వినోదానికే కాదు వివాదాలకు కేంద్రంగా మారింది బిగ్‌బాస్ షో. ప్రతి సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్, గొడవల సెన్సేషన్స్ కూడా ఉంటూ వస్తున్నాయి. గంట నిడివి ఉండే ఎపిసోడ్‌లో నిర్వాహకులు తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ టీమ్ నాన్‌స్టాప్ స్ట్రీమింగ్‌ను ప్రవేశపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదాన్ని కన్నార్పకుండా చూసేయండంటూ 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్‌ను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ బూటకమంటోంది తమిళ నటి వనితా విజయ్ కుమార్. ఈమేరకు బిగ్‌బాస్ షో గురించి వరుస ట్వీట్లు చేసింది.
'బిగ్‌బాస్ అల్టిమేట్ నుంచి వచ్చేసినందుకు, కొందరు అనుకుంటున్నట్లుగా షో నుంచి పారిపోయినందుకు సంతోషంగా ఉంది. బిగ్‌బాస్ హౌస్ పిచ్చి, చిరాకు కలిగించే ప్రదేశం. అక్కడ ఉన్నందుకు ఇప్పటికీ పీడకలలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ షో నుంచి బయటకు వచ్చేసినా సరే, పూర్తిగా దాన్నుంచి బయటపడేందుకు కొంత సమయం పడుతుంది.'
'హౌస్‌లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది కానీ, అభిరామి మాటలను కానీ టెలికాస్ట్ చేయలేదు. ఇదసలు లైవ్ షోనే కాదు. వాళ్లకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి వివాదాస్పదంగా ఉండేట్టు టెలికాస్ట్ చేస్తున్నారు. పేరుకే ఎంటర్‌టైన్‌మెంట్ షో, కానీ అందులో ప్రధానమైన వినోదమే మిస్ అవుతోంది, కాంప్లికేటెడ్‌గా మారిపోయింది. ఎవరూ దాన్ని ప్రశ్నించడం లేదు. బిగ్‌బాస్ అనుభవం నుంచి బయటకు రావడానికి మానసికంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్.
Entertainment show which lost its entertainment factor and has become complicated and no one to ask against it. thanking God for trusting my instincts and choosing sanity and peace..still mentally getting over the #bbexperience
— Vanitha Vijaykumar (@vanithavijayku1) March 4, 2022
Comments
Please login to add a commentAdd a comment