Multitasking
-
ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే!
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 3820 విభాగాల వారీగా పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–1726, స్టెనోగ్రాఫర్ –163, మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–1931. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఆంధ్రప్రదేశ్–35: యూడీసీ–07, ఎంటీఎస్–26, స్టెనో–02. తెలంగాణ–72: యూడీసీ–25, ఎంటీఎస్–43, స్టెనో–04 అర్హతలు: ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వయసు: స్టెనో, యూడీసీ పోస్టులకి 18–27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) పోస్టులకి 4వ పే లెవల్ ప్రకారం–నెలకు రూ.25,500–రూ.81,100, ఎంటీఎస్ వారికి పే లెవల్ 1 ప్రకారం–నెలకు రూ.18,800– రూ.56,900 వేతనంగా చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, స్కిల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): యూడీసీ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష–200 మార్కులకు, మెయిన్స్–200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ప్రిలిమినరీ పరీక్షకు గంట(60 నిమిషాలు) సమయం, మెయిన్స్‌కు రెండు గంటలు(120 నిమిషాలు) పరీక్ష సమయంగా కేటాయిస్తారు. స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే నిర్వహించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్కిల్ టెస్ట్‌కు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష సమయం 130 నిమిషాలు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్(ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి. డిక్టేషన్‌కు 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. నిమిషానికి 80 వర్డ్స్ టైప్ చేయాలి. ట్రాన్స్స్క్రిప్షన్కు సంబంధించి ఇంగ్లిష్‌కు 50 నిమిషాలు(పీడబ్ల్యూడీలకు 70 నిమిషాలు ), హిందీకి 65 నిమిషాలు(పీడబ్యూడీలకు 90 నిమిషాలు) స్కిల్ టెస్టుకు సమయం కేటాయిస్తారు. మల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఎంటీఎస్ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ–200 మార్కులకి, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకి నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభతేదీ: 15.01.2022 ► దరఖాస్తు చివరి తేదీ: 15.02.2022 ► వెబ్సైట్: esic.nic.in -
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ఉద్యోగాలకు నోటిఫికేషన్
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 3261 ► పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్,ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్టైల్ డిజైనర్ తదితరాలు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) ► అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్/10+2, గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. (NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021 ► కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: 2022 జనవరి/ఫిబ్రవరి ► వెబ్సైట్: https://ssc.nic.in -
మగవారికన్నా మహిళలేమి బెటర్ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : ఇంట్లో వంటావార్పు చేస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ భర్తకు టిఫిన్ పెట్టి, లంచ్ బాక్స్ సర్ది ఆఫీసుకు పంపించడమే కాకుండా తాను ఓ ఆఫీసుకెళ్లి పనిచేస్తున్న ఆడవాళ్లను అరుదుగానైనా చూస్తూనే ఉన్నాం. అది వారికున్న ప్రత్యేక నైపుణ్యమని, ఏకకాలంలో విభిన్న పనులు చేసే సామర్థ్యం ఆ దేవుడు వారికి ఇచ్చిన వరమంటూ పురుష పుంగవులు ప్రశంసించిన సందర్భాలను వినే ఉంటాం. అయితే అదంతా ఓ ట్రాష్ అని ‘ప్లాస్ వన్’ అనే ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించిన ఓ సర్వే తెలియజేసింది. ఏకకాలంలో అనేక పనులు చేస్తే.. చేసే అసలు పనిపై మగవాళ్లకు దృష్టి తగ్గినట్లే ఆడవాళ్లకు కూడా దృష్టి తగ్గుతుందని, ఏకకాలంలో బహు పనులు చేసే సామర్థ్యం ఆడవాళ్ల మెదళ్లకు లేదని, ఈ విషయంలో ఇరువురి మెదళ్ల మధ్య ఎలాంటి తేడా లేదని సర్వే తేల్చి చెప్పింది. వాస్తవానికి రెండు పనులు, ముఖ్యంగా ఒకే రకమైన పనులు ఏకకాలంలో చేయడానికి మానవ మెదడు పనిచేయదని సర్వే తెలిపింది. అయితే ఒక పని మీది నుంచి మరో పనిపైకి దృష్టిని వేగంగా మళ్లించేందుకు స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా మానవ మెదడు వేగంగా పనిచేస్తుందని కూడా సర్వే కనుక్కొంది. జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం 43 మంది పురుషులను, అంతే సంఖ్యలో మహిళలను ఎంపిక చేసి వారికి సంఖ్యలు, అంకెలను విశ్లేషించే పరీక్షలు నిర్వహించింది. ఒకే సమయంలో ఒక పనిని, ఒకే సమయంలో రెండు రకాల పనులు అప్పగించి చూశారు. స్త్రీ, పురుషుల మధ్య తేడా లేకుండా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. ఏకకాలంలో ఒక పనిపైనే దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఆ పనికి సంబంధించిన ఫలితాలు బాగున్నాయి. ఏకకాలంలో రెండు పనులు చేసినప్పుడు వాటి ఫలితాల మధ్య తేడాలు కనిపించాయి. ఇంటి పనులు చేయడంలో ఆడవాళ్లదే పైచేయని, మగవారి కంటే ఇంటిని శుభ్రంగా ఉంచే సామర్థ్యం వారికే ఉందన్నది కూడా భ్రమేనని సర్వే తెలిపింది. కాకపోతే ఆడవాళ్లు శుభ్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. మిగతా దేశాల్లో కన్నా ఆస్ట్రేలియాలో మగవాళ్లు వంట కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట. పిల్లల ఆలనాపాలనతోపాటు ఇంటి పనులను ఆడవాళ్లు చూసుకునేలా చేసిందీ మగవాళ్ల ఆధిపత్యమేనని, ఆ సామర్థ్యం వారికే ఉందడనం వారిని మభ్య పెట్టడానికేనని సర్వే తేల్చి చెప్పింది. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారు. -
రెండు చేతులు ఇరవై పనులు!
నెత్తి మీద వంద పనులు పెట్టుకుని, పడిపోకుండా పరుగులు తీయడం మల్టీటాస్కింగ్. (పనులు పడిపోకుండానా, మనిషి పడిపోకుండానా? రెండూనూ). పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఛైర్మన్లు నిత్యం మల్టీటాస్కింగ్ చేస్తుంటారని విన్నప్పుడు.. వాళ్ల ‘డీఎన్ఏ’ వేరేమో అనిపిస్తుంది. వాళ్లు తప్ప నరమానవులెవరూ మల్టీటాస్కింగ్ చెయ్యలేరు. వేగం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలి. పని ఫినిష్ చేసేయాలి. మల్టీటాస్కింగ్ ఒక విధంగా సామర్థ్యానికి కొలబద్ద. అయితే ఈ మల్టీటాస్కింగ్.. ఒంటికి మంచిది కాదని, ఒత్తిడిని తట్టుకునే శక్తిని కొద్దికొద్దిగా ఈ టాస్కింగ్ తగ్గించేస్తుందని మయామీ యూనివర్శిటీ న్యూరోసైంటిస్ట్ అమిషీ ఝా అంటున్నారు! ‘మైండ్‌తో పరుగులు తీసే మనిషి, బాడీ ఏమైపోతుందో పట్టించుకోడు. బాడీ బలహీనం అయ్యాక, ఆ ప్రభావం మైండ్ మీద పడి కొత్తకొత్త న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. అందుకే.. అన్నీ ఒకరే చేయాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. పనుల్ని పంచండి. ఎవరికైతే పంచారో వాళ్లపై నమ్మకం ఉంచండి. ఆరోగ్యంగా ఉండండి. మరి గృహిణుల మాటేమిటి? వాళ్ల మల్టీటాస్కింగ్.. ఏ కంపెనీ సీఈవో కన్నా తక్కువ కాదు కదా! నిజమే. లోకంలోని అతి పెద్ద మల్టీటాస్కింగ్ గృహిణులదే. రెండు చేతులు, ఇరవై పనులు. వాళ్ల ఆరోగ్యం దెబ్బతినదా? తింటుంది. అందుకే.. బయట మన మల్టీటాస్కింగ్ పనుల్ని నలుగురికి పంచిన విధంగానే, ఇంట్లో స్త్రీల మల్టీటాస్కింగ్ని మనమూ పంచుకోవాలి. -
రెండు చేతులు ఇరవై పనులు!
నెత్తి మీద వంద పనులు పెట్టుకుని, పడిపోకుండా పరుగులు తీయడం మల్టీటాస్కింగ్. (పనులు పడిపోకుండానా, మనిషి పడిపోకుండానా? రెండూనూ). పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఛైర్మన్లు నిత్యం మల్టీటాస్కింగ్ చేస్తుంటారని విన్నప్పుడు.. వాళ్ల ‘డీఎన్ఏ’ వేరేమో అనిపిస్తుంది. వాళ్లు తప్ప నరమానవులెవరూ మల్టీటాస్కింగ్ చెయ్యలేరు. వేగం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలి. పని ఫినిష్ చేసేయాలి. మల్టీటాస్కింగ్ ఒక విధంగా సామర్థ్యానికి కొలబద్ద. అయితే ఈ మల్టీటాస్కింగ్.. ఒంటికి మంచిది కాదని, ఒత్తిడిని తట్టుకునే శక్తిని కొద్దికొద్దిగా ఈ టాస్కింగ్ తగ్గించేస్తుందని మయామీ యూనివర్శిటీ న్యూరోసైంటిస్ట్ అమిషీ ఝా అంటున్నారు! ‘మైండ్‌తో పరుగులు తీసే మనిషి, బాడీ ఏమైపోతుందో పట్టించుకోడు. బాడీ బలహీనం అయ్యాక, ఆ ప్రభావం మైండ్ మీద పడి కొత్తకొత్త న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. అందుకే.. అన్నీ ఒకరే చేయాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. పనుల్ని పంచండి. ఎవరికైతే పంచారో వాళ్లపై నమ్మకం ఉంచండి. ఆరోగ్యంగా ఉండండి. మరి గృహిణుల మాటేమిటి? వాళ్ల మల్టీటాస్కింగ్.. ఏ కంపెనీ సీఈవో కన్నా తక్కువ కాదు కదా! నిజమే. లోకంలోని అతి పెద్ద మల్టీటాస్కింగ్ గృహిణులదే. రెండు చేతులు, ఇరవై పనులు. వాళ్ల ఆరోగ్యం దెబ్బతినదా? తింటుంది. అందుకే.. బయట మన మల్టీటాస్కింగ్ పనుల్ని నలుగురికి పంచిన విధంగానే, ఇంట్లో స్త్రీల మల్టీటాస్కింగ్ని మనమూ పంచుకోవాలి. -
యాంగర్‌కి చెక్
మహాభాగ్యం క్షణం తీరికలేని షెడ్యూల్, మల్టీటాస్కింగ్ తెచ్చే ఒత్తిడి సహజంగానే కోపాన్ని తెప్పిస్తుంటుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కెరీర్లో, ఆత్మీయులతో అపార్థాలు వస్తుంటాయి. అనర్థాలు జరుగుతుంటాయి. మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? మాట్లాడే ముందు ఆలోచించండి: కోపానికి ట్విన్ సిస్టిర్ ఆవేశం. కోపం రాగానే ఆవేశమూ యాక్ట్ చేస్తుంది. అందుకే కోపం ఉన్నప్పుడు ఆవేశంగా స్పందించకుండా ఆలోచనకు పనిచెప్పండి. నెమ్మదించాకే మాట్లాండి: ఆలోచన విచక్షణనిస్తుంది. దాంతో ఆవేశం పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు చెప్పదల్చుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పండి. కోపానికి కారణాన్నీ తెలపండి. వ్యాయామం: ఒత్తిడిని తగ్గించే చక్కని ఆయుధం వ్యాయామం. ఒత్తిడి తగ్గితే కోపమూ కంట్రోల్ అవుతుంది. టైమ్ అవుట్: చేస్తున్న పనిలోంచి బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. ఈ బ్రేక్ మీలో ఒత్తిడిని దూరం చేసి కోపానికి గురికాకుండా చూస్తుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పరిష్కారం చూడండి: కోపానికి దారితీసిన విషయం మీద దృష్టిపెట్టండి. అప్పుడు కోపం తగ్గి పరిష్కారం పట్టుపడుతుంది. క్షమించడమే.. కోపం తెప్పించిన మనుషులను క్షమించేస్తే ఆ అగ్నిలో దహించిపోయే దుస్థితి ఉండదు. హాస్యాన్ని ఆస్వాదించండి: కోపం వచ్చినప్పుడు హాస్యాన్ని ఆశ్రయించండి. బోలెండత సాంత్వననిస్తుంది. రిలాక్సేషన్ స్కిల్స్: దీర్ఘశ్వాసను తీసుకోండి. శ్రావ్యమైన సంగీతం వినండి. పజిల్స్ నింపండి. కోపానికి కారణాలను కాగితం మీద రాసుకోండి. టేకిట్ ఈజీని మంత్రాన్ని జపించండి. -
కొత్త సరుకు
జోలో క్యూ900టీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జోలో తాజాగా ఓ మధ్యమశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. క్యూ900టీగా పిలుస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.12వేలు. అయితే ఫీచర్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. మల్టీటాస్కింగ్తోపాటు, గేమింగ్‌కు ప్రాసెసర్ కీలకమన్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యూ900టీలో ఏకంగా 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 1080 పిక్సెళ్ల వీడియో రికార్డింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్ ఒక గిగాబైట్ కాగా, ఇంటర్నల్ మెమరీ నాలుగు గిగాబైట్లు. మొత్తమ్మీద చూస్తూ ఈ డ్యుయెల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగిచడం కొంచెం నిరాశ కలిగించే అంశం. వీడియోకాన్ ఏ29 కొంచెం తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి మంచి ఆప్షన్ వీడియోకాన్ ఏ29. నాలుగు అంగుళాల కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్, డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్లో 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ మాత్రమే. వీడియోకాన్ ఏ29లో 512 ఎంబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.5800.