Vanitha Vijayakumar
-
నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది
తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి అని న్యూస్. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఏడడుగులు వేయనుందని అందరూ అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని స్వయంగా ఇప్పుడు ఈమెనే తేల్చేసింది. ఎందుకంటే ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్. దీంతో అందరూ ఫూల్ అయ్యారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు)రెండు మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోని నటి వనితా విజయ్ కుమార్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అందరూ నాలుగో పెళ్లికి రెడీ అయిందని ఫిక్స్ అయ్యారు. రాబర్ట్‌తో ఈమె రిలేషన్లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. దీంతో అందరూ పెళ్లి వార్త నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా 'మిసెస్ & మిస్టర్' కోసమని ఇప్పుడు బయటపెట్టారు.ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వనితనే దర్శకత్వం వహించింది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరించింది. ఇలానే గతంలో తెలుగులో నరేశ్-పవిత్ర కూడా తొలుత పెళ్లి అన్నట్లు హడావుడి చేశారు. తీరా చూస్తే 'మళ్లీ పెళ్లి' సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఐడియానే వనిత కాపీ కొట్టేశారా అనిపించింది. కాగా వనిత విజయ్‌కుమార్ తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్, బిగ్‌బాస్ అల్టిమేట్ మొదటి (ఓటీటీ) సీజన్లో పాల్గొంది.(ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ) View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్
తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. చాలాకాలం నుంచి తనకు తెలిసిన కొరియోగ్రాఫర్తోనే ఏడడుగులు వేయబోతుంది. అక్టోబరు 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.ప్రముఖ నటుడు విజయ కుమార్ పెద్ద కూతురు వనిత. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అనంతరం పలు మూవీస్ చేసింది. 2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూతురు పుట్టింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో ఇతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్)కాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ని మూడో పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే ఇది పెటాకులైంది. అయితే ఆయనతో తన పెళ్లి జరగలేదని, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని వనిత వివరణ ఇచ్చింది.ఇవన్నీ పక్కనబెడితే గతంలో సహజీవనం సాగించిందనే రూమర్ వచ్చింది కదా.. సదరు కొరియోగ్రాఫర్ రాబర్ట్‌నే ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుంది. వనిత వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
మరో పెళ్లి వైపు అడుగులేస్తున్న సీనియర్ నటి
నటి వనితా విజయకుమార్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. సీనియర్ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత అని తెలిసిందే. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన వనిత ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది.తరువాత 2020లో ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కూడా కేవలం నాలుగు నెలల్లోనే ముగిసిపోయింది. కానీ, ఆయనతో పెళ్లి జరగలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని నటి వనిత వివరణ ఇచ్చింది.వీటన్నింటి తర్వాత 43 ఏళ్ల వనిత 4వ సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందనే టాక్ తమిళ మీడియాలో వినిపిస్తోంది. అలాంటి వార్త బయటకు రాగానే ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనేది అందరి ప్రశ్న. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక సమాధానం లేదు. ఇప్పుడు పెళ్లి గురించి అడిగిన ఓ అభిమానికి వనిత బదులిస్తూ.. ఊహించని ట్విస్ట్ కోసం ఆగండి! అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నిజంగానే త్వరలో గుడ్‌న్యూస్ చెబుతుందేమోనని కామెంట్లు చేస్తున్నారు. వనిత మాత్రమే కాదు, ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది. -
హీరోయిన్గా డైరెక్టర్ కూతురి ఎంట్రీ!
ఇండస్ట్రీలోకి వారసులు రావడం కొత్తేం కాదు. వీళ్లలో కొందరు సక్సెస్ అయి స్టార్స్ అయితే మరికొందరు మాత్రం అనామకంగా మిగిలిపోతుంటారు. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీల వారసుల తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే నటి వనితా విజయ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మాజీ భర్త ఆకాశ్‌కు పుట్టిన కొడుకు విజయ్ శ్రీహరి... ఇప్పుడు హీరో అవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ కూతురు హేజల్ షైనీ ఇదే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)విజయ్ శ్రీహరి, హేజల్ షైనీ జంటగా ప్రభు సాల్మన్ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'కొక్కీ' మూవీతో కరణ్‌ని, 'మైనా'తో అమలాపాల్, 'కుంకీ'తో విక్రమ్ ప్రభును హీరోగా పరిచయం చేశారు. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 'కాయల్' సినిమాతో ఆనందికి కూడా మంచి పేరు వచ్చేలా చేశారు సాల్మన్. ఇలా చాలామందికి హిట్స్ ఇచ్చిన ప్రభు సాల్మన్ ఇప్పుడు తన కూతురికి కూడా అలానే ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు.ఇది 'కుంకీ' తరహాలోనే అడవి బ్యాక్ డ్రాప్లో సాగే డిఫరెంట్ సినిమా అని, ఇందులో సింహాం ప్రధాన పాత్రధారిగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్) -
నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్ కుమార్
నటి వనితా విజయ్ కుమార్.. సినిమాలకంటే వ్యక్తిగత విషయాలవల్లే ఎక్కువగా పాపులర్ అయింది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ వారసురాలిగా చంద్రలేఖ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. అందులో దళపతి విజయ్‌కి జోడిగా నటించి మంచి మార్కులు సాధించింది. దేవి సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలోనే 2000లో నటుడు ఆకాష్‌ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఏడాదికే ఆకాశ్‌కు విడాకులు ఇచ్చి..ఆనంద్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని..అతన్ని దూరం పెట్టేసింది. గతేడాదిలో మేలో పీటర్ పాల్ మృతి చెందగా.. అతను తన భర్తే కాదని, తమకు పెళ్లే జరగలేదని చెప్పి అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం వనితా తన ఇద్దరి కూతుళ్లతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. విజయ్ కుమార్ ఫ్యామిలీ ఆమెను దూరం పెట్టింది. ఇటీవల విజయ్ కుమార్ మనువరాలు దియా పెళ్లి జరిగింది. ఆ వేడుకకు విజయ్ కుమార్ ఇద్దరు భార్యల పిల్లలు.. బంధువులు వెళ్లారు. కానీ వనితకు మాత్రం ఆహ్వానం అందలేదట. ఇదిలా ఉంతే తన తండ్రి గురించి వనితా విజయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో వనితా మాట్లాడుతూ.. ‘మా నాన్న ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడుతూ.. నా పేరు తప్ప అందరి పేర్లు చెప్పాడు. నా పేరు పలకడానికి కూడా ఆయన ఇష్టం లేదు. ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. నేను మాత్రం ఆయన కూతురినే అనే విషయం ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం నా జీవితం ఇలా అయిందంటే..అందుకు కారణం మా నాన్న. ఆయన వల్లే నా జీవితం నాశనం అయింది. ఆయన మాటలు వినడం వల్లే నేను ఇలా తయారయ్యాను’ అని వనితా కుమార్ అన్నారు. అయితే ఈ వాఖ్యలు చాలా రోజుల క్రితం చేయగా..ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
తెలుగు స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం.. ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఇంకా..
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఈ షోని ఆరాధించే అభిమానులతో పాటు తిట్టిపోసే జనాలు సైతం ఉన్నారు. అయితే ఎంత తిట్టుకున్నా ఆ మ్యూజిక్ రాగానే చాలామంది టీవీలకు అతుక్కుపోయి మరీ బిగ్‌బాస్ చూస్తుంటారు. అదే ఈ షో ప్రత్యేకత! ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో చూపించాలన్నదే దీని కాన్సెప్ట్. వారికి ఇచ్చే ఛాలెంజ్‌లు, టాస్కులు అదనం.. దీని ద్వారా చూసే జనాలకు కాలక్షేపం.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు కాసుల వర్షం. కానీ షో ముగిసిన తర్వాత నెమ్మదిగా జనాలు వారిని మర్చిపోతుంటారు. అటు కంటెస్టెంట్లు కూడా బోలెడంత నెగెటివిటీతో బయటకు వస్తారు. పైగా ఛాన్సులు, ఫేమ్ అందుకోవడం అందని ద్రాక్షగా మారుతూ ఉంటుంది. టైటిల్ గెలిచామన్న సంతృప్తి తప్ప ఏదో కోల్పోయామన్న లోటు మాత్రం అలాగే ఉండిపోతుంది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడే అంత క్రేజ్! బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్, నాలుగో సీజన్ తర్వాత మళ్లీ ఏడో సీజన్‌కు ఆ స్థాయిలో క్రేజ్ వచ్చింది. కంటెస్టెంట్ల కోసం అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలే చేశారు. అంతిమంగా ఈ పోరులో రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. బిగ్‌బాస్ షో అనేది వ్యక్తిత్వ, మానసిక వికాస కేంద్రం అని అప్పట్లో బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందుమాధవి తండ్రి అన్నాడు. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి, తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదన్నాడు. కానీ ఇక్కడే ప్రశాంత్‌ను తప్పుదారి పట్టించాడు శివాజీ. హౌస్‌లో ప్రశాంత్ తప్పు చేయబోయిన ప్రతిసారి శివాజీ అడ్డుకున్నాడు. అతడిని మాట్లాడనీయకుండా చేశాడు. టైటిల్ విజేత అరెస్ట్ అప్పుడే కనక శివాజీ అడ్డుపడకపోయుంటే ప్రశాంత్ స్వభావం అందరికీ తెలిసేది, తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చి ఉండేది. హౌస్‌లో ఉన్ననాళ్లూ మాస్క్ వేసుకుని నటించాడన్న మాట వచ్చుండేదే కాదు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే (డిసెంబర్ 17) రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొందో అందరకీ తెలిసిందే! ప్రశాంత్‌ను వెనక గేటు నుంచి వెళ్లిపోమన్నా ముందు నుంచే వెళ్తానన్నాడు. పోనీ, కారు ఆపకుండా వెళ్లిపోమని చెప్పినా లెక్క చేయలేదు. రైతుబిడ్డ అనే సింపతీ వాడాలనుకున్నాడు. పైగా అంతమంది అభిమానులు కనిపించడంతో మళ్లీ అదే స్టూడియో దగ్గరకు వచ్చాడు. దీంతో అక్కడ చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు. చివరకు ఏమైంది? పోలీసుల మాటల్ని బేఖాతరు చేసినందుకు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. టైటిల్ గెలిచిన ఒక్కరోజులోనే ప్రశాంత్ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో వల్ల ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ మరోవైపు తమిళంలో రన్ అవుతున్న బిగ్‌బాస్ ఏడో సీజన్ సైతం తరచూ వార్తల్లో ఉంటోంది. ఈ షోలో సీనియర్ హీరోయిన్ విచిత్ర పాల్గొంది. ఓ ఎపిసోడ్లో ఆమె ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. తెలుగులో ఓ స్టార్ హీరో పెట్టిన టార్చర్ వల్లే సినిమాలు వదిలేశానంది. ఆ హీరో తన గదికి రమ్మని పిలిస్తే వెళ్లలేదని.. దీంతో తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బంది పెట్టారని చెప్పింది. తనను సెట్స్‌లోనూ అసభ్యంగా తాకాడని.. ఆ విషయం చెప్పినందుకు తన చెంపే పగలగొట్టారని వాపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ హీరో బాలకృష్ణయే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. Actor Who Harassed : #Balayya (Balakrishna) Telugu Film Name : Bhalevadivi Basu (2001 Release) Stunt Director : A.Vijay Nadigar Sangam Head Who Refused Action: Radha Ravi #Vichithra #MeToo pic.twitter.com/9rrxagpUwV — Analyst (@BoAnalyst) November 22, 2023 పారిపోయేందుకు యత్నం ఇక ఇదే హస్‌లోని కంటెస్టెంట్ కూల్ సురేశ్ ఓ రోజు బిగ్‌బాస్ ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గోడ ఎక్కి పారిపోవడానికి యత్నించగా అది చూసిన ఓ కంటెస్టెంట్ పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని కిందకు దింపాడు. ఇదిలా ఉంటే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వార్, బయట అభిమానుల మధ్య వార్ సహజమే! కానీ లోపల కంటెస్టెంట్లు ఏదో అనుకున్నారని వారి కుటుంబసభ్యులపైనే దాడి జరిగింది. నటి వనితా విజయ్‌కుమార్ కూతురు జోవిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. ఆమె ప్రదీప్ ఆంటోని అనే కంటెస్టెంట్‌పై తీవ్ర విమర్శలు చేసింది. #CoolSuresh try to escape .this week no elimination cool suresh self eviction. pic.twitter.com/hZqh8RDuwP — Jin (@Jin49486319) December 13, 2023 జోవిక ఆరోపణలు.. ప్రదీప్‌కు రెడ్ కార్డ్ ఆయన ఎప్పుడూ వాష్ రూమ్ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రత లేదని జోవిక ఆరోపించింది. దీంతో కమల్ అతడికి రెడ్ కార్డ్ జారీ చేసి షో మధ్యలోనే అర్థాంతరంగా ఎలిమినేట్ చేశాడు. దీనివల్ల జోవికపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరగ్గా దాన్ని తిప్పికొడుతూ వచ్చింది వనిత. ఓ రోజు బిగ్‌బాస్ షో గురించి రివ్యూ చెప్పి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని అభిమానే తనపై దాడి చేశాడని వనిత ఆరోపించింది. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) షో మధ్యలో కంటెస్టెంట్ అరెస్ట్ కన్నడ బిగ్‌బాస్ 10వ సీజన్లో ఓ కంటెస్టెంట్‌ను షో మధ్యలో నుంచే పోలీసులు తీసుకెళ్లిపోయారు. వర్తూర్ సంతోష్ పులి గోరును మెడలో ధరించి దర్జా ప్రదర్శించాడు. దీంతో అటవీ అధికారులు అది నిజమైనదా? కాదా అని సెట్స్‌కు వెళ్లి మరీ పరీశిలించారు. అది నిజమైన పులి గోరేనని తేలడంతో అతడిని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇకపోతే బిగ్‌బాస్ షోలోకి యూట్యూబర్లు, సింగర్లు, డ్యాన్సర్లు, నటీనటులు వెళ్తుంటారు. కానీ తొలిసారి ఓ ఎమ్మెల్యే హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌లోకి ఎమ్మెల్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లను మోటివేట్ చేశాడు. కంటెస్టెంట్‌గా కాకుండా అతిథిగా షోకి వెళ్లి వచ్చాడు. ఇక ఇదే షోలో ఓ శునకం ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. సదరు ఛానల్ కూడా 777 చార్లీ సినిమాతో ఆకట్టుకున్న చార్లీ అనే శునకం మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లనుందని ప్రకటించింది. కానీ పలు కారణాల రీత్యా ఇది కార్యరూపం దాల్చలేదు. ಕಲರ್ಫುಲ್ ಮನೆಗೆ ತಾಳ್ಮೆಯ ಬಿಳುಪು; ಎಂಟ್ರೀ ಕೊಟ್ರು ಎಮ್.ಎಲ್.ಎ ಪ್ರದೀಪು! ಬಿಗ್ ಬಾಸ್ | ಪ್ರತಿ ರಾತ್ರಿ 9:30 #BBK10 #HappyBiggBoss #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ pic.twitter.com/9FB9d1eVrd — Colors Kannada (@ColorsKannada) October 9, 2023 ప్రెగ్నెన్సీ టెస్ట్ బిగ్‌బాస్ షోలో దంపతులు పార్టిసిపేట్ చేయడం చూశాం. తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. కానీ తొలిసారి ఓ మహిళకు హౌస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో అంకితా లోఖండే- విక్కీ జైన్ కలిసి పాల్గొన్నారు. హౌస్‌లోకి వెళ్లిన నెల రోజుల తర్వాత తనకు ఇంకా పీరియడ్స్ రాకపోవడంతో అయోమయానికి లోనైంది అంకిత. దీంతో ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు చేశారు. అయితే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇలా ఈ ఏడాది ఏదో భాషలో ఏదో ఒక వార్తతో బిగ్‌బాస్ షో ట్రెండ్ అవుతూనే వచ్చింది. చదవండి: బుల్లితెర జంట విడాకులు? ఇద్దరి తప్పు.. ఏడుస్తూ ఉండలేం కదా! -
బిగ్ బాస్ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి
సౌత్ ఇండియా సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ తరుచూ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. 'దేవి' సినిమాతో ఆమె తెలుగు వాళ్లకు పరిచయం అయింది. అలా పలు సినిమాల్లో ఆమె నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు జోవిక బిగ్ బాస్-7 తమిళ్లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. దీంతో జోవిక ట్రోలింగ్‌కు గురి అవుతూ రావడంతో వనిత విజయ్‌కుమార్ వాటిని తిప్పి కొడుతుంది. ఇలా ఆమె చుట్టూ కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో వనిత విజయ్‌కుమార్‌పై దాడి జరిగింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నిన్న రాత్రి ఆమె ఎదుర్కొన్న సంఘటనను తెలిపింది. బిగ్ బాస్ స్టార్ అభిమాని అంటూ ఓ వ్యక్తి తనను కొట్టాడని, తన ముఖం నుంచి రక్తం కూడా వచ్చిందని వనితా విజయకుమార్ ఫోటోతో సహా ఇలా వెల్లడించింది. 'నాపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అతనెవరో దేవుడికి మాత్రమే తెలుసు. ఈ దాడికి పాల్పడింది బిగ్ బాస్ స్టార్ ప్రదీప్ ఆంటోనీ అభిమాని అని తెలుస్తోంది. అతన్ని విచారిస్తే అన్నీ విషయాలు బయటకొస్తాయి. రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత రివ్యూ చెప్పి నేను డిన్నర్ కోసం బయటకు వచ్చాను. తర్వాత మా అక్క సౌమ్య ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారును తీయడానికి వస్తుండగా చీకట్లోంచి ఓ వ్యక్తి వచ్చాడు. అప్పుడు అతను నాకు రెడ్ కార్డ్ గుర్తుందా..? అంటూ కొట్టాడు. రెడ్ కార్డ్ వివాదంలో మీ సపోర్ట్ కూడా ఉంది ఉంటూ పారిపోయాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నా ముఖం నుంచి రక్తం వచ్చినప్పుడు, నేను అరుస్తూ ఏడ్చాను. అప్పుడు అర్ధరాత్రి ఒంటిగంట అయింది. కాబట్టి నా చుట్టూ ఎవరూ లేరు. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అక్క చెప్పింది. కానీ నేను వారిని అంతగా నమ్మను అందుకే ప్రస్తుతానికి నేను ఫిర్యాదు చేయలేదు. కానీ పోలీసుల వద్దకు తప్పకుండా వెళ్తాను. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స తీసుకుని అనంతరం ఇంటికి వెళ్లాను. నాపై ఎవరు దాడి చేశారో గుర్తించలేకపోయాను. పిచ్చివాడిలా అతని నవ్వు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతోంది. నేను ప్రస్తుతం ఆ గాయం నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను.. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను.. ఎందుకంటే నాకు శారీరకంగా బాగా లేదు. ఈ స్థితిలో తెర ముందుకు రావడం సాధ్యం కాదు.' అని వనిత చెబుతోంది. కూతురు జోవిక వల్లే ఈ గొడవ జరిగిందా..? తరువాత, వనిత తన ముఖంపై గాయాన్ని కూడా చూపించింది. ‘‘నేను ఎదుర్కొన్న క్రూరమైన దాడి ఇది. ధైర్యంగా ఈ పోస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ తమిళ్ కేవలం గేమ్ షో మాత్రమే. ఇలాంటి దాడి సరికాదు.' అని ఆమె చెప్పింది. కమల్ హాసన్ హాస్ట్‌గా ఉన్న తమిళ బిగ్ బాస్ ఏడో సీజన్ జరుగుతోంది. ఈ షోలో వనిత కూతురు జోవిక కూడా పోటీ పడుతోంది. అదే షోలో తమిళ్ నటుడు ప్రదీప్ ఆంటోనీ అనే కంటెస్టెంట్ ఉన్నాడు. ఆయనపై తోటి కంటెస్టెంట్లతో పాటు జోవిక కూడా గతంలో విమర్శలు చేసింది. ఆయన ఎప్పుడూ వాష్ రూమ్ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రతలేదని జోవిక ఆరోపించింది. దీంతో ఆంటోనీ ప్రదీప్‌కు కమల్ కూడా రెడ్ కార్డ్ జారీ చేశాడు. అప్పుడు ఆయన బిగ్ బాస్ మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఈ గొడవ వల్లే వనిత విజయ్‌కుమార్‌పై ప్రదీప్ అభిమానులు దాడి చేశారని తెలుస్తోంది. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరే చూడాలి కానీ ఇలా దాడులు చేయడం వరకు వెళ్లడం ఏంటని నెటిజన్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) -
బిగ్ బాస్: జోవికా తండ్రి ఎవరంటూ కామెంట్లు.. ఫైర్ అయిన షకీలా
కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కుమార్తెనే ఈ జోవిక. కోలీవుడ్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. దీంతో షో పట్ల భారీగా అంచనాలు పెరిగాయి. జోవిక బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టగానే అందరూ స్టార్ కిడ్, బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి తీసుకున్నారు అనుకున్నారు కానీ ఆమె ఆడుతున్న విధానం చూసి చాలామంది ముచ్చట పడుతున్నారు.18 ఏళ్ళ వయసులో ఆమె బ్యాలెన్స్, మెచ్యూరిటీ లెవెల్స్ మామూలుగా లేవని మెచ్చుకుంటున్నారు. ప్రతి మాటలో ఫైర్ ఉంటుంది. మాటల్లో తడబాటు ఉండదు. చెప్పాల్సిన విషయాన్ని పర్ఫెక్ట్గా చెబుతుంది. ఇలా తన గేమ్ ప్లాన్‌తో ఆమె దూసుకుపోతుంది. జోవికా కోసం షకీలా ఫైట్ ఇలాంటి సమయంలో ఆమె తండ్రి ఎవరు..? సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేయడం ప్రారంభించారు. దీంతో జోవికా వ్యక్తిగత జీవితం గురించి బిగ్ బాస్ ప్రేక్షకులలో పెద్ద చర్చనీయాంశమైంది. జోవిక వనిత మొదటి భర్త ఆకాష్‌కి పుట్టిన కూతురు. అయితే గతంలో వనిత రెండో భర్త చేసిన వాదన తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. జోవికా తండ్రి ఆకాష్ కాదని, ప్రేమికుడని చెప్పాడు. ప్రస్తుతం జోవికా బిగ్ బాస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఇది నచ్చన కొందరు పీఆర్ టీమ్ వారు ఇలాంటి విషయాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి షకీలా స్పందించి తెరపైకి వచ్చింది. అలాంటి చెత్త కామెంట్లు చేసే వారిపై ఫైర్ అయింది. జోవికా తండ్రి ఆకాష్ అని షకీలా బలంగా చెప్పింది. అనుమానాలు లేవనెత్తే వారిని పరుషమైన భాషలో షకీల తిప్పికొట్టింది. అడిగేవారికి వేరే పని లేదు. ఇతరుల బెడ్రూమ్లలోకి వచ్చి చూస్తున్నారా..? అంటూ విరుచుకుపడింది. జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు: షకీలా 'జోవికా తండ్రి ఎవరో నాకు తెలుసు. జోవికాకు ఒక సోదరితో పాటు ఒక సోదరుడు ఉన్నారు. జోవికా పుట్టిన సమయం నుంచి నాకు తెలుసు. ఇదంతా చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఇలాంటి తప్పుడు మాటలు అంటే ఎదుటి వారు భాద పడుతారని కూడా ఎలా కామెంట్లు చేస్తారు..? ఏమీ ఆలోచించకుండా ఇతరుల బెడ్రూమ్లలోకి చొరబడే వారి కోసమే నేనొకటి అడుగుతున్నా.. ఇంతకూ నీ తండ్రి ఎవరు..? ఒకసారి సమాధానం చెప్పండి. పిల్లల తండ్రి ఎవరో తల్లికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి ఆకాష్. జోవిక పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఆమె పేరు పెట్టే రోజు నేను అక్కడ ఉన్నాను. 18 ఏళ్లు నిండిన పిల్లపై ఇలాంటి మాటలా..? ఆ చిన్నారిని ఎవరూ బాధపెట్టకూడదు. గతంలోనే జోవికా తల్లి చెప్పింది.. ఆ పాపకు తండ్రి ఆకాష్ అని. అంతకంటే ఇంకేం కావాలి..? జోవికాకు పెళ్లి చేయాలి, నాన్న ఎవరో కూడా తెలియదని ఆమెపై నిందలు వేస్తే ఎలా..? అలాంటి వారు నా ముందుకు వస్తే కచ్చితంగా కొడతాను.' అని షకీలా హెచ్చరించింది. చిన్న వయసులోనే చదువు మానేసినా జోవికా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని షకీలా కూడా చెబుతోంది. షకీలా తన జీవితంలోని అనేక దశలలో వనితతో ఓదార్పుగా ఉండేది. వారిద్దరూ 20 ఎళ్లకు పైగా మంచి స్నేహితులు. -
బిగ్‌బాస్‌లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!
కోలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేయించుకున్న నటి వనితా విజయకుమార్. విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన వ్యక్తిగత సమస్యల కారణంగా కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్నారు. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) వనిత రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నా వైవాహిక దాంపత్యం సాఫీగా సాగలేదు. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ తర్వాత వనితా విజయకుమార్ మళ్లీ నటించటానికి సిద్ధమయ్యారు. ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని అక్కడ కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. కాగా ఈమె కూతురు గురించి చాలామందికి తెలియదు. వనితా విజయ్ కుమార్ కూతురు పేరు జోవిక. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్ రియాలిటీ షో సెవెన్ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని తల్లి బాటలోనే ప్రయాణిస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో చదువు చాలా ముఖ్యం అన్న నటి విచిత్ర వ్యాఖ్యలను ఖండించి తనకు చదువు పెద్దగా అబ్బకపోవడంతోనే నచ్చింది చేస్తున్నానని బదిలిచ్చింది. దీంతో తొలి వారమే ఎపిసోడ్‌లోని హాట్ టాపిక్‌గా మారింది. (ఇది చదవండి: హౌస్‌లో అడుగుపెట్టిన సోషల్ మీడియా సెన్సేషన్) తన కూతురు మాటలను పూర్తిగా సమర్థించిన నటి వనిత విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను దర్శక నటుడు పార్థీపన్ వద్ద గత కొన్ని నెలలుగా సహాయ దర్శకురాలిగా పనిచేసినట్లు చెప్పారు. తమకు రెండు కార్లు ఉన్నా పార్తీపన్ కార్యాలయానికి మెట్రో రైల్లోనే వెళ్లి వచ్చేదని చెప్పారు. అలా పెడితేనే సహాయ దర్శకుల కష్టమేమిటో ఆమెకు తెలుస్తుందని చెప్పారు. తాను కూడా మొదట్లో దర్శకుడు పి. వాసు వద్ద 10 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశానని విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జోవికాకు సంబంధించిన మరో సర్ప్రైజ్ ఏమిటంటే తను ఇప్పటికే రెండు చిత్రాల్లో కథానాయకిగా నటించడానికి ఒప్పందం అయినట్లు చెప్పారు. అందులో ఒకటి తన చిత్రం కాగా.. మరొకటి తెలుగు చిత్రమని చెప్పారు. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) -
'నా కూతురిని చూసి గర్విస్తున్నా'.. బిగ్‌బాస్ గొడవపై స్పందించిన నటి!
ఇటీవలే మొదలైన తమిళ బిగ్ బాస్ మొదటి వారం నుంచే హాట్‌హాట్‌గా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్- 7లో ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కుమార్తె జోవికా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లో మరో కంటెస్టెంట్ అయిన విచిత్రకు జోవిక మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. చదువు విషయంలో తలెత్తిన ఈ గొడవపై జోవికా తల్లి, మాజీ కంటెస్టెంట్ వనిత రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. వనిత తన ట్వీట్లో రాస్తూ.. 'తన ఆట తనను ఆడనివ్వండి. నా కూతురిని చూసి నేను గర్విస్తున్నా. తన కూతురు ధనిక కుటుంబం నుంచి రాలేదు. నేను కూడా నా జీవితంలో చాలా కష్టపడ్డా. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతి బిడ్డ తన సొంత మార్గంలో వెళ్లాలనే ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. నేను ఒక తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. నా ఇద్దరు కుమార్తెలు వారి సొంత మార్గాల్లో రాణిస్తున్నారు' అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన కూతురు ప్రొఫెషనల్ యాక్టర్ అని.. రెండు సినిమాలకు సైన్ చేసిందని వనిత తెలిపింది. జోవిక తెలుగు, తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు పేర్కొంది. చిన్న వయస్సులో తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అంటూ రాసుకొచ్చింది. కాగా.. తొలివారంలో ఐషు, అనన్య, చెల్లదురై, కూల్ సురేష్, జోవికా, ప్రదీప్, రవీనా దాహా, యుగేంద్రన్ నామినేట్ అయ్యారు. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో నుండి యుగేంద్రన్ ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. She is already a professional actor technicianw who has signed 2 films . One in telugu and one in tamil . She is working already at 18 years old understanding she has responsibilities at this young age. She is now on a paid job as everyone else — Vanitha Vijaykumar (@vanithavijayku1) October 6, 2023 But is it the end for those who cannot complete their education because they are unable to cope with the education system pressures. Fyi she is not from a rich family, I have struggled to make ends meet on a day to day basis facing family situations etc. — Vanitha Vijaykumar (@vanithavijayku1) October 6, 2023 -
సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే! హీరోయిన్ ప్రియా బాజ్‌పేయ్, కల్పికా గణేశ్ సైతం మయోసైటిస్‌తో పోరాడుతున్నట్లు ఆ మధ్య వెల్లడించారు. వారిలాగే తాను కూడా ఓ అరుదైన వ్యాధితో పోరాడుతున్నానంటోంది నటి వనితా విజయ్ కుమార్. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చాలా ఏళ్ల నుంచి క్లాస్ట్రోఫోబియాతో సతమతమవుతున్నట్లు పేర్కొంది. దీనివల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండాలంటేనే భయమేస్తోందని చెప్పుకొచ్చింది. లిఫ్ట్, వాష్‌రూమ్ వంటి చిన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండలేనంది. కిటికీలు లేని గదుల్లో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా’ అంటారు. గతంలో సంపూర్ణేశ్ బాబు సైతం బిగ్‌బాస్ షోలో ఈ భావనతో బాధపడ్డాడు. ఇకపోతే తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది వనితా విజయ్‌కుమార్. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. ఆమె కూతురు జోవిక సైతం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏడాదిపాటు శిక్షణ సైతం తీసుకుంది. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు, గుర్తింపు రావట్లేదని చనిపోదామనుకున్నా -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న వనితా విజయ్‌కుమార్ కూతురు!
వనితా విజయ్‌కుమార్.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటుందీ నటి. తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌తో ఫేమస్ అయిన వనిత అటు బుల్లితెర, ఇటు వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. తెలుగులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. వనితకు.. విజయ్ శ్రీ హరి అనే తనయుడితోపాటు జోవిక విజయ్‌కుమార్ అనే కూతురు కూడా ఉంది. ఇటీవలే జోవిక 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. హీరో ఎవరని కాకుండా కథ.. ఇది చూసిన అభిమానులు కోలీవుడ్‌కు మరో హీరోయిన్ దొరికేసింది అని కామెంట్లు పెడుతున్నారు. అటు వనితా విజయ్ కుమార్ కూడా జరగబోయేది అదేనని వత్తాసు పలుకుతోంది. 'నా కూతురు జోవిక కచ్చితంగా సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే మేము కొన్ని కథలు వింటున్నాం. అయితే తను హీరోయిన్గా చేయాలా? ముఖ్యమైన పాత్రలో నటించాలా? అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. మరీ ముఖ్యంగా సినిమాలో ఎవరు హీరో? అన్నదాన్ని పక్కనపెట్టి కథ బాగుందా? లేదా? అన్నదానిపైనే ఫోకస్ చేస్తున్నాం. తన ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది' అని చెప్పుకొచ్చింది. స్టార్స్ శిక్షణ తీసుకున్న ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కాగా జోవిక ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏడాదిపాటు శిక్షణ తీసుకుంది. దీపికా పదుకొణె, ప్రీతి జింటా, హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ వంటి ఎందరో స్టార్స్ ఈ స్కూలులో శిక్షణ తీసుకున్నవాళ్లే! మరి జోవిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందా? ముఖ్య పాత్రలో మెరవనుందా? అనేది చూడాలి! ఇదిలా ఉంటే వనితా విజయ్ కుమార్ తెలుగులో చివరగా నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Jovika Vijaykumar (@jovika_vijaykumar) View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: మెగాస్టార్ గ్లామరస్‌గా కనిపించిన సినిమా భోళా శంకర్.. ఆరోజు ఆయన్ను తొక్కేయాలనుకున్నారు -
మూడో పెళ్లిపై ప్రముఖ నటి కామెంట్స్.. అందుకే విడిపోయామని!
నటి వనితా విజయ్ కుమార్ పేరు చెప్పగానే మూడు పెళ్లిళ్ల విషయమే గుర్తొస్తుంది. ఈ ఏడాది మే నెలలో ఈమె మూడో భర్త పీటర్ పాల్ చనిపోయాడు. అయితే అతడు తన భర్త కాదని, తమకు అసలు పెళ్లే జరగలేదని ఈమె అప్పట్లో పోస్ట్ పెట్టింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. అదేంటి, లాక్డౌన్ టైంలో మ్యారేజ్ చేసుకున్నారా కదా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మూడోపెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) 'లాక్డౌన్ వల్ల నాలో ఒత్తిడి పెరిగింది. చనిపోతానేమో అని భయమేసింది. దీంతో నాకు ఎవరైనా కావాలనిపించింది. ఒకవేళ నేను చనిపోయినా అప్పటివరకు తోడుంటారు కదా! అయితే నేను మూడో పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. అలానే అతడు(పీటర్ పాల్) మంచి వ్యక్తి. అతడి వల్ల జీవితంలో చాలా విషయాలు తెలుసుకున్నాను' 'నా వరకు చూసుకుంటే.. మాకు పెళ్లి జరగలేదు. జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. కొన్నాళ్లకు నేను జీవితాన్ని కోరుకున్నాను. ఆయన వేరే దారిని ఎంచుకున్నారు. నా వరకు వస్తే ప్రేమ చాలా ముఖ్యం. కానీ అది ఓవైపు నుంచి వస్తే ఎలా? నేను ప్రేమ చూపించినప్పుడు అటువైపు నుంచి కూడా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా!' అని వనిత విజయ్ కుమార్ చెప్పారు. ఈ మధ్య ఈమె.. నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాలో నటించింది. (ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!) -
నా లైఫ్ అంత కాంట్రవర్సీలతోనే సగం గడిచింది..
-
నా కన్న కొడుకుకి బ్రెయిన్ వాష్ చేసి నాకు దూరం చేసాడు..
-
నా కన్న తండ్రే నన్ను బాధపెట్టి హింసించాడు..
-
ఆయనచేసే పనులకు తట్టుకోలేక మూడో భర్తను వదిలేసా
-
నా జీవితాన్ని సినిమాగా చేస్తే బాహుబలిల పార్ట్స్ తీయాలి
-
రమ్యకృష్ణ అందరి ముందు నా మీద అరవడం కరెక్ట్ కాదు..
-
జూ ఎన్టీఆర్ అంటే పిచ్చి థియేటర్ లో హంగామా చేస్తా ఆయన సినిమాకి
-
నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అల్లు అర్జున్ అంటే నాకు ...
-
అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి
సెలబ్రిటీ ప్రేమజంట నరేశ్- పవిత్ర లోకేశ్ జంటగా నటించిన మూవీ మళ్లీ పెళ్లి. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ తను నాలుగో పెళ్లి చేసుకుంటానని, పవిత్రతో జీవితం కొనసాగిస్తానని చెప్పాడు. ఇక ఈ మూవీలో నరేశ్ మూడో భార్యగా నటించిన వనితా విజయ్‌కుమార్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోగా మూడో పెళ్లి చట్టప్రకారం చెల్లదని చెప్పింది. శుక్రవారం (మే 26న) మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. బిగ్‌బాస్‌తో రీఎంట్రీ 'నేను మొదట్లో కొన్ని సినిమాలు చేసి మానేశాను. కొన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లి గెలిచాక తిరిగి స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాను. తమిళంలో సినిమా అవకాశాలు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం రాలేదు. ఓ రోజు గుడికి వెళ్లి ఒక మంచి తెలుగు సినిమా కావాలని అమ్మవారితో చెప్పుకుంటూ ఏడ్చాను. ఆ తర్వాతి రోజే డైరెక్టర్ ఎంఎస్ రాజు ఫోన్ చేసి మళ్లీ పెళ్లి మూవీ ఆఫర్ ఇచ్చాడు. వెంటనే ఓకే చెప్పాను. నా కొడుకు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లా షూటింగ్లో బిజీ ఉండటంతో నా ఫ్రెండ్సే నా పిల్లలను చూసుకున్నారు. నా కుటుంబానికి నేను ఎప్పుడో దూరమయ్యాను. బయటవాళ్లు వచ్చి ఇంట్లో ఏవేవో చేసేయాలని చూసేవారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఆఖరికి నా సొంత కొడుక్కి ఏదేదో చెప్పి బ్రెయిన్‌వాష్ చేశారు. దీంతో మా నాన్న కూడా అదే నమ్మి వాడిని నా నుంచి కాపాడాలనుకున్నాడు, దూరం చేయాలని చూశాడు. కోర్టు కేసులు కూడా అయ్యాయి. సుప్రీం కోర్టుదాకా వెళ్లి నేనే గెలిచాను. ఈ రాద్ధాంతం జరుగుతున్నప్పుడే రెండో సారి విడాకులు తీసుకున్నాను. అమ్మ చనిపోయాక కష్టాలు.. పోలీసుల సాయం తీసుకుని నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. తమిళనాడులో అడుగుపెట్టనివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు. అమ్మ చనిపోయేముందు నా పేరు కలవరించింది. అందరూ తనను మోసం చేయబోతున్నారని గ్రహించిన ఆమె నాకు ఫోన్ చేసి రమ్మంది. నేను ఒక్కదాన్నే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాను. తను మీడియాను, సుప్రీంకోర్టు లాయర్ రామ్ జెఠ్మలానీని పిలువు అని అడిగింది. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, ఇప్పుడివన్నీ చేయలేనని చెప్పాను. నాకు వీలునామా రాస్తానంది. అవన్నీ ఇప్పుడొద్దని చెప్పాను. కానీ అమ్మ చనిపోయాక వాళ్లు నన్ను ముప్పు తిప్పలు పెట్టారు' అని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్. వనితా విజయ్‌కుమార్ పేరెంట్స్ చదవండి: శ్రీలీల చెంపపై కొట్టిన బాలకృష్ణ, ఏం జరిగిందంటే? -
మూడు పెళ్లిళ్లు.. అందుకే విడాకులు నయనతార రమ్యక్రిష్ణ తో విబేదాలు
-
చనిపోయింది నా మూడో భర్త కాదు, నేను సంతోషంగా ఉన్నా: వనిత
నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి నటి వనితా విజయ్ కుమార్. తండ్రితో ఆస్తి గొడవలు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, పెళ్లిళ్లు,-విడాకులు.. ఇలా ఏదో ఒక విధంగా తమిళనాట వార్తల్లో వనిత పేరు తరచూ వినిపిస్తుంది. వనితతో గతంలో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన పీటర్ పాల్ ఇటీవల కన్నుమూశాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. తాజాగా దీనిపై వనిత స్పందించింది. పీటర్‌తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని కుండబద్ధలు కొట్టింది. 'పీటర్ పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. కాకపోతే 2020లో మేము రిలేషన్షిప్లో ఉన్నాం. అదే ఏడాది విడిపోయాం కూడా! అతడు నా భర్త కాదు, నేను అతడికి భార్యను కాదు. నేనసలు వైవాహిక జీవితంలోనే లేను. ఏ విషయానికీ నేను బాధపడటం లేదు. సింగిల్‌గా జీవిస్తున్నా. సంతోషంగా బతుకుతున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కాగా లాక్డౌన్లో వనిత, పీటర్ల పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తనకు విడాకులివ్వకుండా పీటర్ మరో పెళ్లి చేసుకున్నట్లు అతడి మొదటి భార్య ఎలిజబెత్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వనిత- పీటర్ల పెళ్లి చెల్లదని పేర్కొంది. కానీ కొంతకాలానికే వారు విడిపోయారు. ఆతర్వాత సింగిల్‌గా ఉన్న వనిత ఓసారి తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనిపై స్పందించిన వనిత.. ఇది కేవలం పికప్ డ్రాప్ సినిమాకు సంబంధించిన ఫోటో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినా ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని మహిళ చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. నేను నాలుగు కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడేమో తనకసలు మూడో పెళ్లే జరగలేదని మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb — Happy Sharing By Dks (@Dksview) June 27, 2020 View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: స్టార్ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు -
నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత
నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త, విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఏప్రిల్ 29న) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. 'సాయం చేసేవారికి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు ఎటువైపు వెళ్లాలనేది ఎటువెళ్లాలనేది ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు విముక్తి, శాంతి లభించిందని భావిస్తున్నాను. నువ్వు ఈ లోకం నుంచి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఇప్పటికైనా నీకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా వనితా విజయ్ కుమార్ 2020 జూన్ 27న పీటర్ పాల్‌ను పెళ్లాడింది. ఇది వనితకు మూడో పెళ్లి కాగా పీటర్‌కు రెండో పెళ్లి. అయితే తనకు విడాకులు ఇవ్వకముందే పీటర్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అతడి మొదటి భార్య ఎలిజబెత్. అదంతా అబద్ధమని, ఎలిజబెత్‌కు విడాకులిచ్చిన తర్వాతే వనితను పెళ్లాడానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు పీటర్. కానీ వీరి బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన నాలుగు నెలలకే వనితా- పీటర్ విడిపోతున్నట్లు వెల్లడించారు. పీటర్ మద్యానికి బానిసై అసభ్యంగా ప్రవర్తించడం వల్లే వనిత అతనిని విడిచిపెట్టినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. మద్యం తాగే అలవాటు వల్లే పీటర్ అనారోగ్యానికి గురై మరణించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్.. పెళ్లి మాత్రం వద్దట ఎవరూ ఇల్లు ఇవ్వడం లేదు.. చాలా కష్టంగా ఉంది: నటి -
'బిగ్‌బాస్ లైవ్ షో నిజం కాదు, దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు'
వినోదానికే కాదు వివాదాలకు కేంద్రంగా మారింది బిగ్‌బాస్ షో. ప్రతి సీజన్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్, గొడవల సెన్సేషన్స్ కూడా ఉంటూ వస్తున్నాయి. గంట నిడివి ఉండే ఎపిసోడ్లో నిర్వాహకులు తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ టీమ్ నాన్‌స్టాప్ స్ట్రీమింగ్‌ను ప్రవేశపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదాన్ని కన్నార్పకుండా చూసేయండంటూ 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్‌ను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ బూటకమంటోంది తమిళ నటి వనితా విజయ్ కుమార్. ఈమేరకు బిగ్‌బాస్ షో గురించి వరుస ట్వీట్లు చేసింది. 'బిగ్‌బాస్ అల్టిమేట్ నుంచి వచ్చేసినందుకు, కొందరు అనుకుంటున్నట్లుగా షో నుంచి పారిపోయినందుకు సంతోషంగా ఉంది. బిగ్‌బాస్ హౌస్ పిచ్చి, చిరాకు కలిగించే ప్రదేశం. అక్కడ ఉన్నందుకు ఇప్పటికీ పీడకలలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ షో నుంచి బయటకు వచ్చేసినా సరే, పూర్తిగా దాన్నుంచి బయటపడేందుకు కొంత సమయం పడుతుంది.' 'హౌస్‌లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది కానీ, అభిరామి మాటలను కానీ టెలికాస్ట్ చేయలేదు. ఇదసలు లైవ్ షోనే కాదు. వాళ్లకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి వివాదాస్పదంగా ఉండేట్టు టెలికాస్ట్ చేస్తున్నారు. పేరుకే ఎంటర్టైన్మెంట్ షో, కానీ అందులో ప్రధానమైన వినోదమే మిస్ అవుతోంది, కాంప్లికేటెడ్‌గా మారిపోయింది. ఎవరూ దాన్ని ప్రశ్నించడం లేదు. బిగ్‌బాస్ అనుభవం నుంచి బయటకు రావడానికి మానసికంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్. Entertainment show which lost its entertainment factor and has become complicated and no one to ask against it. thanking God for trusting my instincts and choosing sanity and peace..still mentally getting over the #bbexperience — Vanitha Vijaykumar (@vanithavijayku1) March 4, 2022 -
కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశాడు: నటి
అలనాటి స్టార్ కపుల్ మంజుల - విజయ్ కుమార్ల పెద్ద కూతురే నటి వనితా విజయ్ కుమార్. కోలీవుడ్‌లో సత్తా చాటుతూ టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా అవన్నీ పెటాకులే అయ్యాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కష్టాలను ఏకరువు పెట్టింది. 'మా అమ్మ ఎంతో కష్టపడి స్టార్ హోదా సంపాదించుకుంది. మాకోసం రాత్రింబవళ్లు షూటింగ్‌ల వెంట పరుగులు పెడ్తూ డబ్బులు కూడబెట్టింది. అమ్మకు మేము ముగ్గురం కూతుళ్లం. ఏదైనా మాకు సమానంగా రావాల్సిందే. కానీ నాన్న నాకు ఏదీ ఇవ్వకూడదనుకున్నారు. మా అమ్మ చనిపోయాక నాకు ఆస్తిపాస్తుల్లో చిల్లిగవ్వ కూడా దక్కకూడదనుకున్నారు. నామీదే కేసులు పెట్టారు. ఈ విషయంలో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్లాను. తమిళనాడులో నాకు అడ్రస్ లేకుండా చేస్తానని నాన్న నాతో ఛాలెంజ్ చేశాడు. కానీ ఇప్పుడు తమిళ ప్రజలకు నేను దగ్గరయ్యాను. అందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. మా ఫ్యామిలీలో ఎవరిని కదిలించినా వాళ్లంతా కూడా నేను ఆ కుటుంబంలో లేనని చెప్తుంటారు. వాళ్లకు నామీద ఎందుకంత కోపమో నాకిప్పటికీ తెలియదు. ఒకసారైతే నాన్న పోలీసులను పిలిపించి మా అమ్మ ఇంట్లోంచి నన్ను బయటకు గెంటేశారు. నాకు సంబంధించిన వస్తువులు, డబ్బులు కూడా ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక పెళ్లి సంగతి అంటారా? చిన్న వయసులో వివాహం చేయడం వల్లే నా పెళ్లిళ్లు ఎంతోకాలం నిలవలేవు' అని చెప్తూ ఎమోషనల్ అయింది వనిత. -
నటి వనితా విజయ్‌కుమార్ ఇంట విషాదం
వివాదాస్పద నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ ఇంట విషాదం నెలకొంది. తన అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషాద వార్తను సోషల్ మీడియాలో పంచుకున్న వనిత ఎమోషనల్ లేఖను పోస్ట్ చేసింది. 'విషాదకర వార్తతో ఉదయం నిద్ర లేచాను. నా అక్క కూతురు అనిత(20) మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె నాకు దేవుడిచ్చిన కూతురులాంటిది, నాకు పెద్దకూతురు వంటిది. మా నాన్న సోదరుడి కూతురు ఇంద్ర.. ఆమె సింగపూర్‌లో ఉంటుంది. ఇంద్ర చిన్న కూతురే అనిత. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టం. ఆమె కూతురు అనిత ఎంతో దయాగుణం కలిగి ఉండేది. అన్నింటినీ ఎంతో బాగా అర్థం చేసుకునేది. ఎప్పుడూ నాకు మద్దతుగా నిలబడేది. నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది. కానీ ఇలా మమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె పేరెంట్స్ సింగపూర్‌లో ఉండటంతో తన మృతదేహాన్ని కూడా అక్కడికే తరలించారు. ప్రస్తుతం నేను దుబాయ్‌లో ఉన్నాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నిజానికి ఈ అక్టోబర్ మధ్యలో మేమిద్దరం కలుద్దాం అనుకున్నాం. తనను నాదగ్గరే 2 నెలలు ఉంచేసుకుందామనుకున్నా. కోవిడ్, లాక్డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం, కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నా హృదయం ముక్కలైంది. మాటలు రావడం లేదు. ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నాను. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకోవడం లేదు. కానీ కొందరు ఇలాంటి విషాదాలను కూడా పక్కనపెట్టి చీరలు, నగలు కొనుక్కుంటూ పండగ సెలబ్రేట్ చేసుకుంటూ నీచంగా ప్రవర్తిస్తారు. అదృష్టవశాత్తు మా కుటుంబంలో అలాంటి వారు ఎవరూ లేరు. అనిత మాకు లక్ష్మీదేవి వంటిది. రెండేళ్లుగా కలుద్దామని ప్లాన్లు వేసుకున్నాం కానీ కనీసం హాయ్, బాయ్ కూడా చెప్పుకోలేదు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా స్వీట్ హార్ట్. అతన్, అంజన కోసమైనా ఇంద్ర అక్క స్ట్రాంగ్‌గా ఉండాలి. నా డార్లింగ్ అనిత ఎప్పటికీ నా కూతురే..' అని భావోద్వేగానికి లోనైంది వనిత. -
సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్
Vanitha Vijaykumar Supports Samantha: సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకులకు సమంతనే కారణం అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ చాలా దారుణంగా సామ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆమెపై అసత్య ప్రచారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. చదవండి: జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ సామ్-చై విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో సమంతదే తప్పు అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సహా పలువురు సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా నిలిచారు. తాజాగా వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ సైతం సామ్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసుకుంది. 'సమాజం అన్నది అవాస్తవం సామ్. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితం చాలా విలువైంది. ఏం జరిగినా దాని వెనుక ఓ కారణం ఉండే ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్లు' అంటూ వనితా విజయ్‌కుమార్ పేర్కొంది. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్ -
నాలుగు కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా : వనితా విజయ్‌కుమార్
Vanitha Vijayakumar: వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ ఇటీవలె తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురే వనిత. 'చంద్రలేఖ' చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని తరచూ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకొని విమర్శలపాలైంది. వీరి వివాహం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు. వివాహం అయిన కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అలా మూడో పెళ్లి పెటాకులైన వనితా విజయ్ తాజాగా పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి ఫోటో షేర్ చేసి అందరికి షాకిచ్చింది. ఇద్దరూ పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లవ్ సింబల్‌ను జోడించింది. దీంతో వనితా విజయ్‌కుమార్ నాలుగో పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఓ జ్యోతిష్యుడు వనితాకు నాలుగో పెళ్లి జరుగుతుందంటూ చెప్పిందే నిజమైందంటూ జోకులు పేల్చారు. ఇక వీరిద్దరరి పెళ్లి ఫోటో నెట్టింట ఎంతగా వైరల అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కరల్లేదు. దీంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చిన వనితా విజయ్‌కుమార్ స్పందించింది. ఇది నిజమైన పెళ్లి కాదని, ‘పికప్ డ్రాప్’ అనే చిత్రానికి సంబంధించిన ఫొటోలని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా పెళ్లి గురించి తనపై వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. 'ఇద్దరు నటీనటులు కలిసి ఫోటోలు తీసుకుంటే అది నిజమైన పెళ్లి అయిపోతుందా? దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? నా స్థానంలో ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం తప్పుపడుతున్నారు. నాలుగు కాదు..40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం. అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని స్పష్టం చేసింది. -
తమిళ పవర్ స్టార్‌తో వనిత విజయ్‌కుమార్ నాలుగో పెళ్లి?
మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకుంది వనిత విజయ్‌కుమార్. సీనియర్ నటుడు విజయ్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురే వనిత. 'చంద్రలేఖ' చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని తరచూ వార్తల్లో నిలిచింది. అయితే ఆమె త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ జ్యోతిష్యుడు జోస్యం పలికిన వీడియో ఒకటి ఆ మధ్య తెగ వైరల్ అయింది. వనితతో ఏడడుగులు నడిచే వ్యక్తి పేరు 'S' అక్షరంతో మొదలవుతుందని అతడు హింట్ కూడా ఇచ్చాడు. అంతేకాక ఆమె రాజకీయాల్లోకి కూడా ఎంటరవుతుందని, దివంగత సీఎం జయలలితలా పాలిటిక్స్‌లోనూ తన సత్తా చాటుతుందని పేర్కొన్నాడు. ఇదిలా వుంటే తాజాగా వనిత పెళ్లి ఫొటోను షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందా? అని కొందరు అభిమానులు అయోమయానికి లోనయ్యారు. ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజమైందంటూ మరికొందరు శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు, ప్రస్తుతం తను చేస్తున్న ఓ సినిమాలోని స్టిల్ ఇది. మొత్తానికి ఈ ఫొటో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. With you both a very happy married life ! pic.twitter.com/thvo7sLUDW — tiger sachi (@tigersachi) July 21, 2021 Happy Married Life #VanithaVijayaKumar With #PowerstarSrinivasan 4th Wicket Out 😂😂#Master @actorvijay #Beast pic.twitter.com/9MUnJqAPCP — Mʀ.Rv ❁ (@Thalapathy_Rv12) July 21, 2021 https://t.co/9LZ98IEDyR — Suriya fan girl🤺❤️! (@_swe___) July 22, 2021 -
మరోసారి వార్తల్లో నటి వనితా విజయ్‌కుమార్.. నెట్టింట్లో వైరల్
తమిళ సినిమా: ఎప్పుడూ ఏదో ఒక చర్యతో వార్తల్లో వుండే నటి వనితా విజయ్‌కుమార్. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకుని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తున్న వనితా విజయ్‌కుమార్ తన భర్త ఎవరని అడుగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు. ఆమె తన ఇంటిలో కుబేరుడి పూజ నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వనితా విజయకుమార్, ఆమె కూతురు మెడలో డబ్బు నోట్ల మాలలు ధరించి పూజ నిర్వహించారు. ఆ దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
నటి ఆరోపణలు.. డీసెంట్‌గా స్పందించిన రమ్యకృష్ణ
వనితా విజయ్‌కుమార్.. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురు. వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా స్టార్ విజయ్ టీవీతో ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘బిగ్‌బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణన్(రమ్యకృష్ణ). పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు. Thank you @vijaytelevision for giving me the best opportunities of my life beginning from #biggbosstamil3 ..#cookuwithkomali season 1..and #kalakkapovadhuyaaru season 9.. and #bbjodigal. I want to make it clear I WALKED OUT OF THE SHOW @bbsureshthatha sorry I had to do this..❤️🙏 pic.twitter.com/E0c95POaoD — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 2, 2021 అయితే ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ బదులిస్తూ.. ‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని బదులిచ్చింది. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది ఆమె. కాగా, చివరి ఎపిసోడ్లో వనిత పర్ఫార్మెన్స్కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ. చదవండి: ఆ కామెంట్ నచ్చకే విడిపోయా- హీరోయిన్ -
సింగిల్ అంటూ కన్నుకొట్టిన వనితపై నెటిజన్ ఫైర్, నటి చురకలు
మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకున్నారు వనిత విజయ్ కూమార్. గత ఏడాది తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 3లో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత గతేడాది జూన్‌లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదిగిన కూతుళ్ల ముందే మూడో పెళ్లి చేసుకోవడం, ముద్దులు పెట్టడమేంటని కొంచమైన బుద్ది ఉండాలంటు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అయితే ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు. పీటర్ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అలా మూడో పెళ్లి పెటాకులైన కొన్ని రోజులకు వనిత మరో పోస్ట్ చేశారు. మళ్లీ ప్రేమలో పడ్డానంటూ ఓ పోస్ట్ చేశారు. కానీ దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో వనిత మరో పెళ్లి, రిలేషన్ అంటూ నెటిజన్లు తన రిలేషన్‌పై రూమర్లు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. తాజాగా ఆ రూమర్లకు చెక్ పెడుతూ ‘తాను సింగిల్ అని, అందరికీ అందుబాటులోనే ఉన్నాను’ అంటూ కన్నుకొడుతూ ఓ పోస్ట్ షేర్ చేశారు. అది చూసి దీనిపై ఓ నెటిజన్ భగ్గుమన్నారు. అలా సింగిల్ అని చెప్పడం అందుబాటులోనే ఉన్నానని అనడం ఏంటి? బాధ్యత లేదా? మీకు ఎదిగిన పిల్లలున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక వనిత సదరు నెటిజన్‌పై మండిపడుతూ.. ‘ఎలా ఉండాలో నాకు తెలుసు.. నీ బతుకు నీ బతుకు. నాకు అవసరం ఉంటే నువ్వొచ్చి ఏమీ పెట్టడం లేదు కదా?.. నా నటన నచ్చితే నా వీడియోలు చూడు లేదంటే నీ పని నువ్ చూసుకో’ అంటూ చురకలు అంటించారు. చదవండి: మళ్లీ ప్రేమలో పడ్డా కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్ మాదిరిగానే -
కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్ మాదిరిగానే
తమిళసినిమా: సంచలన నటి వనిత విజయకుమార్ పేరు మరోసారి సామాజిక మాధ్యమాల్లో నానుతోంది. నిజానికి నెటిజన్లే ఆమెపై సెటైర్లు వేస్తూ ఆగ్రహానికి గురి చేస్తున్నారని చెప్పవచ్చు. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో ప్రజలు దాని బారిన పడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడిపేస్తున్న పరిస్థితి. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కోవైలో కొందరు ఒక అడుగు ముందుకు వేసి కరోనా దేవి పేరుతో ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. కరోనా నుంచి త్వరగా తమను బయటపడేయాలని మొక్కుతున్నారు. ఈ వ్యవహారంలోకి నటి వనిత విజయకుమార్‌ను లాగేశారు కొందరు నెటిజన్లు. కరోనా దేవి ప్రతిమ అచ్చం నటి వనిత విజయకుమార్ మాదిరిగానే ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా దీనికి సంబంధించిన మీమ్స్‌ను ఆమెకే పోస్టు చేస్తున్నారు. ఇది చూసిన వనిత విజయకుమార్ నెటిజన్లపై మండిపడుతున్నారు. -
మళ్లీ ప్రేమలో పడ్డా
'మళ్లీ ప్రేమలో పడ్డాను' అంటూ నటి వనిత విజయకుమార్ తెలిపారు. సీనియర్ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమె చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకున్నారు. గత ఏడాది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3లో పాల్గొని వార్తల్లో నానారు. గత జూన్‌లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు. చదవండి: (అతిథులు వీళ్లేనా బాస్?) ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు. పీటర్ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నటి వనిత విజయకుమార్ తాను మళ్లీ ప్రేమలో పడ్డానని గురువారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె ఎవరి ప్రేమలో పడ్డాను అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో ఆమె గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారం ట్రోల్ అవుతుంది. చదవండి: (భర్తతో వనితా విజయ్ కుమార్‌కు విభేదాలు!) -
భర్తతో వనితా విజయ్ కుమార్‌కు విభేదాలు!
చెన్నై: తన భర్త మద్యానికి బానిసయ్యాడని నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయకుమార్ ఆరోపించింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన ఆమె ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. తాజాగా పీటర్ పాల్‌తో కూడా వనితా విజయ్‌కుమార్‌కు విభేదాలు తలెత్తినట్లు, వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సంచలన జంట ఇటీవల విహారయాత్రకు గోవాకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవ మొదలైంది. దీంతో చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత నటి వనితా విజయకుమార్ మూడవ భర్తను కూడా వదిలేసినట్లు ప్రచారం హోరెత్తుతోంది. చదవండి: వనితా విజయకుమార్ భర్తకు గుండెపోటు ఈ విషయంపై స్పందించిన వనిత విజయకుమార్ ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో ఆమె.. ‘పీటర్‌పాల్ మద్యానికి పచ్చి బానిసని, చైన్ స్మోకర్’ అని ఆరోపించారు. అతనికి రెండు సార్లు గుండెపోటు రావడంతో రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అదృష్టవశాత్తు పీటర్ పాల్‌కు ఆరోగ్యం బాగుపడిందని, అయితే మళ్లీ మద్యం తాగుతున్నట్లు ఆరోపించారు. మద్యానికి దూరంగా ఉంటానని తనకు ప్రమాణం చేసి కూడా తాగడం ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తానీ నిర్ణయానికి వచ్చినట్లు వనితా విజయకుమార్ వివరించారు.చదవండి: ‘సైఫ్‌ను చాలా ప్రేమిస్తున్నాను.’ -
వనిత నివాసంలో కుబేర పూజ
చెన్నై : నటి వనిత విజయ్‌కుమార్ పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుని పెద్ద వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ వనిత మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శల దాడి చేశారు. దీంతో వనిత కూడా వారిపై ఎదురుదాడి చేసింది. ఈవ్యవహారం కేసులు, కోర్టు వరకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో వనిత భర్త పీటర్ పాల్ గుండెపోటుకు గురై చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. ( వనితా విజయకుమార్ భర్తకు గుండెపోటు ) తాజాగా వనిత, పీటర్ పాల్ కరెన్సీ మాలను మెడలో ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను వనిత తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంటూ తన ఇంట్లో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించినట్లు పేర్కొంది. 2020లో ఇకపై వచ్చే రోజులు అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పింది. -
వనితా విజయకుమార్ భర్తకు గుండెపోటు
తమిళ సినిమా: నటి వనితా విజయకుమార్ భర్తకు గుండెపోటు రావడంతో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. నటి వనితా విజయకుమార్ ఇటీవలే పీటర్‌పాల్ అనే వ్యక్తిని మూడవ వివాహం చేసుకున్న విషయం తెలిసింది. వీరి వివాహం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. అంతేకాకుండా నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్ వంటివారు నటి వనితా విజయకుమార్ మూడవ పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేశారు. వీరి మధ్య గొడవ పోలీసులు, కేసుల వరకు వెళ్లింది. అంతేకాకుండా నటి వనితా విజయకుమార్, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా అంటూ నోటీసుల వరకు వెళ్లారు. ఈ వ్యవహారం పక్కన పెడితే వనిత విజయకుమార్ భర్త పీటర్ పాల్ మంగళవారం గుండపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్చారు. -
జీవితం చాలా కష్టమైనది : వనితా విజయ్‌కుమార్
చెన్నై : వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఛాతి నొప్పి కారణంగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్లు వనితా విజయ్‌కుమార్ తెలిపారు. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన వనితా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 'చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితం చాలా కష్టమైంది. మన లైఫ్‌లో జరిగే ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని నేను నమ్ముతాను. పరిస్థితులు అన్ని సర్దుకుంటాయి' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటి వనితా విజయ్‌కుమార్ ఈ మధ్య పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇతరుల విషయాల్లో తలదూర్చకండి) అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే వనితా తన భర్తను వివాహం ఎలా చేసుకుంటుందంటూ పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ ఆరోపణలు చేసింది. డబ్బు కోసమే ఇవన్నీ చేస్తుందంటూ ఆమె వనితపై కేసు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వనితా విజయ్‌కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో పెళ్లిపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలతో దూషించుకున్న వనితా, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం సమన్లు, బెదిరింపుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక 1995లో విడుదలైన చంద్రలేఖ చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వనితా విజయ్‌కుమార్ పలు చిత్రాల్లో నటించింది. అయితే నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. (విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లా?) Lots to say...nothing I can..god is great..believe..everything happens for a reason...life is tough ..face it..when u do..trust me ..everything will be ok...get tough..hit back...show the world you can.. — Vanitha Vijaykumar (@vanithavijayku1) August 25, 2020 -
1.25 కోట్ల నష్ట పరిహారంతో బెదిరింపు
సినిమా: నటి వనితా విజయకుమార్, నటి,దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ మధ్య వివాదం ఇప్పట్లో సమసేలా లేదు. ఇప్పుటికే అనుచిత వ్యాఖ్యలతో దూషించుకున్న వీరు ఇప్పుడు సమన్లు, బెదిరింపుల వరకూ వెళుతున్నారు. ఈ వివరాలు చూస్తే నటి వనిత ఇటీవల పీటర్‌పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ వివాదానికి తెరలేచింది. వనిత మూడో వివాహం చేసుకోవడాన్ని లక్ష్మీరామకృష్ణన్‌తో పాటు కస్తూరి తీవ్రంగా విమర్శించారు. దీంతో వనిత వారిపై ఎదురుదాడికి దిగింది. అలా లక్ష్మీరామకృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శించింది. (వనితపై వరుస కేసులు) దీంతో లక్ష్మీరామకృష్ణన్ లాయర్ ద్వారా వనితకు నోటీసులు జారీ చేయించింది. దాని కాపీని స్థానిక వడపళని మహిళా పోలీస్‌స్టేషన్‌కు, వడపళని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌కు, చెన్నై మహిళా సంఘానికి పంపింది. ఈ నోటీస్‌పై వనిత స్పందిస్తూ లక్ష్మీరామకృష్ణన్ రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ బెదిరిస్తూ తనకు నోటీసులు పంపినట్లు వెటకారంగా పేర్కొంది. ఆమె పంపిన నోటీస్ కోర్టు ద్వారా వచ్చింది కాదని చెప్పింది. దానికి బదులుగా తానూ లక్ష్మీ రామకృష్ణన్‌కు నోటీస్ పంపినట్లు వనిత పేర్కొంది. లక్ష్మీరామకృష్ణన్ బెదిరింపులకు బెదిరిపోయేది లేదని, చట్టపరంగానే ఎదుర్కొంటానని వనిత పేర్కొంది. -
వనితపై వరుస కేసులు
పెరంబూరు: నటి వనిత విజయకుమార్‌పై కేసుల పరంపర కొనసాగుతోంది. వివాదాల నటిగా ముద్ర వేసుకున్న ఈమె ఎక్కడ ఉంటే అక్కడ చర్చే అనే పరిస్థితి నెలకొంది. ఆ మధ్య బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని వివాదాలకు నిలయంగా మారారు. పీటర్‌పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని మరోసారి చర్చకు తెరలేపారు. ఈమె మూడో పెళ్లి చేసుకోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. అందులో లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ, నిర్మాత రవీందర్, సూర్యదేవి ప్రధానంగా ఉన్నారు. కాగా వనితా, సూర్యదేవి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకు న్నారు. (కరోనా వ్యాప్తి.. ఆమెపై రెండు కేసులు) తనను, తన భర్తను విమర్శించిందంటూ దర్శకురాలు లక్ష్మీరామకృష్టన్, వనితకు న్యాయవాది ద్వారా సమన్లు పంపింది. కరోనా కాలంలో అనుమతి లేకుండా వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించిందంటూ వనితపై స్థానిక అయ్యప్పన్ తంగల్‌కు చెందిన అపార్ట్మెంట్ల సంఘం కార్యదర్శి నిషా తోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన వనిత వాటన్నింటిని చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. మంగళవారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమానికి జడ్జిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు నెలల తరువాత ముఖానికి మేకప్ వేసుకుని షూటింగ్లో పాల్గొన్నానని అన్నారు. ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడే వారు అలాగే ఉంటారని వ్యాఖ్యానించారు. వాటిని పట్టించుకోకూడదని వనిత వ్యాఖ్యానించారు. -
కరోనా వ్యాప్తి.. ఆమెపై రెండు కేసులు
పెరంబూరు: సూర్యదేవిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నటి వనితా విజయకుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై వీడియోల ద్వారా సూర్యదేవి విమర్శల దాడి చేసి వార్తల్లో నిలిచారు. ఈ నెల 22న వనితా ఫిర్యాదుతో వడపళని మహిళా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత నటి కస్తూరీ తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్ ఇప్పించారు. (నటి వనితతో గొడవ, ఆ మహిళ ఎక్కడ?) కాగా అంతకు ముందు సూర్యదేవిని విచారించిన పోలీస్ అధికారికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారి చెన్నై ఐఐటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సూర్యదేవి మాత్రం పరీక్షలు చేసుకోకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని సూర్యదేవి యూట్యూబ్‌లో వీడియో విడుదల చేశారు. కరోనా వ్యాప్తికి పాల్పడుతోందంటూ చేసిన ఫిర్యాదుపై విరుగంబాక్కమ్ పోలీసులు సూర్యదేవిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నారు. -
వనితపై బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆగ్రహం
సాక్షి, చెన్నై : ఇటీవలే మూడో వివాహం చేసుకున్న నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆమె తాజాగా రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనిత వివాహంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారిపై ఎదురు దాడి చేసే పనిలో భాగంగా ఆమె తంజావూర్ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వనిత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (నటి వనితపై విమర్శలు.. యువతి అరెస్ట్) ఆ వ్యాఖ్యలు ఆ ప్రాంత కాంగ్రెస్, బీజేపీ వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యవహారంపై తంజావూర్ జిల్లా, పుదుక్కొటై నగర పోలీస్ స్టేషన్లో జిల్లా కాంగ్రెస్ యువజన పార్టీ కార్యదర్శి శివ ఫిర్యాదు చేశారు. తంజావూరు మట్టికి, ప్రజలకు ఒక చరిత్ర ఉందని అన్నారు. అలాంటి ప్రజలను మనోభావాలను కించపరిచే విధంగా వనిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. తంజావూరు ప్రజలందరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వనితపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తంజావూర్ కలెక్టర్ గోవిందరావు, ఎస్పీ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్‌కు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు ఫిర్యాదు చేశారు. వనిత వ్యాఖ్యలు తంజావూరు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు పేర్కొన్నారు. ఆమె వెంటనే తంజావూర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వనితపై చర్యలు తీసుకోవాలని కోరారు. (నటి మూడో పెళ్లి; ఫోటోలు వైరల్) కాగా తన వ్యాఖ్యలపై వనితా ట్విటర్లో ... తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే సహృదయంతో తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. My fellow brothers and sisters from #Tanjore ...kindly dont misinterpret my anger and tone to another issue as disrespectful to you..I am very sorry if I unintentionally said anything that may have hurt your feelings...endrendrum thalaivanungugiren en thanjai mannirku 🙏 — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 23, 2020 -
నటి వనితపై విమర్శలు.. యువతి అరెస్ట్
సినిమా: నటి వనిత విజయకుమార్‌పై విమర్శలు గుర్తించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటి వనితా విజయకుమార్ ఈ మధ్య పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె మూడో వివాహంపై పలువురి నుంచి పలు రకాల విమర్శలు వస్తున్నాయి. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కస్తూరి అదేవిధంగా నిర్మాత రవీంద్రన్ వంటి వారు వనితపై విమర్శల దాడి చేస్తున్నారు. అదే విధంగా సూర్యదేవి అనే యువతి నటి వనిత విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను యూట్యూబ్‌లో విడుదల చేసింది. దీంతో వనిత కూడా వారిపై ఎదురుదాడికి దిగింది. అయినా సూర్యదేవి విమర్శలు చేస్తూనే ఉండడంతో వనిత ఆమెపై వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వడపళని మహిళా పోలీసులు సూర్యదేవిని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అయితే ఆమె వెంటనే గురువారం బెయిల్‌పై విడుదలైంది. సూర్యదేవి బెయిలుకు నటి కస్తూరి ప్రయత్నించింది. సూర్యదేవి అరెస్ట్ గురించి చేసిన వెంటనే ఆమెను ఎలాగైనా బెయిల్‌పై విడిపించాలని నటి కస్తూరి భావించిందట. దీంతో తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్ వచ్చేలా చేసినట్లు కస్తూరి తెలిపింది. కాగా సూర్యదేవి బెయిల్‌పై స్పందించిన నటి వనిత పేర్కొంటూ సూర్యదేవి ఎలాంటి కారణాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను చేసి తన మనసును గాయపరచిందని పేర్కొంది. అయితే ఆమె పిల్లల క్షేమం కోరి తాను ఆమెను రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేయడం లేదన్నారు. అందువల్ల సూర్యదేవి బెయిల్‌ను తాను వ్యతిరేకించడం లేదని చెప్పింది. అయితే ఇకపై అయినా సూర్యదేవి ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటుందని భావిస్తున్నారని పేర్కొంది. కాగా తన పెళ్లికి సంబంధించిన సమస్యను తాను చట్టపరంగా ఎదుర్కొంటానని వనిత చెప్పింది. -
నటి మూడో పెళ్లిపై విమర్శలు
చెన్నై : సినీ నిర్మాత రవీంద్రన్‌పై నటి వనిత విజయకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇటీవలే పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆమెపై పలువురు విమర్శల దాడి చేస్తున్నారు. వనిత పెళ్లి అన్నది ఆమె వ్యక్తిగత విషయమైనప్పటికీ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ఆమెపై విమర్శలు దాడి కొనసాగిస్తున్నారు. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, కస్తూరి, నిర్మాత రవీంద్రన్ వంటి వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నటి వనిత వారికి ట్విట్టర్ ద్వారానే గట్టిగానే బదులిచ్చారు. అయినా ఆమెపై విమర్శలు ఆగకపోవడంతో వనిత మంగళవారం సాయంత్రం తన న్యాయవాదితో కలిసి స్థానిక పోరూర్ పోలీస్ స్టేషన్లో నిర్మాత రవీంద్రన్, అదేవిధంగా సూర్యదేవిపైన ఫిర్యాదు చేశారు. నటి వనిత మూడో పెళ్లి చేసుకోవడంపై సూర్యదేవి అనే మహిళ తీవ్రంగా విమర్శిస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. దాంతో వారిపై వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కొన్ని వారాలుగా మీడియాలో తన గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, సూర్యదేవి అనే మహిళ తన గురించి హద్దులు మీరి అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత రవీంద్రన్ సైతం తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం తనను మానసికంగా వేదనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలతో తాను జీవితం కొనసాగిస్తున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో తోడు కోసం మరో పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని తాను చట్టపరంగా ఏదుర్కొంటానని చెప్పింది. తన ఫిర్యాదుపై పోలీసులు ఒకటి రెండు రోజుల్లో సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని నటి వనిత అన్నారు. ( ఈమె మూడో పెళ్లి కూడా.. ) -
ఈమె మూడో పెళ్లి కూడా..
తమిళ సినిమా(చెన్నై): తాను సివంగిని అని అంటోంది నటి వనితా విజయకుమార్. మొదట్లో చంద్రలేఖ వంటి కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ తర్వాత వెండి తెరపై కనిపించలేదు. తరచూ ఏదోఒక వివాద వార్తల్లో ఉంటూనే ఉంది. ఆ మధ్య బిగ్‌బాస్–3 రియాల్టీ షోలో పాల్గొని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న వనిత ఇటీవల మూడో పెళ్లి చేసుకుంది. ఈమె మూడో పెళ్లి కూడా వివాదాలకు గురవుతోంది. వనిత తాజాగా పెళ్లి చేసుకున్న పీటర్‌పాల్ కూడా ఇంతకుముందు ఒక పెళ్లి చేసుకున్నాడు. అది ఇప్పుడు వివాదంగా మారింది. వనిత, పీటర్ పాల్ పెళ్లి చేసుకున్నరోజు సాయంత్రమే అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే నటి వనితను పెళ్లి చేసుకున్నారని ఆరోపింది. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని నటి వనితపేర్కొంది. నటి వనిత మూడో పెళ్లిపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కుట్టి పద్మిని అదేవిధంగా నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖర్ వంటివారు పీటర్ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి వనిత పెళ్లి చేసుకుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిపై వనిత విరుచుకుపడింది. ‘మీ పని మీరు చూసుకోండి’ అంటూ ఫైర్ అయ్యింది. లక్ష్మీరామకృష్ణన్, కుట్టిపద్మిని వెంటనే సారీ చెప్పారు. నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖర్ మాత్రం తాను క్షమాపణ చెప్పేదిలేదన్నారు. నటి వనిత అంటే తనకు అభిమానమన్నారు. అలా ఒక అభిమానిగా ఆమె తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపే హక్కు తనకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నటి వనిత తన ట్విటర్లో పేర్కొంటూ ‘ఒక తల్లిగా తన జీవితం, ప్రతిభపై అక్కరచూపుతున్న మీ అందరికీ తాను చెప్పేది ఒక్కటే.. నేను సహజంగానే సివంగిని’ అని చెప్పింది. తన పిల్లలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు అని అంది. మరి ఈ చర్చ ఇంకా ఎంత కాలం సాగుతుందో చూడాలి. -
మరోసారి వార్తల్లో వనితా విజయ్‌కుమార్
చెన్నై : ఇతరుల విషయంలో తలదూర్చకండి అంటూ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌కు నటి వనితా విజయ్ కుమార్ సూచించారు. అసలు విషయం ఏమిటంటే నటి వనిత ఇటీవలే పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అదే రోజు పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ ఆయనపై వడపళని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై లక్ష్మీ రామకృష్ణన్ స్పందించారు. వనితను పీటర్ పాల్ వివాహం చేసుకునే వరకు ఆయన మొదటి భార్య చూస్తూ ఎందుకు ఉందని, అప్పటివరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు డబ్బు కోసమే ఆమె ఫిర్యాదు చేసిందని ట్విటర్లో పేర్కొన్నారు. వనిత చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ బంధం అయినా ఆమె నిలుపుకుంటారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. లక్ష్మీ రామకృష్ణన్ వ్యాఖ్యలపై వనిత విజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. (మూడో పెళ్లి చేసుకున్న నటి; ఫోటోలు వైరల్) ‘దంపతులుగా జీవిస్తున్న ఇద్దరు ఎందుకు విడిపోతున్నారో, ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో మీకు తెలుసా..? మీకు తెలియని విషయంపై ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడంలేదు కాబట్టి, మీరు ఈ విషయంలో తలదూర్చటం ఆపేయాలి. మీకు తెలియని ఒక వ్యక్తి గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం లేద’ని సూచించారు. తాను తెలిసో తెలియకో ఈ వ్యవహారంలో చిక్కుకున్నానని, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఇతరుల సలహా గానీ, సహాయం గానీ తనకు అవసరం లేదని నటి వనిత స్పష్టం చేశారు. (విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లా?) -
నటి మూడో పెళ్లి: 'డబ్బుల కోసమే డ్రామాలు'
నటి వనితా విజయ్‌కుమార్ శనివారం సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకోవడం పట్ల పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ కేసు పెట్టారు. తమకు ఇద్దరు పిల్లలున్నారని వ్యక్తిగత కారణాలతో ఏడేళ్ల నుంచి విడిగా ఉంటున్నామని, అయినప్పటికీ చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన వనితా విజయ్‌కుమార్..ఎలిజబెత్ హెలెన్ డబ్బు కోసమే ఈ డ్రామాలాడుతుందని మండిపడ్డారు. తన భర్త, ఎలిజబెత్ ఎనిమిదేళ్ల క్రితమే విడిపోయారని, అలాంటప్పుడు కేసు ఫైల్ చేయడం ఏంటని మండిపడ్డారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ ఇదివరకే తమను డిమాండ్ చేసిందని అయితే అంత మొత్తంలో డబ్బు ఇచ్చే స్థోమత తమకు లేదని తెలిపారు. పెళ్లి తర్వాత సంతోషంగా గడుపుతున్న తమ జీవితంలో ఎలిజబెత్ ఇబ్బందులు సృష్టించాలని చూస్తుందని అయినప్పటికీ ఈ కేసుపై న్యాయపరంగానే గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. (భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు ) వనితా విజయ్‌కుమార్, పీటర్ పాల్ రెండురోజుల క్రితం సన్నిహితుల మద్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పీటర్‌కు ఇది రెండో పెళ్లి కాగా వనితాకు ఇది మూడో పెళ్లి. క్రైస్తవ మత ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న వనితా..నటుడు విజయ్‌కుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు. చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయుకగా పరిచయమైన ఆమె దేవి సినిమాతో తెలుగువారికి సుపరిచితం అయ్యింది. ఇక ఇటీవల తమిళ బిగ్‌బాస్-3 లో పాల్గొని వార్తల్లోకెక్కి మళ్లీ తన పెళ్లితో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. (మూడో పెళ్లి చేసుకున్న నటి; ఫోటోలు వైరల్ ) -
నటి మూడో పెళ్లి; ఫోటోలు వైరల్
చెన్నై : నటి వనిత విజయ్‌కుమార్ శనివారం(జూన్27) సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. క్రైస్తవ మత ఆచారం ప్రకారం సాయంత్రం 4 గంటలకు చెన్నైలో వీరి వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వనితకు ఇది మూడో వివాహం కావడం గమనార్హం. ఈ వేడుకలో వనిత ముందు భర్త పిల్లలు జోవికా, జయనిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (నటి మరో పెళ్లి.. కుమార్తె మద్దతు) ఇప్పటికే 2000 సంవత్సరంలో వనిత విజయ్‌కుమార్ నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోగా, ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. మళ్లీ ఆనంద్‌తోనూ 2012లో విడాకులు తీసుకున్న వనిత శనివారం తన ఇంటి వద్దే పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమెకు నలుగురు సోదరీలు, ఒక సోదరుడు ఉన్నారు. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ మలయాల సినిమాల్లో నటించిన ఈ నటి ఇటీవల తమిళ బిగ్‌బాస్-3లో పాల్గొని మళ్లీ వార్తల్లోకెక్కారు. (బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!) #VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb — Happy Sharing By Dks (@Dksview) June 27, 2020 View this post on Instagram Cooku With கோமாளி 👨🍳🤡 Best Wishes @vanithavijaykumar ❤❤ 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬┃𝐂𝐨𝐨𝐤𝐮 𝐖𝐢𝐭𝐡 𝐂𝐨𝐦𝐚𝐥𝐢┃𝟐𝟒×𝟕 𝐊𝐞𝐞𝐩 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 & 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 #actorajithkumarofficial #cookwithcomali #cookuwithcomali #cookuwithcomalivijaytv #CookwithComali omali #trading #comedy #biggbosstamil #biggbosstroll #actorajithkumarofficial #biggbossunseen #tharshan #tharshanarmy #tharshanbiggboss3 #tharshan #tharshanforever #tharshanfans #tharshanfc #losliya #losliyaarmy #losliyafans #losliya_army #losliya_maria #losliyaarmy #kavin #actorajithkumarofficial #themugenrao_fans #losliyaarmy #losliyafans #losliya_army #iamsandy_off #sandymandy_official #sandymasterarmyofficial #abiramivenkatachalam #shakshiagarwal #sherinshringar #actorajithkumarofficial A post shared by Cooku With கோமாளி 👨🍳🤡🔪🥗🍗🦀🦐🍲🥘 (@cookuwithcomalivijaytv) on Jun 27, 2020 at 3:30am PDT https://t.co/V3roOy1QRW Vanitha and Peter paul wedding clicks....#VanithaPeterpaulWedding#vanithavijayakumar#VanithaVijaykumar#VanithaWedding #Vanithavijayakumarwedding #vanithamarriage#vanithaweddingimages #vanithaweddingpictures #vanithaclicks pic.twitter.com/nUgDVdwozO — Sindhu Ganesh (@SindhuGanesh8) June 27, 2020 -
నటి మరో పెళ్లి.. కుమార్తె మద్దతు
నటి వనితా విజయకుమార్ వివాహంపై వస్తోన్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఆమె కుమార్తె జోవికా.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. పెళ్లి చేసుకోబోతున్నందుకు శుభాకాంక్షలు అని.. ఎల్లప్పుడు తల్లికి మద్దతుగా నిలుస్తానని తెలిపింది. ఈ క్రమంలో జోవికా.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఏం జరిగినా నేను నీకు మద్దతుగా ఉంటాను. ప్రతిది నేను నీ నుంచే నేర్చుకున్నాను. నేను నీతో 15 సాహసోపేత సంవత్సరాలు గడిపాను. ముందు ముందు చాలా సంవత్సరాలు కలిసి జీవించాలి. మరెన్నో సాహసాలు చూడాలి. నీ గురించి నాకన్న బాగా ఎవరికి తెలియదు. నువ్వు చాలా దయ, ప్రేమ కల మనిషివని నేను నీకు చెప్తున్నాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించడంలో ఏలాంటి తప్పు లేదు. లవ్ యూ మా.. ఆల్ ది బెస్ట్’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తల్లి పెళ్లి వార్తలను తెలపడమే కాక ఆమెకు మద్దతుగా నిలిచింది. (మళ్లీ పెళ్లికి సిద్ధమైన నటి !) View this post on Instagram I'm counting my blessings A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) on Jun 17, 2020 at 11:41am PDT సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 27న చెన్నైలోని వీరి నివాసంలో సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది. -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన నటి !
సినిమా: నటి వనితా విజయకుమార్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన వనిత ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కాగా ఇటీవల బిగ్‌బాస్–3లో పాల్గొని వార్తల్లోకి ఎక్కిన వనిత తాజాగా మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే సింపుల్‌గా పీటర్ పాల్ అనే వ్యక్తితో వనిత వివాహం జరగనున్నట్లు పెళ్లి పత్రిక సహా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం గురించి నటి వనిత తరఫు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. -
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!
చెన్నై, పెరంబూరు: బిగ్‌బాస్ హౌస్‌లో తానెవరి ప్రేమలోనూ పడలేదని నటి వనితా విజయకుమార్ పేర్కొంది. నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్‌షో సీజన్–3 జరుగుతున్న విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందుతోంది. ఈ 18 మంది సినీ సెలబ్రిటీలు సభ్యులుగా కలిగిన ఈ గేమ్ ఫోలో గత 7న నటి ఫాతిమాబాబు బయటకు వచ్చేసింది. కాగా గత ఆదివారం మరో సంచలన నటి వనితా విజయకుమార్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి ఆమె అంత త్వరగా బయటకు వచ్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. వనిత బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటూనే ఆ కార్యక్రమానికి రేటింగ్ పెరుగుతోందన్న విషయం తెలిసిందే. అయినా ఓటింగ్ విధానంలో వనిత ఎలిమినేట్ కాక తప్పలేదు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నటి వనితావిజయకుమార్ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను అంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని అంది. అయితే తాను హౌస్‌లో ఉండాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేయడం సంతోషం కలిగించిందని చెప్పిందిు. గత బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న వారి మాదిరి తాను ఈ గేమ్ షో గురించి విమర్శించనని, నిర్వాహకులు తమని నటింపజేయలేదని తెలిపింది అదేవిధంగా హౌస్‌లో తనకెలాంటి కొరత జరగలేదని చెప్పింది..తానేమిటో అందరికీ తెలుసని, తనకు చట్టం గురించి తెలుసని అంది. బిగ్‌బాస్ హస్‌లో ఆడమగ ప్రేమలో పడుతుంటారని, అదే విధంగా తానూ ప్రేమలో పడతానని ప్రేక్షకులు భావించారని అంది. అయితే తానెవరినీ ప్రేమించలేదని చెప్పింది. అలాంటి తప్పు తాను చేయనని అంది. తాను ముగ్గురు పిల్లలకు తల్లిని కాబట్టి తనకు బాధ్యత ఉందని అంది. అయితే ఇతరులు ప్రేమలో పడడంలో తప్పు లేదని వనితావిజయకుమార్ పేర్కొంది. ఆడ మగ మాట్లాడుకోకుండా ఉండలేరని, కాబట్టి అలాంటప్పుడు ప్రేమలో పడడం అన్నది సహజం అని వనిత పేర్కొంది. మరో విషయం ఏమిటంటే రాత్రుల్లో లైట్స్ ఆపివేస్తున్నట్లు టీవీల్లో చూపించినా, అది కొన్ని క్షణాలేనని, ఆ తరువాత లైట్లు వెలుగుతూనే ఉంటాయని చెప్పింది. తాను త్వరలో ఒక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నటి వనితావిజయకుమార్ తెలిపింది. -
బిగ్‌బాస్ హౌస్‌లోకి వనిత కూతురు
సాక్షి, చెన్నై : తల్లిదండ్రుల విభేదాల మధ్య నలిగిపోయిన నటి వనిత కుమార్తె జెనితరాజన్ ఎట్టకేలకు తండ్రి చెంతకే చేరినట్లు సమాచారం. దివంగత సీనియర్ నటి మంజుల, నటుడు విజయకుమార్ కుమార్తె వనిత, ఆమె మాజీ భర్త ఆనంద్‌రాజ్ మధ్య గత కొన్ని నెలలుగా న్యాయ పోరు నేపథ్యంలో గత నాలుగు రోజులుగా చెన్నైలో హైడ్రామా నడిచింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షురాలు వసుంధర శ్రీనివాస్, తెలంగాణ, తమిళనాడు పోలీసులు బిగ్‌బాస్ హౌస్ వేదికగా బుధవారం సాయంత్రం వరకు జరిపిన చర్చల్లో చివరకు చిన్నారి జెనితరాజన్ తండ్రి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కూతురు తన వద్దే ఉందని అంగీకరించిన వనిత వనిత 2007లో ఆనందరాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జెనిత రాజన్ అనే కూతురు ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసార జీవితంలో మనస్పర్థల కారణంగా 2012లో దంపతులు విడిపోయారు. 2015లో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది. కూతురి సంరక్షణ బాధ్యతలను తండ్రికే అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆనంద్‌రాజ్ తన కూతురితో సహా హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. గత ఫిబ్రవరిలో వనిత హైదరాబాద్‌కు వెళ్లి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న కూతురిని తీసుకెళ్లిపోయింది. దీంతో ఆనంద్‌రాజ్ హైదరాబాద్ పోలీసులకు తన కూతురిని వనిత కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. అయితే ఆమెకు చెన్నైలో స్థిర నివాసం లేకపోవడంతో ఆమెను కనిపెట్టి విచారించడం కష్టతరంగా మారింది. బిగ్‌బాస్ 3 సెట్లోకి పోలీసులు.. ఏ క్షణమైనా వనిత అరెస్ట్! బిగ్‌బాస్ హౌస్‌లో వనిత ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో నటి వనిత ఆచూకీని తెలిపింది. బిగ్‌బాస్ సీజన్–3లో వనిత పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియన్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వసుంధర శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు బృందం తెలంగాణ హోంమినిస్టర్ ఆదేశాల మేరకు బుధవారం చెన్నైకి వచ్చారు. చెన్నై పోలీసుల సహకారంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. వనితను ఆమె కూతురు జెనిత రాజన్ గురించి విచారించగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. మరోసారి విచారించిన వసుంధర శ్రీనివాస్ సాయంత్రం 5 గంటలలోపే జెనిత రాజన్ గురించిన సమాచారం అందించాలని హెచ్చరించారు. దీంతో వనిత తన కూతురిని బిగ్‌బాస్ హౌస్‌కు రప్పించారు. అయితే జెనితారాజన్ తన తల్లి, ఆమె తరఫు న్యాయవాది చెప్పినట్లుగా అమ్మతోనే ఉంటానని చెప్పింది. ఇదిలా ఉండగా తండ్రి ఆనందరాజ్.. వనిత తన కూతురిని కిడ్నాప్ చేసిందని, న్యాయస్థానం ఆదేశాలతోనే తాను తన కూతురి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల సమయంలో కూతురిపై వనితకు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని, ఏదో దురుద్ధేశంతోనే తను తన కూతురిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. తన కూతురి ఇష్టాఇష్టాలు, తనకేం కావాలో, తన అవసరాలేంటో ఇంతకాలంగా పోషిస్తున్న తనకే తెలుసని, బిడ్డను తీసుకొచ్చి ఎక్కడో పరాయి పెంపకంలో ఉంచి బిగ్‌బాస్ రియాలిటీ గేమ్‌షోలో 100 రోజులు పాల్గొనడానికి సిద్ధం అయిన వనితలో తల్లి ప్రేమ ఎక్కడుందని ఆనంద్‌రాజ్ ప్రశ్నించారు. విచారణలో చివరికి తనకు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోనే ముఖ్యం అని, కూతురు జెనితరాజన్ను తండ్రికే అప్పగించడానికి నటి వనిత అంగీకరించినట్లు తెలిసింది. బిగ్‌బాస్ హౌస్ నియమ నిభంధనలకు వ్యతిరేకంగా నటి వనిత తన కూతురును హౌస్‌లోకి తీసుకురావడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ వ్యవహారం ఆ హౌస్‌లో కలకలానికి దారి తీసింది. -
ఏ క్షణమైనా వనిత అరెస్ట్!
సాక్షి, చెన్నై : సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ల పెద్ద కుమార్తె వనిత వివాదం మరింత ముదురుతోంది. గత పదేళ్లుగా వనిత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. కొంత కాలం పాటు తండ్రితో గొడవపడిని వనిత, భర్తనుంచి విడిపోయిన తరువాత కూతురి విషయంలో అతనితో గొడవపడుతున్నారు. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఉన్న వనితను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. 2007 ఆనంద్‌రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూతురు జోవిత సంరక్షణ బాధ్యతల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనిత తన కూతరిని చెన్నై తీసుకెళ్లి దాచిపెట్టినట్టుగా ఆనంద్ రాజ్ తెలంగాణ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ మేరకు వనితపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన విచారణ జరిపిన పోలీసులలు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ ఉన్న ఈవీపీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించిన తెలంగాణ పోలీసులు వనిత అరెస్ట్‌కు సహకరించవలసిందిగా కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సెట్లో ఉన్న వనితను తెలంగాణ పోలీసులు ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
ఏ తల్లికి ఈ పరిస్థితి రాకూడదు: సినీనటి
చెన్నై: బిడ్డల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏ తల్లికి రాకూడదని ప్రముఖ సినీనటి వనిత విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ ప్రముఖ సినీనటి వనిత విజయకుమార్, తిరువళ్లూరు జిల్లా పూందమల్లిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు హైదరాబాద్‌కు చెందిన ఆనందరాజ్‌తో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జెనీతా(10) అనే కుమార్తె ఉంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. జెనీతా హైదరాబాద్‌లో నివాసం వుండేది. ఈ నేపథ్యంలో 2012లో తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించిన వనిత, హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నారిని తనతో పాటు తీసుకొచ్చింది. దీంతో ఆనందరాజ్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెను భార్య వనిత కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కేసు నమోదు చేశారు. భార్య వద్ద నుంచి కుమార్తెను అప్పగించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన వనిత విజయకుమార్ జెనీతాకు తాను అమ్మనని, ప్రస్తుతం తనతోనే ఉందని..చిన్నారిపై పూర్తి హక్కును తనకు అప్పగించాలని కోరుతూ పూందమల్లి కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో సంబంధిత కేసును పూందమల్లి నుంచి తిరువళ్లూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణ శుక్రవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సెల్వనాథన్ ఎదుట సాగింది. విచారణకు ఆనందరాజ్ హాజరు కాకపోవడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వనిత విజయకుమార్, తన బిడ్డ కోసం కోర్టు మెట్లు ఎక్కానని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు. తనకు న్యాయం జరుగుందనే నమ్మకం ఉందన్నారు. -
కొరియోగ్రాఫర్ తో పెళ్లివార్తలను ఖండించిన సినీ తార!
కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో పెళ్లైందంటూ వస్తున్న వార్తలను దివంగత నటి మంజుల, విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ ఖండించారు. తాను రాబర్ట్ ఇంకా పెళ్లి చేసుకోలేదని వనిత స్సష్టం చేశారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం. ప్రస్తుతం ఓ ప్రొడక్షన్ హౌజ్ ను ఏర్పాటు చేయడంపైనే దృష్టిని కేంద్రీకరించాం అని వనిత వెల్లడించింది. అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. మా రిలేషన్ గురించి మా కుటుంబాలకు తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని వనితా ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేస్తాం. మేం కెరీర్ పరంగా విజయం సాధిస్తాం అని అన్నారు. ఇదిలా ఉండగా, వనితకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి వివాహం తమిళ నటుడు ఆకాశ్ తో, రెండవ వివాహం ఎన్నారై ఆనంద్ రాజ్ తో జరిగింది. ఇద్దరు భర్తల నుంచి విడాకులు పొందిన వనితకు శ్రీహరి అనే కుమారుడు ఉన్నాడు. తమిళంలో చంద్రలేఖ, మానిక్కం అనే రెండు చిత్రాల్లో నటించింది.