Tamil Bigg Boss Losliya Mariyanesan Reveals About Her Break Up With Kavin, Details Inside - Sakshi

Losliya Mariyanesan Breakup: నటుడితో న్యూస్‌ రీడర్‌ లోస్లియా బ్రేకప్‌ స్టోరి

Apr 8 2022 1:15 PM | Updated on Apr 8 2022 2:21 PM

Losliya Mariyanesan Opens Up About Her Break Up With Kavin - Sakshi

టెలివిజన్‌ రంగంలో బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సహా అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌ షోకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అయితే ఈ షోలో లవ్‌ట్రాక్‌లు ఉండటం చాలా కామన్‌. కానీ షో అయిపోయాక బ్రేకప్‌ చెప్పేసుకున్న జంటలు కూడా కామనే. తాజాగా మరో బిగ్‌బాస్‌ జంట విడిపోయింది.

షో అనంతరం కూడా తమ బంధాన్ని కంటిన్యూ చేసిన ఓ కపుల్‌ ఆ తర్వాత మాత్రం తమ దారులు వేరంటూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళ బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన జంటల్లో లోస్లియా- కవిన్‌ కూడా ఒకటి. తెరపై ఎంతో అన్యోనంగా కనిపించిన ఈ కపుల్‌ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. తాజాగా ఇదే అంశంపై లోస్లియా స్పందించింది.

'బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు నాకు, కవిన్‌కు మధ్య ఏదో తెలియని ఆకర్షణ(ప్రేమ)ఉన్న మాట నిజమే. షో తర్వాత కూడా కొంతకాలం మేం ప్రేమికులుగా కొనసాగాము. అయితే మా ఆలోచనలు, లక్ష్యాలు వేరువేరు అని తెలుసుకున్నాం. అందుకే వేర్వేరు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాయి. కవిన్‌తో నాకు ఎప్పుడే బ్రేకప్‌ జరిగిపోయింది'.. అంటూ లోస్లియా వెల్లడించింది. కాగా న్యూస్‌ రీడర్‌గా పాపులర్‌ అయిన లోస్లియా తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని మరింత గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఇప్పుడు సినిమాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement