ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే! | ESIC Recruitment 2022: Upper Division Clerk, Stenographer, Multitasking Staff Posts | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే!

Published Sat, Jan 8 2022 1:52 PM | Last Updated on Sat, Jan 8 2022 7:17 PM

ESIC Recruitment 2022: Upper Division Clerk, Stenographer, Multitasking Staff Posts - Sakshi

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలి.
     
మొత్తం పోస్టుల సంఖ్య: 3820

విభాగాల వారీగా పోస్టులు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–1726, స్టెనోగ్రాఫర్‌ –163, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–1931.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు
     
ఆంధ్రప్రదేశ్‌–35: యూడీసీ–07, ఎంటీఎస్‌–26, స్టెనో–02. 
     
తెలంగాణ–72: యూడీసీ–25, ఎంటీఎస్‌–43, స్టెనో–04
     
అర్హతలు: ఎంటీఎస్‌ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
     
వయసు: స్టెనో, యూడీసీ పోస్టులకి 18–27 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
     
వేతనాలు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ) పోస్టులకి 4వ పే లెవల్‌ ప్రకారం–నెలకు రూ.25,500–రూ.81,100, ఎంటీఎస్‌ వారికి పే లెవల్‌ 1 ప్రకారం–నెలకు రూ.18,800– రూ.56,900 వేతనంగా చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ
ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం
అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ): యూడీసీ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష–200 మార్కులకు, మెయిన్స్‌–200 మార్కులకు, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ప్రిలిమినరీ పరీక్షకు గంట(60 నిమిషాలు) సమయం, మెయిన్స్‌కు రెండు గంటలు(120 నిమిషాలు) పరీక్ష సమయంగా కేటాయిస్తారు. 

స్టెనోగ్రాఫర్‌
స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు మెయిన్‌ ఎగ్జామ్, స్కిల్‌ టెస్ట్‌ ఇన్‌ స్టెనోగ్రఫీ మాత్రమే నిర్వహించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్కిల్‌ టెస్ట్‌కు అనుమతిస్తారు. మెయిన్స్‌ పరీక్ష సమయం 130 నిమిషాలు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్‌(ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి. డిక్టేషన్‌కు 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. నిమిషానికి 80 వర్డ్స్‌ టైప్‌ చేయాలి. ట్రాన్స్‌స్క్రిప్షన్‌కు సంబంధించి ఇంగ్లిష్‌కు 50 నిమిషాలు(పీడబ్ల్యూడీలకు 70 నిమిషాలు ), హిందీకి 65 నిమిషాలు(పీడబ్యూడీలకు 90 నిమిషాలు) స్కిల్‌ టెస్టుకు సమయం కేటాయిస్తారు.

మల్టి టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)
ఎంటీఎస్‌ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ–200 మార్కులకి, మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకి నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తు ప్రారంభతేదీ: 15.01.2022
► దరఖాస్తు చివరి తేదీ: 15.02.2022
► వెబ్‌సైట్‌: esic.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement