కొత్త సరుకు | The new cargo | Sakshi
Sakshi News home page

కొత్త సరుకు

Published Wed, May 7 2014 11:15 PM | Last Updated on Fri, May 25 2018 6:02 PM

The new cargo

జోలో క్యూ900టీ
 
దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జోలో తాజాగా ఓ మధ్యమశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. క్యూ900టీగా పిలుస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.12వేలు. అయితే ఫీచర్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. మల్టీటాస్కింగ్‌తోపాటు, గేమింగ్‌కు ప్రాసెసర్ కీలకమన్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యూ900టీలో ఏకంగా 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 1080 పిక్సెళ్ల వీడియో రికార్డింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ నాలుగు గిగాబైట్లు. మొత్తమ్మీద చూస్తూ ఈ డ్యుయెల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగిచడం కొంచెం నిరాశ కలిగించే అంశం.
 
వీడియోకాన్ ఏ29
 
కొంచెం తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి మంచి ఆప్షన్ వీడియోకాన్ ఏ29. నాలుగు అంగుళాల కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్, డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్‌లో 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ మాత్రమే. వీడియోకాన్ ఏ29లో 512 ఎంబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.5800.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement