తమిళ సినిమా: నటి వనితా విజయకుమార్ భర్తకు గుండెపోటు రావడంతో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. నటి వనితా విజయకుమార్ ఇటీవలే పీటర్‌పాల్ అనే వ్యక్తిని మూడవ వివాహం చేసుకున్న విషయం తెలిసింది. వీరి వివాహం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. అంతేకాకుండా నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్ వంటివారు నటి వనితా విజయకుమార్ మూడవ పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేశారు. వీరి మధ్య గొడవ పోలీసులు, కేసుల వరకు వెళ్లింది. అంతేకాకుండా నటి వనితా విజయకుమార్, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా అంటూ నోటీసుల వరకు వెళ్లారు. ఈ వ్యవహారం పక్కన పెడితే వనిత విజయకుమార్ భర్త పీటర్ పాల్ మంగళవారం గుండపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment