
సరస్వతి (ఫైల్)
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): కోర్టు తీర్పును టైప్ చేస్తూ గుండెపోటుతో స్టెనోగ్రాఫర్ మృతిచెందారు. ఈ ఘటన తిరువళ్లూరు ఉమ్మడి కోర్టు ఆవరణలో మంగళవారం జరిగింది. చెన్నై కోడంబాక్కం ఆండవర్‌నగర్‌కు చెందిన బాలాజీ భార్య సరస్వతి (52) జిల్లా ప్రధాన కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
మంగళవారం జిల్లా న్యాయమూర్తి ఒక కేసులో ఇచ్చిన తీర్పును టైప్‌చేస్తూ హఠాత్తుగా కిందపడిపోయారు. ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిరువళ్లూరు నగర పోలీసులు కేసు నమోదు చేశారు.