stenographer
-
స్టెనో నుంచి న్యాయమూర్తిగా.. ఆమె జర్నీ సాగిందిలా..
సాక్షి,విశాఖ లీగల్: నగరంలోని 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్టెనోగా పనిచేస్తున్న సాయి సుధ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన ఆమె హైస్కూలు విద్యను తాటిపూడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పూర్తి చేశారు. ఎన్వీపీ న్యాయ కాలేజీలో న్యాయశాస్తంలో పట్టా తీసుకున్నారు. అనంతరం కోర్టులో స్టెనోగా విధుల్లో చేరారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తి పరీక్షల్లో సాయి సుధ ప్రతిభ చాటారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఉన్నారని ఆమె చెప్పారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, ఇతర న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది గొలగాని అప్పారావు, సీనియర్ న్యాయవాది గోలి శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాద్యక్షుడు కె.రామజోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి! -
ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే!
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 3820 విభాగాల వారీగా పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–1726, స్టెనోగ్రాఫర్ –163, మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–1931. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఆంధ్రప్రదేశ్–35: యూడీసీ–07, ఎంటీఎస్–26, స్టెనో–02. తెలంగాణ–72: యూడీసీ–25, ఎంటీఎస్–43, స్టెనో–04 అర్హతలు: ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వయసు: స్టెనో, యూడీసీ పోస్టులకి 18–27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) పోస్టులకి 4వ పే లెవల్ ప్రకారం–నెలకు రూ.25,500–రూ.81,100, ఎంటీఎస్ వారికి పే లెవల్ 1 ప్రకారం–నెలకు రూ.18,800– రూ.56,900 వేతనంగా చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, స్కిల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): యూడీసీ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష–200 మార్కులకు, మెయిన్స్–200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ప్రిలిమినరీ పరీక్షకు గంట(60 నిమిషాలు) సమయం, మెయిన్స్‌కు రెండు గంటలు(120 నిమిషాలు) పరీక్ష సమయంగా కేటాయిస్తారు. స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే నిర్వహించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్కిల్ టెస్ట్‌కు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష సమయం 130 నిమిషాలు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్(ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి. డిక్టేషన్‌కు 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. నిమిషానికి 80 వర్డ్స్ టైప్ చేయాలి. ట్రాన్స్స్క్రిప్షన్కు సంబంధించి ఇంగ్లిష్‌కు 50 నిమిషాలు(పీడబ్ల్యూడీలకు 70 నిమిషాలు ), హిందీకి 65 నిమిషాలు(పీడబ్యూడీలకు 90 నిమిషాలు) స్కిల్ టెస్టుకు సమయం కేటాయిస్తారు. మల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఎంటీఎస్ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ–200 మార్కులకి, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకి నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభతేదీ: 15.01.2022 ► దరఖాస్తు చివరి తేదీ: 15.02.2022 ► వెబ్సైట్: esic.nic.in -
కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): కోర్టు తీర్పును టైప్ చేస్తూ గుండెపోటుతో స్టెనోగ్రాఫర్ మృతిచెందారు. ఈ ఘటన తిరువళ్లూరు ఉమ్మడి కోర్టు ఆవరణలో మంగళవారం జరిగింది. చెన్నై కోడంబాక్కం ఆండవర్‌నగర్‌కు చెందిన బాలాజీ భార్య సరస్వతి (52) జిల్లా ప్రధాన కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం జిల్లా న్యాయమూర్తి ఒక కేసులో ఇచ్చిన తీర్పును టైప్‌చేస్తూ హఠాత్తుగా కిందపడిపోయారు. ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిరువళ్లూరు నగర పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్టెనోగ్రాఫర్స్
(గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2016) జాబ్స్ విత్ ఇంటర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2016కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర ఉపవిభాగాలు, రాష్ట్రాల వారీగా ఖాళీలను త్వరలో వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్హతలు: ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత వయోపరిమితి: 18-27 ఏళ్లు. - ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఒబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీ వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. పార్ట్-1, 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-3లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ గ్రేడ్-సి అభ్యర్థులకు నిమిషానికి 100 పదాల వేగం, గ్రేడ్-డి అభ్యర్థులకు 80 పదాల వేగం ఉండాలి. గ్రేడ్-డి అభ్యర్థులకు ఇంగ్లిష్‌కు 50 ని.లు, హిందీకి 65 ని.లు, గ్రేడ్-సికి ఇంగ్లిష్‌కు 40 ని.లు, హిందీకి 55 ని.ల సమయమిస్తారు. రాతపరీక్ష సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్: వర్తమాన సంఘటనలకు సంబంధించి అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. భారత్, పొరుగు దేశాల సమాచారం తెలుసుకోవాలి. క్రీడలు, చరిత్ర, భౌగోళికం, ఆర్థికం, పాలిటీ, శాస్త్రీయ పరిశోధన తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, రైటింగ్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. వివరాలకు: http://ssc.nic.in/ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 3, 2016, పరీక్ష తేది: 31 జూలై 2016 దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం. -
మనసు పెట్టి రాస్తే జీవకళ! మెదడు పెట్టి రాస్తే సమగ్రత!!
అంతర్వీక్షణం వి. హనుమంతరావు, సీనియర్ జర్నలిస్ట్... అంటే ఆయన సంతోషిస్తారు. ప్రొఫెసర్ హనుమంతరావు, ఆర్థికవేత్త హనుమంతరావు అనే మకుటాలు నాకొద్దంటూ నిక్కచ్చిగా చెప్పేస్తారు. గడచిన ఆగస్టు 30వ తేదీతో 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టారాయన. ఆయన జర్నలిస్టు జీవితానికి అరవై దాటాయి. ఈ సందర్భంగా ఇది ఆయన అంతర్వీక్షణం. పాత్రికేయ వృత్తి గురించి ఒక్కమాటలో..! అత్యంత బాధ్యతాయుతమైనది, పవిత్రమైనది. మీ రోజుల్లో శిక్షణ ఉండేదా? అప్పట్లో జర్నలిజం కోర్సుల్లేవు. ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్, టైపింగ్, షార్ట్‌హ్యాండ్ అర్హతలతో ఈ వృత్తిలోకి వచ్చాను. ఓనమాల నుంచి పనిచేస్తూనే నేర్చుకున్నాను. తప్పులు చేస్తూ... సీనియర్లు దిద్దిన కాపీ చూసి నేర్చుకున్న తరం మాది. మీ తొలి ఉద్యోగం... పోస్టల్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్. మరి పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? ప్రజాశక్తిలో పుచ్చలపల్లి సుందరయ్యకు సహాయకుడిగా టైప్, షార్ట్ హ్యాండ్ వచ్చిన వ్యక్తి కావాలని స్నేహితులు చెప్పడంతో చేరాను. ఆ తర్వాత పార్లమెంటు కార్యకలాపాలను నోట్స్ రాసుకుని కథనాలు తయారు చేయడానికి షార్ట్ హ్యాండ్ వచ్చు అనే అర్హతతోనే నన్ను ఢిల్లీకి పంపారు. అప్పట్లో పత్రికల మధ్య అక్షరయుద్ధం సాగేదా? 1955 మధ్యంతర ఎన్నికల సమయంలో ఆంధ్రప్రభ (నార్ల వెంకటేశ్వరరావు) - విశాలాంధ్ర (రాంభట్ల కృష్ణమూర్తి) పత్రికల మధ్య కార్టూన్ల యుద్ధం తీవ్రంగా సాగింది. పాత్రికేయునిగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా? యుఎన్‌ఐలో పనిచేస్తున్నప్పుడు మాకు పిటిఐతో పోటీ. జాతీయపత్రికల్లో హైదరాబాద్ కనిపించాలంటే దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే వార్తాకథనాలు రాయాలి. రాజేంద్రనగర్, తార్నాకల్లోని అఖిలభారత సైన్సు, సాంకేతిక సంస్థల్లో నాకు మంచి విషయాలు దొరికేవి. మీరు కాలరెగరేసుకుని చెప్పగలిగిన రిపోర్టింగ్? బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో విమాన వాహక నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’ నుంచి యుద్ధవార్తలు పంపడం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనొక్కడినే. మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు? ఇరవై వరకు ఉంటాయి. ‘ఎపి యట్ 50’ ఆంధ్రప్రదేశ్ మీద సమగ్ర సమీక్ష సమాచారంతో ఇంగ్లిష్‌లో ప్రచురించిన తొలి పుస్తకానికి సంపాదకత్వం వహించాను. నేను స్థాపించిన డిఎన్ఎఫ్ (డేటా న్యూస్ ఫీచర్స్) అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి న్యూస్ ఏజెన్సీ. విలేఖరిగా మీరు ఊహించని హఠాత్పరిణామం ఏదైనా ఉందా? విశాఖపట్నంలో జరిగింది. పాకిస్తాన్ సబ్‌మెరైన్ విశాఖ తీరంలో మునిగిపోయింది. పాక్ జలాంతర్గామిని పేల్చివేసిన శబ్దాన్ని విశాఖ నగరం మొత్తం విన్నది. వైస్ అడ్మిరల్ ఆ విషయాన్ని పత్రికాసమావేశంలో వెల్లడించి మేమున్న గది తలుపులు వేయించాడు. ఎందుకలా!... పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ వార్తను ప్రభుత్వం ప్రకటించకముందు పత్రికల్లో రాకూడదని. వ్యక్తికి - విలేఖరికి తేడా!... వ్యక్తి తప్పు చేస్తే దాని దుష్ర్పభావాన్ని వారు మాత్రమే భరిస్తారు. జర్నలిస్టు తప్పు రాస్తే ఒక వాస్తవం మరుగున పడి, అవాస్తవం సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. జర్నలిజానికి కేంద్రబిందువు రాజకీయాలేనా? కాదు, ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా సాగే వార్తలకు, వార్తా కథనాలకు కట్టుబడి ఉండడమే విలేఖరి తనకు తాను గీసుకోవాల్సిన లక్ష్మణరేఖ. జర్నలిస్టుకు మీరిచ్చే సందేశం? ఈ వృత్తిలో కొనసాగుతున్నది జీతం కోసమే, అయినా ‘మనసు పెట్టి పని చేస్తే రాష్ట్రానికీ, దేశానికీ, ప్రజలకు సేవ చేయవచ్చు’ అనే తలంపు ఉండాలి. అప్పుడే వార్తకు జీవకళ వస్తుంది. మెదడుకు పని చెప్పి మేధస్సు జోడిస్తే వార్తకు సమగ్రత వస్తుంది. - వాకా మంజులారెడ్డి -
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహిస్తుంది. అదే క్రమంలో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, డి) కేటగిరీలో 534 మంది ఉద్యోగులను భర్తీ చేయనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే‘స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్-సి, డి) ఎగ్జామినేషన్-2014’ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఖాళీల వివరాలు: - గ్రేడ్-సి: 38 (అన్ రిజర్వ్డ్-27, ఎస్సీ-1, ఎస్టీ-6, ఓబీసీ-4, ఓహెచ్-1) - గ్రేడ్-డి: 496 (అన్ రిజర్వ్డ్-300, ఎస్సీ-62, ఎస్టీ-33, ఓబీసీ-101, వీహెచ్-2, ఓహెచ్- 11, ఎక్స్‌సర్వీస్‌మెన్-19) ఎంపిక: రెండు దశలుగా ఎంపిక ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను తర్వాతి దశ నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్ట్)కు అనుమతిస్తారు. రాత పరీక్ష ఇలా: రాత పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 50- 50 జనరల్ అవేర్నెస్- 50- 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ -100 -100 మొత్తం - 200- 200 సమయం: 120 నిమిషాలు ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ విభాగంలో వెర్బల్-నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఇం దులో మెరుగైన మార్కులు సాధించాలంటే తార్కిక విశ్లేషణ అవసరం. డెరైక్షన్స్, అనాలజీస్, ర్యాంకింగ్, కోడింగ్-డీకోడింగ్,బ్లడ్ రిలేషన్స్, వెన్‌డయాగ్రమ్స్ తదితరాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇంగ్లిష్: ఎంపికైన అభ్యర్థులు విధుల్లో భాగంగా ఇంగ్లిష్ భాషను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆంగ్ల భాషలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ స్కోరింగ్ విభాగం కూడా ఇదే. అత్యధిక వెయిటేజీ ఈ విభాగానికే కేటాయించారు. అంటే ఫలితాల్లో ఇంగ్లిష్ నిర్ణయాత్మకంగా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, కామన్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, యాంటోనిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవడం, రోజూ ఇంగ్లిష్ దిన పత్రికలను చదవడంతో ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. రోజూ ఆంగ్ల దినపత్రికలు చదవడం జనరల్ అవేర్నెస్ పరంగా కూడా ఉపకరిస్తుంది. అంతేకాకుండా రైటింగ్ సామర్థ్యాలను కూడా పరీక్షిస్తారు. కాబట్టి ఆ దిశగా కూడా ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం. జనరల్ అవేర్నెస్: జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను నిశితంగా పరిశీలించాలి. అదే సమయంలో చరిత్ర, జనరల్ సైన్స్, ఆర్థిక రంగం, జాగ్రఫీ, పాలిటీ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థులందరూ కనీసం 15 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 25 నుంచి 30 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. నైపుణ్య పరీక్ష: నైపుణ్య పరీక్షలో భాగంగా స్టెనోగ్రిఫీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల టైపింగ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ముందుగా అభ్యర్థులకు 10 నిమిషాలపాటు ఒక అంశాన్ని ఇంగ్లిష్/హిందీలో డిక్టేట్ (వింటూ రాయడం) చేస్తారు. అయితే కేటగిరీల వారీగా నిర్దేశించిన విధంగా అభ్యర్థులు సదరు అంశాన్ని రాయాలి. ఈ క్రమంలో గ్రేడ్-సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాల వేగంతో, గ్రేడ్-డి అభ్యర్థులు నిమిషానికి 80 పదాల వేగంతో పూర్తి చేయాలి. ఈ విధంగా పూర్తి చేసిన అంశాన్ని కంప్యూటర్లో టైప్ చేయాలి. ఈ క్రమంలో గ్రేడ్-సి అభ్యర్థులు ఇంగ్లిష్‌లో 40 నిమిషాల్లో, హిందీ భాషను ఎంచుకుంటే 50 నిమిషాల్లో, గ్రేడ్-డి అభ్యర్థులు ఇంగ్లిష్లోనైతే 50 నిమిషాల్లో, హిందీ భాషను ఎంచుకుంటే 65 నిమిషాల్లో పూర్తి చేయాలి. రిఫరెన్స్ బుక్స్: - క్వికర్ మ్యాథ్స్: ఎం. థైరా - ఆబ్జెక్టివ్ మ్యాథ్స్: ఆర్ఎస్ అగర్వాల్ - రీజనింగ్: ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్ ప్రకాషణ్ - ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఎస్ చాంద్ పబ్లికేషన్స్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ - జీకే: మనోరమ ఇయర్‌బుక్, అరిహంత్ పబ్లికేషన్స్, ప్రతియోగితా దర్పణ్ నోటిఫికేషన్ సమాచారం: - అర్హత: 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత - వయసు: 18 నుంచి 27 ఏళ్లు (ఆగస్టు 1, 2014 నాటికి). నిర్దేశిత అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపునిస్తారు. - ఫీజు: రూ. 100 (నిర్దేశిత అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు). - దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్. - దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2014. - రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 14, 2014. వివరాలకు: http://ssc.nic.in