్రం అందించారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ను సంఘం నేతలు కలుసుకుని బాధితులకు న్యాయం చేయాలని , ఏ1 ముద్దాయిగా హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన అనంతరం సోమవారం ఛలో కాకినాడ నిర్వహిస్తున్నామని, ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా ప్రణాళిక రచించారు. ముందుగానే మృతదేహాలను తరలించేందుకు కార్పొరేషన్ నుంచి లెటర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం నుంచి జీజీహెచ్ మార్చురీ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. సాయంత్రం అయిదు గంటల నుంచి జిల్లాకు చెందిన సుమారు 600 మంది వరకూ ప్రత్యేక పోలీసు బలగాలు, పలు సబ్ డివిజినల్కు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది జీజీహెచ్‌కు చేరుకున్నారు. ఆఖరిసారిగా మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలకు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో 5.45 గంటలకు రెండు అంబులెన్స్‌లో పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ మృతదేహాలను వారి స్వస్థలాలు పెదపూడి మండలం రామేశ్వరం, కాకినాడ రామారావుపేటలోకి పంపిచేశారు. మృతదేహాలను తీసుకునేందుకు బాధిత బంధువులు నిరాకరించారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను ఎలా తీసుకొచ్చి అప్పగిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల వ్యవధి ఇచ్చామని, పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత నాలుగు రోజులు మార్చురీ వద్ద పడిగాపులు కాశామని, ఇక కుదరదని, కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు మృతదేహాలను తరలించినట్టు కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అనంతరం మృతదేహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసులు పాల్గొన్నారు. జంట హత్యల కేసులో పురోగతి పోలీసుల అదుపులో అయిదుగురు నిందితులు ఏ 2 ముద్దాయి కోసం గాలింపు కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల 2న కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన రోజునే పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్‌కుమార్, ఆ తర్వాత పోలీసుల విచారణలో మరో అయిదుగురు పేర్లు చెప్పినట్టు çతెలిసింది. ఈ హత్యలో తనతో పాటూ మరో వ్యక్తి పాల్గొన్నట్టు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రెండో నిందితుడు సుబ్బయ్య హోటల్ సమీపాన సతీష్ పేకర్స్, మూవర్స్ అనే పేరుపై వాహనాలను నడుపుతున్నట్టు ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజున కేటరింగ్‌లో వేన్లో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వీరు హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. ప్రధాన నిందితుడి వివరాల మేరకు ఇప్పటికే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడు సతీష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలో రెండో ప్రధాన ముద్దాయిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జంట హత్యల కేసులో లోతుగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నామని విచారణ అధికారి, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. -
మృతదేహాల తరలింపులో ఉత్కంఠ
జంట హత్యల కేసులో కలెక్టరేట్ వద్ద ఆందోళన బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల డిమాండ్ బాధ్యులను అరెస్టు చేయాలని నినాదాలు భారీగా పోలీస్‌ల మోహరింపు∙ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల రెండో తేదీన కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసు బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌కుమార్ ఘటన జరిగిన రోజే పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో సుబ్బయ్య హోటల్ యాజమాన్యానికి చెందిన ఇద్దరి ప్రమేయం ఉందని, ఏ1 ముద్దాయిలుగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ మూడు రోజులుగా కాకినాడలో ఆందోళనలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మార్చి రెండున జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టమ్ పూర్తయినా మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. బా«ధితులకు న్యా యం జరిగేదాకా మృత దేహాలను తీసుకువెళ్లే ప్రశక్తి లేదని ఒక పక్క, పోస్ట్‌మార్టమ్ అయిన మృతదేహాలను మూడు రోజుల్లో తీసుకెళ్లకపోతే మున్సిపల్ కార్పొరేష¯ŒSకి అప్పగించి, దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసులు మరో పక్క ప్రకటించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు కలెక్టరేట్ వద్ద శనివారం ఉదయం జిల్లా దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. çసుబ్బయ్య హŸటల్ సిబ్బందిపై ఏ1గా పరిగణించాలని, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జేసీ సత్యనారాయణను కలిసి వారి డిమాండ్లు వినిపించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని సర్దిచెప్పారు. జేసీ చాంబర్లోనే డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావుతో చర్చించారు. దర్యాప్తు సాగుతుందని, ఆందోళన విరమించి, మృతదేహాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించగా తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే తీసుకువెళ్తామని, లేదంటే ఉంచేస్తామని దళిత నాయకులు తెలిపారు. దళిత ఐక్యవేదిక నేతలు« డి.శ్యామ్‌సుందర్, సబ్బతి ఫణీశ్వరరావు, గుడాల కృçష్ణ, కొండేపూడి ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మొహరించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే మార్చురీ వద్ద నుంచి కలెక్టరేట్‌కు మృతదేహాలతో ధర్నా చేస్తారన్న సమాచారంతో డీఎస్పీ పరిధిలోని పోలీసులు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించి ఈ భారీ బందోబస్తు చేశారు. -
జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరం
కీలకంగా మారిన సీసీ కెమెరా పుటేజీ హత్యకు పాల్పడింది ఒక్కరే కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ రామారావుపేటలో ఈ నెల 2 అర్ధరాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్య జరిగిన తీరుతెన్నులపై దళిత సంఘాలు పలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రాధాన్యం సంతరించుకుంది. హత్యకేసును సత్వరంగా ఓ కొలిక్కి తీసుకు రావాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ డీఎస్పీని ఆదేశించినట్టు తెలిసింది. హత్యకు పాల్పడ్డ కాకినాడ జగన్నాథపురానికి చెందిన నిందితుడు అడ్లబోయిన అశోక్‌కుమార్ పోలీసుల అదుపులోనే ఉండటంతో అతడిని విచారించే పనిలో ఉన్నారు. అతడు పని చేస్తున్న సుబ్బయ్య హాటల్ యాజమానికి ఫిర్యాదు చేస్తున్నాడనే కక్షతోనే బడుగు బాల గంగాధరతిలక్ (బాలా)ను అతడికి వత్తాసు పలుకుతున్న జగడం రామస్వామిలను పథకం ప్రకారం కేటరింగ్ వ్యాన్ డ్రైవర్ అశోక్‌కుమార్ ఒక్కడే హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగిన రామారావుపేటలో సంఘటన ప్రదేశం సమీపాన ఉన్న సుబ్బయ్య హోటల్, అపోలో ఫార్మసీ దుకాణాలకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, వాటి పుటేసీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు ఒక పుటేజీలో కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. జంట హత్యలకు పాల్పడింది అశోక్‌కుమార్ ఒక్కడేననే నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హత్యకు పాల్పడిన అశోక్‌కుమార్, ప్రేరేపించిన హోటల్ యాజమాన్యం వైఖరిపై జిల్లాలోని దళిత సంఘాలు పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సుబ్బయ్య హోటల్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.ఈ కేసు విషయమై కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఉమర్ తెలిపారు. ఇంకా మార్చురీ వద్దే మృతదేహాలు హత్యకు గురైన బడుగు బాలగంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిలకు గురువారం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు రోజులవుతున్నా, మృతదేహాలను అక్కడ నుంచి తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు నిరాకరించడంతో ఆందోళన నెలకొంది. బాధితులకు న్యాయం చేయాలని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, హోటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, నష్టపరిహారంగా ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు ఇవ్వాలని, లేకుంటే మృతదేహాలను తీసుకెళ్లే ప్రశక్తేలేదని భీష్మించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. విచారణలో దోషులుగా తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మృతదేహాలను తీసుకెళ్లాలని పోలీసులు కోరుతున్నా బాధితులు నిరాకరించారు. వీరికి దళిత సంఘాలు సంఘీభావం తెలపడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. మార్చురీ వద్ద పరిస్థితిని కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, టూటౌన్, త్రీ, వన్‌టౌన్ సీఐలు ఉమర్, దుర్గారావు, ఏఎస్ రావు సమీక్షిస్తున్నారు. -
డ్యూయల్ సిమ్ ఆపిల్ రానుందా?
ఆపిల్ ఈ బ్రాండ్ ఫోన్ కోసం ప్రపంచవ్యాప్తంగా వెర్రెత్తిపోయే వారేందరో. మొన్నటికి మొన్న ఆపిల్ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వార్తలూ చూశాం. తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆపిల్ డ్యూయల్ సిమ్ ఫోన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు డ్యూయల్ సిమ్‌కు సంబంధించిన పేటెంట్ హక్కులను ఆపిల్ ఈ మధ్యే పొందిందని సమాచారం. ఇదే నిజమైతే ఆపిల్ ఫోన్ అంటే చెవి కోసుకునే వారికి బంపర్ ఆఫరే. భారత్, చైనాల్లో అత్యధిక సంఖ్యలో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఫోన్-8లో డ్యూయల్ సిమ్‌ను ఆపిల్ పరిచయం చేయనుందట. డ్యూయల్ సిమ్ టెక్నాలజీకి సంబంధించి యాపిల్ ఇటీవలే అమెరికాలో పేటెంట్ హక్కులను పొందింది. చైనాలోనూ అనుమతి లభించినట్లు ఆ సంస్థకు చెందిన ఓ అధికారి తాజాగా వెల్లడించారు. -
కూల్ ప్యాడ్ మ్యాక్స్ లాంచింగ్ నేడే
చైనీస్ హ్యాండ్ సెంట్ తయారీదారి కూల్ ప్యాడ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను నేడు భారత మార్కెట్లోకి తీసుకురానుంది. కూల్ ప్యాడ్ మ్యాక్స్ అనే స్మార్ట్ ఫోన్ ను నేడు ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్యలో ఉంటుందని అంచనా. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లి బిన్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్. జాంగ్సెంగ్ లువో, భారత సీఈవో సయ్యద్ తాజుద్దీన్ లు కలిసి ఈ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. "డ్యూయల్ ఇన్ వన్" అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. డ్యూయల్ సిమ్ సపోర్టుతో, ఆ రెండు సిమ్ లపై కూడా రెండు అకౌంట్లు కలిగి ఉండేలా యూజర్లకు ఈ ఫోన్ అందుబాటులో ఉంచనున్నారు. దీంతో వాట్సాప్, మెసేంజర్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలు అన్నీ రెండు అకౌంట్లను యూజర్లు వాడుకోవచ్చు. మ్యాక్స్ ను మొదట చైనాలో రెండు వేరియంట్లగా విడుదలచేశారు. 32జీబీ స్టోరేజ్ మోడల్ ను 3జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్ తో, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 4జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్ తో ప్రవేశపెట్టారు. నేడు భారత్ లో ఆవిష్కరించబోతున్న ఈ ఫోన్ దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ కంపెనీ నుంచి రూ.8,999 కు కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ అక్టోబర్ లో భారత మార్కెట్లోకి వచ్చింది. కూల్ ప్యాడ్ మ్యాక్స్ ప్రత్యేకతలు.... 5.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ కర్వ్డ్ 2.5డీ డిస్ ప్లే 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా 2,800ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ డ్యూయల్ సిమ్స్ విత్ డ్యూయల్ అకౌంట్స్ -
రిలయన్స్ జియో 4జీ హ్యాండ్సెట్స్ ఆవిష్కరణ
అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో తాజాగా చౌక ధరల 4జీ మొబైల్ హ్యాండ్సెట్లను ‘ఎల్వైఎఫ్’ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన తొలి హోర్డింగ్స్‌ను అమరావతిలో ఏర్పాటుచేసినట్లు కంపెనీ అధికారి ఒకరు ట్విటర్లో తెలిపారు. ఈ మొబైల్స్ వినియోగదారులను జియో నెట్‌వర్క్‌పై 4జీ, వై-ఫై నెట్‌వర్క్‌ల్లో వాయిల్ కాల్స్, హైడెఫినేషన్ వీడియో కాల్స్‌కు అనుమతిస్తాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో డ్యూయెల్ సిమ్ ఫీచర్ ఉంటుంది. ఇందులో జియో సిమ్‌తోపాటు ఇతర కంపెనీ సిమ్‌లను కూడా పనిచేస్తాయి. ప్రస్తుతం ఎల్వైఎఫ్ హ్యాండ్సెట్స్ రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకమైన వై-ఫై పరికరాలను కూడా అందిస్తోంది. ఇవి 50-70 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అందిస్తాయి. అలాగే ఒకేసారి 10 డివెసైస్ను కనె క్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
సెల్‌కాన్‌తో ఎయిర్‌సెల్ జట్టు
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్‌తో టెలికం కంపెనీ ఎయిర్‌సెల్ చేతులు కలిపింది. క్యాంపస్ ఏ356 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై సీ329 ఫీచర్ ఫోన్‌ను సెల్కాన్ ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు ఫోన్లకు ఎయిర్‌సెల్ 1.5 జీబీ వరకు 3జీ డాటాను ఉచితంగా ఇవ్వనుంది. కిట్‌క్యాట్, డ్యూయల్ సిమ్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల తెర, 2 ఎంపీ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటివి ఏ356 విశిష్టతలు. 1.8 అంగుళాల స్క్రీన్‌తో డ్యూయల్ సిమ్ కలిగి ఉన్న సెల్కాన్ సీ329లో ఆడియో, వీడియో ప్లేయర్లతోపాటు ఆటోకాల్ రికార్డింగ్, ఎఫ్ఎం, బ్లూటూత్, జీపీఆర్ఎస్, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్యాక్ ధర రూ.3,333. ఈ ఒప్పందం ఇరు కంపెనీలకు కలిసి వస్తుందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా తెలిపారు. -
నోకియా ఎక్స్ సిరీస్‌లో కొత్త మొబైల్
- నోకియా ఎక్స్2.. డ్యుయల్ సిమ్ - ధర రూ.10,000 లోపు! న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్లలో మరో కొత్త మోడల్, నోకియా ఎక్స్2ను మంగళవారం ఆవిష్కరించింది. దీని ధరను 99 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ భారత్‌లో రూ.10,000 ధరలో లభించవచ్చు. ఈ ఫోన్‌ను తక్షణం ఎంపిక చేసిన దేశాల్లో విక్రయిస్తామని కంపెనీ అధికారిక బ్లాగ్‌లో పేర్కొంది. ఈ బ్లాగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..., ఈ డ్యుయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లో 1.2 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 4.3 అంగుళాల క్లియర్‌బ్లాక్ డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ కెమెరా, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. స్కైప్, అవుట్‌లుక్‌డాట్‌కామ్ వంటి మైక్రోసాఫ్ట్ యాప్‌లు, 7 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లున్నాయి. ఫాస్ట్లైన్తో పాటు యాప్స్లిస్ట్ పేరుతో మరో కొత్త నావిగేషన్ ఆప్షన్ కూడా ఈ ఫోన్లో ఉంది. ఈ ఫోన్ మోటరోలా మోటో జీ, హెచ్‌టీసీ డిజైర్, శామ్సంగ్ డ్యుయోస్ వంటి ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చౌక ధరల స్మార్ట్ఫోన్ల పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ఫోన్‌ను తెస్తోంది. శామ్సంగ్, హెచ్‌టీసీ, జియోని, హువాయ్, జెడ్‌టీఈ వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు కార్బన్, లావా, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ మొబైల్ కంపెనీలందించే చౌక ధరల స్మార్ట్ఫోన్ల పోటీని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా మైక్రోసాఫ్ట్ డివెసైస్ ఈ ఫోన్‌ను అందిస్తోంది. గతేడాది భారత్‌లో 4.4 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. -
రూ.3,555కే ఇంటెక్స్ 3జీ ఫోన్
న్యూఢిల్లీ: ఇంటెక్స్ కంపెనీ కొత్త 3జీ స్మార్ట్‌ఫోన్, ఆక్వా 3జీని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.3,555 అని ఇంటెక్స్ బిజినెస్ హెడ్(సంజయ్ కుమార్ కలిరోనా) చెప్పారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ రామ్, 12.25 ఎంబీ బిల్టిన్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 1400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పలువురు వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని, అందుకే మొబైల్ కంపెనీలు అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించాల్సిన అవసరముందని సంజయ్ కుమార్ వివరించారు. -
మైక్రోమ్యాక్స్.. విండోస్ మొబైల్ ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే తొలి మొబైల్ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. కాన్వాస్ విన్ డబ్ల్యూ121(ధర రూ.9,500), కాన్వాస్ విన్ డబ్ల్యూ092(ధర రూ.6,500)- ఈ రెండు ఫోన్లు డ్యుయల్-సిమ్ ఫోన్లని కంపెనీ చైర్మన్ సంజీవ్‌కపూర్ చెప్పారు. వచ్చే నెల నుంచి వీటి విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉన్న కాన్వాస్ డబ్ల్యూ121లో 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఇక కాన్వాస్ విన్ డబ్ల్యూ 092లో 4-అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. తొలి దేశీయ కంపెనీ..: స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో భారత్‌లో రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పటివరకూ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై ఫోన్లను అందిస్తోంది. మొదటి స్థానంపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ ఓఎస్ ఆధారిత మొబైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఓఎస్‌పై పనిచేసే మొబైళ్లను తయారు చేసిన మొదటి దేశీయ కంపెనీగా మైక్రోమ్యాక్స్ అవతరించింది. ఇప్పటికే విండోస్ ఓఎస్ ఆధారిత ఫోన్లను నోకియా, హెచ్‌టీసీ, ఎల్జీ, డెల్‌లు తయారు చేస్తున్నాయి. -
నోకియా లూమియా డ్యుయల్ సిమ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కంపెనీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, లుమియా 630ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. మోటో జి, హెచ్‌టీసీ డిజైర్, శామ్సంగ్ గెలాక్సీ డ్యుయోస్లకు గట్టి పోటీనిచ్చేలా ఈ ఫోన్‌ను రంగంలోకి తేవాలని మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోం ది. ఈ లూమియా 630 మోడల్లో సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.9,500, డ్యుయల్ సిమ్ వేరియంట్ ధర రూ.10,100 ఉండవచ్చు. విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 4.5 అంగుళాల డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలుంటాయని సమాచారం. నోకియా హ్యాండ్సెట్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత డ్యుయల్ సిమ్ మార్కెట్‌పై కన్నేసిన మైక్రోసాఫ్ట్ ఇప్పటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్, చైనా వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లలో డ్యుయల్ సిమ్ మార్కెట్ కీలకమని మైక్రోసాఫ్ట్ డివెసైస్ గ్రూప్ ఈవీపీ స్టీఫెన్ ఇలోప్ వ్యాఖ్యానించారు. 2016 కల్లా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డ్యుయల్-సిమ్ స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయన్న అంచనాలను వెల్లడించారు. -
కొత్త సరుకు
జోలో క్యూ900టీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జోలో తాజాగా ఓ మధ్యమశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. క్యూ900టీగా పిలుస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.12వేలు. అయితే ఫీచర్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. మల్టీటాస్కింగ్తోపాటు, గేమింగ్‌కు ప్రాసెసర్ కీలకమన్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యూ900టీలో ఏకంగా 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 1080 పిక్సెళ్ల వీడియో రికార్డింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ నాలుగు గిగాబైట్లు. మొత్తమ్మీద చూస్తూ ఈ డ్యుయెల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగిచడం కొంచెం నిరాశ కలిగించే అంశం. వీడియోకాన్ ఏ29 కొంచెం తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి మంచి ఆప్షన్ వీడియోకాన్ ఏ29. నాలుగు అంగుళాల కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్, డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్లో 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ మాత్రమే. వీడియోకాన్ ఏ29లో 512 ఎంబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.5800.