యాంగర్‌కి చెక్‌ | Check to Anger | Sakshi
Sakshi News home page

యాంగర్‌కి చెక్‌

Published Wed, Apr 19 2017 12:00 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

యాంగర్‌కి చెక్‌ - Sakshi

యాంగర్‌కి చెక్‌

మహాభాగ్యం

క్షణం తీరికలేని షెడ్యూల్, మల్టీటాస్కింగ్‌ తెచ్చే ఒత్తిడి సహజంగానే కోపాన్ని తెప్పిస్తుంటుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కెరీర్‌లో, ఆత్మీయులతో అపార్థాలు వస్తుంటాయి. అనర్థాలు జరుగుతుంటాయి. మరి కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవడం ఎలా?

మాట్లాడే ముందు ఆలోచించండి: కోపానికి ట్విన్‌ సిస్టిర్‌ ఆవేశం. కోపం రాగానే ఆవేశమూ యాక్ట్‌ చేస్తుంది. అందుకే కోపం ఉన్నప్పుడు ఆవేశంగా స్పందించకుండా ఆలోచనకు పనిచెప్పండి. 

నెమ్మదించాకే మాట్లాండి: ఆలోచన విచక్షణనిస్తుంది. దాంతో ఆవేశం పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు చెప్పదల్చుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పండి. కోపానికి కారణాన్నీ తెలపండి.  
 
వ్యాయామం: ఒత్తిడిని తగ్గించే చక్కని ఆయుధం వ్యాయామం. ఒత్తిడి తగ్గితే కోపమూ కంట్రోల్‌ అవుతుంది.  
     
టైమ్‌ అవుట్‌: చేస్తున్న పనిలోంచి బ్రేక్‌ తీసుకోవడం చాలా అవసరం. ఈ బ్రేక్‌ మీలో ఒత్తిడిని దూరం చేసి కోపానికి గురికాకుండా చూస్తుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.  
     
పరిష్కారం చూడండి: కోపానికి దారితీసిన విషయం మీద దృష్టిపెట్టండి. అప్పుడు కోపం తగ్గి పరిష్కారం పట్టుపడుతుంది.  
     
క్షమించడమే.. కోపం తెప్పించిన మనుషులను క్షమించేస్తే ఆ అగ్నిలో దహించిపోయే దుస్థితి ఉండదు.
     
హాస్యాన్ని ఆస్వాదించండి: కోపం వచ్చినప్పుడు హాస్యాన్ని ఆశ్రయించండి. బోలెండత సాంత్వననిస్తుంది.
     
రిలాక్సేషన్‌ స్కిల్స్‌: దీర్ఘశ్వాసను తీసుకోండి. శ్రావ్యమైన సంగీతం వినండి. పజిల్స్‌ నింపండి. కోపానికి కారణాలను కాగితం మీద రాసుకోండి. టేకిట్‌ ఈజీని మంత్రాన్ని జపించండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement