
సినీ, టీవీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా అలా ఓ తమిళ నటుడు ఏకంగా జడ్జి కొడుకుతోనే గొడవ పెట్టుకున్నాడు. మాటలతో పోయే దానికి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?
(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
శ్రీలంకకు చెందిన దర్శన్.. చెన్నైలో ఉంటున్నాడు. గతంలో బిగ్ బాస్ 3వ తమిళ సీజన్ లో పాల్గొన్న ఇతడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ కాస్త బిజీగా ఉన్నాడు. ఇకపోతే దర్శన్ ఉంటున్న ఇంటి దగ్గర్లో ఓ టీ షాప్ ఉంది. గురువారం నాడు మద్రాస్ హైకోర్ట్ జడ్జి కుమారుడు అత్తిచూడి.. తన భార్య, అత్తతో కలిసి ఇక్కడికి వచ్చాడు. దర్శన్ ఇంటి ముందు తన కారుని పార్క్ చేశాడు.
దీంతో పార్కింగ్ విషయమై దర్శన్-అత్తిచూడి ఒకరినొకరు మాట మాట అనుకున్నారు. ఈ క్రమంలో దర్శన్.. జడ్జి కొడుకుపై దాడి చేశాడు. దీంతో ఈ వ్యవహారం జేజే నగర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టగా.. దర్శన్ తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మాటలతో అయిపోయే విషయాన్ని ఇప్పుడు కేసుల వరకు తెచ్చుకున్నారనే చెప్పాలి.
(ఇదీ చదవండి: సినిమా వివాదం.. 'సలార్' విలన్ కి నోటీసులు)