సెలబ్రిటీ ప్రేమజంట నరేశ్- పవిత్ర లోకేశ్ జంటగా నటించిన మూవీ మళ్లీ పెళ్లి. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ తను నాలుగో పెళ్లి చేసుకుంటానని, పవిత్రతో జీవితం కొనసాగిస్తానని చెప్పాడు. ఇక ఈ మూవీలో నరేశ్ మూడో భార్యగా నటించిన వనితా విజయ్‌కుమార్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోగా మూడో పెళ్లి చట్టప్రకారం చెల్లదని చెప్పింది. శుక్రవారం (మే 26న) మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
బిగ్‌బాస్‌తో రీఎంట్రీ
'నేను మొదట్లో కొన్ని సినిమాలు చేసి మానేశాను. కొన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లి గెలిచాక తిరిగి స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాను. తమిళంలో సినిమా అవకాశాలు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం రాలేదు. ఓ రోజు గుడికి వెళ్లి ఒక మంచి తెలుగు సినిమా కావాలని అమ్మవారితో చెప్పుకుంటూ ఏడ్చాను. ఆ తర్వాతి రోజే డైరెక్టర్ ఎంఎస్ రాజు ఫోన్ చేసి మళ్లీ పెళ్లి మూవీ ఆఫర్ ఇచ్చాడు. వెంటనే ఓకే చెప్పాను.
నా కొడుకు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లా
షూటింగ్‌లో బిజీ ఉండటంతో నా ఫ్రెండ్సే నా పిల్లలను చూసుకున్నారు. నా కుటుంబానికి నేను ఎప్పుడో దూరమయ్యాను. బయటవాళ్లు వచ్చి ఇంట్లో ఏవేవో చేసేయాలని చూసేవారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఆఖరికి నా సొంత కొడుక్కి ఏదేదో చెప్పి బ్రెయిన్‌వాష్ చేశారు. దీంతో మా నాన్న కూడా అదే నమ్మి వాడిని నా నుంచి కాపాడాలనుకున్నాడు, దూరం చేయాలని చూశాడు. కోర్టు కేసులు కూడా అయ్యాయి. సుప్రీం కోర్టుదాకా వెళ్లి నేనే గెలిచాను. ఈ రాద్ధాంతం జరుగుతున్నప్పుడే రెండో సారి విడాకులు తీసుకున్నాను.
అమ్మ చనిపోయాక కష్టాలు..
పోలీసుల సాయం తీసుకుని నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. తమిళనాడులో అడుగుపెట్టనివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు. అమ్మ చనిపోయేముందు నా పేరు కలవరించింది. అందరూ తనను మోసం చేయబోతున్నారని గ్రహించిన ఆమె నాకు ఫోన్ చేసి రమ్మంది. నేను ఒక్కదాన్నే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాను. తను మీడియాను, సుప్రీంకోర్టు లాయర్ రామ్ జెఠ్మలానీని పిలువు అని అడిగింది. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, ఇప్పుడివన్నీ చేయలేనని చెప్పాను. నాకు వీలునామా రాస్తానంది. అవన్నీ ఇప్పుడొద్దని చెప్పాను. కానీ అమ్మ చనిపోయాక వాళ్లు నన్ను ముప్పు తిప్పలు పెట్టారు' అని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్.
వనితా విజయ్‌కుమార్ పేరెంట్స్
Comments
Please login to add a commentAdd a comment